Pages

A short story


మీరంటే నాకిష్టం


 

 
అప్పుడే రాజధాని ఎక్ష్ప్రెస్స్ ప్లాట్ ఫోరం మీద ఆగింది . స్టేషన్ మొత్తం వింత వింత శబ్దాలతో

మారుమోగుతోంది. మత్తు మత్తుగా లేస్తూ ఒళ్ళు విరుచుకుంది మీనాక్షి . నిద్రలో చెదిరిన వెంట్రుకలు గబగబా సరిచేసుకుంది .చక్రల్లాంటి కళ్ళను త్రిప్పి కిటికిలోంచి బయటకు చూసింది . తెలతెలవారుతున్నట్లుగా ఉంది . స్టేషన్ వచ్చేసింది . గబగబా లగేజి సర్దుకుని ప్లాట్ ఫార్మ్ పై నిలబడింది . "మీనా !వచ్చేసావామ్మా ! రైలు కరెక్ట్ సమయానికే వచ్చినట్లు ఉంది" ... చేతిలో లగేజి అందుకుంటూ పలకరించాడు తండ్రి వెంకటరావు. "ఏమిటి నాన్నగారు మీరు వచ్చారు అన్నయ్యను పంపవచ్చును కదా !" కాస్తంత బాధ గా అడిగింది మీనాక్షి .ఫరవాలేదులే , పదా , అదిగో బండి ఎక్కుతల్లీ అంటూ "ఒరేయ్ మల్లేశం సామాన్లు కాస్తంత జాగ్రత్త గా పెట్టు సుమా రాగం తీస్తున్నట్లు గా చెప్పాడు వెంకట్రావు .నేను చూసుకుంటాను దొరగారు అంటూ వినయం గా చెప్పాడు మల్లేశం .

"తెల్లగా , నునుపుగా మెరుస్తున్న ఎడ్లు , నల్లటి తడులకు మేడలో కట్టిన మువ్వలు మెరుస్తూ శబ్దం చేస్తుంటే బండి శ్రీరామపురం వైపుకు పరుగులు తీసింది . అప్పుడప్పుడే తూర్పున అరుణోదయం, ఎటు చూసినా పచ్చగా తివాచి పరిచినట్లు గా ఉంది . తెల్లని కొంగలు, పొలాన్ని కాపలా కాస్తున్న సైనికుల్లా , బారులు బారులు గా నిలబడి ఉన్నాయి . అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేత కిరణాలతో పొలం అంత ఎర్రగా మెరిసిపోతోంది .

"మీనా ! ఇదేనమ్మా ! మన పొలం. దాళువా వేసాము . అనుకోని వర్షానికి మొత్తం నీళ్ళు వచ్చేసాయి .ఎలాగోలా మొత్తం బయటకు పంపాము . ఏమో తల్లీ ఇదివరకులా వ్యవసాయం చేయలేక పోతున్నాము . ఖర్చు ఎక్కువ , రాబడి తక్కువ అయిపొయింది .. ఏదో పిల్లలు మీరు స్దిరపడితే పొలం కౌలుకు ఇచ్చేద్దామనుకుంటున్నాను .విశ్రాంతి తీసుకోవాలని ఉంది ....ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు వెంకట్రావు .

మాటల సందడిలో రామాపురం రానే వచ్చింది . ఇంత స్పీడు యుగం లోను గ్రామం ఏమి మారలేదు . ఎప్పుడో తాతలు కట్టిన ఇల్లు పాతతరంవి ఇంకా చాల ఉన్నాయి అక్కడ . వెంకట్రావు గారు ఊరి కరణం గారు . ఒకప్పుడు జమిందారులు వాళ్ళ కుటుంబం . ఇప్పుడు అంత చితికిపోయి ఒక మాదిరి కుటుంబం వాళ్ళది . అయినా ఊరిలో ధనవంతులు గానే చలామణి అవుతున్నారు .

వాళ్ళు ఇల్లు చేరగానే "చిన్న దొరసాని గారు , నాకు పట్నం నుండి ఏమైనా తెచ్చారా" ...అంటూ ముసిముసిగా నవ్వుతూ సామాన్లు అందుకుంది చాకలి కూనమ్మ .తల్లి రూపాదేవి పలకరింపులు .. కాస్తంత విశ్రాంతి తీసుకోవటం తో రోజు అలా గడిచిపోయింది .

