Pages

A tribute to Shri Atal Bihari Vajpeyeeji

ఎన్నో ఎగిరే జండాలను తనలో ఇముడ్చు కొంది

భారతీయ సంస్కృతి ఆత్మ గా పెట్టుకొని పై పైకి.ఎదిగి వచ్చింది

తళుకు తళుకు నక్షత్రాల పుంత లో ధృవ తార. వాజపేయo

ఎందరికో దశ దిశా నిర్దేశం చేసిన తార

కాల చక్రం తిరిగిపోతున్నా నింగి లో అవి ధృవ తారలే

ఎంతో గొప్పగా, ఎంతో ఎత్తులో సూర్య చంద్రులు. అయినా వాటిపైననే తళుకు, తళుకు. తారల పుంత

రాజకీయకారు మేఘాలను అంటుకోకుండా అవల వెలిశాయి.

చల్లనివేళ చక్కని వేళ కనువిందు చేస్తూ సమాజ స్పృహ ని బోధిస్తాయు

దైవమే ఎంచి పంపిన మహాత్ములు వీళ్ళు

పదవులు కోసం వెతుక్కోరు, కిరీటాలకోసం కొట్లాడరు

నిరంతరం సమ సమాజ స్థాపనం, సంఘ ఉద్ధరణ వారి ధ్యేయం

వారికీ. కోట్ల నం ,మందీ మహార్బలం, అధికార దర్పం ఏమీ కనిపించవు

వారు ఒక్కరే సమాజములో కోట్ల విలువధనానికి సమానం

వారు ఒక్కరే కోట్ల సైన్యానికి సమానం,వాళ్ళఆలోచనలు అన్నీ సౌమ్యమే

గొప్పకోసమో, ప్రచారం కోసమో ఫోజులివ్వరు

పుట్టినప్పుడే వారి మేధ లో గొప్ప విజన్ మొలిచే ఉంటుంది

దాని ని మనుషుల్లో పాతి పెంచుతారు మహా వృక్షం లా

వారికి సింహాసనం గడ్డి పోచ సమానం, దేశభక్తి వారికి శిరోధార్యం

అందుకే యావత్తు దేశం వారి వెంట ప్రవాహం లా పరుగులుపెడుతుంది

జాతికోసం జండాపట్టుకొని ప్రాకి ప్రాకి ,పై పైకి

శిఖరం లో కలిసిపోయి, ఆకాశంలో చేరిపోయు

తళుకు తళుకు, ధగ ధగా వెలిగే తారలవుతారు

సూర్య చంద్రులు వున్నంత కాలo వారి సుకీర్తి శా స్వతమ్  (భారత రత్నం వాజపేయి గారికి సవినయం గా సమర్పించే శ్రద్దాo జలి)

 
 

 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online