Pages

Shiva ashtottara mahima

శివాష్టోత్తరశతనామస్తోత్ర మహిమ
శివాయగురవేనమః... శృతులయందు చెప్పబడ్డ పరమేశ్వరుని దివ్యనామాలలో శివాష్టోత్తరశతనామ స్తోత్రం ఒకటి. శంకరునికి అత్యంత ప్రియమైన స్తోత్రమిది. సంవత్సరకాలం రోజూ మూడు పూటల దీన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని నారాయణుడు అమ్మవారితో చెప్పగా ఆవిడ ఈ నామాలను ఉపాసన చేసింది తత్ఫలితంగా పరమేశ్వరుని తో వివాహం జరిగిందని స్కాందపురాణం చెప్తోంది. అలాంటి దివ్యమైన ఈ మంత్రరాశి పరంపరగా వ్యాసుని దయ వలన మనకి లభించింది. దీని మహిమను వ్యాసుడు చెప్తూ “యస్త్రిసన్ధ్యం పఠేన్నిత్యం నామ్నామష్టోత్తం శతమ్ శతరుద్ర త్రిరావృత్యా యత్ఫలం లభతే నరః తత్ఫలం ప్రాప్నుయాన్నిత్యమేకావృత్త్యా నసంశయః సకృద్వానామభిః పూజ్య కులకోటిం సముద్ధరేత్” -  మూడు మార్లు రుద్రనమకం పఠిస్తే ఎంత ఫలితమో ఒక్కమారు శివాష్టోత్తరం పఠిస్తే అంత ఫలితం. ఇలా రోజు త్రిసంధ్యలలో పఠించాలి. ఈ నామాలతో శివుని పూజిస్తే వంశం అంతా తరిస్తుంది అని చెప్పారు. “బిల్వపత్రైః ప్రశస్తైశ్చ పుష్పైశ్చ తులసీదళైః  తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయః“ –  మారేడు దళాలు, పుష్పాలు, తులసీ దళాలు, తిలాక్షతలు - నువ్వులు బియ్యం కలిసి ఈ నామాలతో ఆరాధించితే దివ్యమైన ఫలితం లభించి వారు జీవన్ముక్తులు అవుతారని నారాయణుడు చెప్పిన మాట. -పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online