ఇంటి వెనకాలే పంట చేలు ఉన్నాయి . పెసరకాయలు కొట్టి కుప్పలు పోస్తున్నారు .రైతు కూలీలు . చెట్ల క్రింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారుతండ్రీ కూతురును ."అమ్మా ! మీనా ! నిన్ను ఒక మాట అడగనా ?" కూర్చున్న కుర్చీ దగ్గరగా లాక్కుని కూతుర్ని లాలనగా చూస్తూ అన్నాడు వెంకట్రావు .

ఆశ్చర్యం గా చూస్తూ తల ఊపింది మీనాక్షి . ఏమి లేదమ్మా ... అన్ని విషయాలలో మనకు అన్నివిధాల సరిపడే పెండ్లి సంబంధం చుసానమ్మా .. అబ్బాయి నీలాగానే రీసెర్చ్ చేస్తున్నాడు రెండు రోజుల్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను ఏమంటావు ...ప్రేమగా తల నిమురుతూ అడిగాడు వెంకట్రావు .

"నాన్న గారు .. నా రీసెర్చ్ ఇంకా పూర్తీ కాలేదు .. ఇంకొంచం ఓపిక పట్టండి ..పూర్తీ అయిన తరువాత చెపుతాను "వినమ్రంగా చెప్పింది మీనాక్షి .

తండ్రి వెంకట్రావు అసహనం గా లేచి ఇంట్లోకి వెళ్ళాడు . జరిగిన విషయం అంత భార్య రూపాదేవి కి చెప్పాడు .తన బాధ ను వేల్లపోసుకున్నాడు . అంత విని రూపాదేవి "మీరు ఉండండి ,నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అభయం ఇచ్చింది

అంతలో ఉన్నత్లూన్ది ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమైనాయి ,బరువైన చినుకులు విసురుగా పడుతున్నాయి .కూలీలు అంతా పరుగుపరుగున సూపరుసంచి పట్టాలు అన్ని ధాన్యం పైన కప్పేసారు . మీనాక్షి కొద్దికొద్దిగా తడుస్తూ ఇంట్లోకి వచ్చేసింది .మీనాక్షి కి ఒక కప్పు టీ అందించి తను కూడా ఒకటి తీసుకుని పక్కనే నిలన్బడి సిప్ చేస్తూ ఉంది రూపాదేవి . ఆడపిచుక ఒకటి ఇంట్లోకి వచ్చింది . పిల్క్లాలు అన్ని లోపలి వచ్చేవరకు అరుస్తూ ఉంది . పిల్లలు నేర్చుకోవాలి అన్నట్లు గా ఫోజు ఇస్తూ చూరులో నక్కి బయటకు చూస్తోంది మగ పిచ్చుక .

"చూడమ్మా !మీనా ! మా అన్నయ్య స్నేహితుడు సుబ్రహ్మణ్యం గారు టీచర్ గా పని చేసేవారు . వారి అబ్బాయి , ఢిల్లీ యూనివర్సిటీ లో రీసెర్చ్ చేస్తున్నాడు .మంచి సంప్రదాయం గల కుటుంబం . అబ్బాయి నీకు అన్నివిధాలా సరిపోతాడు .బుద్ధిమంతుడు , పెళ్లిచూపులు తతంగం నీకు అంత గా నచ్చక పొతే ఊరికే అలాగా పిలిచి ,పరిచయం చేస్తాము .నీకు ఇష్టము అయితేనే పెళ్లి నిర్ణయం తీసుకుందాము . ఏమంటావు ? చాల తేలిగ్గా అడిగేసింది రూపాదేవి . ఆలోచనల్లో పడింది మీనాక్షి ఉత్త పరిచయమేగా ..చూసిన తరువాత అయినా నచ్చలేదని తప్పుకోవచ్చు ." ఇది బాగానే ఉంది అని మనసులో మల్లగుల్లాలు పడుతూ ఉంది మీనాక్షి "ఏమ్మా? ఏమి చేద్దాం ?తల్లి పిలుపుతో లోకం లోకి వచ్చింది . "సరే అమ్మ !కానివ్వండి , మీ ఇష్టం" అని తల ఊపి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది .వెంకట్రావు ఫోనులో సుబ్రహ్మణ్యానికి అంత చెప్పాడు .పెళ్లిచూపులు తతంగం లా కాకుండా ఏదో మీ అబ్బాయి శ్రీకాంత్ కి , మా అమ్మాయి కి పరిచయం . అందరం కలిసి చక్కని కాఫీ తాగుదాము .మిగతా విషయాలు తరువాత చూసుకుందాము అని అంటే ఒప్పుకున్నాడు సుబ్రహ్మణ్యంగారు .

