వేదములలో కాంతి విక్షేపణ ధర్మము
మనమందరమూ సుమారు 1704 వ సంవత్సరంలో సర్ ఐసాక్ న్యూటన్ కాంతి విక్షేపణం కనుగొన్నాడని పాఠశాలలో చదువుకున్నాము. ఈయన తన మొదటి ప్రయోగంలో 5-6 ప్రాథమిక రంగులు గుర్తించాడు. కాంతి ఒక యానకం (గాలి) నుండి మరొక యానకమునకు (గాజు ఫలకం/prism) ప్రయాణిoచిన్నప్పుడు కొంత ఒంగి ప్రయాణిoచడం వల్ల వివిధ రంగులు ఏర్పడతాయి. దీనినే సరాళముగా కాంతి విక్షేపణం అంటారు. న్యూటన్ మొదలగు శాస్త్రవేత్తలు కాంతి రంగులను prism వల్ల వస్తుందని భావించారు. కానీ అది తప్పు. రంగులు యానకం నుండి కాదు, కాంతి నుండే వస్తున్నాయి అని మన భారతీయులు కొన్ని వేల సంవత్సరాలుగా, అరుణ కాఠక రూపంలో, పారాయణ చేయుచున్నారు.
కొన్ని ఉదాహరణలు క్రింది చూద్దాం!
దివ్యస్యైకా ధనురాత్రి:
పృథివ్యామపరాశ్రితా
......
తదిన్ద్ర ధనూరిత్యజ్యమ్
అభ్రవర్ణేషు చక్షతే (అరుణo 1-5)
దీని భావం
అల్లెత్రాడు లేని ధనస్సు భూమిని ఆకాశాన్ని కలుపుతున్నట్లు ఉంది. ఈ ధనస్సుకి అనేక రంగులు నీటి బిందువులవలన ఏర్పడినవి ఉన్నాయి.
ఆరోగో భ్రాజః పటరః పతంగః
స్వర్ణరో జ్యోతిషీమాన్ విభాసః
తే అస్మై సర్వే దివమా తపంతి
ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతి (అరుణం 1-7)
సాయణాచార్య భాష్యం ప్రకారం ఆరోగః, భ్రాజః, పటరః, పతంగః, స్వర్ణరః, జ్యోతిషీమాన్, విభాసః అను 7 గురు సూర్యులు గలరని వారు ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్నారని వివరించబడినది. కానీ నిజానికి ఈ ఏడు పేర్లు ఏడుగురు సూర్యుళ్ళు కాదు. ఒకే సూర్యునికి చెందిన ఏడు రంగులు.
దీని భావం
ఆరోగః - ఎరుపు (Red);
భ్రాజః - నారింజ (Orange)
పటరః - నీలం (Blue)
పతంగః - ఆకుపచ్చ (Green)
స్వర్ణః - పసుపు (Yellow)
జ్యోతిషీమాన్ - నీలి మందు రంగు (Indigo)
విభాసః - ఊదా (Violet)
అనపస్ఫురంత ఈ రంగులు అనడంతో హానికరం కాదు ఋషులు చెప్పారు.
సాకమ్ జానాగ్o సప్తథమాహురేకజమ్ (అరుణం 1-3)
ఒకే కిరణం నుండి ఏడు కిరణాలు ఉత్పన్నమయ్యాయి అని వివరించారు.
అరుణ కాఠకమ్ ప్రకారం కాంతి విక్షేపణం రంగులు 7 గుర్తించటం తో ఆగలేదు. 8 వది ఈ క్రింది మంత్రం లో తెలియచేసారు.
కశ్యపోస్టమః స మహా మేరున్నజహాతి (అరుణం 1-7)
ఇది కశ్యప. ఎనిమిదవది. భూమి వాతావరణం లోనికి ప్రవేశించ లేదు. (హిమాలయ పర్వత శిఖర ప్రాంతము నుంచి క్రిందకి ప్రయాణించలేదు. విక్షేపణం చెందలేదు)
అపశ్య మహమేతత్సూర్య మండలం పరివర్తమానం
గార్గ్యః ప్రాణత్రాతః
గచ్ఛ్అంతు మహామేరుమ్
ఏకంచా జహతం
....
అస్ట్ఔ తు వ్యవసితా ఇతి
సూర్య మండలాన్యస్తాత ఊర్ధ్వం (అరుణ కాఠకం)
హిమవత్పర్వతమును అధిరోహించి, గర్గుని కొడుకు ప్రాణత్రాతుడు, సూర్యుని యొక్క కాంతి రూపం అయిన 8 వ రూపం రేడియేషన్ ని గుర్తించెను.
భారతీయులు కొన్ని వేల సంవత్సరాల క్రిందట కాంతి విక్షేపాన్ని, భూ వాతావరణంలో ప్రవేశించలేని హానికర కాస్మిక్ కిరణాలని గుర్తించ గలిగారు.
భూమికి 16000 అడుగున పైన సౌర రేడియేషన్ ని 1912 వ సంవత్సరంలో ఆస్ట్రియన్ సైంటిస్ట్ దట్టమైన రేడియేషన్ ఉందని నోబెల్ బహుమతి పొందెను.
భారతీయులకు వేదములలో జ్ఞానమును వెలికి తీసే ప్రయత్నములు గత 1000 సంవత్సరాలుగా (వివిధ సాంఘిక, దురాక్రమణ కారణములవలన) తగ్గుట వలన అపార జ్ఞాన రాశిని ప్రపంచానికి సకాలంలో తెలియ చేయ లేక పోయాం.
ఈ ప్రయత్నములు తిరిగి ప్రారింభించవలసి ఆవశ్యకత ఉన్నది.
Reference books: Krishna Yajurveda Aaranyakam, Saayana Bhashyam, Science in Krishna Yajurveda
0 comments:
Post a Comment