Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-5

      అస్సలు భగవంతుడు మానవుడి లా అంత తేలిగ్గా  మీసాలు పెంచో .నున్నగా షేవ్ చేసుకునో .ఆయుధాలు పట్టుకోనో .పక్కన పిల్లలను పట్టుకొనో కనిపిస్తారా అని కొంతమందికి సంశయం  .పండితులు అరిషడ్వర్గము లు[ అంటే కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యములు] మనలోని రాక్షసులు అంటూ .క్షీరసాగర మధనం అంటే మన మనస్సు ని తర్కించుకోవటంఅని ఒక్కోదానికి పోల్చి చూపిస్తూ వుంటారు .అయి తే ఈ బ్రమ్మాండం లో ఎన్నో జీవులు వున్నాయి .ప్రతి జీవిలో మళ్ళీ అదే బ్రహ్మ౦ డము కొద్దిరూపములో నిండి వుంటుంది.  బ్రమ్మాండ ౦ లో ఉన్నదే కొద్ది కొద్ది గా ప్రతీ జీవిలో సూక్ష్మ రూపములో చిన్న  చిన్న బిందువు ల్లగా వుంటుంది .ఉదాహరణకు బైట పురాణాల్లో రాక్షసులు ,వాళ్ళు చేసే అరాచకాలు వింటూ ఉంటాము .అది బైట ప్రపంచములో జరిగినది నిజమే .మనలో వున్న రాక్షసులూ నిజమే అదే ఇలా చెప్పారు అని పోల్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఉదాహరణకు దశావతారములు తీసుకున్నాము .బ్రహ్మ్మ౦ డము లో భగవంతుడు అలా అవతారములుగా వచ్చి ఉండవచ్చు అది బైట జరిగింది

     అలానే మానవుడి లేక జీవపరిణామం చేపలు,తాబేళ్లు పంది సగం మనిషి సగం జంతువు కోతులు పోట్టిమానవుడు తెల్విగల మానవుడు ,ఆ తరువాత  అలా జీవ పరిణామం జరుగుతూవచ్చింది .దీనినే విదేశీయులు డార్విన్ ,జీన్ బ్లాస్తిస్ లమార్క్ లాంటివాళ్ళు ఈ ఆధునిక కాలములో నిరూపించారు .కాబట్టి ఇక్కడభగవంతుడిలో మనం వున్నాము .మనలో భగవంతుడు వున్నాడు .కాబట్టి భగవంతుడికి మనకు బేధము లేదు అదే అద్వైతము .అంటే రెండు కాదు ఒక్కటే   భగవంతుడు ,,నేను అంటే జీవుడు ఇద్దరం ఒక్కటే అనే వాదం ఈ వాదాన్ని అద్వైతముఅంటారు దీనిని జగద్గురు శంకరాచార్యులవారు ఆవిష్కరించారు .