"ఎం అన్నయ్యగారు , ప్రయాణం ఎలా జరిగింది ?"చిరునవ్వుతో అడిగింది రూపాదేవి . ఏముంది లేమ్మా .. తిప్పి కొడితే రెండు గంటల ప్రయాణం ..అంతేగా ..గల గలా నవ్వుతూ చెప్పాడు సుబ్రహ్మణ్యం . ఏమ్మా !మీనా! సుబ్రహ్మణ్యం మామయ్య వాళ్ళు వచ్చారు కొంచం మంచినీళ్ళు పట్టుకురా తల్లీ! అంది రూపాదేవి .సోఫా లో కూర్చున్నారు తండ్రికొడుకులు . "నమస్కారమన్దీ" అంటూ మంచినీళ్ళు అందించింది మీనాక్షి . "అమ్మా !మీనా !నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే ...ఈయనే సుబ్రహ్మణ్యం గారు .ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం ఉన్నా ఉద్యోగంవల్ల ఎక్కడెక్కడో పనిచేస్తుండేవారు . ఇదిగో ఇప్పుడు కుదిరింది .. అందుకే ఇలా వచ్చారు . అంది రూపాదేవి .

నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావమ్మా ! అని ఆప్యాయంగా అడిగారు సుబ్రహ్మణ్యం గారు . నేను బయోటెక్నాలజీ లో పీ .హెచ్ .డి . చేస్తున్నా నన్దీ అంది మీనాక్షి .వీడు మా అబ్బాయి శ్రీకాంత్ . ఆర్కియాలజీ లో పీ .హెచ్ .డి . చేస్తున్నాడు అని చెప్తూ ఉండగానే న్యూస్ పేపర్ లోనుండి తల ఎత్తి హలో అన్నాడు శ్రీకాంత్ . ఏమి మాట్లాడకుండా చిరునవ్వుతో నమస్కారం చేసింది మీనాక్షి .

"బాకుల్లా ఎదలో గుచ్చే కళ్ళు ,విల్లు లాంటి కనుబొమలు , ఊర్వసి అనిపించే ముక్కు , గులబిరేకుల్లాంటి పెదవులు ,మల్లెమొగ్గల్లాంటి పలువరుస , జాజిపూలు సింగారించుకున్న జడ" .... క్షణకాలం అలా .. ఆమె వైపు చూస్తుండిపోయాడు శ్రీకాంత్ . శ్రీకాంత్ వేసిన చూపుల బాణాలకు ఏమాత్రం స్పందించకుండా వెళ్లి కూర్చుంది మీనాక్షి .

పెద్ద వాళ్ళు అంతా ఏదో పిచ్చాపాతీ మాట్లాడుకుంటున్నారు . "మీరు సిటీ లో ఎక్కడ ఉంటారు ?" అడిగాడు శ్రీకాంత్ . "నేను యూనివర్సిటీ హాస్టల్ లోనే ఉంటాను " మెల్లగా చెప్పింది మీనా . "మీకు మెస్ బాగుంటుందా "మల్లీ అడిగాడు శ్రీకాంత్ . ఫర్వాలేదు .. అని తల ఊపింది మీనా .మీ రీసెర్చ్ ఇంకా ఎంత కాలం పట్టవచ్చు ? అడిగింది మీనాక్షి . అయిపోయిందండి .. వచ్చే ఏడూ సెమినార్ పెట్టేసి ఫైనల్ కాపీ తాయారు చేస్తాను ..ఎంతో ఆనందంగా చెప్పాడు శ్రీకాంత్ .

అలా ఏదో పొడిపొడి మాటలు తప్ప పెద్దగా మాట్లాడుకున్నది ఏమి లేదు .ఏదో అలా రెండు గంటలు గడిపి తిరుగు ప్రయాణం అయ్యారు తండ్రికొడుకులు .

బస్సు నిదానంగా ప్రయాణిస్తోంది . విండో లోనుంచి అంత పరికించి చూస్తున్నాడు శ్రీకాంత్ ."దట్టంగా పెరిగిన మామిడి తోటలు ...నిగనిగలాడుతూ వ్రేలాడుతున్న మామిడి పిందెలు , దూరంగా పొలాల్లో చెట్ల నీడన కట్టేసిన ఎడ్ల బండ్లు ,ఆప్యాయంగా ఒకదాన్ని మరొకటి నిమురుకుంటున్న ఎడ్లు , గొర్రెలు , మేకల్ని మేపుకునేవాళ్ళు చేలల్లో మేయిస్తున్నారు . శ్రీకాంత్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి .

