Pages

Sunderkandaparayana is solution for all problems in real life

సుందరకాండ పారాయణంతో సకల దోషాల...
విముక్తి..!!
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏

సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు
తొలగి పోతాయి.
శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు
ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.
అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో
ఓ సందర్భంలో అంటాడు.
'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,
వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ.

సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
బిల్వవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.
నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ
ఎంతో శుభప్రదం.
ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి.
సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో
ఉదాత్త గుణాలు కలుగుతాయి.
ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు.
సుగ్రీవుని మంత్రిగా ఆంజనేయుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి
శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.

ఆంజనేయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతునిగా,
శ్రీరామచంద్రునికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
నవగ్రహ పీడలు తొలగి పోతాయి.
మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.
ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు
పదును పెట్టగలుగుతారు.
ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా
అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు.

అంతేకాక,అహంకార, మమకారాలకు
ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు.
ప్రలోభాలకు, బెదిరింపులకు చలించకుండా
తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగుతాడు. బృహద్ధర్మపురాణంలో సుందరకాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించబడింది.

మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో,
ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత
అందుకే పుట్టింది.
మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి,
ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగించేది సుందర కాండ.

కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు
సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత
త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచుతుంది.
చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.

సుందరకాండ పారాయణకు మన పెద్దలు
అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకిలను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగపడుతుంది.

రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు.

శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి
భూత,ప్రేత పిశాచాలు రావు.
శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన
పరమ రహస్యం ఇదే..!!

సర్వే జనా సుఖినోభవంతు..
అయితే పారాయణం చేసేటప్పుడు కొన్ని  శుచి శుభ్రత లు ఒంటిపూట భోజనం ..నేలపై పడుకోవడం ..బ్రహ్మచర్యం పాటించడం ....తరువాత బ్రాహ్మణులు కు భోజనాలు పెట్టడం ..లాంటివి ఉంటాయి అందుకే దాని విధి విధానాలను పండితులను ఒకసారి సంప్రదించి చేసుకోవాల్సి ఉంటుంది .
అందుకే అవి కుదరని వాళ్ళు ఆంజనేయ స్వామి 16 నామాలు ..శ్రీరామతారక మంత్రం ..చదువుకున్నా చాలు ..శ్రీరామ దూతం శిరసానమామి అనుకున్నా చాలు శ్రీరామదూత హనుమ అంటే ఆ నామం ఆయనకు చాలా ఇష్టం ...కనీసం శ్రీహనుమ ..జయ హనుమ జయహనుమ జయ జయ హనుమ ....అని చదువుకున్నా కూడా చాలా మంచిదే. శనివారంనాడు, ఉదయమే స్వామి గుడికి వెళ్ళి జయజయ చదువుకొని సింధూరం పెట్టుకొని వచ్చినా కూడా చాలా సమస్యలు దారికి వస్తాయి... ఈ చిన్న దానికి పెద్ద నియమాలు అవసరం లేదు ....కాస్తంత మంచి పనులు చేస్తే చాలు....జై హనుమ జైశ్రీరామీ

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online