ఇటువంటి రైతులు ఏ ప్రభుత్వానికీ కనిపించరు మరి !! ఈ సంఘటనలకు ప్రభుత్వాలు తల దించుకోవాలి. ఇది ఎప్పుడో బి .సి . లలో జరిగింది కాదు . ఈ మధ్య నే జరిగింది. భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం అని , 90% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తారని చదువుకున్నాము . కానీ నేడు వ్యవసాయం లేదు, చెట్లు , చేమలూ లేవు. గుట్టలూ , పుట్టలూ లేవు. అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే లేకుంటే ఐ .టి, కంప్యూటర్స్, లేకపోతే పనికిరాని చదువులతో యూనివర్సిటీ లలో రాజకీయాలు.
ఏ రోజు అయితే చిత్తశుద్ధి తో ప్రభుత్వాలు ప్రకృతి , పర్యావరణం, చెట్లు, పొలాలు, వ్యవసాయం , పంటలు , రైతులను పట్టించుకుంటారో, వాళ్ళ కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిజం గా అంకితం అవుతారో ఆనాడు భారత దేశం అన్ని రంగాల్లో ముందు ఉంటుంది, అని అనేవారు స్వతంత్ర సమారా యోధులు మా తండ్రి గారు. ఎక్కడో యూనివర్సిటీ లలో చదువుతున్నామని చెబుతూ వయస్సు అంతా అక్కడ గడిపేస్తూ , కొంత మంది నాయకుల ఫోటోలు గోడల నిండా అంటిస్తూ , వారి భజనలు చేస్తూ , వర్తమానం మరిచి , బాధ్యతలను మరిచి, పనికిరాని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొనే కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లోపడి మోసపోయి , తీవ్ర భావజాలం పెంచుకొని , భారత దేశాన్ని తిట్టుకుంటూ , సమ సమాజ స్థాపన కై కలలుకన్న స్వతంత్ర సమరయోదులు , సంఘ సంస్కర్తలు , దేశ భక్తుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ , గడుపుతున్న వారు కొందరు .ఇంకొందరు ఉపకార వేతనాలు ఇస్తుంటే తీసుకుని తల్లితండ్రుల ఆశలు నెరవేర్చి , కష్టపడి పదిమందిని ప్రయోజకులను తయారు చేయవలసిన యువకులు కొందరు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావం తో తీవ్రవాదం వైపుకు మళ్లి బ్రతుకును బుగ్గి పాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు , మను వాదం , బ్రాహ్మణ వాదం అంటూ తలకు ఎత్తుకొని ఇచ్చిన రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారో అది సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన లేక యూనివర్సిటీ ల గోడల నిండా తిట్టుకుంటూ వ్రాయడానికే కొందరు విద్యార్ధుల జీవితాలు సరిపోవడం లేదు. అటువంటి విద్యార్ధులను ఇంకా ప్రక్క దోవ పట్టిస్తూ పత్రికలు చిమ్ముతున్న విషపురాతలు. పీ హెచ్ డి అయిపోయి డాక్టరేట్ లు తీసుకున్న మేధావులు పిచ్చి వాళ్ళు గా రోడ్లపై తిరుగుతుంటే ఏ ఒక్క పత్రిక అయినా , సంస్థ అయినా , రాజకీయ పార్టీ అయినా గుర్తిస్తుందా ?
కానీ ఏ యూనివర్సిటీ లో అయిన ఒక ఓ .సి . చనిపోతే ఏ రాజ కీయ పార్టీ కూడా పట్టించుకోదు. కానీ ఈ మధ్య జరిగిన యూనివర్సిటీ విద్యార్ధి ఆత్మహత్య సంఘటనకు ఎక్కడో ఢిల్లీ నుండి రాజకీయ నాయకులు ఎగేసుకొని రెండు వోట్లు దొరుకుతాయేమో అని లగెత్తుకొచ్చారు . అలానే కేరళ రాష్ట్రం నుండి కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చారు. ఇలా ప్రతి విషయం కులం, మతం, ప్రాంతం, రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. నిజానికి విద్యార్ధుల భవిష్యత్తు ఎవరు కోరుకుంటున్నారు? విద్యార్ధులు కూడా మాకులం వారే మాకు ఆత్మా గౌరవం అంటూ ప్రతిదీ కులం కోణం లో చూడటం మానివేయాలి . కొన్ని చోట్ల పీ హెచ్ డి చేస్తూ నెలకు 25,000 ఉపకార వేతనం తీసుకుంటున్నారు. యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు కూడా. అది మంచిదే . మేము పీ హెచ్ డి చేస్తున్న రోజుల్లో ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు . పార్ట్ టైం జాబు చేసుకుంటూ పీ హెచ్ డి పూర్తి చేసాము. అలా ఉంది చదువుల పరిస్థితి . ఇక ఆటలు ఆడేవారికి కోట్లు రూపాయలు ఇచ్చేస్తారు . పాటలు పాడే వారికి లక్షలు ఇచ్చేస్తారు . కానీ రైతులు ఇలాంటి అన్నదాతలు ఆత్మా హత్యలు చేసుకున్నప్పుడు ఏ cm. రాలేదు . 1500 మంది అన్న దాతలు పొలాలు ఎండిపోయి , అప్పులు చేసి , కష్టం కలిసిరాక , బంగారం , ఇల్లు , పొలాలు తాకట్టు పెట్టి , అప్పులు తీర్చలేక భయపడి , బెంబేలెత్తి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క CM. గానీ , మంత్రులు గానీ , రారు . అన్ని రాజకీయ పార్టీలు ,cm. లు , అందరు ప్రజా ప్రతినిధులు , మీకు మేము అండగా ఉంటాము అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి , పల్లెలకు వెళ్లి అక్కడి రైతుల గుండె తలుపు తట్టి నిలబడితే ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగేవి కావు . ఇప్పటికైనా రైతులు, సైనికులు దేశానికి ఎంతో అవసరం అని, జై జవాన్ , జై కిసాన్ అని గుర్తు పెట్టుకొని వారి శ్రేయస్సు కోసం భారత దేశం తపించాలి. రైతులు కనపడితే నమస్కారం చెయ్యండి . కష్టాల్లో ఉన్న రైతులకు యువకులు , ఉద్యోగులు తగినంత సాయం చెయ్యండి. మనకు అన్నం పెట్టిన అన్నదాత ఋణం కొంతైనా తీర్చుకోండి . అన్నదాతల కుటుంబాలకు ప్రోత్సాహం గా అందరూ నిలబడాలి .
పచ్చని పంట పొలాలను పాడుచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వాలు దగ్గరుండి చేయిస్తున్నాయి . మరి అప్పుడు రైతులు ఏమి పండిస్తారు ? ఎక్కడ పండిస్తారు ? ఆకలి వేస్తే బంగారం , డబ్బులు , బిల్డింగ్స్ , సిమెంట్ ఎవ్వరూ తినరు . గుప్పెడు అన్నం, గ్లాసు నీళ్ళు ప్రాణం నిలబెడతాయి అని ఎవ్వరూ మరిచిపోరాదు .

0 comments:
Post a Comment