"ఏమిటో మీనాక్షి చాల బాగుంది కాని ఉండాల్సిన ఉత్సాహం చూపాల్సినంత సంతోషం మాత్రం లేదు . ఎందుకు అలా చేసింది ? ఏమో ఒకవేళ తనకు పెళ్లి ఇష్టం లేదేమో ... ఒకవేళ జాబు గురించి ఆలోచిస్తోందేమో ... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లేకపోతె .పీ .ఎస్ ., . .ఎస్ . కావాలనుకున్తోందేమో .. ఏమోలే నేను కూడా కంప్యూటర్ కోర్స్ లు నేర్చుకుంటున్నాను ...అని చెప్పల్సిందేమో ... సరే . ఏది ఏమైనా అమ్మాయి చాలా అందంగా ఉంది . ఆమె మనసు ఎలా అయినా తెలుసుకుంటాను . మళ్ళీ మీనాక్షిని కలుస్తాను .అలా ఆలోచనల్లో మునిగిపోయాడు శ్రీకాంత్ . బస్ గమ్యస్థానానికి దూసుకువేల్తుంది .

ఏమండి ! సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు వచ్చి వెళ్లారు .రోజులు గడిచి పోతున్నాయి ..అమ్మాయి ఒక్క మాట అయినా మాట్లాడలేదు ...ఏమి చేద్దాం ..చిన్నగా అడిగింది రూపాదేవి . ఏమో నాకు అర్ధం కావటం లేదు మనసులో ఏముందో విషయం ఏమైనా బయటకు వస్తేగా ...ఆవేదనగా చెప్పాడు వెంకట్రావు . ఇంతలో ఇంట్లో ట్రింగ్ ట్రింగ్ మంటూ పాతకాలపు టెలిఫోన్ మ్రోగింది . హలో ఎవరండి తియ్యగా అడిగింది మీనాక్షి . నేను అవధాని ని మాట్లాడుతున్నాను ..వెంకట్రావు గారు లేరా అని అడిగాడు ....లైన్ లో ఉండండి పిలుస్తాను ..." నాన్న గారు మీకు ఫోన్ ".కేకవేసింది మీనాక్షి . హలో చెప్పండి అవధానిగారు అంటూ మొదలుపెట్టాడు వెంకట్రావు గారు .

"చాలా కాలం అయ్యిన్దండీ బాగున్నారా " అంటూ మొదలుపెట్టాడు . అవధాని గారు .. కుశలమే ... అన్నాడు . చెప్పండి విషయం ఏమిటి ? అన్నాడు వెంకట్రావు .

"మీ అబ్బాయి చదువు అయిపొయింది . పెళ్ళికి ఉన్నాడు అని తెలిసింది . మంచి సంబంధం ఉంది . అమ్మాయి చదువుకుంది . సంప్రదాయం ఉన్న కుటుంబం ... అంటూ మొదలుపెట్టాడు అవధాని . అయ్యా ! ఆగండి ....మా అమ్మాయి మీనాక్షి పెళ్లి అయితేనేగాని అబ్బాయి పెళ్లి చెయ్యను ...దీర్ఘాలు తీసాడు వెంకట్రావు . ఫోన్ పెట్టేసి లోపలకు వచ్చాడు . ఎవరండీ ఫోన్ లో స్పీచ్ ఇస్తున్నారు ? ఆశ్చర్యంగా మొహం పెట్టింది రూపాదేవి . ఇదే మంచి అవకాసం అనుకున్నాడు వెంకట్రావు మన అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది ..నేను ..నాకు ఆడపిల్లకి పెళ్లి బాధ్యత తీరితే గాని అబ్బాయి పెళ్లి లేదు అని చెప్పేసాను .సంబంధాలు వచ్చ్కాయా అని అడిగారు నేను మాత్రం ఏమి చెప్పను ? మీనాక్ష ఏదైనా మాట్లాడితేనే కదా మనకి తెలిసేది . ఈరోజుల్లో పిల్లలు చదువుకుంటున్నారు అన్నమాటే గానీ తల్లితండ్రులు , వాళ్ళ మనస్సులు , కుటుంబ బాధ్యతలు ,వాళ్ళగురించి ఏమైనా ఆలోచిస్తేగా ...కాస్తంత విసుగ్గా ..ఆవేశంగా అరిచేస్తున్నాడు . "నాన్నగారు నాకు కొంచెం టైం కావాలి . ఇప్పుడే పెళ్లి గురించి ఏమి చెప్పలేను .రేపు ఉదయమే నాకు ట్రైన్ ఉంది . నన్ను మీరు స్టేషన్ లో దింపితే నా దారిన నేను వెళ్తాను .. అంటూ విసురుగా లోపలి కి వెళ్ళిపోయింది మీనాక్షి

