కుంభము అంటే కుండ లేదా కలశము అనిఅర్ధము.
మేళా అంటే కలయిక, కూటమి అనిఅర్ధము.
ఈ కుంభమేళా గురించి..
భాగవతము,
మహాభారతము,
రామాయణము,
విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది.
క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా
ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం : అలహాబాద్,
హరిద్వార్,
ఉజ్జయిని,
నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయి.
అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.
దీనిని సాధారణ కుంభమేళా అంటారు.
6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని,
12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు.
12 పూర్ణ కుంభమేళాలు
12*12= 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభమేళా అంటారు.
2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది
ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్దజరుగుతాయి.
ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు,
సాధువులు స్నానము ఆచరిస్తారు.
*కుంభమేళా_పౌరాణిక_ప్రాశస్త్యం.
స్కందపురాణంలో దీనివర్ణన ఉంది.
మనకు దేవదానవుల క్షీరసాగరమథనం కథ
తెలుసు కదా!
అపుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజులపాటు యుద్ధం జరిగింది.
దేవతలకు 12 రోజులంటే మానవులకు
12 సంవత్సరములే కదా!
కుంభపర్వాలు కూడా 12 ఉన్నాయి.
అయితే మానవులకు 4 ,
దేవతలకు 8 కేటాయించడం జరిగింది.
అందువలన భూమిపై 4 ,
దేవలోకంలో 8 కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణవచనం.
దేవదానవ సంగ్రామ సమయంలో అమృతకుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు.
చంద్రుడు కలశంనుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే ,
సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసులనుండి కాపాడితే ,
శనైశ్చరుడు ఇంద్రునినుండి కలశాన్ని కాపాడాడని స్కందపురాణం ఇలా తెలియజేస్తుంది -
" చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్దధౌ ।
దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్।।"
ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో
అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు కుంభయోగం ఏర్పడుతుంది.
అయితే ఆ అమృతకుంభం నుండి
కొన్ని అమృతబిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ ,
అందువలన అవి పడిన నాలుగుచోట్ల..
ప్రయాగ,
ఉజ్జయిని,
నాసిక్ మరియు
హరిద్వార్ లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం అంటోంది -
" విష్ణుద్వారే తీర్థరాజేఽవన్త్యాం గోదావరీతటే।
సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్।।"
"వెయ్యి కార్తికమాసస్నానాలు గంగలో చేసిన ఫలితం, వందమాఘమాసస్నానాలు గంగలో చేసినఫలితం , వైశాఖమాసస్నానాలు కోటిమారులు నర్మదా నదిలో చేసినఫలితాన్ని ఒక్కమారు కుంభస్నానంతో మానవుడు పొందుతాడని స్కందపురాణవచనం
0 comments:
Post a Comment