🌷 ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ🌹
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌷Tiruppavai12 th pasuram ...తిరుప్పావై12 వ పాశురం 🌷
🌹ఓం నమో నారాయణాయ..ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే పాహిమాం ఓం నమో వేంకటేశాయ🌹
సినిమా టిక్కెట్లు ధరపై రాజకీయ0
https://telugu.greatandhra.com/articles/mbs/nani-and-film-tickets-123259.html
😀😁 ఈ లింక్ లో చూద్దాం 😀😄
🌹 Tirupppavai 11 th pashuram ..తిరుప్పావై11వ పాశురం 🌹
🌷ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌷
🌷ఓం నమో వేంకటేశాయ 🌷
తిరుప్పావై పాశురం8 ...tiruppavai pasuram 8
🌷 ఓం నమో నారాయణాయ ..ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌷
🌹ఓం నమో వేంకటేశాయ 🌹
🌷 Tiruppavai godavaibhavam..2 nd pasuram ...తిరుప్పావై పాశురం నె0 2 🌷డా ..మరింగంటి మురళీకృష్ణ భట్టరాచార్యులు
🌹 ఓం నమో నారాయణా య ...ఓం నమో వేంకటేశాయ 🌹
🌹తిరుప్పావై ..శ్రీగోదాదేవి అమ్మవారి వైభవం 🌻..డాక్టర్ మరింగంటి మురళీకృష్ణ భట్ట రాచార్య
🌹ఓం నమో నారాయణా య ...ఓం నమో వేంకటేశాయ🌷
🌞 సూర్యదేవుని ఆరాధన గురించి తెలుసుకుందాము.. ఓం శ్రీ సూర్య దేవాయన మహ:🌞
డాక్టర్ మరింగంటి మురళీకృష్ణభట్టరాచార్య
🌹ఓం నమో నారాయణాయ ....ఓం నమో వేంకటేశాయ🌹🌷శ్రీమద్భాగవతము..ఓం నమో నారాయణా య..జయ జయ శ్రీ కృష్ణ 🌷
🌷 *శ్రీమద్భాగవతము*🌷
🌻 శిరస్సులో ప్రాణమయ కోశమునకు గల ప్రారంభ స్థానమును ధ్యానించుచు వెన్నెముక వెంట ఉన్న నాడీ మండలమును ఈ ప్రాణమయ కోశమను అశ్వము యొక్క దేహముగా ధ్యానము చేయుటయే అశ్వశిరస్సు అనబడు విద్య. దీని వలన సర్వజ్ఞత్వము, సకల బంధ విమోచనము కలుగును. దీనినే హయగ్రీవ విద్యగా మంత్ర శాస్ర్తము ఉపదేశించుచున్నది.
అశ్వినీ దేవతలకు దధీచి ఇది వరకే ఉపదేశించినట్లు నారాయణుడు చెప్పుచున్నాడు. దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము. ధారణ చేయు శక్తి, బుద్ధిబలము, వివేకము కలసి వెన్నెముక యందు ఎల్లెడెల వ్యాపించి పని చేయుచుండును. ఆ వెలుగునకు జీవులు చేయు కర్మతో సంబంధము లేదు. కనుకనే దధీచి అశ్వినులను జీవన్ముక్తులను చేసెనని చెప్పెను
బుద్ధిని ఆశ్రయించినచో అంతర్యామిత్వము దర్శనమిచ్చుననియు, దానిని వెన్నెముకలోను, శిరస్సులోను ధ్యానము చేసినచో అంతర్యామి యందు అన్య వస్తువులు చూడబడవనియు ఏకాంత స్థితి లభించి జీవన్ముక్తుడు అగుననియు భావన. ఇదియే వృత్రాసురుని వధ............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-346,347.
🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 నారాయణుడు దేవతలచే ఇంకనూ ఇట్లనెను...... ఆ దధీచియే విశ్వరూపునకు కూడా నా పేరున ఒక కవచమును ప్రసాదించెను. దానిని ఛేదించుటకు ఎవనికి శక్యము కాదు. (విశ్వమునందలి జీవుల రూపములు అన్నింటిలో వేరు వేరుగా నేనను ప్రజ్ఞ స్థాపించుకొని ఉన్నది. అది అందరిలో ఉన్నది కనుక ఏ ఒక్కరికిని లొంగదు. దాని వెనుక గల అంతర్యామిత్వమే నారాయణుడు. దానిని ధ్యానించుటయే నారాయణ కవచము.)
