ఆధునిక కాలం లో డబ్బు అవసరాలకు ఒక పరిమితి లేకుండా పోయింది . పూర్వకాలం లో ఓ ఇల్లు కొద్దిగా పొలం, ఒక సైకిల్ ఉంటె చూకు అనుకొనేవారు . కానీ నేడు ఫ్లాట్, బండి , కారు, బ్యాంకు బాలన్స్, ఫార్మ్ హౌస్, బంగారం, ఎఫ్ .డి .లు , ఇలా ఎన్నో వాటికి తాపత్రయ పడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నారు . తప్పనిసరి రోజులు ఇవి. దానితో ప్రతి మనిషీ కుల, మత, లింగ, వయో, వృత్తి భేదం లేకుండా డబ్బు సంపాదనలో పడిపోతున్నారు. దేశాలు కూడా దాటి వెళ్ళాల్సి వస్తోందిఅయితే కొన్ని రకాల సంపాదనల తో మనిషి, జీవుల ఆరోగ్యం, ఉనికి పై తీవ్ర ప్రభావం పడుతోంది.
రైతులు వ్యవసాయం కోసం అప్పులు చేసి ఆ తర్వాత వాతావరణం అనుకూలించక పంటలు సరిగ్గా పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. "వ్యవసాయాధారం భారత దేశం " అని ప్రభుత్వాలు ఊదర కొట్టతమే కానీ ఆ ప్రభుత్వాలు కూడా రైతుల గోడు పట్టించుకోవటం లేదు. విజ్ఞాన పరం గా కంప్యుటర్ రంగం లో చాలా అభివృద్ధి సాధించినా, ఎన్ని రాకెట్లు, ఉపగ్రహాలు ప్రయోగించినా ఆకలి కాగానే కడుపుకి అన్నం తినాలి గానీ కంప్యూటర్ చిప్స్ తినలేము కదా ! అఫ్ కోర్స్ ఈ pollution. ఈ కల్తీ ల పుణ్యమా అని ప్రతివారికీ షుగర్, బి.పీ. వల్ల ఎవరూ కడుపు నిండా తిండి తినటమే లేదు . అప్పుడప్పుడూ తింటూ గ్యాస్, ఉబ్బరం తో సతమమవుతూ కాలం గడిపేస్తున్నారు .
రైతులకు కూడా డబ్బుల అవసరం చాలా ఉంది. అందుకే ప్రతి పంటకూ, ప్రతి చెట్టుకూ రసాయనిక మందులు వేస్తున్నారు. విత్తనం త్వరగా మొలకెత్తటానికి మందులు, త్వరగా పెరిగి కాయలు కాయటానికి మందులు, ఆ కాయలు పండ్లు అవటానికి మందులు ఇలా అన్నీ రసాయనిక మందులు పోసేస్తున్నారు . ఇక అమ్మేవాళ్ళు ఇంకాస్త విషపు పొట్లాలు పెట్టి పండ్లు పండిస్తున్నారు. ఇలా అన్ని మార్గాల్లో తినే అసలు పదార్ధం కంటే విషాలు తినేస్తున్నాం మనం .
అంతే కాదు మన విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెంది ఆ శాస్త్రవేత్తలు ఆ పువ్వులు, ఈ కాయలు కలిపి కొత్త కొత్త పండ్లు, కాయలు పుట్టిస్తున్నారు. దాని వల్ల మనిషి జీన్స్ లోని R.N.A., D.N.A. ల లోనే మార్పులు వస్తున్నాయి. అన్నీ సంకర జాతి అయిపోతున్నాయి. ఇక పాడి పరిశ్రమ వాళ్ళు ఆవులు, గేదెలు కలిపి కొత్తగా జెర్సీ ఆవులు పుట్టిస్తున్నారు. ఆ ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి. అయితే ఆ పాల వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి అని నిరూపిత మైంది.
