Pages

కాషాయీకరణం అంటే

ప్రపంచ దేశాల్లో కాస్తంత హిందుత్వం మిగిలి ఉన్న దేశం భారత దేశం.  దాన్ని ఒక్క దాన్నీ కూడా నాశనం చేయాలనీ స్వదేశం లోనే కొంత మంది కంకణం కట్టారు.  మరి ఏమి చేస్తారు ? 
    హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడి నప్పుడు, హిందువులు అంతా సంఘటితం అయి రక్షించుకోవాలి.  స్వదేశం , మతం సంస్కృతి నాశనానికి బయట దేశాల వాళ్ళ కంటే దేశం లోపలే ఎక్కువ శత్రువులు ఉన్నారు.  89% మెజార్టీ హిందువుల మనోభావాలు వదిలేసి మైనారిటీ ల కోసం కులం , మతం లేని రాజ్యాంగం అని వ్రాసారు.  అది హిందువులకు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కోసం వ్రాసింది .  ఇతర మతాల వారు ఎవరైనా వారి మత ప్రచారం చేసుకోవచ్చు.  హిందువులు ఏదైనా మతం గురించి గానీ , తమ మతం గురించి గానీ మాట్లాడ కూడదు.  మాట్లాడితే అది మత వాదం, మత మౌధ్యం, మతోన్మాదం అని పిలుస్తారు ఇక్కడ .హిందూ మతం అంటే బాంబులు , మానవ బాంబులు కానేకాదు.  నేరం చెయ్యొద్దు అని చెప్పేదే హిందూ మతం.  కాశాయికరణం కంటే ప్రమాద కరమైనవి  ఇంకా ఎన్నో ఉన్నాయి.  అవి ఎక్కువ ఒంటికి పట్టించుకుంటే బుర్ర చెడిపోయి తుపాకులు చేతబట్టి, అడవులకు వెళ్ళిపోవడమే.  ఇక అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజి లు , నీటి వంతెనలు , ఆకాశవాణి కేంద్రాలు పెల్చేయడం దాకా పోతుంది.  కనీసం అడవులలోకి వెళ్లి జీవితాన్ని త్యాగం చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు రోడ్లు , మంచి నీరు , గిట్టుబాటు ధరలు , రైతుల ఆత్మ హత్యలు లాంటి కనీస సమస్యలు ను అయినా పరిష్కరించ లేక పోతున్నారు.  వారు అడవిలోకి వెళ్ళటం ఏమి లాభమో అర్ధం కాదు . 
   కాషాయీకరణం వల్ల అంత ప్రమాదం ఏమి పొంచి లేదు .  అన్ని పార్టీల్లోనూ , అన్ని సంస్థలలోనూ, అన్ని మతాల్లోనూ ఉంటున్నారు. 

