Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-8

         తరువాత  తామసమైన ఆరాధన కూడా వచ్చింది .అదే లింగ ఆరాధన అస్సలు ఈ జగతికి ,ఈ సృష్టి కి కారణమైన వారి సృష్టి అంగాలను పూజించటం అదేశివపార్వతులు కలసివున్న  శివలింగం ,శివపార్వతులు ని శివలింగం రూపములో ఆరాధించటం ఇతర మతాలలో కూడా ఆడం అవుర్ హవ్వ సృష్టికి మూల పురుషులుగా కొలుస్తారు.

       విదేశీయులు వివేకానందుడిని ఇలా అడిగారు మీ మతములో లింగపూజ అస్లీలమైనదే కదా అని అడిగారు .అప్పుడు ఆయన సమాధానం చెబుతూ ,ఆ లింగ,పానవట్టం లద్వారా జరిగే ప్రక్రియ మాకు చాలా పవిత్రమైనది .ఆ ప్రక్రియ వల్లే కనబడుతున్న జగతి అంతా వచ్చింది .ఇన్ని సంభంధాలు ,ఇన్నిప్రేమలు ఇన్నిబందాలు ఇంతపెద్ద ప్రపంచం ఇన్నికుటుంబాలు సంతోషాలు ఇదంతా ఆ మూల పురుషుల రహస్య అంగాలు జరిపిన తంతు , సృష్టి వల్లనే కదా అని ఆ లింగం ,పానవట్టం లను పూజించటం అదే ,శివలింగం ఒక్క శివ  లింగాన్నే ఆరాధించేవారువున్నారు .వారుశివుడు ఒక్కడే దేవుడు ,పార్వతి ని కూడా ఒప్పుకోరు . శివుడ్ని మాత్రమే ఒప్పుకొని ఆరాధించే వారిని శైవులు ,వీర శైవులు అనికూడా అంటారు .

      అలానే శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆరాధించే వారు వున్నారు .వారు లక్ష్మీదేవి ని కూడా పట్టించుకోరు అంటే ఆమె పవర్ కూడా ఈ మహా విష్ణువు ఇచ్చినదే ,అంటే సుప్రీమ్ శ్రీమన్నారాయణుడే .అని నమ్మి ఆయననే ఆరాధించే వారిని వీర వైష్ణవులు  అంటారు .అలానే అమ్మ , కన్న బిడ్డలను దగ్గరకు తీసు కున్నట్టు మన అందరిని దగ్గరకు తీసుకొని మనసమస్యలను, తండ్రి లాంటి వాడు శ్రీ మహావిష్ణువు కి చెప్పి మనపై ప్రేమ కురి పించేలా చేయగల తల్లి శ్రీ మహా లక్ష్మి అనే భావన పెట్టుకొని ,మోక్షము విషయము లో జీవుడి ని లాలించి ,ఆ దేవదేవుడు అయున శ్రీమహావిష్ణువు తో ఒప్పించే భారం ఆమె తీసుకొనే తల్లి అని ఆ లక్ష్మి దేవిని ముందు పెట్టి శ్రీ మహా విష్ణువునే ఆరాధించే వారిని శ్రీ వైష్ణవులు అంటారు .ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి అమ్మవారు అని అర్థం .
      ఇంకా అలానే మధ్వవైష్ణవులు అని అంటారు ఎక్కువ కన్నడ రాష్ట్రములోను తెలుగు రాష్ట్రాల సరిహద్దులలోను ఎక్కువగా వుంటారు .వీరు మధ్వాచార్యుల వారి సాంప్రదాయం లో నడుస్తూ వుంటారు .వారిది ద్వైత సిద్దాంతం  వీరు కూడా శ్రీమహావిష్ణువుని ఒక్కరినే ఆరాధిస్తారు .లక్ష్మి అమ్మవారు కూడా ఆయనలోపలే ,ఆయనకు లోబడి వుంటుంది .కాబట్టి స్వామివారే గొప్ప అని ,అంతా స్వామివారి మహాత్మ్యమే అని వారి నమ్మకం .అందుకే వారి పేర్లు కూడా కృష్ణా చార్య అని వుంటుందికానీ కృష్ణమాచార్య  అని వుండదు  అంటే మ కారం వుండదు .అదే పైన చెప్పుకొన్న శ్రీ వైష్ణవ సాంప్రదాయములో అయుతే కృష్ణమాచార్యులు అని వాళ్ళు వ్రాసుకొంటారు .వాళ్ళకులక్ష్మి  అమ్మవారే ముఖ్యం.
         ఇక బెంగాల్ లో గౌడీ య  వైష్ణవమ్ అనే సాంప్రదాయం ఒకటి అక్కడ వున్నది .దానిలో చైతన్య మహా ప్రభు ,శ్రీ కృష్ణ సాంప్రదాయం ప్రముఖమైనాయి .బెంగాల్ రాష్ట్రములో బ్రాహ్మణ హోటల్స్ ఉంటాయి కాని అందులో చేప వంటకాలుఉంటాయి .వారికి చేప లు తోనే  సంప్రదాయం అంతా నిండి వుంటుంది .వారికి అది శాఖాహారం క్రింద లెక్క .అదికూడా తినని శుద్ధ శాఖాహారులకి శ్రీ వైష్ట్నవ హోటల్ అని అడగాలి ,అక్కడ అయి తే చేప కూడా లేని శుద్ద శాఖాహారం లభిస్తుంది
       .ఈ విధముగా భక్తీ ఉద్యమం రక రకాలుగా శ్యాఖోపశ్యాఖలు గా ప్రపంచం అంతా విస్తరించి వుంది .మళ్ళిఇదిరెండు రకాలుగా వుంది .ఒకటి భక్తీ శాఖ మరొకటి జ్ఞాన శాఖ .వీటిగురించి అందరికి తెలిసే వుంటుంది  . జ్ఞానము గురించి ఎక్కువగా ఉపనిషత్తుల్లో వుంది  .క్రీస్తు పూర్వములో పూజలు ఆడంబరత్త్వం లాంటి కొన్ని విషయాలలో బేదాభిప్రాయములు వచ్చికొందరు పురోహితులు  అడవి లోకి వెళ్లి పోయారు .వాళ్ళు అక్కడ అడవిలో కూర్చుని కొన్ని సిద్దాంతాలు తయారు చేశారు  వాటిలో అరణ్యా కాలు .,ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి
      .మళ్ళీ సిద్దంతకారులు కూడా వున్నారు అందులో బోధాయనుడు,గౌతముడు ఇద్దరి ప్రభావం సంస్కృతి, సమాజం పై వున్నాయి .బోధాయనుడి సూత్రాలను ఆధారముగా తీసుకున్న వారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ,అలా చాలా వందల సంవత్సరాల  గడిచిన తరువాత , ఆధునిక యుగములో అంబేత్కర్ వచ్చి  గౌతమఋషి సిద్దాంతాలను ,సూత్రాలను ఆధారముగా తీసుకున్నారు .భారతీయసంస్కృతిలో జ్ఞాన ము ఆధారముగా నడిచినవారిలో శంకరాచార్యులు వారు ,కబీర్ ముందుగా చెప్పుకోవాలి .ఆ తరువాత చాలామంది వున్నారు.
 
