గుండెల్లో ఇల్లు కట్టావు,
ఆ ఇల్లు వదిలి వెళ్ళలేవు
ఆ ధ్యాస నిన్ను వెళ్ళనివ్వదు
శ్వాస శ్వాసకు మధ్య నీ ధ్యాస
నా వేడి ఊపిరిలు నీ చెవి లో గుసగుసలు
కాలాన్ని పరుపులా వేసేస్తాను.
చూపుల గాలం లో నీ పరువాలని పట్టేసింది
. కౌగిలింతలో అందాలకు ఆర్థ్రత వస్తుంది.
ప్రేమ ఊహలు అన్ని ఇక ఊగే ఊయలలు.
నీ పొడగాటి జడ నా భుజాలలో ఇరుక్కుని పోతుంది.
మల్లెల్లు అన్ని ఆశల దారం లో దోబూచులాదతాయి
ఆ రాత్రివేళ వెన్నెల కురుస్తు ఉంటుంది.
చల్లని గాలులు నీ ప్రేమను నా పై అభిషేకిస్తాయి,
నీ ఆధారాలు నా పై రంగులు అద్దుతాయి ,
నీ ముంగురులు పాపిటి కుంకుమ
నా పై జల్లిన రహస్యాలు చూడాలని భానుడు ఉరికి వస్తాడు,
తెల్లవారి నా మెడ నిండా నీ కుంకుమ గుర్తులే
గుండెల్లో ఇల్లు కాస్త పొదరిల్లు అవుతుంది
ఆ పొదరిల్లు కి మనమిద్దరం రెండు తలుపులం
ఎన్నో తలపులకి ఇద్దరము బందీలము .

0 comments:
Post a Comment