ఆంధ్రకేసరి
-------------
"బీరువా నిండిపోయింది.ఒక కట్ట పెడితే ,పదికట్టలు పడిపోతున్నాయండీ !ఏమిచెయ్యమంటారు?"ప్రశ్నించిందా యిల్లాలు ప్రకాశంగారిని.
ఈ ఒక్కమాట చాలదా? ప్రకాశంగారు బారిష్టరుగా కోర్టులో పనిచేసి యేవిధంగా సంపాదించేవారో మనకి తెలియడానికి.
అలాగని ఆయన అడ్డమైన ,అన్యాయమైన కేసులూ వాదించేవారుకాదు.
నిజాయతీ కలిగిన కేసులను మాత్రమే తీసుకొని,వాదించి వారిని నిర్ధోషులుగా ఋజువుజేసి గెలిపించేవారు.
ఆయన వాదనా పటిమకు జడ్జీలే బిత్తరపోయేవారు.
బీదలదగ్గర ఒక్కరూపాయి ఫీజుగా తీసుకోని ప్రకాశంగారు,
ధనవంతులదగ్గరమాత్రం,ముక్కుపిండి రెట్టింపు ధనాన్ని వసూలు చేసేవారు. అలా ధనవంతుల కేసులు చేసి సంపాదించినధనమే బీరువాలో పట్టనంత ధనమై కూడింది.
ప్రకాశంగారికి ధనం దాచడం తెలియదు. ఆపన్నులకు అడిగినవెంటనే దానంచేయుటకు,ధనం యెల్లప్పుడూ అందుబాటులో
వుంచుకొనేవారు.
అలా యెందరికో దానధర్మాలు చేసేవారు.
అంతమంచి ప్రాక్టీస్ ని వదిలి పెట్టి స్వాతంత్ర్యసమరంలో కాలూని,తనసంపాదనంతా సమరనిధులకు వినియోగించారు.
మన ప్రకాశంగారుమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి ,ప్రత్యర్థులపన్నాగాలకు తలయొగ్గక పోవడం వలన పదవినుండి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది.దానికాయన యెంతమాత్రంచింతించలేదు. ఆవిషయం,అలాజరుగుతుందన్నవిషయం ఆయనముందుగానే తన ఆప్తులకు చెప్పారు.
అంతటి మహానేత, ఆంధ్రకేసరి యని ఆంగ్లేయులతో కొనయాడబడిన ఆమహాపురుషుడు చివరి దశను చాలా లేమితో గడపవలసి వచ్చింది. ఎంతగానంటే, ఒక నాడు ఆయన పుట్టినరోజునాడు ఒక అభిమాని ఆయనకు అత్యంత విలువైన ,అందమైన గులాబీదండను ఆయన మెడలోవేసి,పాదాలకు నమస్కరించినప్పుడు ఆ మహాదాత" ఒరేయ్ !ఈ గులాబీల దండకు బదులుగా
ఒక డజను అరటిపళ్ళు తెచ్చివుంటే నా ఆకలి తీరివుండేది కదా!" అన్నారంటే,
ఆ నిస్వార్థపరుడైన రాజకీయనాయకుడి గురించి ఒక్కక్షణం ఆలోచించండి.
అటువంటి పాలకుల చేతిలోనుండి మనదేశం ఈనాడు ఎలాంటి నాయకుల చేతిలోపడి అల్లాడిపోతోందో గ్రహించండి.
ఈనాడు ఆంధ్రకేసరి టంగుటూరివారి పుట్టినరోజు సందర్భంగా వాసినది.ఇది కథకాదు ,ఆయన నిజాయితీ జీవితానికి నిలువెత్తు నిదర్శనం.
(చదవండి,చదివించండి ఆధ్రకేసరి జీవితగాథ)
0 comments:
Post a Comment