    కాషాయీకరణం  అంటూ ఈ మధ్య కొందరు ఈ విషయాన్ని పదేపదే వల్లిస్తున్నారు.  కాషాయీకరణం, బ్రాహ్మణ వాదం , మను వాదం అంటూ పదేపదే వల్లే వేస్తున్నారు .  అన్ని రంగాల్లో S.C.,S.T., BC. మరియు ఇతర కులాల వారు కనిపిస్తున్నారు .  బ్రాహ్మణులు ఉన్నత స్థానాల్లో అనేది ఎప్పుడో అంతరించి పోయింది.  మనువుని తిడుతూ అంబేద్కర్ ని ఆధునిక మనువు గా పిలుస్తాము .  అసలు మనుస్మృతి కి ఈ యుగం లో సంబంధం లేదు .  ఇప్పుడు తీసుకోవలసింది పరాశర స్మృతి  కొన్ని కులాలను వెనకేసుకొచ్చిన పక్షపాతి మనువు అని తిడుతూ ఉంటారు .  కానీ ఆధునిక రాజ్యాంగం లో కులం మతం ప్రస్తావన లేకుండా నడుస్తుందా ?  పైగా మనువు లాగానే కొన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చారు రాజ్యాంగ కర్త .     
       ఇక కాషాయీకరణం అంటే వేదాంతం, పురాణాలు , పురాణ పురుషులు , తత్వవేత్తలు , సంఘ సంస్కర్తలు ,ఎన్నో వస్తాయి.  అయినా కాషాయీకరణం  వల్ల వచ్చె నష్టాలు ఏమి లేవు . కాబట్టి కాషాయీకరణం  అంటే ఏదో నక్సలిజం, తీవ్ర వాదం లాగా మాట్లాడటం ఏమి బాగోలేదు.  అంత ధైర్యం, తెగింపు ఉన్నవాళ్ళు ఇతర కులాల , మతాల పై కూడా విమర్సలు చేసి చూడండి.  మత సంస్థ లు అంటూ విమర్శలు చేస్తున్నారు.హిందువులది మతోన్మాదం అని అంటున్నారు.  మరి ముస్లిం లీగ్ ముందు ఏర్పడిందా ? లేక R.S.S. ముందు ఏర్పడిందా ? గమనిస్తే చాలు. ముస్లింలీగ్ ఏర్పడిన 30 సo,, కు R.S.S. ఏర్పడింది . 
  సర్వేజనాః సుఖినో భవంతు అని చెప్తుంది హిందూమతం .  ఇప్పుడే , ఇక్కడే ఆ మతం ఉనికిని కోల్పోయే ప్రమాదం లో పడితే గళం విప్పుతున్నారు .  ఏది ఏమైనా మెజార్టీ ప్రజల మనోభావాలు మైనార్టీ లు , వీరి మనో భావాలు మెజార్టీ లు ఇలా ఒకరికొకరు గౌరవించుకోవాలి . 
  ప్రతి విషయానికీ కుహనా సెక్యులరిజం అంట గట్టడం, సందర్భం లేక పోయినా హిందూ మతాన్ని, భావ జాలాన్ని విమర్శించటం, తిట్టటం మానుకోవాలి.  హిందూఇజం సంస్థల్లో ఇప్పుడు ఎక్కువ BC. SC. స్థ వారే ఉంటున్నారు .ఈ విషయాన్ని అందరు గ్రహించి గౌరవించాలి .  కాషాయికరణం లో రామాయణ ధర్మం ఉంది , భారత ధర్మం ఉంది , భాగవతం పరమాత్మ కధలు ఉన్నాయి, భక్తీ ఉంది , జ్ఞానం ఉంది , మూఢ నమ్మకాలు ఖండించే ఆచార్యులు ఉన్నారు .  వాగ్గేయ కారులు ఉన్నారు.   కవులు , పండితులు, రచయితలు , సంఘ సంస్కర్తలు హిందూ మతం మతం కంటే ధర్మం అని పిలుస్తారు .
    బౌద్దం , జైనం వంటి మతాలు హిందూ మతం లోనుండి వచ్చినవే.  అవి భగవంతుని కంటే జ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చాయి .
  ఎన్నో అనాగరిక ఆచారాలను , 75 మతాలను త్రోసిపుచ్చి మూఢ నమ్మకాలను పారద్రోలి, 6 మతాలు ముఖ్యం అని శంకర , రామానుజ , మద్వ  త్రిమతా చార్యులు కృషి చేసారు.  వివేకానంద, రామకృష్ణ పరమహంస, రాధాకృష్ణన్, రమణ మహర్షి వరకు కోటాను కోట్ల మంది తాత్వికులు ఈ భారత భూమి పుట్టుక నుంచి ఉన్నారు.  అదే కాషాయీకరణం అని తెలుసుకోండి .