 
 
 
 
 
 

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-7

      సృష్టి ప్రారంభములో పరమాత్మ ఒకడే ఉండెను .సృష్టి కార్యమునకు ఇద్దరు అవసరం అని ఆలోచన చేసెను .అందుకోసం తన శ రీరమును రెండుభాగములుగా విడగోట్టుకొనేను.ఒకరు పురుష రూపం రెండు స్త్ర్రీ రూపముగా విడగొట్టు కొనెను .దానినే అర్థనారీశ్వరస్వరూపంఅని కొందరు చెబుతారు .

         శ్రీ వైష్ణవములో లక్ష్మీనారాయణస్వరూపముగా చెబుతారు .అలా వచ్చిన తరువాత శ్రీమన్నారాయణుడు లక్ష్మి అమ్మవారిని పిలిచి కావలసినంత చెట్లు చేమలు తీగెలు పచ్చని ప్రకృతి ని ,జీవనానికి ,పోషణకి ,అందము ,ఆహ్లాదం ఆనందం ఇస్తూ భవిష్యత్తులో అన్ని రకాలు అవసరాలు తీర్చే విధముగా  తీర్చిదిద్ద మని ఆదేశిస్తాడు అని ఉపనిషత్తుల్లోచెప్పబడినది


         అమ్మవారు స్వామివారిలో భాగము కాబట్టి ఆమె ప్రతి రూపాన్ని ప్రకృతిగా మలిచినది . ఆ రూపమే వనదుర్గ అంటే అందుకే అమ్మే ఆది పరాశక్తి అని చెప్పిఆ మతాన్ని ఆరాధించే వారు శాక్తేయులు గా పిలువబాడతారు ఆ శాక్తేయ మతం ప్రకారం  ఆ  అమ్మే త్రిమూర్తుల ను సృష్టించినది అని చెబుతారు  .అందుకే చరిత్ర లో   ఆది మానవ    సెకములో గుహలలో ముందుగా అమ్మవారి రూపమే యుండేనని కాబట్టి మా అమ్మవారి రూపమే ముందు అని గట్టిగా వాదించే వారు శాక్తేయులు .సత్త్వ  తమో  రజో గుణములు ఆధారముగా భగవంతుడి అవతారములు వచ్చినవి అని కూడా పురాణములు ద్వారా తెలుస్తోంది.  

