ములగఆకులు చాలా మంచివి కూరగా ,కానీ పప్పులో కానీ లేక రోజూ ఓ గుప్పెడు ఆకులు పోపు లోవేసుకొని ఉడకబెట్టుకొని తింటే చాలమంచిది కొలెస్ట్రాల్ ను తీసేయడమే కాకుండా గుండె నాళాలను వెడల్పు చేసి వాటిలో అడ్డంగా ఉన్న గారను తొలగిస్తుంది. చాలరకాల వ్యాధులకు ములగాకు దివ్య ఔషధం. ఎండబెట్టి పొడి లోపలకు తీసుకున్నా చాలా మంచిది. చాలా క్యాన్సర్లకు ఈ ములగ ఆకు మందుల్లో వాడబోతున్నారు. అలానే ములక్కాయలు కూడా తినడం వల్ల లోపల మిగిలిపోయిన ఇంగ్లీషు మందులటాక్సిన్లు
బైటకు వెళ్ళిపోతాయి. ఇంకా చాలా రకలయున విటమిన్లు, మినరల్స్ వీటిల్లో వుంటాయి .ముఖ్యముగా బీటాకేరోటిన్ ,విటమిన్ C , మాంసకృత్తులు ,ఇనుము, క్యాలిష్యం ,పొటాషియం సమృద్ధిగా వున్నాయి.
ఇక కామంచి ఆకు లేదా కామాక్షి మొక్క అంటారు .ఈ కామంచి చెట్టు వల్ల చాలా ఆరోగ్య లాభాలు ముఖ్యంగా కళ్లకు, లివర్ కి చాలా మంచిది.లివర్ ఏ స్థితి లో ఉన్నా కూడా కామంచి మొక్క మొత్తం ఉండుకొని తింటే లివర్ బాగుపడుతుంది.
ఇక షుగర్ ఎక్కువగా ఉండి బాధపడుతున్నవాళ్ళు ప్రతిరోజూ ఉదయమే కరివేపాకు ఆకులు 8 ఆకులు సుమారు గా పరగడుపున తిన0డి .కొద్దిగా నీరు త్రాగండి ఓ పది నిమషముల తరువాత కాఫీ టీ లు త్రాగవచ్చు. ఇక షుగరు లేనివారు అయినా కరివేపాకు తింటే. వారసత్త్వం గా వచ్చే షుగరు రాదు ,లేదా షుగర్ త్వరగా జీవితం లోనికి రానివ్వదు. అలానే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ఒక హాఫ్ స్పూన్ మెంతుల పొడి ,ఒక చిటికెడు పచ్చి పసుపు లను బాగుగా కలిపి పరగడుపున త్రాగాలి కొద్దిసేపు వరకు ఏమి లోపలికి తీసుకోకుండా ఉండాలి (10 నిముషాలు ఆగి తరువాత కాఫీ,టీ లు తీసుకోవచ్చు.దీనివల్ల షుగర్ రీడింగ్ లు తగ్గుముఖం పడతాయి .కావాలంటే మీకు సూట్ అయితే కొంచెము ఆ పొడి ని పాలా పెంచుకోవచ్చు.
.కళ్ళకు తోటకూర, పుదీనా,కొత్తిమీర క్యారెట్,, ఉసిరికాయ, చాలా మంచిది .కొద్దికాలం పాటు తింటూ ఉంటే మీకే తెలుస్తుంది కళ్ళ సైట్ పవర్ కూడా తగ్గుతాయి.
పచ్చిముక్కలు ఉల్లి,క్యారెట్, బీట్రూట్, ఇంకా మీకు ఇష్టమైన పచ్చిముక్కలు భోజనం కు ముందు కొద్దీ గా తినడం మంచిది రక్తంలోని ట్రీగ్లిజరేట్ శాతం తగ్గిపోతుంది.