Pages

A story about Kali testing the King Nala

కలిదోషం మనదరి చేరకూడదు అంటే..నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి...!


ఈ కలికాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పెనవేసుకుపోయింది.
దేనివల్ల అంటే కలిప్రభావం వలన అని అనేక శాస్త్రాలు తెలుపుతున్నాయి.
కలికాలంలో కలిదోషం మనదరి చేరకూడదు అంటే ఏమిచేయాలి? నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి.


ఇది కలికాలం కాబట్టి అందరికీ చదివే అవకాశం రాకపోవచ్చు.
లేదా చదవాలని ఉన్నా పుస్తకం పట్టుకోగానే మైకం కమ్మి నిద్ర పట్టేయవచ్చు.
ఇలా అనుకుంటూ కాలం గడిపేస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది?
తగ్గకపోగా ఇంకా ఇంకా పెరుగుతుంది.
కలిప్రభావం వలన మనం నిత్యం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో,
ఎన్ని కష్టాలు పడుతున్నమో చూస్తూనే ఉన్నాం కదా! మరెలా కలిప్రభావం తగ్గుతుంది.


ధర్మపాలుడు అయిన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని 15 సంవత్సరాలు ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని కలి పురుషుడు చూశాడు.
ఒకనాడు మూత్ర విసర్జన చేసి కళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు. అంతే! ఆ చిన్న పొరబాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి.
అది కూడా కలియుగం కాదు. కృతయుగంలో.. కృతయుగం అంటే ధర్మానికి నిలయం.
ఆయుగంలో అధర్మం పొరబాటున ప్రవేశించలేదు. అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుడిని పట్టుకున్నాడంటే ఈయుగంలో  మనం ఎంత ధర్మబద్దంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి అలోచించి చూసుకోండి..


కలి ప్రవేశించడంతో జూదం ఆడాలని అనిపించింది. అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు.
అడవుల పాలయ్యాడు.
అయినా తన ధర్మనిష్ఠకి బద్ధుడై జీవించాడు.
ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు. అప్పటి వరకు సుందరమైన రూపంతో ఉన్న నలుడి క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళేలా చేశాడు.


ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా ఒదిలి వెళ్ళిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా రెండో వివాహం అని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది.
ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని ఐతే కురూపిగా ఉన్నాడని సందేహించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడి రాజ్యానికి రెండుసార్లు వర్తమానం పంపడం,
తెల్లారితే స్వయంవరం కావడంతో ఋతుపర్ణుడు నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారధ్యం కోరతాడు.
అప్పటికే తన భార్య దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది?
అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్ళి వివాహం ఎందుకు చేసుకుంటుంది?
ఇది ఎలాగైనా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించి రథసారధ్యం వహిస్తాడు.


ఆ రథం వెళ్ళే వేగానికి (నిమిషానికి "నిమిషం అంటే కంటి రెప్పపాటు" అంటే కనురెప్పపాటు కాలంలో 8 యోజనాల దూరం వెళ్ళే వేగానికి) ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. మహాత్మా! నీవు సామాన్యుడిలా లేవు.
ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్ధ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది.
ఆయనే నలుడు.
అది మీరే అని నా సందేహం.
నిజం చెప్పండి అంటూ ఉండగా ఆవేగానికి తన భుజం పై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పడుతుంది.
మహాత్మా ఒక్కసారి రథం ఆపండి.
ఉత్తరీయం తీసుకురావాలి అనగా! నలుడు మహారాజా! ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పేలోపు మనం 8యోజనాల దూరం వచ్చేసాం.
ఇప్పడు వెనక్కి వెళ్ళడం అంటే సమయానికి మనం చేరుకోలేము.
అనగానే ఆశ్చర్యపోయిన ఋతుపర్ణుడు.. మహాత్మా! ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి. అంటాడు.
రథాన్ని ఆపుతాడు నలుడు.
ఋతుపర్ణుడు నలుడిని వివరం అడుగుతాడు.


అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడు ఆనందాశ్చర్యలకు గురై మహాత్మా! నీకు అక్ష హృదయ విద్య ఉపదేశిస్తాను.
నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే మహరాజా!ప్రస్తుతం నేను కురూపిని ముందు నాకు అక్షహృదయ విద్య ఉపదేశించండి.
ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది.
ప్రస్తుతం ఈరూపం వదలకూడదు.
అందుచేత రూపం మారిన వెంటనే మీకు అశ్వహృదయ విద్య బోధిస్తాను...అన్నాడు నలుడు.
వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకి తీసుకెళ్ళి అక్షహృదయ విద్య బోధిస్తాడు.
ఆ మంత్ర ప్రభావం చేత, నిత్యం తాను చేస్తున్న సంధ్యవందం చేత,
ఆచరిస్తున్న ధర్మ నిష్ఠ చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చాడు.


"మహానుభావా!నీకు నమస్కారం.
నన్ను శపించకు. నేను కలిపురుషుడిని.
నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చేయాలనీ నీలో ప్రవేశించాను.


ప్రవేశించాను అనే పేరే కాని నీలో ప్రవేశించిన క్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ఠ, నియమ నిష్టలకి నిరంతరం దహించుకుపోయాను.
నిన్ను పరిక్షించడం మాట అటుంచి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖం లేదు.
దీనికి తోడు ఇప్పుడు నువ్వు పొందిన అక్ష హృదయ విద్య మరింతగా దహించింది.
ఇక నావల్ల కాక ఇలా బయటికి వచ్చేశాను.
నన్ను క్షమించు.
నన్ను శపించకు.
ఈనాటి నుండి నీకో వరం ఇస్తున్నాను.
నిన్ను..నీభార్యని,
కర్కోటకుడిని,
ఈ ఋతుపర్ణుడిని
ఎవరైతే తలచుకుంటారో వారిని నేను పట్టుకోను.
నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చేట్టులోకి ప్రవేశించాడు. ఆ శ్లోకమే ఈ క్రింద ఇచ్చిన శ్లోకం.
ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలి భయం ఉండదు.


కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలి నాశనం!
దమయంతి నలాబ్యాంచ ప్రణమామి పునః పునః..!!

The last message of Sri Krishna

లోకాన్ని ఉద్దరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన చివరి మాటలు:

కృష్ణుడు – ఉద్ధవుడు

ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆదుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.

‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందఱో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
 
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు. 
 
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
 

Our Forgotten Medical genius Dr. yellapragada

మనం మరిచిపోయిన మహానుభావుడు !
పేరు : ఎల్లాప్రగడ సుబ్బారావు
ఊరు: భీమవరం, ఆంద్రప్రదేశ్
పుట్టిన రోజు: జనవరి 12, 1895
వృత్తి: Biochemist (జీవరసాయన శాస్త్రవేత్త)


ఈయన గూర్చి మనం ఏమి తెలుసుకోవాలి?
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన ఓ వైద్య శాస్త్ర అద్భుతం !


Miracle man of medicine అని పిలిపించుకున్నాడు !


నోబెల్ బహుమతి గ్రహీత  GH  Hitchings ఎల్లాప్రగడ గూర్చి మాట్లాడతూ ఇలా అన్నారు " మేము కనిపెట్టిన చాలా న్యూక్లియోటైడ్స్ ఇంతకు ముందే ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టేశారు... దానినే మేము మళ్ళీ కనిపెట్టాము.. సుబ్బారావు తో పనిచేసిన ఆతని సాటి శాస్త్రవేత్తల అసూయ, ద్వేషం కారణంగా సుబ్బారావు చాలా ఆవిష్కరణలు ప్రపంచానికి తెలీదు !!


ఆయన జీవితం
౼౼౼౼౼౼౼౼౼


జనవరి 12, 1895 న భీమవరం లో పుట్టారు. స్కూల్ చదువులు రాజమండ్రి లో పూర్తి చేసుకుని, మద్రాస్ లో ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో LMS డిగ్రీ సంపాదించారు !