రైలు ప్రయాణం చేసి హైదరాబాద్ యూనివర్సిటీ హాస్టల్ కి చేరుకుంది మీనాక్షి . లగేజి అందుకుని లోపల పెట్టింది మీనాక్షి ఫ్రెండ్ కళ్యాణి . ప్రయాణం తీరు వాళ్ళ ఊరి విషయాలు , పెళ్ళిచూపుల పేరుతో శ్రీకాంత్ పరిచయం ఇలా అన్ని విషయాలు చర్చించుకోవటం తోనే ఆరోజు గడిచిపోయింది .

యూనివర్సిటీ లో ఆడిటోరియం అంతా స్టూడెంట్స్ తో కిటకిటలాడుతోంది . ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపొయింది . వి .సి .గారు , ఆయన వెనుక చండీగడ్ లో గొప్ప ఫార్మ సంస్థ డైరెక్టర్ , శాస్త్రవేత్త అయిన గిరీష్ సహని గారు వేదిక మీద ఆసీనులయ్యారు . ఈరోజుల్లో వచ్చే రోగాలు , ఆయన కనిపెట్టిన మందులు .. అనుభవాలు చెప్పుకుంటూ పోతున్నారు .వందలో తొంభై శాతం మంది వాడుతున్న పారాసేత్మాల్ , దాన్ని కనుగొన్న డా .ఎల్లాప్రగడ సుబ్బారావు ఎంత మందికి తెలుసు ....ఇలా సాగుతోంది ఆయన ఉపన్యాసం .

"ఎదైనా కనుక్కోవాలి ... చదువు పదిమందికీ ఉపయోగపడాలి ... నన్ను కూడా అందరు తలచుకోవాలి" ... ఇలా ఆలోచనల్లో పడిపోయింది మీనాక్షి .

"మీనా ..మీనా ... ఇకలే .. అందరూ వెళ్ళిపోతున్నారు .పద ..పద .. అంటూ చేయిలాగి ఈలోకం లోకి తెచ్చింది కళ్యాణి . ఇద్దరు హాస్టల్ కి చేరుకున్నారు . తలుపు తెరవగానే పోస్టల్ కవర్ కనిపించింది కళ్యాణి క్షణకాలం చూసి ..నీదే ..మీనా అంటూ ఇచ్చింది . రెండు నిముషాలు చదివి కోపం గా మడిచి విసిరేసింది మీనాక్షి . కళ్యాణి అడక్కుండానే విషయం అంతా వివరించి చెప్పింది మీనాక్షి . "ఒక్కసారి మళ్ళీ ఆలోచించు . అబ్బాయి ఏమైనా బాధ పడతాడేమో ... ఇష్టం లేదు అని రాసేయచ్చుగా ..లేకపోతె నాకు టైం ఇవ్వండి అని వ్రాయి". అని సలహా ఇచ్చింది కళ్యాణి . మీనాక్షి కి తెలియకుండా కవర్ మీద శ్రీకాంత్ అడ్రస్ సేకరించింది కళ్యాణి .

"శ్రీకాంత్ గారు అన్ని విషయాలు అంత తొందర తొందర గా జరిగిపోవు , కొద్ది సమయం పడుతుంది ఓర్పు వహించగలరు అని సమాధానం వ్రాసి , ఇట్లు మీనాక్షి అని సంతకం పెట్టి పోస్ట్ చేసింది కళ్యాణి .

