Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-7

      సృష్టి ప్రారంభములో పరమాత్మ ఒకడే ఉండెను .సృష్టి కార్యమునకు ఇద్దరు అవసరం అని ఆలోచన చేసెను .అందుకోసం తన శ రీరమును రెండుభాగములుగా విడగోట్టుకొనేను.ఒకరు పురుష రూపం రెండు స్త్ర్రీ రూపముగా విడగొట్టు కొనెను .దానినే అర్థనారీశ్వరస్వరూపంఅని కొందరు చెబుతారు .

         శ్రీ వైష్ణవములో లక్ష్మీనారాయణస్వరూపముగా చెబుతారు .అలా వచ్చిన తరువాత శ్రీమన్నారాయణుడు లక్ష్మి అమ్మవారిని పిలిచి కావలసినంత చెట్లు చేమలు తీగెలు పచ్చని ప్రకృతి ని ,జీవనానికి ,పోషణకి ,అందము ,ఆహ్లాదం ఆనందం ఇస్తూ భవిష్యత్తులో అన్ని రకాలు అవసరాలు తీర్చే విధముగా  తీర్చిదిద్ద మని ఆదేశిస్తాడు అని ఉపనిషత్తుల్లోచెప్పబడినది


         అమ్మవారు స్వామివారిలో భాగము కాబట్టి ఆమె ప్రతి రూపాన్ని ప్రకృతిగా మలిచినది . ఆ రూపమే వనదుర్గ అంటే అందుకే అమ్మే ఆది పరాశక్తి అని చెప్పిఆ మతాన్ని ఆరాధించే వారు శాక్తేయులు గా పిలువబాడతారు ఆ శాక్తేయ మతం ప్రకారం  ఆ  అమ్మే త్రిమూర్తుల ను సృష్టించినది అని చెబుతారు  .అందుకే చరిత్ర లో   ఆది మానవ    సెకములో గుహలలో ముందుగా అమ్మవారి రూపమే యుండేనని కాబట్టి మా అమ్మవారి రూపమే ముందు అని గట్టిగా వాదించే వారు శాక్తేయులు .సత్త్వ  తమో  రజో గుణములు ఆధారముగా భగవంతుడి అవతారములు వచ్చినవి అని కూడా పురాణములు ద్వారా తెలుస్తోంది.  

        ఓం దేవీం వాచమజనయంతామ్ అనే అమ్మవారి స్తోత్రములో ఆది మానవుడు నుంచీ తొట్టతొలి గా అమ్మవారిని ఆరాధి౦చే వారు అని శాక్తేయులు చెబుతున్నారు . ఆదిమానవులు గుహలలో సంచరిస్తూన్న రోజుల్లో జంతువులను చంపి పచ్చి మాంసం తింటూన్నరోజులలో ఆ మనస్తత్వం ఆధారముగా వచ్చిన తత్వమే రజో గుణం .ఆ గుణం ప్రకారం పచ్చిరక్తం , పచ్చి మాంసం కొండల్లో ,గుహలలో వున్న ఆదిపరాశక్తి అమ్మవారు అనేక భుజాలు కలిగిఎర్రని నాలుక పెద్దగా బైటకు చాచుకొనివున్న ఉగ్ర రూపం  .ఆ రూపాన్ని ఆరాధించేవారు   ,అంతా హింస ఎక్కువగా వున్నట్లు అనిపిస్తుంది  ఎంతసేపూ మాంసం రక్తం సమర్పిస్తూ లేక ఆరగింపు చేస్తూ నడిచేది రజోగుణం కి సంబంధించినది.అలా కొన్ని వందల ,వేల సoవ త్స రాలుగా జరుగుతూ ఉంది.

        ఆది మానవుడు అభివృద్ధి చందటము మొదలుపెట్టాడు ,అమ్మప్రక్కన  ఒకనాన్న వున్నాడని ఆమెకు ఒకకుటుంబము వుండాలి అనే నిర్ణయానికి మానవుడు అభివృద్ధి చెందాడు .కుటంబం లో అమ్మ కి కనిపిస్తున్న ప్రాముఖ్యం,పిల్లలని కని వాళ్లకు పాలిచ్చి పెంచడం ,పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ భుజం పై ,తలపై మోసుకొంటూ తిరగటం  తండ్రి ఎక్కడో తిరగటం ఇన్ని కారణాలువల్ల  ఆ రోజుల్లో తల్లి దైవం ,తల్లి తో వున్న అనుబంధము ,ప్రాముఖ్యం లే అమ్మ దేవత గా రూపు దాల్చింది .  .ఇప్పటికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ ,కుటుంబం లో ఇప్పటకీ తల్లి మాటకే ఎక్కువ గౌరవం ఇస్తూవుంటాము .నాగరికత పెరిగిన తరువాత తల్లి తండ్రి ఇద్దరూ సమానమే అని ఇద్దరినీ పూజిస్తూ ఉన్నాము .పార్వతీ పరమేస్వర్లు లక్ష్మీనారాయణులు,సరస్వతీ బ్రహ్మ లు ,ఇలా సృష్టి కి ఆధార భూతమైన ఇద్దరినీ ఆరాదిస్తూనే వున్నాము .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online