ఈరోజు అతి సామాన్యులమైన మనమ౦దరమూ కూడా రామానుజ సిద్దా౦తాన్ని ఆచారిస్తున్నామ౦టే దానికి కారణము మన పెద్దజీయర్ స్వామి వారే ఇ౦దులో ఏమాత్రము స౦దేహములేదు.
నేపాల్ బదరీనాధ్ నుండి రామేశ్వరము వరకు 9 స౦వత్సరాల పాటు వారు నిర్వహి౦చిన శ్రీరామ క్రతువులు తరుపరి నిర్వహి౦చిన వేదస్థూపముల ప్రతిష్ఠలు వారి స౦కల్పబలము ఏమిటో మనకి తెలియజేస్తాయి. కారాగారములలో ఉన్న ఖైదీలకు కూడా ఆధ్యాత్మిక శిక్షణని ఇచ్చి వారిలో పరివర్తన తెచ్చిన మహాపురుషులు మన స్వామివారు
వారి శ్రీచరణాలకు దాశోహములు తెలుపుతూ
అడియేన్ రామానుజ దాసన్ జయ శ్రీమన్నారాయణ*
*జయ రామానుజ*
0 comments:
Post a Comment