జనుల మనస్సున వసంత కోయిల కూజితాలు
ప్రకృతి వయస్సు పై మన్మధుడి బాణాలు
కొత్త వత్సర వస్త్రాన్ని చుట్టుకొచ్చిన ప్రకృతి కన్య
ఆకు ఆకు పై వసంతం , ఆశా ఆశా పై సంతకం
కొత్త సంవత్సర సంబరం , మన్మధ నామ సంరంభం
తెలుగు జాతికి సరాగం
ఆ హృదయం , ఆ ఉదయం మధురం మరువం
ఆ గీతం సంగీతం శ్రావ్యం కావ్యం
రమ్యం నవ్యం కొత్తరుచుల్లో భవ్యం
వేప పూతల పరిమళం లేత మామిళ్ల పుల్లదనం
చింతలను మైమరపించే కొత్త బెల్లం క్రొంగొత్త రుచికరం
ఉగాది పచ్చడి ప్రకృతి కోవెల ప్రసాదం
మాయల మదనుడి విందు భోజనం
కడుపునిండా తిన్న గండుకోయిల కూతల పర్వం
ఆశలతో సతమతమయ్యే కుర్రకారుకి ఏది సౌఖ్యం
ప్రపంచ జనులంతా బాగుండాలని కోర్కెల పర్వం
పొలాలన్నీ పంటలతో నిండాలి
గొడ్లు గోదా చెట్లు పక్షుల క్షేమం కావాలి
అబ్బాయులుకు అమ్మ్మాయులుకు సంపద సంబారాలు కావాలి
ఆశలన్నీ తీరేందుకు శుభ శకునం ఈ ఉగాది పర్వదినం
అప్పుడే కనపడేను మన్మధ బాణాలు
అన్ని ఇచ్చేస్తాడు మన్మధుడు
అది మన్మధ బాణాల మంచి ఫ్హలితం
అందుకే అందరికి అన్నీ ఇచ్చే మన్మధ నామ శుభ సంవత్శ్రం
ఇదే భగవంతుడు పంపిన మన్మధ సందేశ వత్షరం
--------------- శుభం భూయాత్ ------------
ప్రకృతి వయస్సు పై మన్మధుడి బాణాలు
కొత్త వత్సర వస్త్రాన్ని చుట్టుకొచ్చిన ప్రకృతి కన్య
ఆకు ఆకు పై వసంతం , ఆశా ఆశా పై సంతకం
కొత్త సంవత్సర సంబరం , మన్మధ నామ సంరంభం
తెలుగు జాతికి సరాగం
ఆ హృదయం , ఆ ఉదయం మధురం మరువం
ఆ గీతం సంగీతం శ్రావ్యం కావ్యం
రమ్యం నవ్యం కొత్తరుచుల్లో భవ్యం
వేప పూతల పరిమళం లేత మామిళ్ల పుల్లదనం
చింతలను మైమరపించే కొత్త బెల్లం క్రొంగొత్త రుచికరం
ఉగాది పచ్చడి ప్రకృతి కోవెల ప్రసాదం
మాయల మదనుడి విందు భోజనం
కడుపునిండా తిన్న గండుకోయిల కూతల పర్వం
ఆశలతో సతమతమయ్యే కుర్రకారుకి ఏది సౌఖ్యం
ప్రపంచ జనులంతా బాగుండాలని కోర్కెల పర్వం
పొలాలన్నీ పంటలతో నిండాలి
గొడ్లు గోదా చెట్లు పక్షుల క్షేమం కావాలి
అబ్బాయులుకు అమ్మ్మాయులుకు సంపద సంబారాలు కావాలి
ఆశలన్నీ తీరేందుకు శుభ శకునం ఈ ఉగాది పర్వదినం
అప్పుడే కనపడేను మన్మధ బాణాలు
అన్ని ఇచ్చేస్తాడు మన్మధుడు
అది మన్మధ బాణాల మంచి ఫ్హలితం
అందుకే అందరికి అన్నీ ఇచ్చే మన్మధ నామ శుభ సంవత్శ్రం
ఇదే భగవంతుడు పంపిన మన్మధ సందేశ వత్షరం
--------------- శుభం భూయాత్ ------------
1 comments:
మురళీ కృష్ణ సర్
మీ కవిత చాలా బావుంది.
Post a Comment