        ఓం దేవీం వాచమజనయంతామ్ అనే అమ్మవారి స్తోత్రములో ఆది మానవుడు నుంచీ తొట్టతొలి గా అమ్మవారిని ఆరాధి౦చే వారు అని శాక్తేయులు చెబుతున్నారు . ఆదిమానవులు గుహలలో సంచరిస్తూన్న రోజుల్లో జంతువులను చంపి పచ్చి మాంసం తింటూన్నరోజులలో ఆ మనస్తత్వం ఆధారముగా వచ్చిన తత్వమే రజో గుణం .ఆ గుణం ప్రకారం పచ్చిరక్తం , పచ్చి మాంసం కొండల్లో ,గుహలలో వున్న ఆదిపరాశక్తి అమ్మవారు అనేక భుజాలు కలిగిఎర్రని నాలుక పెద్దగా బైటకు చాచుకొనివున్న ఉగ్ర రూపం  .ఆ రూపాన్ని ఆరాధించేవారు   ,అంతా హింస ఎక్కువగా వున్నట్లు అనిపిస్తుంది  ఎంతసేపూ మాంసం రక్తం సమర్పిస్తూ లేక ఆరగింపు చేస్తూ నడిచేది రజోగుణం కి సంబంధించినది.అలా కొన్ని వందల ,వేల సoవ త్స రాలుగా జరుగుతూ ఉంది.

        ఆది మానవుడు అభివృద్ధి చందటము మొదలుపెట్టాడు ,అమ్మప్రక్కన  ఒకనాన్న వున్నాడని ఆమెకు ఒకకుటుంబము వుండాలి అనే నిర్ణయానికి మానవుడు అభివృద్ధి చెందాడు .కుటంబం లో అమ్మ కి కనిపిస్తున్న ప్రాముఖ్యం,పిల్లలని కని వాళ్లకు పాలిచ్చి పెంచడం ,పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ భుజం పై ,తలపై మోసుకొంటూ తిరగటం  తండ్రి ఎక్కడో తిరగటం ఇన్ని కారణాలువల్ల  ఆ రోజుల్లో తల్లి దైవం ,తల్లి తో వున్న అనుబంధము ,ప్రాముఖ్యం లే అమ్మ దేవత గా రూపు దాల్చింది .  .ఇప్పటికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ ,కుటుంబం లో ఇప్పటకీ తల్లి మాటకే ఎక్కువ గౌరవం ఇస్తూవుంటాము .నాగరికత పెరిగిన తరువాత తల్లి తండ్రి ఇద్దరూ సమానమే అని ఇద్దరినీ పూజిస్తూ ఉన్నాము .పార్వతీ పరమేస్వర్లు లక్ష్మీనారాయణులు,సరస్వతీ బ్రహ్మ లు ,ఇలా సృష్టి కి ఆధార భూతమైన ఇద్దరినీ ఆరాదిస్తూనే వున్నాము .

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-6

      ఇంకో ఉదాహరణ చెప్పుకొందాం వేసవి కాలములో కొత్తకుండ లో ని నీటిని త్రాగితే ఎలా వుంటుంది. మన శేరీరానికి అలవాటు పడేంత వరకు జలుబు చేస్తూవుంటుంది .అలానే కొత్తగా .సి లో కి వెళ్లి పడుకొంటే ఏమవతుంది .జలుబు ,ముక్కు కారటం ,తల నొప్పి లాంటివి వస్తాయి . ఇవన్ని ఇలా ఎందుకు జరుగుతున్నాయి .అదే మనలోని ప్రకృతి తత్త్త్వం .బైట ప్రకృతి కి మనలోని ప్రకృతి కి వున్న బంధాన్ని కొంత మార్చి చల్లదనం కోసం ప్రయత్ని౦ చాం .తాత్కాలికముగా మారటానికి కొంత టైం పడుతుంది .ఇంకా ప్రకృతి చాలా చాలా రకాలుగా వుంటుంది .కొంతమంది మెల్లగా మాట్లాడతారు.కొంతమంది దురుసుగా మాట్లాడతారు .దీనిని మనవాళ్ళు . వాడి ప్రకృతే అంత అంటూ వుంటారు .ప్రకృతి అంటే ఇక్కడ సూక్ష్మరూపములో మనలో వుండే కొన్ని లక్షణాలు .అలానే బైట ప్రకృతి లో మనం చూస్తూవుంటాం వున్నట్టు వుండివర్షం. అకాలవర్షం ,ఎండలు తుఫాను లు ,గాలులు ఎలా ఉంటాయో మన మదిలో ,మన నడవడికలో కోపతాపాలు ,సంతోషాలు బాధలు దుఖాలు ఇది కూడా ప్రకృతి లక్షణములు .ప్రకృతి లో నష్టాలు ,మనిషి,లేక జీవి జీవితములో ఆటుపోట్లు ,బైట ప్రకృతిలో విలయాలు , మనిషి జీవితములో కోలుకోలేని దెబ్బలు ఇవన్నిచూస్తూవుంటే బైట ప్రకృతికి మన శేరీరములో పెద్ద పాత్ర ,మనజీవితములో పెద్ద భాగస్వామం వుంది అని అర్థం అవుతుంది కదా .ఇది అంతా కనపడకుండా జరిగేది .ఇక కనిపించేలా జరిగేది మనకు సుపరిచితమే .