ఎల్లాప్రగడ వారికి ఆయుర్వేదమ్ పైన ఉన్న మక్కువ చేత, ఆయుర్వేదం ని ఆధునిక పద్ధతుల్లో బాగా వాడొచ్చని మద్రాస్ ఆయుర్వేద కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయ్యారు !


ఆయుర్వేదాన్ని సాటి భారతీయులే హేళన చేస్తున్న ఆ రోజుల్లో ఎల్లాప్రగడకి అమెరికా నుండి పిలుపు వచ్చింది ! అమెరికా లో Harvard university లో
PhD కూడా పూర్తిచేసి, ledral company తో కలిసి పనిచేసారు !


ఎల్లాప్రగడ ఆవిష్కరణలు (కొన్ని)
========×××=========


* ఫాలీక్ ఆసిడ్ తయారీ (రక్తహీనతకి మందు)
* మిటోట్రెకసెట్ (కాన్సర్ కి మందు)
* టెట్రా సైక్లిన్ (ప్లేగు, మలేరియా, కలరా etc  కి మందు
* అరియొమైసిన్ (పెన్సిలిన్, స్టెప్ట్రోమైసిన్ కంటే బాగా పనిచేసే antibiotics)
* రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాకి వైద్య సేవలు
*  మనిషి లో శక్తికి మూలం ATP
* Polymyxin ( పశువుల మేత)
* విటమిన్ B9 తయారీ


ఇలా ఎన్నో గొప్పగొప్ప విషయాలు ఆయన కనిపెట్టిన సరే, ఆయనికి ఎలాంటి గుర్తింపు రాలేదు.. నోబెల్ బహుమతి గాని, భారతరత్న గాని లేదు !


ఎందుకంటే ఆయన ఏదో ఆశించి ఇవన్నీ కనిపెట్టలేదు ! ప్రపంచ క్షేమం కోసం కనిపెట్టారు !


కానీ అతని తోటి శాస్త్రవేత్తలు, అక్కడి అమెరికన్లు భారతీయిడికి ఇంత పేరు, ప్రతిష్ట రాకూడదు అని అతని పరిశోధనలని వాళ్ళ పరిశోదనలుగా చెప్పుకున్నారు !


ఆఖరికి మన చరిత్రలో, మన పాఠ్యపుస్తకాలలో కూడా ఆ మహానుభావుడు కి చోటు లేదు !
ఎల్లాప్రగడా గూర్చి doron K Antrim అనే రచయిత ఇలా అంది " "Yet because he lived you may live longer".


ఎల్లాప్రగడ జీవితంలో జరిగిన  ఓ సంఘటన !
=============================


స్థలం: చెన్నై, మైలాపూర్,  కపాలీశ్వర దేవాలయం
సమయం: ఇంచుమించు 1922 సంవత్సరం  ఒక సాయంకాలం


దేవాలయం కోనేటి మెట్లపై ఓ ఐదారుగురు మిత్రులు కబుర్లాడుతున్నారువారంలో ఒకసారి అలా కలుసుకోవడం ఆనవాయితీ. ఆ గుంపులో మెడిసిన్ లో డిప్లమా తీసుకొని, చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టరూ ఉన్నాడు.


ఆయన నెల జీతం అరవై రూపాయలు.
డాక్టర్ : నాకేగనక ఓ పదివేలరూపాయలుంటే నా పరిశోధనలతో అద్భుతాలు చేసి చూపిస్తాను.


ఒకశ్రోత : సర్లేవయ్యా! నీ సోది ఎప్పుడూ ఉండేదేగదా!


డా: నిజం సర్, నామాట నమ్మండి. పెట్టుబడే ఉంటే, "సర్పగంధి "తో నేను దివ్యౌషధాలు చేసి చూపిస్తాను.


రెండవశ్రోత : ఇంకానయం. మృతసంజీవని చేస్తానన్నావుకాదు.


డా :పరిహాసాలు కాదు సర్. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి. అంతే.


మొ.శ్రో.: పరిహాసం కాదు డాక్టరుగారూ! నిజంగానే అంటున్నాను. అంతపెట్టుబడి మనకెక్కడ? ఏ అమెరికావాడో పెడితే తప్ప.


