ఈ కీటకాన్ని ఎవరు గుర్తించలేదు కదా? దీన్ని "వజ్ర కీట" (Vajra Keeta) అంటారు.ఇది చూడడానికి ముళ్ళతో భయానకంగా ఉంటుంది కానీ నేపాల్ గండకీ నదిలో నివసిస్తూ, దాని శరీరంలో ఊరే రసాయనాలతో మరియు ముళ్ళతో, పరమ పవిత్రమైన సాలిగ్రామాలను(సాలగ్రామం,శాలిగ్ రామం...ఎలా అన్నా ఒకటే) చెక్కుతుంది! విష్ణుమూర్తికి సంబంధించిన శంఖు, చక్ర, గద,ఇంకా అనేక స్వరూపాలతో సాలిగ్రామాలను చెక్కగల నేర్పరితనం ఈ జీవికి ఉంది! కొన్ని సాలిగ్రామాలకి పైన బంగరు వర్ణంలో ఉండే పూత కూడా ఈ వజ్ర కీట వల్ల ఏర్పడినదే!
*వజ్రం లాంటి పళ్ళున్న జీవి*
భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ప్రవహించే గండకీ అనే నది ఒకటుంది. విష్ణు భగవానుని రూపాలైన సాలగ్రామ రాళ్లకు నివాసం కావడం వలన ఈ నది ప్రపంచవ్యాప్తంగా హిందువులకు చాల ప్రాముఖ్యమైనది. అదే నదిలో నివసిస్తాయి, ‘వజ్ర కీటకాలు’ అనే జీవాలు/పురుగులు. సాలగ్రామాలు భగవంతుడు విష్ణువు యొక్క రూపాన్ని, ఆయుధాల్ని పోలి వివిధ ఆకారాల్లో లభ్యమవుతాయ్. శంఖం, చక్రం, గద, పద్మాలు రూపాలు పోలిన సాలగ్రామాలు మొత్తం 24 రకాలు. మనకు తెలియనివి మరెన్నో ఉండి ఉండవచ్చు. మరి సాలగ్రామాలు అనబడే ఈ రాళ్లు ఆలా వివిధ రూపాల్ని ఎలా పొందుతాయనే విషయం మనల్ని విస్మయానికి గురిచేస్తుంది.
వజ్రకీటకాలు అనబడే ఆ పురుగులు సాలగ్రామాలనే ఈ రాళ్ళను వజ్రంలాంటి తమ పళ్లతో కొరికి చీలుస్తాయి. అలా చీల్చి ఆ రాళ్ళలో ప్రవేశించిన ఆ జీవాలు చివరి శ్వాస వరకు అందులోనే ఉండి, అక్కడే మరణిస్తాయట. ఆలా చీల్చే క్రమంలో ఆ రాళ్లు వివిధ రూపాలను పొందుతాయి, ఆ రూపాలే విష్ణు రూపాన్ని, మరియు శంఖ, చక్ర, గదా పద్మాలను పోలి ఉంటాయి. ఇటువంటి సాలగ్రామాలు లెక్కలేనన్ని ఆ నదిలో దొరుకుతాయట. ఆ నది నుండి ఈ సాలగ్రామాలు దేశ వ్యాప్తంగా కాశి మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లో, ఇతర మార్కెట్లలో కూడా లభిస్తాయి. అంతే కాక ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేయబడతాయి.
ఈ సాలగ్రామాల్ని ఇంట్లో పెట్టుకోవాలంటే చాల పద్ధతిగా పూజా సంప్రదాయాలు తప్పనిసరని పెద్దలు చెప్తారు.
0 comments:
Post a Comment