Pages

ఇది సాంస్కృతిక నిరంకుశత్వం --- ఒక విశ్లేషణ

 
           పైన పేర్కొన్న వ్యాసాన్ని చదివాక నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచికోవాలని ఈ వ్యాసం వ్రాస్తున్నాను .  పై వ్యాసం లో కొన్ని విషయాలు మనకు ఇప్పటివరకు తెలిసిన వాటికి విరుద్ధం గా ఉన్నాయి .  మీరు కూడా చదవండి.  అప్పుడు మీకు కూడా అర్ధం అవుతుంది నేను ఏమి చెప్తున్నానో .  ఇక్కడ మన వ్యాసకర్త ఈ మధ్య మహారాష్ట్ర లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఉటంకిస్తూ దానికి ఖండనలను వ్రాసారు .  తన యొక్కబాధ ను అందులో వ్యక్తపరిచారు .  అంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తన వాదనను బలపరుచుకోవటానికి ఇచ్చిన explanations. ఎంత వరకు నిజమో మీరు కూడా ఆలోచించండి .  అందుకే నేను నా విశ్లేషణలు క్రింద రాస్తున్నాను .
         ఏ మాంసం అయినా తినవచ్చు గానీ మిషన్లలో పెట్టి ప్రాణం ఉండగానే హింస పెట్టి తినకండి .  ఇప్పుడున్న అల్ కబీర్ కబేళాలు అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టనివ్వ కుండా బహిష్కరించారు .  మర్రి చెన్నారెడ్డి హయాం లో ఇక్కడ మెదక్ జిల్లా లో నెలకొల్పారు .  ఒకప్పుడు దాన్ని మూసివేయమని  అరిచి గీపెట్టిన బి జె పీ వారు అధికారం లోకి వఛ్చాక ఆ విషయాన్ని మరిచారు .  అక్కడ ఆ కబేలాలలో పశువుల్ని మిషన్లలో పెట్టి, వాటి చర్మం వలిచి , నెత్తురు తీసి, ఎముకలు విరిచి ఆ తర్వాత చంపుతారు .  అది ఎంత క్రూరత్వం ?      అసలు ఆవులే కాదు ఎద్దులని, కోడేలని బర్రెల్ని కూడా ఇలాగే హింసిస్తున్నారు.
         అసలు మన మల్లేపల్లి లక్ష్మయ్య గారి లాంటి వారిని ఒకసారి ఆ కబెలాలకు వెళ్లి చూడమని చెప్పండి.  అప్పుడు తెలుస్తుంది అసలు జీవ హింస అంటే ఏమిటో !  వూరికే ఎప్పుడూ ఒకటే పాత పాటే పాడటం కాదు, పత్రికల్లో విషపు రాతలు రాయటం కాదు.  పశువుల్ని ప్రాణం ఉండగానే వాటి చర్మం వొలిచి రక్తం తీసి ఎముకలను విరవటం ఎంత ఘోరం, ఎంత హింస ? అసలు ఆలోచిస్తేనే మనసు క్షోభిస్తుంది, మెదడు మొద్దుబారి పోతుంది .  అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది .  మన తెలంగాణా జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాలకు  వెళ్లి చూస్తె తెలుస్తుంది ఒక మతం వారు పసువులను చౌకగా కొనేసి లారీ ల్లోకి ఎక్కించి తీసుకువస్తారు .అప్పుడు ఆ లారీల్లో లెక్కకు మించి పసువులను ఎక్కించి కాళ్ళు అడ్డువస్తే ఇనుప కడ్డీలతో కొట్టి కాళ్ళు విరిచి ఒకదానిపై మరొకదాన్ని ఎక్కించి తీసుకువస్తారు .  అది ఎంత క్రూరత్వమో ఆలోచించారా ?  మరి బౌద్దులం, బుద్ధుని బోధనల్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాం అని కొత్తకొత్త విషయాలు పత్రికల్లో వ్రాసేవారికి ఈ విషయాలు కనిపించటం లేదా ?  కేవలం పత్రికల్లో రాతలకే పరిమితమా వారి బౌద్ధం, అహింసావాదం ?  ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి .     మనకు జీవితం లో కన్నతల్లి కొంత కాలం మాత్రమే పాలు ఇచ్చి పెంచుతుంది .  కానీ ఆవులు, గేదెలు మతం మనకు జీవితాంతం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఇస్తాయి .  మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.  అటువంటి వాటికి ప్రతిఫలం గా మనం తిరిగి ఏమి ఇస్తున్నాము ? ఇంత చిత్రహింస పెట్టి చంపి తినటం. అదీ మన మానవత్వం. 
