Pages

Varalakshmi vratamవరలక్ష్మీ వ్రతవిధానం

*🙏శ్రావణ వరలక్ష్మి వ్రత విధానం🙏*

శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-
పసుపు 100 గ్రాములు
కుంకుమ100 గ్రాములు.
ఒక డబ్బ గంధం
విడిపూలు,పూల దండలు - 6
తమల పాకులు -30 వక్కలు
వంద గ్రాముల ఖర్జూరములు
50 గ్రాముల అగరవత్తులు
కర్పూరము - 50 గ్రాములు
౩౦ రూపాయి నాణాలు
ఒక తెల్ల టవల్
జాకెట్ ముక్కలు
మామిడి ఆకులు
ఒక డజన్ అరటిపండ్లు
ఇతర ఐదు రకాల పండ్లు
అమ్మవారి ఫోటో
కలశం
కొబ్బరి కాయలు
తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 2
స్వీట్లు
బియ్యం 2 కిలోలు
కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు
దీపాలు
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

*వ్రత విధానం :-*


వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

*కావలసినవి :-*

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి.

*కంకణం ఎలా తయారుచేసుకోవాలి :-*

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి.
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః ,
ఓం ఏకదంతాయ నమః ,
ఓం కపిలాయ నమః ,
ఓం గజకర్ణికాయ నమః ,
ఓంలంబోదరాయ నమః ,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

*కలశపూజ :-*

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

*అధాంగపూజ:-*

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః - పాదౌ పూజయామి,
చపలాయై నమః - జానునీ పూజయామి,
పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి,
మలవాసిన్యైనమః - కటిం పూజయామి,
పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,
మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి,
కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,
సుముఖాయైనమః - ముఖంపూజయామి,
సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి,
రమాయైనమః - కర్ణౌ పూజయామి,
కమలాయైనమః - శిరః పూజయామి,
శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
కంకణపూజ :-
కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే  వ్రత.

*కథా ప్రారంభం :-*

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు.
ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.
అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

*వరలక్ష్మీ సాక్షాత్కారం :-*

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.
అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.
చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో
*సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే*
*శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!*

 అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి.
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జైశ్రీమాన్నారాయన్..అష్టాక్షరీ మంత్రం గొప్పదనం....power of chanting sreemannarayana

                          ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర మహిమ...........
శ్రీ  వైష్ణవులు కు ఉపనయనం చేసి భుజాలపై శంఖ, చక్ర ముద్రలు వేసి ఈ అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ...అని చెవిలో చెబుతారు..ఇక ఆరోజు నుంచీ గాయత్రీ మంత్రం తో పాటు ఈ మంత్రం కూడా జపం చేసుకోవడం ప్రారంభిస్తారు .ఇక చక్రాంకితములు లేదా సమాశ్రేయణములుఅయిన తరువాత ఇక నారాయణుని ...ఆ స్వామి అవతరములను మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు ..మధ్యలో...ఇక మతం మారడం ..దేవుళ్లను మార్చేయడం ఉండదు ..మిగతా దేవుళ్ళను ..బాబాలను ..పీఠాధిపతులను ఆ నారాయణుని అవతారమే ..అని తలచి ఆరాధిస్తూఉంటారు .....అప్పుడు వాళ్ళకు ఈ అష్టాక్షరీ మంత్రమును తిరు మంత్రం అనికూడా పిలుస్తూ ఉంటారు ... కాకుండా ఇతర కులాల వారికి కూడా సమాశ్రేయణములు అంటే శ0ఖ చక్రముల చిహ్నములు ఆడ, మగ వారికి పెళ్ళి అయిన వారికి భుజాలపై వేస్తారు ..అప్పుడు ఈ అష్టాక్షరీ మంత్రం ఉపదేశిస్తారు ..ఒక నియమం లాగా చేసుకొనే వారు మధు మాంసం లు ముట్టరు.. ఇక అందరికి కలిపి ఓం నమో నారాయణాయ..ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో విష్ణవే .అని ఉపదేశం చేస్తారు ..పై దానిని తిరు మంత్రం అని క్రింద రెండు నామాలను ద్వయ మంత్రం అని పిలుస్తారు
    *ఓం నమో నారాయణాయ* అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది. ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు  సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు.

    మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. .
మీకు ఎక్కడ ప్రశాంతము గా అనిపిస్తే అక్కడ కూర్చుని హాయిగా జపం చేసుకోవచ్చు ..గరుడుడు ని ఎక్కిన శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి లు ను పారిజాత పుష్పాలతో108 సార్లు అష్టాక్షరీ నామం జపించినా చాలు.లేదు వూరికే.. కూర్చొని మనస్సులో కూడా ధ్యానం చేసుకోవచ్చు ...ఎవరైనా సరే శుచిగా ..శుభ్రంగా లేము అనుకుంటే ..మనస్సులో లోలోపల హాయిగా చేసుకోవచ్చు ..అస్సలు..ఈ అష్టాక్షరీ మంత్రమునకు పెద్దగా మడి ఏమీ అవసరం లేదు కాళ్ళు,చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసి నెత్తిన కొద్దిగా నీళ్ళు జల్లుకొని నామం చదువుకోవచ్చు ..మామూలుగా ప్రయాణం చేస్తూనో,పనిచేసుకుంటూనో నామ చదువుకోవచ్చు ..పెద్దగా మడిబట్ట లు ..అటువంటి రూల్స్ ఏమీ లేవు రాత్రి నిద్రపట్టకపోయినా ,మంచంపై పడుకొని కూడా నామం పఠీ స్తూ..నిద్రపోవచ్చు ..

    అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం, నకారం రక్త (ఎరుపు) వర్ణం, మో అనే అక్షరం కృష్ణ (నలుపు), నా అనే అక్షరం ఎర్రగానూ, రా అనే అక్షరం కుంకుమరంగులోనూ, య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ, ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది. ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు.

    సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

    నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓంనమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.అంతే కాదు శ్రీవైష్ణవ జనులు కలుసుకోగానే జైశ్రీమాన్నారాయన్ అని పెద్దగా పలుకుతారు ముఖ్యంగా చిన్నజీయర్ స్వామివారి భక్తులను ..అలా ఎందుకు అంటారు అంటే సాక్షాత్తూ.. కృష్ణభగవానుడే గీత లో స్వయముగాచెప్పాడు.. మీకు విష్ణుసహస్రనామాలలో భగవానుఉవాచ...అని.

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ‖ 32 ‖
అందుకే....ఎక్కడ జయ శ్రీమన్నారాయణ.. అంటారో అక్కడ వాతావరణం కు పవిత్రత కలిగి ..అందరికి శుభం చేకూరుతుంది ...ఘోరమైన వ్యాధులతో బాధ పడేవారు ...దుఖఃము లో మునిగి పోయి భయ భ్రాంతులు చెందేవారు ..లేనిపోని వి ఊహించుకొని దయ్యాలు, భూతాలు అని ఉలిక్కిపడి భీతి తో ఉన్నవారు ...జయ శ్రీ మన్నారాయణ... అంటూ ఉంటే మీకే తెలుస్తుంది ఆ రిలీఫ్ ...ఈ నామం చేయటానికి ఎలాంటి శుచి.. మడి ..ఆ నియమాలు ఏమీ అవసరం లేదు .......    ఆడ.. మగ తేడా కూడా అవసరం లేదు ..      ఒక్కసారి అయినా మనస్సుని శుచి గా ..మనస్సులో ఒక్క క్షణం రూపం ఊహించుకుంటే ఇంకా ఫలితం బాగా వస్తుంది ..ప్రపంచం  అంతా భగవంతుడు నిండిపోయి ఆవరించి వున్నాడు ..ఇప్పుడు మనం ఆయన లో ఉన్నాము ..ఆయన మనలో వున్నాడు ..పై ..పై ..డాంబికాలు ..శుభ్రతలు ..అంతా ఉత్తదే ..







ఓం కారం జపిస్తే మానసిక శా రీరక ఆరోగ్యం.. chanting omekara gives health

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.

అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.
అయితే చక్కగా పద్మాసనం వేసుకొని గుడిలోనో ,తోటలో కానీ ,..ప్రశాంతంగా కూర్చొని సాధన చేయాలి ఎదురుగా కావాలంటే మీ ఇష్ట దైవం పెట్టుకొని ప్రాక్టీసు చేయండి ..కళ్ళు మూసుకొని ఓం అని రోజుకు కొంచెం సేపు ఓం కారం ప్రాక్టీస్ చేయండి ...లంగ్స్, కి గుండె కూడా మంచిది ..మనకు ఉన్న శక్తి ని పట్టి చేసుకోవాలి ...అతి సర్వత్రా వర్జయేత్ అని కదా ...అతి చేయకూడదు ..ఒకవేళ ఎక్కువ సేపు పట్టలేక పోతే ...ఒక నామం కల్పి ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు జపం లాగా చేసుకొండి ఉదాహరణకు ఓం నమో వేంకటేశా యా ...ఓం....... నమోవేంకటేశాయ..అలా కూడా మీ ఇష్ట దైవం నామ్0 ప్రాక్టీస్ చేస్తూ మనస్సులో ఆ దైవం కొద్దిసేపు అయినా నిలిచేట్లు గా సాధన చేయండి ...లేదా ముక్కు లో నుంచి శ్వాస తీస్తూ పైకి అంటే ఉచ్వాస లో ముక్కు పైన నుదుటి దగ్గర మీ ఇష్ట దైవం యొక్క చిత్రాన్ని నిలుపుకొని దానిపైనే ధ్యాస పెడుతూ గాలి మెల్లగా తీసుకోవడం ...మళ్ళా అలానే మెల్లగా వదలడం చేస్తూ మీకు మీరు ప్రాక్టీసు చేసుకొండి ...కొంతకాలానికి అదే మెడిటేషన్ ..గోవింద నామ0 తీసుకున్నా చాలు ...ఆ ఏకాగ్రత చిత్తం వల్ల మీ ఆలోచనలు భగవంతుని తో లింక్ ఆయు రోజూ అలవాటు ఆయు అదే మీకు మానసిక .శారీరక ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది ...అలానే కొద్దీ కొద్ది గా సాధన చేయండి ....మీకు మీరే ఎంజాయ్ చేసేసుకుంటారు ..ప్రయత్నం చేయడం ఇక ప్రారంభి 0చండి
మీ సందేహాలు ఇక్కడ వ్రాయండి .....సమాధానం చెబుతాను .....శుభం...

మా నాన్నగారి వర్ద0తి


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
18th జులై మా నాన్నగారు వర్ద0తి ..వారి సమాజానికి చేసిన సేవలను ఒకసారి తలుచుకొని వారికి నివాళులు అర్పించిన వారి చాలామంది ప్రియశిష్యు ల తో కల్సి వారి అబ్బాయి ని ......డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ 

పురుషుడు ఎలా ఉండాలి ?importantcharacter sticsof men in Bharateeya dharmasashtra

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1.కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.      సేకరణ........       🙏🏻🙏🏻🙏🙏...!!!!!!!

About pv... పీవీ గారి గొప్పతనం

this is the brain we've to insure, preserve and try to decode. I am more than happy now because of KCR (whatever may be his agenda) the people of this country are able to know the greatest achievements of one person who does not belong to either Gandhi-Nehru or NaMo group, whose achievements supersede them and that person had achieved all on his own and Devine graces without caste, cash and groups. 🙏👏

https://muchata.com/that-is-pv-narsimharao/

ఇంట్లోనేవాకింగు ఎలా walking at home inlock down

ప్రస్తుతం బయట కి వెళ్లడం కుదరదు కనుక ఇంట్లోనే వాకింగ్ చేయండి.
8ఆకారం లో వుత్తరం వైపు  వెళ్లి తిరిగి దక్షిణం వైపు కు రావాలి.
20-నిముషాలు చెయ్యాలి.
హై బీపీ,  బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

Breething exercise కూడా చెయ్యచ్చు.
 ముక్కు ఎడమ రంద్రం నుండి 8-సార్లు,   కుడి రంద్రం నుండి 16-సార్లు గాలి పీల్చి వదలాలి

కరోనా నివారణకు చిన్న చిట్కా


తృటి ఘడియ కల్పం యుగాల లెక్కలు తెలుసుకుందాము

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

భాగవతాదారితం 🕉🕉


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online