        ఇక జీవుడు ,భగవంతుడు ఒకటే ఎలా అవుతారు కాదు ఎప్పటికి అలా కాదు భగవంతుడు సర్వ శక్తిమంతుడు ఆయనచే సృష్టింప బడినవాడు జీవుడు ,అందుకే జీవుడు ఒకడు ,భగవంతుడు ఒకడు ఇద్దరు వేరు వేరు అని మద్వా చార్యులు వారు చెప్పారు ఆ సిద్దాంతాన్ని ద్వైతము అంటారు అయుతే మరి ప్రకృతివిషయం ఒక్కటి వుంది తెలుస్సా దానిని ఏమి చేద్దాము అన్నారుభగవద్  రామానుజాచార్యులువారు అప్పుడు వారు ఒకటి కాదు , రెండు కాదు మూడు అని చెప్పారు దానినే తత్త్వ త్రయం అంటారు అంటే మూడు తత్త్వాలు  ఈ సిద్దాంతాన్ని విశిష్టఅద్వైతము అంటారు ఇది చక్కగా అర్థం కావాలంటే ఓభార్యాభర్తలుకలసినడుచుకుంటూ వస్తూన్నారు ఆ ఇద్దరు చుస్తే వేరువేరు అంటే ద్వైతము . అలానే కొంతకాలానికి భార్యకు కడుపు వచ్చింది ఇప్పుడు ఆమె అద్వైతం రూపానికి ఉదాహరణ. ఇప్పుడు ఆమె లో రెండు తత్వాలు కాని పైకి కనబడేది ఒక్కటే ఇక కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు లేక సంతానం కలిగింది ఆ ముగ్గురు అంటే తల్లి తండ్రి  కొడుకు నడుచుకొంటూ వస్తూన్నారు  ఈ కనపడే రూపం  విశిస్టా ద్వైతం  ..ఈ 3 భగవంతుడు – జీవుడు – ప్రకృతి  ఆధునిక సైన్స్ లో మనం చెప్పుకొనే ఎలక్ట్రాన్ –ప్రోటాన్ –న్యూ ట్రా న్  .రామానుజలువారు ఏమి చెప్పారంటే ఈ మూడు కలసినట్టే, కలసి ఉన్నట్టే  చూస్తే మూడు వేరు వేరు     .అలానే   ఉదాహరణకు  మనం ,మన ప్రక్కన వున్న క్లోజ్ ఫ్రెండ్ లేక బంధువు ఇంటి తో సత్సం సంభందం పెట్టుకున్నాము అనుకోండి.పై పై ఆలోచనలు కలిసే ఉంటాయి .  పండుగలు పబ్బాలు కల్సి చేసుకుంటాము ,మాటలాడుకుంటామ్  కాని ఒకే కుటంబం కాదు ,ఇవి రెండు వేరు వేరు కుటుంబాలు అలాంటి సంభంధమే ఈ భగవంతుడు –జీవుడు –ప్రకృతి 

        జీవుడు  శేరీరం లో వున్నప్పుడు లోపల బైటా  తనప్రక్కన వున్నది భగవంతుడు , ,ప్రకృతి,  అందుకే ఆరు బైట కనిపించే   ప్రకృతి లో కనపడే తూఫానులు ,సుడిగుండాలు,వేడి ,శీతలం అలజడులు  ఆకాశం ,పంచభూతాలు అన్నీమనలో కూడా కనబడుతూ ఉంటాయి ప్రకృతి లో యూనివర్సల్ గా  ఒక్కటే అంతా నిండి వుంటుందిఅదే  .ప్రకృతి ధర్మం అంటాం ఉదాహరణకు ఆవు తన దూడను ప్రేమిస్తుంది .విత్తనాలను మొక్కలు నలుదిసెలా ప్రేమతో ఇష్టం తో వెదజల్లుతాయి .ఇక్కడ ఒక విషయం ఆవు తన దూడనే ప్రేమించు కుంటుంది ఇంకో దాని దూడ విషయం దానికి అనవసరం .అలానే మొక్కలు ,జంతువులు,మనుషులు ఇప్పుడు మనం ప్రకృతి గురించి చర్చిస్తున్నాము .ఒకవేళ మీ మనస్సు లో మీకు అనిపించవచ్చు .కొన్ని జంతువులు .మనుష్యులు ఇతరుల పై శ్రద్ద చూపిస్తూవుంటా యి  మరి అది ఏమిటి అని అడగవచ్చు . ఇక అది ప్రేమ ,అనుభందం  యూనివర్సల్ ప్రేమ   అది భగవతత్త్వం .ప్రకృతి విషయములో బైట ప్రకృతి ,మనలోపల ప్రకృతి గురించి చర్చిస్తున్నాము కదా

walking and its uses

నడకవల్ల జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది .మలబద్దకం సమస్య పోతుంది deprression ,ని మానసిక ఆందోళన ని తగ్గిస్తుంది చురుకు దనాన్ని,చైతన్యాన్ని కలిగిస్తుంది .నీరసాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ ని సరి చేసి ,కండరాలకు ,ఎముకలకు బలాన్ని పెంచుతుంది.  మోనోపాజ్, మేనోపాజ్ వాళ్ళు రోజు నడుస్తూ వుంటే బ్రెయిన్ క్యాలిషియం ఉత్పత్తిని ఎముకలకు సహ్జసిద్దముగా పెంచుతుంది .