ఇంతలో పెద్దవాన. కూర్చున్నవాళ్ళంతా లేచి బిరబిరా తలో మూలా వెళ్ళారు. మన మిత్రబృందం దేవాలయం సన్నిధిలో పూజాసామాగ్రి అమ్మే ఒక దుకాణం చూరుకింద నిల్చున్నారు.అక్కడా ఈ డాక్టరు గారు వదల్లేదు. సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఆంగ్లంలో అనర్గళంగా దంచుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుకనుంచి ఒకతను,


" నిజంగానే మీరు అలాంటి మందులను తయారు చేయగలరా?" అని ప్రశ్నించాడు ఆంగ్లంలో.


మిత్రులు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తే, అతనొక అమెరికన్. డాక్టర్ అత్యుత్సాహంతో " కచ్చితంగా సర్. పెట్టుబడి పెట్టిచూడండి." అన్నాడు.


ఆ అమెరికన్ "సరే. నేను LEDERLE కంపెనీ ప్రతినిధిని. మాకంపెనీ డైరెక్టర్స్ తో మాట్లాడి, ఒకట్రెండు నెలల్లో మీకు తెలియపరుస్తాను." అంటూ డాక్టరుగారి చిరునామా తీసుకున్నాడు.


“ నిజం సర్. ఆరునెలలు గడువియ్యండి చాలు. నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఇండియాకు తిప్పి పంపేయండి" అంటూ ఏదేదో పలవరించసాగాడు పాపమాడాక్టర్.


మర్నాటినుంచీ డాక్టర్ ఎదురు చూపులూ, మిత్రుల పరిహాసాలూ. ఆరువారాల తరువాత LEDERLE COMANY  నుంచి డాక్టరుగారికి ఒక ఉత్తరం వచ్చింది.


"మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, ఓషధీజ్ఞానం మాకు తెలిసింది. ప్రజలకోసం కొత్తమందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరుకనిపెట్టే వాటిల్లో ఏ ఒక్కటి ఫలప్రదమైనా సంతోషిస్తాం. మీరు ఢిల్లీలో మాసంస్థ కార్యాలయానికి వెళ్ళండి. మీప్రయాణ ఏర్పాట్లన్నీ వారు చూసుకుంటారు".
.
ఇదీ ఆ ఉత్తరం సారాంశం. డాక్టరుగారు ఆ ఉత్తరాన్ని ఓ వందసార్లయినా మిత్రులకు చదివి వినిపించుంటారు.
.
 తరువాత ఆయన అమెరికా వెళ్ళడం HETROGEN, TETRACYCLINE, METHOTREXATE(USEFUL IN CANCER TREATMENT) ,POLYMIXIN (Cattle Field )   లాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం అంతా గొప్ప చరిత్ర.


ఆ మహానుభావుడే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావు గారు.


జనవరి 12 పూజ్య స్వామీ వివేకానంద జన్మదినం అని అందరికీ తెలుసు. ఆరోజే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావుగారి జన్మదినం కూడా.


LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.


భాస్కరుడు, చరఖులనుంచీ, శ్రీనివాసరామానుజం, యల్లాప్రగ్గడ సుబ్బారావు గారిదాకా వేలసంవత్సరాలుగా మన భారతీయ మేధ విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. మన యువతకే అది పనికిరానిదయింది.
https://en.m.wikipedia.org/wiki/Yellapragada_Subbarow
http://www.ysubbarow.info/


 

Details about Patri we use in Ganesh Puja on Ganesh Chaturdhi





Happy Ganesh chaturdhi to all my friends.  I just saw this video today on SVBC channel.  It has a detailed description about the patri (the Leaves we use in Ganesh Puja on Vinayaka chavithi) It has complete information reg. all the plants n leaves we use in the Puja and their health benefits n uses also.  I just wanted to share this information with all of u.  That's why am posting this video in this blog.  Its just for the information sake,  No commercial purpose for me.  Please watch this video and know the details n use these plants n leaves accordingly.  Please try to grow some useful plants if possible at home so that we can protect this planet.  Please worship clay Ganesha not made with harmful chemical induced plaster of paris n other materials. 

