కవిత కాదు ఓ భావన
–––--------------////////----- --------------
కొత్తఉద్యోగం ......కొత్త వూరు
కొత్తఊరు .....కొత్తయిల్లు
కొత్త పంట ...కొత్త బెల్లం
కొత్తకుటుంబం కొత్తపరిచయం కానీ పాత చుట్టాలం
ఇంటివారు ....నా ప్రార్ధన మన్నించారు
పాలు పొంగించటానికి పాలు పంపించారు
మెడ మెరిపిస్తూ మేను మురిపిస్తూ
పొడుగాటి జాడ శృ0గారాన్ని కురిపిస్తూ....
ఒయ్యారంగా ఆమె నా గదిలో పాలు పెట్టి వెళ్తోంది
కొత్త వంట గా ప్రారంభం చేశాను .
పాయసం ఎంతో రుచిగా వండాను .
ఆమెను కూడా కోటి ఆశ ల జల్లు తో ఆహ్వానించాను .
మీరు చాలా అందం గా వున్నారు మెల్లగా చెప్పాను .
ఆమె పెదవులు రెండు గులాబీ రేకుల్లా విచ్చుకొన్నాయి .
అప్పుడు ఆమె నాపై తెల్లని మల్లెల నవ్వును విసిరింది.
ఆమె పెదవులు మెరుస్తున్నాయితీయని తేనె పులిమినట్లు,
ఆమె నా కళ్ళలోకి కసి కసి గా చూస్తూ నవ్వింది.
ఆమె బుగ్గలపై చిలిపితనం పొంగిపొర్లింది.
ఇంత పెద్ద వర్షం ఇప్పుడే విరుచుకు పడాలా !
కిరిటీలోనించి ఆమె కోసం వెతుకుతున్నాను.
కిరీటి అంతా వర్షపు బిందువులతోరణాలే,
మనస్సు అంతా తెలియని హర్షపు చిందులే ,
అన్ని బిందువులలో ఆమె అందమైన చిత్రమే ,విచిత్రమే
వండిన పాయసం దేవుని ఎదుట పెట్టాను .
ఆమెరాక కోసం ఆరాటపడుతూ బైట నిలుచున్నాను.
ఇంతలో పిల్లి వచ్చి మొత్తం తినేసి లొట్టలు వేస్తూ వెళ్ళిపోయింది.
ఓ కొత్త చుట్టం గారు ,బావా లేవండి నిద్ర ఆపి పాలు పొంగిచండి.
ఏమిటి! చ్చా! ఇదంతా కలా .అబ్బా ఎంత మధురమో
–––--------------////////-----

0 comments:
Post a Comment