రాత్రివేల ... పండు వెన్నెల పుచ్చపువ్వు లా ప్రకాసిస్తోంది హాస్టల్ చుట్టుప్రక్కల నుండి పారిజాతాలు , కొండ మల్లెలు , సంపెంగలు ... పూల సుగంధపు గాలి తెమ్మెరలు తెమ్మెరలు గా వస్తోంది బాల్కనీ లోనుండి వెన్నెల ధారాపాతం గా కురుస్తోంది జాబిలిని చూస్తూ మంచం పై పడుకుంది మీనా . ఇంకో పిల్లో తెచ్చుకుని మీనాక్షి ప్రక్కన పడుకుంది కళ్యాణి .. అక్కా !.. అక్కా ! నిద్రపోయావా ? పిలిచింది కల్యాణి . ఇద్దరికీ దూరపు చుట్టరికం , ఇంకా కళ్యాణి మీనా కంటే అయిదు నెలలు చిన్నది , అందుకే మీనా ని అక్కా ! అక్కా ! అని పిలుస్తుంది కళ్యాణి . నేను నిద్ర పోవటం లేదు .. చెప్పు అంటూ పైకి జరిగింది మీనాక్షి .

"ఏమి లేదు అక్కా ! శ్రీకాంత్ బాగుంటాడా ? నీకు నచ్చాడా," మెల్లగా అడిగింది కళ్యాణి . "శ్రీకాంత్ అందగాడే , ఎం నువ్వు చేసుకుంటావా ? అయినా నాకు అందం గురించి ఆలోచన లేదు . నాకు నా కెరీర్ , నా ధ్యేయం గురించి ఆలోచిస్తున్నాను గట్టిగా చెప్పింది మీనాక్షి

ఏమో అక్కా ! మా ఇంటి పరిస్థితులు నీకు తెలుసు . నాకు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా .ఒక తమ్ముడు . అందరూ చదువుకుంటున్నారు . ఉన్న ఎకరం పొలం మీద ఏమి రావటం లేదు . నాన్నగారు పూజాసామాగ్రి వ్యాపారం పెట్టారు . ఫీజులు , చదువులు , తడిసిమోపేడు అవుతున్నాయి .నేను కూడా మూడు పదుల్లో కి వస్తున్నాను . రీసెర్చ్ అయ్యేసరికి ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది . లేట్ మ్యారేజ్ , చేసుకునేవాడి నిర్వేదం , పిల్లలు ఆలస్యం ఇది అంత ఎందుకు? అయినా కాలుష్యం తో చిన్న తనం లోనే అనీ లోపాలు వచ్చేస్తున్నాయి . వయసులో జరిగే ముచ్చట వయసులోనే జరగాలి అన్నారు పెద్దలు . ఇలా చెప్పుకుపోతోంది కళ్యాణి .... నీ బోధనా చాల్లే .. ఇక పడుకో , ఇన్నాళ్లు చదివిందంతా వదిలేసి పెళ్లి చేసుకోమంటావు అంతేగా విసుగ్గా అడిగింది మీనాక్షి .

అది కాదు అక్కా ! పెళ్లి చేసుకుని కూడా రీసెర్చ్ పూర్తి చేసుకోవచ్చ్చు కదా ... నేను మాత్రం మంచి సంబంధం వస్తే , నాకు నచ్చితే మాత్రం ఎంచక్కా పెళ్లి చేసుకుని మా నాన్న కు బరువు తగ్గిస్తా . నవ్వుకుంటూ చెప్తోంది కళ్యాణి . చాలు చాల్లే , నాకు నిద్ర వస్తోంది .. అంటూ నిద్ర లోకి జారుకుంది మీనాక్షి . మరుసటిరోజు శ్రీకాంత్ ఆలోచిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు , నేనే వెళ్లి కలుస్తాను , విషయం రాబడతాను అని అనుకుంటూ ప్రయాణం అయ్యాడు శ్రీకాంత్ .

