Pages

గణేశ ఆరాధన అంతరార్ధం

      వినాయకుడు బృహస్పతి అవతారం అని చెబుతారు .  ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తన చెల్లెలు అయిన పార్వతి తనకి కొడుకు గా పుట్టమని కోరుకుంటే అలా వినాయకుడి గా అవతరించాడు అని కూడా చెబుతారు .  అందుకే  " శుక్లాంబర ధరమ్ విష్ణుం  శశి వర్ణం ....." అనే శ్లోకం లో తెల్లని వస్త్రాలు ధరించిన విష్ణువు అని అర్ధం కూడా వస్తుంది .

    ఆది శంకరులవారు జగత్తు అంతా తిరిగి 76 మతాలను ఆ మతాల స్థాపకులను ఎదిరించి కేవలం కేవలం 5, మతాలను మాత్రమే అంగీకరించారు.  అందులో సూర్యుడు , శివుడు , విష్ణువు , శక్తీ , గణేశుడు ఆరాధన చేస్తూ ఈ ఐదుగురిలో మనకు ఇష్టమైన దైవాన్ని మధ్యలో ఉంచి ఎక్కువ గా ఆరాధించడం అనే పద్ధతిని స్థాపించారు.  అందుకే ఆయనను షణ్మత స్థాపనాచార్య అని అంటారు.  ఈ ఆరు మతాలలో గణేశుడు ఉన్నాడు .  గాణాపత్యులు అని గణపతి ఆరాధకులు ఉన్నారు .పూర్వం శాస్త్ర పండితుల ఇళ్లల్లో ఈ 5 దేవతల విగ్రహాలు పెట్టుకొని పూజించే ఆచారం ఉండేది.  అలా వైదిక సాంప్రదాయం లో గణపతి అర్చన ఉంది. 

వర్షాకాలం కొత్త నీరు వచ్చి చేరుతుంది నదులు , చెరువులు మొదలైన వాటిలో.  ఆ నీటిని కాపాడుకోటానికి ఆ నీటి వనరుల్లో పాత మట్టిని తీసి ఆ మట్టి తో గణపతిని చేసి ఔషధ గుణాలు ఉన్న మూలికలు, పత్రాలతో ఆయనను పూజించి, పసుపు , కుంకుమ , గంధం , అక్షతలు అన్నీ కలిసిన ఈ పూజాపత్రిని, గణేశ ప్రతిమ తో సహా నీటిలో కలుపుతారు.  ఈ మూలికల వల్ల వాటిలోని ఔషధ గుణాలు నీటిలో చేరి కొత్త  నీరు శుద్ధి అవుతుంది.  ఇది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయం .


   ఇక వేదాంత పరం గా చూస్తే సృష్టి లో ప్రతి జీవి మట్టిలో పుట్టి మట్టి లో కలిసిపోతుంది.  అనే విషయం మనకు ఈ పూజ తెలియజేస్తుంది.  మట్టి లో పంటలు పండించే ప్రజలు ఆ మట్టి తో విగ్రహాన్ని చేసి పూజించటం అంటే ఆ మట్టి కి చేసే వందనం.

     వినాయకుని రూపం చూస్తే ఆయన కు ఉన్న పెద్ద చెవులు మనకు ఎక్కువ వినాలి , తక్కువ మాట్లాడాలి అనే విషయాన్ని తెలియ జేస్తాయి .  ఏనుగు ముఖం అంటే సంపదలకు చిహ్నం.  అంటే లక్ష్మీదేవి యొక్క గుర్తు .  గజ వదనుడిని ఆరాధించటం వలన మనకు బల, జ్ఞాన, లౌకిక సంపదలు వస్తాయి అని చెప్పవచ్చు . 
  
    సృష్టి లోని విద్యలు భూమి నుండే ఆవిర్భవించాయి.  ఆ భూమి నే వినాయకుని గా భావించడం.  ఈ గణేషుడిని విద్యలకు అధిపతి గా భావిస్తాము .  అందుకే విద్యార్థులు వినాయక చవితి రోజున తమ తమ పుస్తకాలు ఆయన పూజలో పెట్టి, పసుపు తో ఓంకారం మొదటి పేజీ లో రాయటం జరుగుతుంది.  ఆయన చిహ్నమైన స్వస్తిక్ ను కూడా రాస్తారు.  అలా పూజించటం వల్ల సకల విద్యలు ప్రాప్తిస్తాయి అని ప్రజలు నమ్ముతారు .