ఆ దధీచి మహానుభావుడు. అతడు దేహమును దాచుకొనక మీకు ఇచ్చును. (మనస్సునకు, ఇంద్రియములకు దేహముపై వ్యామోహము ఉండును. దేహమును తమ ప్రయోజనమునకై దాచుకొనవలెనని ఉండును. దీనినే దేహాభిమానము అందురు. బుద్ధిశక్తికి అట్టిది లేదు కనుక తనకు కావలసినది ఏదియు లేదు. దేహమును తనకు కావలెననుకొనక మనస్సునకు, ఇంద్రియములకు దానము చెయుననియును, ఈ పనికోసమే వెన్నెముకను ఉపయోగించుననియును అర్థము.)
ఆ దధీచి మహర్షి ఎముకలు విశ్వకర్మచే నిర్మింపబడినవి. (బుద్ధికి వాహనముగా ఉండుటకు దేహము ఏర్పడినది. అందు పిండమున గట్టి ఎముకలు నిర్మాణమగుట ఆశ్చర్యకరమైన సామర్థ్యము. అట్టి ఎముకలతోడి దేహపంజరమును అల్లుట తల నుండి వెన్నెముకకు ప్రజ్ఞలు దిగివచ్చి పనిచేయు నిర్మాణము చేయగలుగుట సామాన్యునకు చేతనైన పనులు కావు. ఆకాశమున ప్రతి భాగమందును ఇమిడి ఉన్న ఒక మహాప్రజ్ఞ ఏ గర్భమునందైనను అస్థిపంజరమును అల్లుచున్నది. ఆ మహాప్రపజ్ఞనే విశ్వకర్మ అందురు. త్వష్ట కుమారుడైన విశ్వరూపుడు విశ్వమునకు రూపములను ఈయగా విశ్వకర్మ నిర్మాణములను చేయచున్నాడు.)............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-346,347.
ఓం నమో వేంకటేశాయ.......
🌴🥀 మంచినీరు..మంచి ఆరోగ్యం ఎప్పుడు ఎప్పుడు ఇస్తుంది చూద్దామా..🌴🥀
*రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?*
*రాయపూడి కార్డియాలజిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్ర౦...*
*రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు?*
*కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!*
*అసలు - రాత్రి పూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?*
*👉ఒక కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) ఏమి చెప్పాడంటే -*
*మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు ఉంటుంది (ముఖ్య౦గా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ) ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రి౦ది భాగాలులో, ముఖ్య౦గా కాళ్ళలో ఎక్కువ నీళ్ళు నిలువు౦టాయి.*
*అదే, మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలైనవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటు౦ది కనుక, మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగి౦చేదానికి సులభంగా ఉ౦టు౦ది.*
*మూత్రం ద్వారానే మన రక్తంలోని మలినాలు, విషపదార్ధాలు విసర్జింపబడతాయి.*
*అటువ౦టప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.*
*👉హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు*
1. *ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు(2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది*
2. *భోజనానికి 30 నిమిషాల ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది*
3. *స్నానం చేయడానికి ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది)*
4. *రాత్రి పడుకునే ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది)*
5. *అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.*
6. *కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.*
*🙏🏻సర్వేజనా సుఖినోభవంతూ🙏🏻*
🙏🏻 🙏🙏🙏🕉🙏🙏🙏🙏🏻
🌹శ్రీమత్ భాగవతం ..శ్రీమహావిష్ణువుకథా మృతం సేవిద్దాం ...తరిద్దాం ఓం నమో నారాయణా య ...ఓం నమో వే0కటేశాయ🌹
Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 నీ మహిమ ఒక అమృత సముద్రము. అందు ఒక బొట్టు ఎప్పుడో ఒకప్పుడు నాలుక మీద పడినంత మాత్రముననే సాధకులు సంతోషపడుచుందురు. నిరంతరమైన ఆ సుఖమును అనుభవించుచుందురు. అట్లు అనుభవించుటలో తాము చూచున్నవి, వినుచున్నవి, అనుభవింపబడుచున్నవి అగు ఇంద్రియార్థములు విస్మరింపబడి అఖండానుభూతి కలుగుచుండును. అట్టివారే పరమభాగవతులు.
వారు నీ పాద పద్మములను సేవించుటయే ధర్మమని నమ్మి మరువకుందురు. నీవు మూడు లోకములుగా ఉద్భవించుచున్నావు. మూడు లోకములను ఆక్రమించుచున్నావు. మూడింటిని చూచు దృష్టి కలిగి త్రిలోచనుడవై ఉన్నావు. మూడు లోకముల యొక్క మనోహరమైన అనుభవముగా ఉన్నావు.