అలా ఆవులను గేదెలను సంకరం జరిపి పుట్టించటం సృష్టి విరుద్ధం . అలానే అవి అధికం గా పాలు ఇస్తాయి అని వాటికి పిచ్చి తిండి పెట్టటం వల్ల చాలా చెడు ఫలితాలు వస్తున్నాయి. పూర్వ కాలం లో పశువులకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడు, చిట్టు ఇలా ఎంతో సహజ సిద్దమైన బలవర్ధక మైన ఆహారం పెట్టేవారు. అందువల్ల ఆ పాలు తాగిన మనుషులకు కూడా మంచి ఆరోగ్యం ఉండేది. కానీ ఇప్పుడు వాటిని చాలా వరకు కబెలాల్లో కోసి తినేస్తున్నారు. ఇంకా మిగిలిన కొద్ది బర్రేలే ఎక్కువ పాలు ఇవ్వాలి. అందుకోసం వాటికి హార్మోన్ ఇంజేక్షన్స్ ఇస్తున్నారు. ఆ పాలు మనం తాగటం వల్ల మన శరీరాల్లో కి ఆ పదార్ధాలు వెళ్లి మనకి ఊబకాయం, ఇంకా కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఇంకా పెరిదాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మనం పాలు తీయకుండానే అవే పాలని బిందేల్లోకి కార్చేస్తాయి. ఆ పాల ద్వారా ఆ హర్మోనే మన శరీరం లోకి ప్రవేశిస్తుంది . అందువల్లనే చిన్న పిల్లల్లో కళ్ళ వ్యాధులు, బి.పీ. , ఎముకలలో బలం తగ్గిపోవటం మొదలైన జబ్బులు వస్తున్నాయి.
ఇంకా పాలు కృత్రిమం గా తయారు చేస్తున్నారు. సబ్బు నురగ +పెయింట్ లో వాడె వైట్ నెర్+ఇంకా యూరియ+ ఇంకా కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరం. ఇంకా హెరిటేజ్, అముల్, వంటి టాప్ బ్రాండ్ పాలల్లో కలుషితాలను బాలల హక్కల సంఘం బయట పెట్టింది.
ఆ పాలను ఎవరు బాన్ చేయించ లేరు. డాక్టర్స్ కూడా అవి వాడద్దు అని చెప్పరు. వారికి కూడా పండగే పండగ. మన బలహీనత లను వారు ఉపయోగించు కుంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు .
ఈ మధ్య చైనా నుండి ప్లాస్టిక్ తో తయారు చేసిన బియ్యం కూడా దిగుమతి అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు చైనా వాళ్ళు కృత్రిమ గుడ్లు తయారు చేసారు. కానీ అవి ఎందుకో మార్కెట్ లో నిలబడ లేదు.డాక్టర్ లు కూడా ప్రతి పత్రిక లో, ప్రతి చానల్ లో ఆరోగ్య సూత్రాలు, జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఈ రసాయనాలు, ఈ కల్తీలు, ఈ కాలుష్యం గురించి ఏమీ మాట్లాడరు. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటేనే అందరికీ భ్రుతీ దొరుకుతుంది, పదిమంది ప్రజలు బ్రతుకుతున్నారు అనే అనుకుంటూ ఉన్నాడో ఏమో ఆ భగవంతుడు అని అడగాలనుంది.
ఏ పత్రిక చదివినా, ఏ టి .వి . ఛానల్ చూసినా రోజూ మీరు నడవండి, కొవ్వులు తినకండి, ఇన్ని గంటలు పడుకోండి, వ్యాయామం చెయ్యండి ....... అంటూ ఇలా చాలా జాగ్రత్తలు చెబుతారు. కానీ ఏం లాభం ? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిట్టచివరకు ఈ పైన చెప్పిన పదార్ధాలు అన్నీ మన పోషణ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనం ఆ డాక్టర్స్, జగ్రత్తపరులు చెప్పినవి విని ఆచరించి ఏమి లాభం ? ఈ కల్తీ పదార్ధాల వల్ల జరిగే చెడు జరిగిపోతోంది. అందువల్లనే ఏ వ్యసనాలు లేకపోయినా చంటి పిల్లలు, స్త్రీలు కూడా రోగాల బారిన పడుతున్నారు.
ఈ సమస్యలు తీరాలంటే ప్రభుత్వం మేలుకోవాలి ఆరోగ్యమైన సమాజం కోసం తగు చర్యలు చేపట్టాలి. కేవలం ప్రభుత్వమే కాక మన వంతు గా మనం చదువుకున్న వాళ్ళు అందరు సంఘం గా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచే కార్యకలాపాలను తయారు చేసి వారిలో ఎవేర్నేస్ కలుగజేయాలి. ఈ బాధ్యత మన అందరి పై ఉంది. మనం ఇప్పుడు జాగ్రత్త పడితే మన రానున్న తరాలు, పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. నవ, ఆరోగ్య భారత నిర్మాణం జరుగుతుంది.

0 comments:
Post a Comment