         వినాయకుడి అసలు రూపం ఒకటే .  కానీ ఆరాధనా పద్ధతులు బట్టి ఆధునిక కాలం లో రక రకాల భంగిమలు, ప్రతిమలు , చిహ్నాలు వస్తున్నాయి .


   గణపతి ఆరాధన బౌద్ధ , జైన మతాలలో కూడా ఉంది .  జైన మతం కుబేరుడి అవతారం వినాయకుడు అని కూడా చెబుతుంది .  అందుకే వ్యాపారస్థులు వినాయకుడిని , లక్ష్మి దేవిని కలిపి పూజిస్తారు.  (ఇక్కడ వినాయకుడు సాక్షాత్ విష్ణువు అనే జ్ఞానం ఉండటం వలన కూడా కావచ్చు) 

   తాంత్రిక బౌద్ధం లో షడ్ భుజాలు గల మహాకాలుడి రూపం లో బౌద్ధ తాంత్రికులు మహా రక్త గణపతిని ఆరాధిస్తారు . 

 థాయిలాండ్ , కంబోడియా వంటి చాలా దేశాలలో ఇంకా చాలా విధాలుగా గణపతి ఆరాధన ఉంది .  అలానే అగ్ని , సూర్య ఆరాధన కూడా ఉంది .  ముఖ్యం గా ఆ దేశాలలో విజయానికీ , అదృష్టానికి బుద్ధి బలానికి మూల దేవునిగా వినాయకుడిని నమ్ముతారు , ఆరాధిస్తారు .

   పరబ్రహ్మ, పరమాత్మ ఒక్కడే ... మనమే వివిధ రూపాలలో చూస్తున్నాము.  శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపం లో చూడండి మనకు ఈ విషయం స్పష్టం అవుతుంది ఆ రూపం లో అందరు దేవతల  ముఖాలు ఉంటాయి వినాయకుని ముఖం కూడా ఉంటుంది .  భగవంతుడు ఈ విశ్వం లో చేసే పనిని బట్టి తన రూపం మార్చి ఆ యా వేషాలు వేసుకుంటాడు అని తెలుసుకోవాలి.  

   ఇంకొక విషయం ఏంటంటే గణేశ పూజ లో విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తాము కొన్ని రోజులు పూజించితరువాత నీటిలో నిమజ్జనం చేస్తాము.  ఇక్కడ విగ్రహం తయారీ సృష్టి , పూజించటం స్థితి , ఇంకా నిమజ్జనం  లయం . ఇక్కడ ఈ ప్రక్రియలో సృష్టి , స్థితి , లయములు 3, ఉన్నాయి .  ఈ ప్రక్రియ అంతా ప్రతి మనిషి జీవితం లో ఉంటుంది . ప్రతి జీవి జీవన క్రమం లో ఉంటుంది.  ఈ విషయాన్ని అందరు తెలుసుకొని అంతా ఇక్కడ వదిలి వేసేదే, ఒక్క మంచి చెడులు, పాప పుణ్యాలు మాత్రమే వెన్నంటి వస్తాయి అని తెలుసుకొని ఒకరిని ఒకరు బాధ పెట్టకుండా బ్రతకాలి అనే జ్ఞానం అలవరచు కోవాలి మనం అందరం .

Foods to increase platelets count in our blood naturally

ఈ రోజుల్లో మనకు రక రకాలైన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి.  అందులో కొన్ని మన రక్తం లోని ప్లేట్ లెట్స్ సంఖ్య ను బాగా తగ్గించి వేస్తున్నాయి అందువల్ల మనకు చాలా సమస్యలు ఎదురు అవుతున్నాయి .

రక్తం లో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే కొన్ని ఉత్తమ ఆహారాలు :

1. బీట్రూట్ :  ఇది ప్లేట్ లెట్స్ ను పెంచటం లో బాగా సహాయ పడుతుంది .  అనీమియా తో బాధ పడేవారికి ఇది ఉత్తమ మైన ఆహారం .