మానవులు దానవులు మొదలగు భేదములన్నియు నీ యందున్న క్రమములే. ఈ క్రమములను వారెవరును దాటలేరు. నీవు నీ మాయ వలన సురలు నరులు మృగములు జలచరములు మొదలైన రూపములు ధరించి ఉన్నావు. ఆయా అవతారములలో దిగి వచ్చి మమ్ము తగిన విధముగా శిక్షణమిచ్చి రక్షించుచున్నావు.........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-343.
Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 దేవతలు ఇంకనూ ఇట్లనిరి..... నీవు భక్తవత్సలుడవు. నీ ముఖపద్మము నుండి వెలువడిన మధుర వచనామృతమందలి ప్రత్యేక కళలచే మా హృదయతాపమును తొలగింపుము. నీవు జగత్తులను పుట్టించుచు మనుచుచు లయము చేయుచు నీ దివ్యమాయచే వినోదించుచుందువు. జీవులందరకును లోపల వెలుపల గల పరబ్రహ్మముగా ఉన్నావు. సూటిగా తానుగా కూడా ఉన్నావు. దేశము కాలము దేహము దాని స్థితులు దానికి ఆధారములు దాని అనుభవములు కలిగి ఉన్నావు.
ఇన్నిటికి సాక్షివై, అతీతుడవై ఉన్న నీకు మేము ఏమని విన్నవింతుము. నీ దివ్య చరణారవిందముల నీడ-జాడలు లోకములకు ఆశ్రయములు. సంసార బాధలను పాపములను ఉపశమింప జేయుటకు అవి మాత్రమే అక్కరకు వచ్చును. వానిని ఆశ్రయించెదము. అని పలు విధముల స్తోత్రము చేసి ఇంకను ఇట్లనిరి.
ఇట్లు భక్తిపరవశులై దేవతలు అతి మనోహరముగా స్తోత్రము చేయుచుండిరి అప్పుడు ఆ పరమేశ్వరుడు అమృతమయములైన గంభీర సంభాషణములతో ఇట్లనెను:.......✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-344,345.
Blog Archive
-
▼
2021
(189)
-
▼
December
(22)
- 🌷Tiruppavai16 th pasukan ...తిరుప్పావై 16 వ పాశుర...
- 🌷Tiruppavai15th pasukan .....తిరుప్పావై 15 వ పాశు...
- 🌷తిరుప్పావై14వ పాశురం ...Tiruppavai 14 th paashur...
- Tiruppvai13 th pasuram ...తిరుప్పావై 13 వ పాశురం
- 🌷Tiruppavai12 th pasuram ...తిరుప్పావై12 వ పాశురం 🌷
- సినిమా టిక్కెట్లు ధరపై రాజకీయ0
- 🌹 Tirupppavai 11 th pashuram ..తిరుప్పావై11వ పా...
- ఏమిటో రాజకీయ రంగులు ..వింత వింత లు
- 🥀తానా. అటా. లాంటి మరి ఇంకో సంస్థ వెలిసింది అద...
- 🌷తిరుప్పావై పాశురం 9 ..Tiruppavai pashuram 9 🌷
- తిరుప్పావై పాశురం8 ...tiruppavai pasuram 8
- 🌹తిరుప్పావై 7 వ పాశురం ..tiruppavai 7 th paashuram🌹
- తిరుప్పావై 6 వపాశురం. .....Tiruppavai 6 th paashuram
- 🌷తిరుప్పావై..5 పాశురం ..Tiruppavai...5 pasuram🌷
- ,,👑🌷Tiruppavai 4 pasuram ....తిరుప్పావై 4 వ పశుర...
- Tirupati..3 d pasukan .. తిరుప్పావై 3 వ పాశురం
- 🌷 Tiruppavai godavaibhavam..2 nd pasuram ...తిరుప...
- 🌹తిరుప్పావై ..శ్రీగోదాదేవి అమ్మవారి వైభవం 🌻..డాక...
- 🌞 సూర్యదేవుని ఆరాధన గురించి తెలుసుకుందాము.. ఓం శ్...
- 🌷శ్రీమద్భాగవతము..ఓం నమో నారాయణా య..జయ జయ శ్రీ కృష...
- 🌴🥀 మంచినీరు..మంచి ఆరోగ్యం ఎప్పుడు ఎప్పుడు ఇస్త...
- 🌹శ్రీమత్ భాగవతం ..శ్రీమహావిష్ణువుకథా మృతం సేవిద్ద...
-
▼
December
(22)
Followers
About Me
- Dr.M muralikrishna