Happy Ganesh chaturdhi to all of u.

Andhra Kesari Tanguturi Prakasam garu

ఆంధ్రకేసరి
             -------------

        "బీరువా నిండిపోయింది.ఒక కట్ట పెడితే ,పదికట్టలు పడిపోతున్నాయండీ !ఏమిచెయ్యమంటారు?"ప్రశ్నించిందా యిల్లాలు ప్రకాశంగారిని.
               ఈ ఒక్కమాట చాలదా? ప్రకాశంగారు బారిష్టరుగా కోర్టులో పనిచేసి యేవిధంగా సంపాదించేవారో మనకి తెలియడానికి.
           అలాగని ఆయన అడ్డమైన ,అన్యాయమైన కేసులూ వాదించేవారుకాదు.
నిజాయతీ కలిగిన కేసులను మాత్రమే తీసుకొని,వాదించి వారిని నిర్ధోషులుగా ఋజువుజేసి గెలిపించేవారు.
ఆయన వాదనా పటిమకు జడ్జీలే బిత్తరపోయేవారు.
బీదలదగ్గర ఒక్కరూపాయి ఫీజుగా తీసుకోని ప్రకాశంగారు,
ధనవంతులదగ్గరమాత్రం,ముక్కుపిండి రెట్టింపు ధనాన్ని వసూలు చేసేవారు. అలా ధనవంతుల కేసులు చేసి సంపాదించినధనమే బీరువాలో పట్టనంత ధనమై కూడింది.
            ప్రకాశంగారికి ధనం దాచడం తెలియదు. ఆపన్నులకు అడిగినవెంటనే దానంచేయుటకు,ధనం యెల్లప్పుడూ అందుబాటులో 
వుంచుకొనేవారు.
అలా యెందరికో దానధర్మాలు చేసేవారు.
             అంతమంచి ప్రాక్టీస్ ని వదిలి పెట్టి స్వాతంత్ర్యసమరంలో కాలూని,తనసంపాదనంతా సమరనిధులకు వినియోగించారు. 
                      మన ప్రకాశంగారుమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి ,ప్రత్యర్థులపన్నాగాలకు తలయొగ్గక పోవడం వలన పదవినుండి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది.దానికాయన యెంతమాత్రంచింతించలేదు. ఆవిషయం,అలాజరుగుతుందన్నవిషయం ఆయనముందుగానే తన ఆప్తులకు చెప్పారు.
                        అంతటి మహానేత, ఆంధ్రకేసరి యని ఆంగ్లేయులతో కొనయాడబడిన ఆమహాపురుషుడు చివరి దశను చాలా లేమితో గడపవలసి వచ్చింది. ఎంతగానంటే, ఒక నాడు ఆయన పుట్టినరోజునాడు ఒక అభిమాని ఆయనకు అత్యంత విలువైన ,అందమైన గులాబీదండను ఆయన మెడలోవేసి,పాదాలకు నమస్కరించినప్పుడు ఆ మహాదాత" ఒరేయ్ !ఈ గులాబీల దండకు బదులుగా 
ఒక డజను అరటిపళ్ళు తెచ్చివుంటే నా ఆకలి తీరివుండేది కదా!" అన్నారంటే,
ఆ నిస్వార్థపరుడైన రాజకీయనాయకుడి గురించి ఒక్కక్షణం ఆలోచించండి.
                అటువంటి పాలకుల చేతిలోనుండి మనదేశం ఈనాడు ఎలాంటి నాయకుల చేతిలోపడి అల్లాడిపోతోందో గ్రహించండి.
   
ఈనాడు ఆంధ్రకేసరి టంగుటూరివారి పుట్టినరోజు సందర్భంగా వాసినది.ఇది కథకాదు ,ఆయన నిజాయితీ జీవితానికి నిలువెత్తు నిదర్శనం.

(చదవండి,చదివించండి ఆధ్రకేసరి జీవితగాథ)

surya namaskaras postures pictures


A beautiful song on Shri Krishna


A wonderful summation of shri krishna tatwam


BhagavadGeeta - a way to heal ailments like Diabetes


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online