          పూర్వ కాలం లో పశువులు వట్టిపోయినా కూడా వాటికి ఇంత మేత పెట్టి వాటిని ప్రేమగా చూసుకునే వారు .  అడవిలో తప్పిపోయిన పశువుల కోసం కూడా చెట్ల కింద మేత, నీళ్ళు పెట్టేవారు.  వాటిని కన్నా బిడ్డల్లా చూసేవారు.  మరి ఇప్పుడు ఆధునికులు దీనికి పూర్తిగా విరుద్ధం గా ఉన్నారు .  వారు వాటిని వ్యాపార సాధనాలుగా చూస్తున్నారు .వాటివల్ల లాభం తీరగానే వాటిని కబెలాల్లో అమ్మేస్తున్నారు . అక్కడ వాటికి నరకం చూపిస్తున్నారు .  ఇది ఏమి మానవత్వం ?  అసలు ఎంత ఆలోచించినా అర్ధం కాదు మనకి.ఈరోజులలో కూడా మనం చూస్తున్నాం విపరీతమైన తాగుడు వల్ల, మాంస భక్షణ వల్ల చిన్న వయస్సు లోనే కొవ్వు చేరినవాళ్ళు, షుగర్ వ్యాధి గ్రస్తులు, ఊబకాయం, ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో భాద పడుతున్నారు అధిక శాతం ప్రజలు.  సాయంత్రం అవగానే కల్లు దుకాణాలు, వైన్ షాప్స్ క్రిక్కిరిసి ఉంటున్నాయి .  భార్యాభర్తలు కూడా రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్నారు .  మనవ సంబంధాలు అపహాస్యం అవుతున్నాయి .  అతిగా తాగి తినే వాడికి ఆలోచన , సాలోచన ఉండవు .  అందుకే వాటిని వదిలెయ్యమని సమాజం లో అందరికీ బోధించారు పెద్దలు, త్రిమతాచార్యులు .
      ఆనాటి యజ్ఞ యాగాదులలో కంటే నేటి ప్రతి నగరం లో, ప్రతి ప్రాంతం లో మాంసం విక్రయాలకోసం పశువులను విపరీతం గా చంపుతున్నారు .  మరి లక్ష్మయ్య గారు చెప్పినట్లు వ్యవసాయం పశు సంపద దెబ్బ తినకుండా ఆనాటి బుద్ధుడు చేసిన పనే నేటి B.J.P. వారు చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా !ఇక అక్కడి బీహార్ లోని బౌద్ధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపించి ఉన్న మన మూలాలను పెకిలించి వేస్తుంటే ఇక్కడి వారు చోద్యం చూస్తూ ఊరుకుంటారా ?
      అలానే శైవమత స్తావరాల్లోకి వైష్ణవం చొచ్చుకుని వస్తే వారు వాళ్ళ మతాన్ని కాపాడుకోటానికి చాలా మంది వైష్ణవులను వీరభద్రపల్లాలతో కొట్టి చంపారు .  మరి ఇక్కడ ఇరువర్గాలు ప్రాణాలు మనుషులవే కదా ! ఈ గొడవలవల్ల శ్రీవైష్ణవులు ఇక్కడ మైనార్టీలు అయ్యారు .  మరి వారికి reservations. ఇస్తారా ?   
        ఒక్కసారిగా మల్లేపల్లి లక్ష్మయ్య గారి వ్యాఖ్యానం వల్లబౌద్ధం అర్ధం, ఉనికి కూడా మారిపోయాయి.  అసలు బుద్ధుడు చెప్పింది ఏమిటి ?  అసలు జీవ హింస వద్దు అని చెప్పాడు ఆయన .  ఆకలితో ఉన్న జీవికి ఆకలి తీరిస్తే అదే ఆ అనుభూతే దైవం అని చెప్పాడు .  అసలు వ్యవసాయ సంక్షోభం అంటూ ఆయన ఆలోచించ లేదు .  ఇవి అన్నీ మన సొంత వ్యాఖ్యానాలు .  మితిమీరిన యాగాల వల్ల పశు సంపద తగ్గిపోతోంది అని అందుకే ఆయన ఈ వ్యవసాయాన్ని రక్షించడానికే అలా అన్నాడు అని రాసారు .  మరి ఇప్పుడు యాగాలు, బలులు లేవు కదా ! మరి ఇప్పుడు పశు సంపద ఎందుకు తగ్గిపోతోంది ?  మిషన్లలో పెట్టి వందలు , వేల సంఖ్యలో పశువుల్ని చంపి తింటూ ఉంటె మరి ఇప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు ?... బౌద్ధం మాది అని చెప్తున్న దళితులూ, కొన్ని కులాల వారు ఇలా ప్సువుల్ని హింసించి మరీ వాటి మాంసం తింటూ మద్యం తాగుతూ ఉంటె అది జీవ హింస కాదా ?  అది బుద్ధునికి వ్యతిరేకం కాదా ? 
