Pages

కృష్ణం వందే జగద్గురుం

        అందరికీ  శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .    "కృష్ణం వందే జగద్గురుం "  అంటే  జగద్గురువు అయిన కృష్ణ భగవానునికి నమస్కారములు  అని కదా అర్ధం .  శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో శ్రీకృష్ణ అవతారం సంపూర్ణ అవతారం అనగా ఇలా వచ్చి అలా వెళ్ళటం కాకుండా ఆయన ఈ భూమండలం పై మానవునిగా పుట్టి , మానవుని వలెనీ పెరిగి , మన జీవితం లో ధర్మం ఎలా ఆచరించాలొ, ధర్మం మానవులను ఎలా రక్షిస్తుందో తెలియజేసాడు .  అందుకు అవసరమైన సంఘటనలు మన కాళ్ళ ముందు జరిపించి చూపించాడు .

          ఈ మధ్య కాలం లో బ్రహ్మ కుమారీ సమాజం వారు ఒక చోట ఉపన్యాసం చెపుతూ ఉంటె విన్నాను , అందులో వారు " కృష్ణుడూ , రాముడూ శివుడిని పూజించారు .  దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే వారు గొప్పవారే కానీ మన లానే మనుషులు దేవతలు కారు .  ఎందుకంటె వారికి వచ్చిన సమస్యలు తొలగించు కోవటానికి వారికి శక్తి లేక వారు శివుడిని పూజించారు .  కనుక వీరికంటే శివుడు గొప్పవాడు , భగవంతుడు కనుక మనం కూడా శివుడిని పూజించాలి " అని చెప్పారు .  ఇక్కడ మొదటగా ఆలోచించ వలసిన విషయం శివ కేశవులు ఇద్దరూ ఒక్కటే  ఇంకా చెప్పాలంటే త్రిమూర్తులు ముగ్గురూ ఒక్కరే ... అని తెలుసుకోవాలి
            ఇంకా మనకు స్పష్టం గా అర్ధం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూపము చూడండి.  అందులో ఆయన తలలు అన్నీ వరుసగా ఉంటాయి .వినాయకుడు , నారసింహుడు , శివుడు , హనుమంతుడు , ఇలా అన్ని రూపాల్లో ఆయనే .  అన్నీ ఆయన ఒక్కడే .  అందుకే ఈ ఉపనిషత్తు వాక్యం లో ఇలా అన్నారు "ఏకదాసీథ్  బహుదా వదంతి "  అంటే బ్రహ్మ పదార్ధం ఒకటే దానినే పండితులు బహు రూపాలుగా వర్ణించారు . కనుక భగవంతుడు ఒక్కడే .  అవసరాలను బట్టి వివిధ రూపాలలో అవతారాలుగా మారి లోక రక్షణ చేపడుతుంటాడు .పైగా మానవ రూపం లో విష్ణువు రావటం వల్ల అక్కడ వైకుంటం ఖాళీ అయ్యింది .  అప్పుడు ఎవర్ని ఆరాధించాలి ?  పైగా ఇక్కడ మానవుడిగా ఉన్నాడు కనుక శివుడ్ని పూజించాడు .  ఇక్కడ కృష్ణావతారానికి వస్తే  అది మధుర భక్తి .  ఆయన భక్తులకు భగవత్ గీత ను ఉపదేశించాడు . జ్ఞానం అందించాడు .   వ్యక్తిత్వ వికాసాన్ని బోధించాడు .టీం వర్క్ ఎలా చెయ్యాలో చేసి చూపించాడు . కృష్ణార్జునులుగా స్నేహం ,  బావా బావమరిది అనుబంధం , బలరామ కృష్ణులు గా అన్నదమ్ముల అనుబంధం , ఇలా అందరినీ మురిపించాడు .
 
         ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుంది . అని చెప్తూ ఉంటారు అంటే కృష్ణుడు ఇక్కడ మార్గ నిర్దేసకుడుగా ఉంటె, అర్జునుడు ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించి   విజయం సాధించాడు .


          భగవంతునికి ఆడంబరం గా పూజలు చేయనక్కర్లేదు .  ఆయనే చెప్పాడు "నన్ను మనస్ఫూర్తిగా తలంచి నా పాదాల వద్ద ఒక తులసిదలాన్ని  బక్తి గా సమర్పించినా చాలు అహంకారం విడిచి సదా నన్ను ఆరాధిస్తే చాలు వారి క్షేమం నేను చూస్తాను " అని .  ఈ ఒక్క మాట చాలు  మనం ఆయన భక్తులుగా ఆయన వెంట పరుగుపెత్తతానికి.  హరే రామ హరే రామ రామ రామ హరే హరే   హరే కృష్ణ హరే కృష్ణ  హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే  అని అనుకున్నా చాలు మనకు ఎన్నో లాభాలు చేకూరుతాయి

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online