stress.టెన్షన్ లు తగ్గి మైండ్ ప్రశాంతముగా వుంటుంది .మెదడు చురుగ్గా పని చేస్తుంది .చెడు కొలిస్త్రోల్ ని తొలగిస్తుంది .ఊపిరితిత్తుల పనితీరుని మెరుగు పరుస్తుంది .శ్వాస లోపాలను సరిచేస్తుంది .gastrouble ని పోగుడుతుంది, అసిడిటిని తగ్గిస్తుంది . చక్కటి నిద్ర ని కలిగిస్తుంది ఈ నడక
.
ఇంకా ఈ నడకవల్ల చెమట పట్టి చెమట ద్వారా విషపదర్దాలు బైటకు పోతాయి .దానితో అన్ని అవయవాలు మంచిగా పని చెస్తాయి .నడకవల్ల ఉత్సాహం పెరుగు తుంది పాజిటివ్ మూడ్ కలిగిస్తుంది .శ రీరములోకి కొత్త శక్తి ని కలిగిస్తుంది

శరీరమునకు కావలసినంత ఆక్సిజన్ వచ్చి  రక్తం పరిశుబ్రం అవుతుంది ,blood circulation బాగుపడుతుంది .

Some medicinal uses of cardamom

చిట్కా గృహ వైద్యం [యాలకులతో]
 
ఒక గ్లాసువేడి నీటిలో చిటెకెడు యాలకుల పొడి ,చిటికెడుమిరియాల పొడి ,కాస్తంతయండబెట్టిన అల్లం ,ఒక చెంచాతేనె కలిపి రొజూ తీసుకోవడం వల్ల ఆస్తమా .బ్రాంకైటిస్ నుంచి ఉపసెమనంపొందవచ్చు .

బోజనానికి ముందు ఒక యాలక్కాయ ,ఒక లవంగం నోటిలో వేసుకొని నమలడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.   అపానవాయువులు, గుండె మంట కూడా తగ్గు ముఖం పడతాయి .యాలకులు  ఒకటి ,అల్లం కొద్దిగా ,ఒక లవంగం కొంచం కొత్తిమిర రసం కలిపి తీసుకోవటం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి .అజీర్ణం వల్ల వచ్చే తలనొప్పి పోవాలంటే యాలకులు వేసి తయారు చేసిన టీ త్రాగితే మంచిఫలితం వుంటుంది .మానసిక వత్తిడి [స్ట్రెస్] నుంచి కూడా బైట పడవచ్చు.
 
 మంచి ఫలితం లభిస్తుంది ,కాని అతిగా యాలకుల పొడి వాడకూడదు.  గ్రీన్ టీ లో గాని ,బ్లాక్ టీ లో గాని ఒక చిటెకెడు యాలకుల పొడి వేసుకొని త్రాగటం వల్లరక్తం లో కేఫ్ఫిన్ తగ్గిపో యి మూత్రపిండాలు ,గాల్ బ్లాడర్ ని శుబ్రం చేస్తుంది
యాలకుల పొడిని అరటి ఆకు తో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉసిరి కాయ రసం లో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవటం వల్లగనేరియా లాంటి సుఖ వ్యాధులు తగ్గి పోతాయి.
 
దాల్చిన చెక్క ను యలకులతో కలిపి కషాయం చేసి పుక్కిలించడం ,గొంతుకి తగిలేలా గాగులు చేయటం వల్ల గొంతు నొప్పి ,జలుబు తగ్గి పోతాయి .అలా 2 లేక 3 రోజు లు చేయాలి.  కప్పు నీళ్ళల్లోరెండు యాలకులు ,5 పుదీనా ఆకులు తో చేసిన కషాయం త్రాగితే వెక్కిళ్ళు తగ్గి పొతాయి. 

 ఏదైనామంచిది మంచి ఫలితం లభిస్తుంది కదా అని దానిని అతిగా వాడరాదు.  అప్పుడు అది వికటించి చెడు ఫలితం ఇస్తుంది.  అలానే అతిగా యాలకుల పొడి వాడకూడదు ,ఎక్కువసార్లు అదేపనిగా రొజూ త్రాగరాదు నపుంసకత్వంవచ్చే  ప్రమాదం వుంది .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online