సాయం సంధ్య వేల ... ఆకాశం లో కొంగలు బారులు బారులు గా సాగిపోతున్నాయి . సన్నటి వర్షం తుమ్పరలుగా ప్రారంభమైనాయి . అమ్మాయిలు గుంపులు గుంపులు గా సీతకోకచిలుకల్లాగా , కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా నడుస్తున్నారు .సన్నటి తుంపరలు వేగంగా పడుతున్నాయి కాంపస్ లో విద్యుద్దీపాలు అందం గా ప్రకాసిసితున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు అటు ఇటు మధ్యలో కాలిబాట , అక్కడక్కడా సిమెంట్ సోఫాలు , రక రకాల వేషభాషలతో , కిలకిల నవ్వులతో అందమైన భామలు , అన్ని చూస్తూ అడ్రస్ ప్రకారం హాస్టల్ దగ్గరకు చేరుకున్నాడు శ్రీకాంత్ . కాలింగ్ బెల్ నొక్కాడు . తలుపు తెరుచుకుంది . హెయిర్ ఫ్రీ గా వదిలేసినా పోనీ టైల్ జుట్టు , జీన్స్ ప్యాంటు , టైట్ టి షర్టు , మల్లెమొగ్గల్లాంటి స్వచ్చమైన కళ్ళు , దొండపండు వంటి పెదవులు సన్నటి నడుము , టి షర్టు సరిచేసుకుంటూ... ఎస్ ... అని కొంటెగా అడిగింది కళ్యాణి . ... రియల్లీ బ్యూటీ ..చాలా బాగుంది మనసులో అనుకుంటూ .. "ఎక్స్ క్యుజ్ మీ ! మీనాక్షి ఉన్నారా ?" మెల్లగా అడిగాడు శ్రీకాంత్ . మీరు శ్రీకాంత్ కదా ! ఆశ్చర్యం గా అడిగింది కళ్యాణి . రండి ప్లీజ్ కూర్చోండి ... అని లోపలి ఆహ్వానించింది ."నీ కోసం శ్రీకాంత్ వచ్చారు బయట సోఫా లో కూర్చున్నాడు లోపలి వెళ్లి మెల్లిగా చెప్పింది కళ్యాణి

శ్రీకాంత్ వచ్చాడా ? ఇక్కడకు రావటం ఎందుకు ?ఇది ఏమీ ఆచారం , పద్దతిగా లేదు . వేల్లిపోమ్మను ,నేను మాట్లాడను ... కోపం తో చిన్డులేసింది మీనాక్షి . అబ్బా !అక్కా ! అలా అనటం బాగుండదు . అంటూ క్షణకాలం ఆలోచనల్లో పడింది కళ్యాణి .. సరే నీ ఇష్టం అంటూ పర్సు తీసుకుని శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి , రండి శ్రీకాంత్ ...అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము అంటూ కాంటీన్ వైపు నడిచింది శ్రీకాంత్ వెంట వెళ్ళాడు .లోపలి మాటలు అన్ని విన్నాడు శ్రీకాంత్ ,ఆలోచనల్లో పడ్డాడు .

హలో ... నా పేరు కళ్యాణి . మాది కాకినాడ . మేము మీనాక్షి వాళ్ళ దూరపు బందువులం . మీ గురించి , మీ పెళ్ళిచూపుల గురించి అంతా చెప్పింది మీనాక్షి ... అంటూ మొదలుపెట్టింది కళ్యాణి . "ఎం చెప్పిందండీ ?పాజిటివ్ గా చెప్పిందా ? ఆత్రం గా అడిగాడు శ్రీకాంత్ ఇంతలో వాన చినుకులు పెద్దగా మొదలయ్యాయి .త్వరగా నడవండి ... తడిసిపోతాము ... అంటూ కొంటెగా అంటూ కాంటీన్ లోనికి దారి తీసింది . అదేమిటండి మీనాక్షి ఇందాక అలా మాట్లాడింది ?నీకు ఎప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉంది కదా !కొంచం టైం కావాలి అని వ్రాసింది . అందుకే వచ్చాను .ఇష్టం లేదు అని ఒక్క మాట వ్రాస్తే నేను వచ్చేవాడ్ని కాదు ... అని కొంచెం కోపంగా కొంచెం బాధగా అన్నాడు . "నేనే అల వ్రాసాను అని చెప్తే ఎలా ? ఏమి అనుకుంటాడో ఏమో ? ఎలా చెప్పాలి .. ఆలోచనలో పడిపోయింది కళ్యాణి . సరే శ్రీకాంత్ వదిలెయ్యండి అని కాఫీ కప్పు చేతికి ఇచ్చింది . వదిలేస్తాను లెండి ఇది ఏమి భగ్న ప్రేమ కాదు కదా !అన్నాడు శ్రీకాంత్ .

