Pages

Toli Tirupathi

తొలి తిరుపతి......

తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.

అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం లో తిరుపతి వుందని

అదే తొలి తిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.

విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ...

స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.

ఆలయ చరిత్ర : 
--------------

ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో

ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.

అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా

ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.

ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట. 

అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట

ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.

స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)

ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. 

ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).

ఆలయ విశిష్టత : 
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 

2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 

3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 

4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 

5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది. 

6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.

కార్యక్రమాలు - పూజా విధానం : 
------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం.
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం.

3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.

4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : 
------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క 
రాణీ రుద్రమదేవి 
శ్రీ కృష్ణ దేవరాయలు 
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు 

లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి ... బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )
How to Reach Tholi Tirupathi :

తొలితిరుపతి  శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.

పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి. 

కాకినాడ - ప్రత్తిపాడు , పెద్దిపాలెం , శాంతి ఆశ్రమం బస్సు లు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సు తొలితిరుపతి లో ఆగుతాయి. తొలితిరుపతి ని చదలడా తిరుపతి అని కూడా పిలుస్తారు.

Nearest Railway Station :

Samalkota ( SLO ) Distance : 10 km 

Nearest Bus Stop : 
Divili ( Divli )

Toli Tirupathi Temple Address:

Sri Srungara Vallabha Swamy Temple,
Peddapuram Mandal,
East Godavari,
Andhra Pradesh.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online