Pages

వలపుల వాన

సౌధం పై ద్వారం చెంత నిలబడి ఆమె ఇటే చూస్తోంది 
నేను వర్షం లో తడుస్తూ చెట్టు కింద ఉన్నాను
ఇరు చూపులు కలిసాయి . మెరుపులు మెరిసాయి .
వర్షం పెద్దదై తడిసిపోతున్నాను
ఆమె నవ్వులు మల్లెల మత్తులై కైపునిస్తున్నాయి
ఆమె అందాలను పైట చెంగు తో కప్పేస్తూ లోపల దోపుకుంది

ఇంట్లో జల్లు పడ్తోంది అంటూ తలుపులు వేసాడు పనివాడు .
నా చూపుల బాణాలు కిటికీలలోకి వేసాను .
ఆమె ఎక్కడా దర్శనం లేదు 
వర్షం తగ్గిపోయింది .
ఆమె మేడపై టీ తాగుతూ కనిపించింది
ఇక చాలు ఇంటికి వెళ్ళమని సైగ చేసింది
కొంటె నవ్వులతో గుండెను తూట్లు పొడిచింది .
అప్పుడే ఆగిన వర్షాన్ని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టాను . 

 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online