Pages

panchamukha aanjaneyudu

పంచముఖ హనుమాన్


       పంచముఖ ఆంజనేయ అవతారం ఎలా వచ్చింది అంటే దానికి మన పెద్దలు ఒక కధ చెప్తారు.  రామ లక్ష్మణులను రావణుని ఆజ్ఞ మేరకు మైరావణుడు పాతాళం లో బంధిస్తాడు.  వారి ఆచూకీ కనుగొని వారిని విడిపించటానికి హనుమంతుని పంపిస్తారు జాంబవంతుడు మొదలైన వారు.  ఆయన వారిని కనుగొని విడిపించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐరావణ మైరావణులు యుద్ధం చేస్తారు.  వారు మాయా యుద్ధం లో ప్రవీణులు.  వారు మాయ తో కందిరీగలు సృష్టించి హనుమంతుని చికాకు పరుస్తారు.  అప్పుడు వారిని జయించటానికి ఆంజనేయుడు అయిదు ముఖములతో పంచముఖుని రూపం ధరించి అన్ని దిక్కులనుండి వారిని ఎదుర్కొని వారిని ఓడించి రామ లక్ష్మణులను విడిపిస్తాడు .  అందువలన ఆయనకు పంచముఖ ఆంజనేయుడు అనే పేరు వచ్చింది.

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.

* తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

*ఓం రామభక్త హనుమాన్ కి జై*

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online