         మరి బౌద్ధం ఏమి చెబుతుందో ఈ రచయితలకు గుర్తు రావటం లేదా ?  "ఏ జీవినీ హింసించ వద్దు .  వాటి ప్రాణం తీసే హక్కు నీకు ఎవరు ఇచ్చాడు ?" అని కూడా బుద్ధుడు ప్రశ్నించాడు. వ్యవసాయ సంక్షోభం ... ఇవన్నీ ఆయన ఆలోచించలేదు . అసలు ఘంటాపధం గా చెప్పాలంటే ఏ రకమైన హింస కూడా వద్దు అన్నాడు . టన్నుల కొద్దీ మాంసం లాగించి , పెగ్గుల కొద్దీ మందు తాగి వూగమని బుద్ధుడు చెప్పలేదు .  అవి అన్నీ తప్పుడు మార్గాలు అని చెప్పాడు . బ్రాహ్మణులూ చేసినా ఏ కులం వారు చేసినా అది తప్పే అని నొక్కి చెప్పాడు .  అదే విషయం తర్వాత త్రిమతాచార్యులు శంకర, రామానుజ, మధ్వలు చెప్పారు .  
         అశోకుడు కూడా బౌద్ధం పాటించటం మొదలు పెట్టినాక అహింసా వాదానికి ప్రాముఖ్యం ఇవ్వటం వల్ల అతని సైన్యం బలహీనమైనది .  అతని విరోధులకు అది పెద్ద ఆయుధం అయ్యింది .  అందువల్లనే అతని తరువాత అతని రాజ్యం చిన్నాభిన్నమైంది.  అతని కుమారులు బలహీనులయ్యారు .  అందుకే వారి సామ్రాజ్యం పతనమైంది అని చరిత్రకారులు చెప్తారు .   
     శాఖాహారులకు కొంత మేర B6, B12, Zinc. అందని మాట నిజమే కానీ శాఖాహారం పూర్తిగా బలం ఇవ్వదు అని అనటం ఎంతమాత్రం సబబు కాదు .  ఉదాహరణకు కోడి రామమూర్తి అంతర్జాతీయం గా కుస్తీ పోటీల్లో ప్రసిద్ధుడు . ఆయన శాఖాహారి.  ఇంకా ఎంతో మంది ప్రముఖులు శాఖాహారులే.  అంతెందుకు ?  ఎంతో బలమైన జంతువులు ఏనుగు, ఖడ్గ మృగం కూడా శాఖాహారులే .  కోళ్ళు, మేకలు మొదలైన జంతువులు మాంసం కోసమే పెంచుతారు కనుక వాటిని తినడం లో తప్పు లేదు అని నా ఉద్దేశ్యం .  కానీ జంతువులను బ్రతికి ఉండగానే హింసించి చంపటం ఎంతవరకు సబబో ఆలోచించండి .     
        నాకు, ఇంకా నా మిత్రులు కొంత మంది కి ఒక సందేహం అది ఏంటంటే అసలు బుద్ధుడు వ్యవసాయ సంక్షోభం, రైతులు, సమాజ ఆర్ధిక వ్యవస్థ వీటి అన్నింటి గురించి ఆలోచిస్తే అసలు ఆయన సన్యాసం ఎందుకు తీసుకుంటాడు ?  ఆయన రాజుగా రాజ ధర్మం నిర్వర్తించే వాడు .  ఆయన అసలు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ చెయ్యలేదు.  ఆయన అసలు హింసకు వ్యతిరేకి.  జీవ హింస నేరం కనుక చేయవద్దు  అనేది ఆయన ప్రధాన బోధన. 
        మనకి ఇష్టమైన మతాన్ని, ధర్మాన్ని ఆచరించే అవకాశం స్వేచ్చ మనకి మన రాజ్యాంగం ఇచ్చింది.  దానిని మేధావులు సద్వినియోగం చేసుకోవాలి .  ఇంకా తెలియని వారికి చెప్పి వివేక వంతుల్ని చెయ్యాలి అంతే గానీ ఇలా తప్పుదోవ పట్టించకూడదు.  మనకు ఇష్టమైన వ్యక్తులు, విషయాలను ఎక్కువ చేసి గొప్పగా చూపటానికి వారు చెయ్యని పనుల్ని వారికి ఆపాదించటం, అన్ని మంచి కార్యాలు వారివల్లే అని ప్రచారం చెయ్యటం, అలాగే మనకి ఇష్టం లేని వారిని అనవసరం గా చులకనగా మాట్లాడటం,  వారు చేసిన మంచి పనుల్ని కూడా చేదుగా వక్రీకరించటం, వేరేవారికి ఆపాదించటం ఇది నిజమైన మేధావుల లక్షణమా ?  అంబేద్కర్ ని గొప్పగా చూపటానికి మహాత్మా గాంధీ గారిని తక్కువ చెయ్యవలసిన అవసరం లేదు.  మన మేధావులు ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని వ్యాసాలూ రాస్తే మన సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది .
           

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online