        ఈ మధ్య కొంత మంది కంచే ఐలయ్య వంటి మేధావులు మేము రామాయణ భారతాలు వంటి హిందూ మత గ్రంధాలు చదవలేదు. చదవము కూడా ఎందుకంటే అవి అన్ని మత వాదాన్ని సమర్దిస్తాయి అని అంటున్నారు .  కానీ అసలు హిందూ మతం గురించి తెలుసుకోకుండా విమర్శ చెయ్యటం ఎంత వరకు సబబు ?  దయ చేసి ముందు హిందూ మతాన్ని గురించి పూర్తి గా తెలుసుకోండి .  కాషాయీకరణం అనగానే భయ పడకండి.  ముందు తెలుసుకుని ఆ తరువాత అందులోని లోటుపాట్లను విమర్శించండి . 

ప్రేమే కట్నం

మేఘాలు ముసిరి ఒక మాదిరి వర్షం ప్రారంభం అయ్యింది
జొన్న చేలు కంకుల బరువు తో ఊగుతున్నాయి .
ఆమె కాలి గజ్జెల చప్పుడు తో వయ్యారం గా నడుస్తోంది
వర్షం పెద్దగా పడ్తోంది తడిసిపోయాను .
ఆమె ప్రక్కకు జరిగింది ఫర్వాలేదు లోపలి రావచ్చు
కొంటె కళ్ళతో ఆహ్వానం పలికింది
ఆమె కూడా కొంచెం కొంచెం తడిసిపోయింది
ఆమె అందాలన్నీ విందు వినోదం చేస్తున్నాయి
 నేను సిగ్గు పడి మెలికలు తిరుగుతున్నాను
కాలేజీ కి వెళ్ళలేదు తోటలో బొప్పాయి పండ్లు దింపు తున్నాము
పైట సవరించుకుంటూ చిరునవ్వు తో సమాధానం
నేనూ అంతే బైట పక్షులు రాకుండా కంకులు కాపలా కాస్తున్నా !
చదువు అయిపోతోంది గా ఇక సెటిల్ అవ్వడమేనా?
మనసుని , తడి చొక్కా ని పిండుకుంటూ అడిగాడు
మీ వాళ్ళు కట్నం అడుగుతున్నారుగా
బుంగ మూతి తో రుస రుస లాడుతూ వెళ్ళిపోయింది
చమేలీ ! నాకు నువ్వే ముద్దు
కట్నం వద్దే వద్దు .. గట్టిగా అరిచాను
వెనక్కి చూసి నవ్వింది .  పైట చెంగు తో ముఖం దాచుకుంది
పెదవి కొరుకుతూ కొంటెగా నా వైపు వాలు జడ విసిరింది .

 

 

స్ఫూర్తి

ఆరుబయట పెద్ద వర్షం గాలి దుమారం
కిటికీరెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి
కిటికీ తెరచి బయటకు చూసాను.
వర్షం లో చెట్టు పై పిచుకల జంట
పిల్లల్ని కాపాడుతూ పోరాటం చేస్తున్నాయి
చెట్టు కొమ్మను నమ్ముకున్నాయి .
ఏ నాటి నుంచో కాపురం ఉన్నాయి
ఇప్పుడు రెక్కలు చాచి పిల్లల్ని దాచిపెట్టాయి
ఎవ్వరింటారు గోడు ? ఎవ్వడూ రాడు.
తనకు తానె తోడూ ,
జోరువానలో తడిసిపోతున్న జోడు
చాలాసేపు విధికి ఎదురోడ్డాయి
నమ్ముకున్న చెట్టుని మాత్రం వీడలేదు
వర్షం కురిసి కురిసి అలసి ఆగిపోయింది
ఆ పక్షి జంట రెక్కలు బాగా దులుపు కున్నాయి
ముక్కుతో పిల్లల రెక్కలు విడదీసి ఆరబెట్టాయి
పిల్లలకు ఇచ్చే శిక్షణ లో ఇదీ భాగమే
అందుకే రెట్టింపు ఉత్సాహం నింపుకున్నాయి
కొమ్మ పై నుంచి కొమ్మ పైకి దూకుతూ కొత్త శిక్షణ ఇస్తున్నాయి
కొత్త కొత్త గా రేపటి తరం ఆశ లకు పదును పెడుతున్నాయి .
మన యువ తరానికి ఇది స్ఫూర్తి .
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online