2.  క్యారెట్  వంటి దుంపలు వారానికి 2.సార్లు అయినా తినవలసి ఉంటుంది

3.బొప్పాయి ఒంట్లో బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పండు తింటే చాలా మంచిది
.
4.ఆకు కూరలు మన శరీరం లో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ k. ఎక్కువగా ఉన్న ఆకు కూరలు తీసుకోవటం మంచిది. 
 
5.వెల్లుల్లి మన శరీరం లో సహజం గా నే ప్లేటిలెట్స్ పెంచుకోవాలంటే ఇది తప్పక తినాలి .  దీనిని మనం వంటలో అన్నింట్లో ఉపయోగించు కోవచ్చు .

6.దానిమ్మ : ఎర్రగా ఉండే అన్ని పండ్లలో ఐరన్ అధికం గా ఉంటుంది .  ఇది రక్తం లో ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది.  కనుక దానిమ్మ పండ్లు మనం తినటం మంచిది.

7.ఆప్రికోట్ :  ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లలో ఇది కూడా ఒకటి .  రోజు రెండు సార్లు ఆప్రికాట్ తినటం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది
 .
8.ఎండు ద్రాక్ష : రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30% ఐరన్  ఉంటుంది ఒక గుప్పెడు ద్రాక్ష తినటం వలన సహజం గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.

9.ఖర్జూరం ఎండు ఖర్జూరం లో ఐరన్ మరియు ఇతర పోషకాలు అధికం గా ఉన్నాయికనుక మనం వీటిని తినడం ఎంతో అవసరం .

10. అల్లం రసం ఒక చెంచా తేనే ఒక చెంచా కలిపి ఒకరోజు , పసుపు ఒక చెంచా తేనే ఒక చెంచా మరొక రోజు మార్చి మార్చి తీసుకుంటూ ఉంటె ఈ ప్లేట్ లెట్స్ పెరుగుతాయి .
 

కాల్షియమ్ part 2

మహిళల్లో కాని పురుషులలో కాని 45 సo,, దాటినా తరువాత శరీరములో కాల్షియమ్ ఉత్పత్తి నిలిచి పోతుంది . అందుకనే ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి . రెండు విధాలుగా మనం ఆ సమస్య నుంచి బయట పడవచ్చు

 1 ) శారీరక శ్రమ శరీరము లో అన్ని భాగాలు కదిలే వ్యాయామము. దీనిలో కాళ్ళను  చేతులును ఎక్కువగా కదిపే వ్యాయామం చెయ్యాలి.   ఎక్కువుగా శ్రమ పడే శరీర భాగాలకు మెదడు ప్రత్యేకముగా శరేరము నున్చి కాల్షియమ్ తెప్పించి యిస్తుoది. అందుకే వ్యాయామము చేయాలి.

2 ) ఇక బయట నుంచి కాల్షియమ్ తీసుకోవచ్చు అదీకూడా ఇంగ్లీష్ మందుల కంటే సహజ సిద్ధమైన పెరుగు, మజ్జిగ, సిట్రస్ పండ్లు, నిమ్మ, బత్తాయి, నారింజ etc.... ఇంకా పెసలు, శనగలు మొలకలు, రాగుల పిండి, సీతాఫలము లాంటి పండ్లలో బాగా కాల్షియమ్ ఉంటుంది.

 ఆయుర్వేదం లో అయితే ధూప్ పాపెశ్వర్ కంపని వారి అస్థిపోషక్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాని కాకరకాయ నేరేడు కాయ వంటివి దీనికి పత్యము. మోకాలు నెప్పులు ఉన్నవారు కూడా పైన చెప్పిన అష్టి పోషక్ వాడితే లాభము కనపడుతుంది.  మోకాలి  చిప్ప పై చింత గింజల పొడి నువ్వుల నూనెలో బాగా కలిపి ముద్దలా కలిపి  రాత్రి వేళ పట్టు లా  వేసుకోవాలి తెల్లవారి తీసేయచ్చు అలా కొన్ని రోజులు చేయటo ద్వారా మోకాలి నెప్పులు తగ్గు ముఖము పడతాయి.

 ఇంకా ఒక చెంచాడు మెంతుల పిండి కప్పు మజ్జిగలో కలిపి రోజు తీసుకోవాలి మోకాలి నెప్పులు నయము అవుతాయి అయితే థైరాయిడ్ వారికి మెంతులు పడవు అని  గ్రహించాలి.  
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online