పెద్దలు ఇష్టపడి కుదిర్చిన సంబంధం . ఏమి ఆలోచన లేకపోతె లెటర్స్ అలా ఎందుకు వ్రాసిందో అడిగేస్తాను , ఆవేశం తో ఊగిపోతూ అన్నాడు శ్రీకాంత్ . లెటర్స్ నేనే వ్రాసాను అంటే నా మీద కూడా అదే ఫీలింగ్ బలపడుతుందా ? నన్ను కూడా కోపగిస్తాడా ? నా ఇస్తానని అంగీకరిస్తాడా ? లేక వెళ్ళిపోతాడా ? ఎలా చెప్పాలి అని లోలోపల ఆలోచనల్లో పడింది కళ్యాణి . ఇద్దరు లేచి కాంటీన్ లోనుంచి బయటకు వచ్చి చెట్టు క్రింద బల్ల పై కూర్చున్నారు కాఫీ త్రాగుతూ మాటల్లో పడ్డారు . వాతావరణం ప్రశాంతం గా ఉంది . ఇంతలో శ్రీకాంత్ మనం మాటల్లో పది టైం చూసుకోలేదు .చాలా టైం అయ్యిన్దండీ . ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు . ఇక విషయం వదిలేస్తాను . మా నాన్నగారు వాళ్లకి కూడా అదే చెప్పేస్తాను ...కొంచెం బాధ గా చెప్పాడు శ్రీకాంత్ . ఫర్వాలేదండి ... నేను కూడా ఫైనల్ గా మీనాక్షి ని ఒకసారి అడిగి చెపుతాను ... ఇక ఉంటానంది బై బై ..అంటూ హాస్టల్ కి బయలుదేరింది కళ్యాణి శ్రీకాంత్ కూడా ఇంటిముఖం పట్టాడు .

శ్రీకాంత్ విషయం ఇష్టం లేని మీనాక్షి విషయం గురించి ఎత్తటం లేదు . రోజులు గడిచి పోతున్నాయి . శ్రీకాంత్ పదేపదే గుర్తుకు వస్తున్నాడు కళ్యాణికి . అతని ముక్కుసూటి తనం , కష్టపడే మనస్తత్వం , అన్నిటికీ మించి మంచితనం ....బుద్దిమంతుడిలా , ఒక హీరో లా ఊహించుకున్తోంది కళ్యాణి ..

నిండు పున్నమి వెన్నెల్లో ఆరుబయట కూర్చుని ఆలోచిస్తోంది కళ్యాణి . మబ్బుల చాటున దోబూచులాడుతున్న జాబిల్లిని చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది కళ్యాణి . మొబైల్ తీసుకుని మెసేజ్ టైపు చేస్తోంది ...శ్రీకాంత్! నమస్తే ! మీరు పరిచయం కాకా మునుపే మీ గురించి మీనాక్షి మీ గురించి చెప్పింది ఆమె పట్ల మీరు చూపుతున్న అభిమానం , ఆమె ఏమి చలించక పోవటం ఇవి అన్నీ చూసి మిమ్మల్ని ఇద్దరినీ కలపాలి అని లెటర్స్ నేనే వ్రాసాను . అతప్పుని క్షమించండి . మీనాక్షి కి ప్రేమ , పెళ్లి ఇవి అన్నీ ఇప్పుడే ఇష్టం లేవని చెప్పేసింది .అయితే మీలో అన్ని విషయాలు నాకు నచ్చాయి . మీరు అంటే నాకు ఇష్టం . మీరు కూడా నన్ను ఇష్టపడితే పెద్దవాళ్ళకు విషయం తెలియ చేద్దాం , లేదంటే విషయం ఇక్కడితో వదిలేద్దాం . సుభ రాత్రి ఇట్లు కళ్యాణి అని మెసేజ్ పంపింది కళ్యాణి .

మెసేజ్ అలెర్ట్ తో చూసి మెసేజ్ చాలాసార్లు చదువుకున్నాడు శ్రీకాంత్ ఆలోచనల్లో పడ్డాడు . మీనాక్షి లాగా కళ్యాణి కూడా అందగత్తె ,పైగా అదే చదువు , నిదానస్తురాలు , ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది . నాకు కూడా నచ్చింది . ఇంకా ఆలస్యం ఎందుకు ? ఒకే . వెంటనే తను కూడా మెసేజ్ టైపు చెయ్యటం మొదలుపెట్టాడు . కళ్యాణి గారు !నమస్తే ! మీనాక్షి పేరుతో లెటర్స్ వ్రాయటం క్షమించరాని నేరం అందుకే మీకు ముందు ప్రేమ , తరువాత పెళ్లి ఇదే నేను విధించే శిక్ష . నాకు కూడా మీరు నచ్చారు .అందుకే పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకుందాం . మెసేజ్ చేసాడు శ్రీకాంత్ . ఎంతో టెన్షన్ గా ఎదురు చూస్తున్న కళ్యాణి భయం భయం గా మెసేజ్ చదవటం మొదలు పెట్టింది మొత్తం చదివాకా ఆనందం లో మునిగిపోయింది .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online