         ఆకులు పండ్లు దుంపలు నీళ్ళు పాడి పంటలు చెట్లు చేమలు .గుహలు ,కొండలు రాళ్ళు రప్పలు ,లోహాలు ,లోహసత్త్వాలు మందులు ఇవన్ని మనకు ప్రత్యక్షంగా ఉపయోగించు కుంటూనేవున్నాంకదా ,ఇక్కడ మీకో విషయం చెప్పాలి మనిషిలో కాని .జంతువుల్లో కాని అంటే జీవి ఏదైనా రోగము వచ్చినప్పుడు ప్రకృతి లోని మూలికలు వాడుతూ ఉంటాము అంటే దాని అర్థం మనలోని ప్రకృతి కి సమస్య వచ్చిన ప్పుడు బైట ప్రకృతి లోని మూలము తో సరిదిద్దుకుంటున్నాముకదా ,మనలో భూమిలో వుండే మూలకాలు మన రీరములో కూడా సూక్ష్మ రూపములో ఉంటున్నాయి అందుకే సోడియం ,పొటాషియం ,జింక్ బంగారం లాంటివి స్వర్ణ భస్మం .లోహభాస్మం ఇలా ఎన్నో భస్మాలుగా ఆయుర్వేదం లో వాడుతూవుంటారు .ఇంగ్లీష్ వైద్యం లో కూడా విటమిన్స్ ,మినరల్స్ జింక్ క్యాప్సుల్స్ గా వాడుతూవుంటాం .కాబట్టి ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి .ప్రకృతి ఒడిలో ,ప్రకృతి లోపల ,మనలో ప్రకృతి ,అంత ఎందుకు ఉచ్వాస,నిచ్వాశ శ్వాస ,ప్రకృతి ప్రాణం కి ఆధారం ప్రకృతి .

       పూర్వకాలములో ప్రకృతి పచ్చగా .చెట్లు,చేమలు తో కళకళ లాడుతూ వుండేది .దాని స్వంత బిడ్డల్లాంటి పక్షులు తో అందాన్ని ,ఆనందాన్నిపొందుతూ ,మనకు గూడా ఇస్తూ ఆరోగ్యముగా రక్షక వలయములా కాపాడుతూ వుండేది . అటువంటి ప్రకృతిని నాశనం చేశాము భగవంతుడు ఇచ్చే పవిత్ర .పంచభూతాలను యధా తధముగా మన జీవ కొటికి అందించే తల్లి ప్రకృతి మాత. ముందు చెట్లు ధ్వంసం చేసాం , తరువాత పక్షులను కూలగొట్టి తినేశాము.మనకు మేలు చేసే పశువులను అన్నిటిని మిషన్స్ లో వేసి రక్త మంసాలను పిండుతూవున్నాము .బ్రహ్మజ్ఞానం చెప్పే పండితులను తూలనాడి ,ప్రతిభకు మంటపెట్టి వాళ్ళను దూరం పెట్టాం ,విదేశాలకు పొట్ట బట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు .మత్తుఅలవాటుచేసుకొని విచక్షణ కోల్పోయి ప్రకృతి ప్రతిరూపాలు అయున స్త్రీలని హింసలు పెడుతున్నాము .ఒక్కపూట లో కోటీశ్వరుడు అవటానికి ధర్మాన్ని ఖూనీ చేస్తున్నాము .ఇది అంతా ఎందుకు చెప్పుతున్నాను అంటే శంకర,రామానుజ ,మధ్వాచార్యులు వారంతా త్రాగుడు ,మత్తు ,జూదము లకి దూరముగా ఉండమన్నారు .అప్పుడు కాని బుర్ర పని చేయదు ,అప్పుడు తప్పులని సరిచేసుకుంటాము.అప్పుడు వ్యవస్థ బాగుంటుంది .


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online