Pages

The speciality of Ashtaakshari mantra

*అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత*
 

*“ఓమ్ నమో నారాయణాయ”* అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!
 
స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః

‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).

శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గతజన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online