Pages

Naarayanopanishat - Meaning

నారాయణోపనిషత్
 

ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!!

తా: సర్వ జీవులు రక్షింప బడు గాక.  సర్వ జీవులు పోషింప బడు గాక. అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి. ( సమాజ ఉద్ధరణ కోసం)  మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక. ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.


ఓం అథ పురుషో హ వై నారాయణోఁకామయత ప్రజా: సృజేయేతి !

నారాయణాత్ప్రాణో జాయతే !

మన: సర్వేన్ద్రియాణి చ !

ఖం వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్య ధారిణీ !

నారాయణాద్ బ్రహ్మా జాయతే !

నారాయణాద్ రుద్రో జాయతే !

నారాయణాదిన్ద్రో జాయతే !

నారాయణాత్ప్రజాపతయ: ప్రజాయస్తే !

నారాయణాద్ ద్వాదశాదిత్యా: రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాగంసి !

నారాయణాదేవ సముత్పద్యస్తే !

నారాయణే ప్రవర్తస్తే !

నారాయణే ప్రలీయస్తే !!

 

ఓమ్ ! అథ నిత్యో నారాయణ: !

బ్రహ్మా నారాయణ: !

శివశ్చ నారాయణ: !

శక్రశ్చ నారాయణ: !

ద్యావాపృథివ్యౌ చ నారాయణ: !

కాలశ్చ నారాయణ: !

దిశశ్చ నారాయణ: !

ఊర్థ్వశ్చ నారాయణ: !

అధశ్చ నారాయణ: !

అస్తర్బహిశ్చ నారాయణ: !

నారాయణ ఏవేదగం సర్వమ్ !

యద్భూతం యచ్చ  !

నిష్కళో నిరఙ్ఞనో నిర్వికల్పో నిరాఖ్యాత: శుద్ధో దేవఏకో నారాయణ: !

న ద్వితీయోఁస్తి కశ్చిత్ !

య ఏవం వేద !

స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి !

ఓమిత్యగ్రే వ్యాహరేత్ !

నమ ఇతి పశ్చాత్ !

నారాయణాయేత్యుపరిష్టాత్ !

ఓమిత్యేకాక్షరమ్ !

నమ ఇతి ద్వే అక్షరే !

నారాయణాయేతి పంచాక్షరాణి !

ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం !

యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి !

అన పబ్రువస్సర్వమాయురేతి !

విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ !

తతోఁమృతత్వమశ్నుతే తతోఁమృతత్వమశ్నత ఇతి !

య ఏవం వేద !!


ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం !

అకార ఉకార మకార ఇతి !

తాసేకధా సమభరత్తదేతదోమితి !

యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ !

ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసక: !

వైకుంఠ భువనలోకం గమిష్యతి !

తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ !

తస్మాత్తదిదావన్మాత్రమ్ !

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ !
సర్వభూతస్థమేకం నారాయణమ్ !

కారణరూపమకార పరబ్రహ్మోమ్ !

ఏతదథర్వ శిరోయోఁధీతే !

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి !

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి !

మాధ్యన్దినమాదిత్యాభిముఖోఁధీయాన: పంచపాత కోపపాతకాత్ ప్రముచ్యతే !

సర్వ వేద పారాయణ పుణ్యం లభతే !

నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణసాయుజ్యమవాప్నోతి !

య ఏవం వేద !

ఇత్యుపనిషత్ !!

ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!!
 

*నారాయణ ఉపనిషత్ భావము:-
 

 1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11)  వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.


 2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. 
సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3."ఓం" అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత "నమ:" అని ఉచ్చరించవలెను.తరువాత "నారాయణాయ" అని ఉచ్చరించవలెను."ఓం" అనునది ఏకాక్షరము."నమ:"అనునది రెండక్షరములు. "నారాయణాయ"అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు "ఓం నమో నారాయణాయ"అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.


ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు. 


4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు."ఓం నమో నారాయణాయ" అను ఈ అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది.ఆ కారణముచే ప్రకాశించుచున్నది.


దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.


ఈ నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.


నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి.
ఓం శాంతి: శాంతి: శాంతి:!!

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online