Pages

శివ కేశవులకు భేదం లేదు

మాఘ పురాణం - 20
20వ అధ్యాయము - శివ బ్రహ్మల వివాదము

గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్తుడైన యధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూదలేకపోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుదు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.

బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి

అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.

హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం
సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |
అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం
చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||
నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై
త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |
పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః
ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||
త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః
గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |
త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట
దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||
లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర
త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః

సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ
త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||
త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ
త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||
పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం
త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||
వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ
కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||
నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః
రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||
అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం
తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||
తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే
తూర్ణం జగనాథ మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. స్త్త్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును యీగుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుదు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.

పైన రెండు పురాణ కధలు చదివితే మనకు అర్ధం కావలసింది ఏమిటంటే శివ .కేశవులకు భేదం లేదు ...అందుకనేఓం శివాయ విష్ణురూపాయ ...శివరూపాయ విష్ణవే ..శివస్య హృదయం విష్టోచ హృదయం శివః యథా శివమయో విష్ణుమయ స్థితః
అలా అర్థం చేసుకోవాలి ..ఇద్దరిలో ఎవరికి నమస్కారం చేసినా సహజసిద్ధంగా ఇంకోకరికి చేసినట్లే అవుతుంది .అందుకే భగవద్గీత లో కూడా శ్రీకృష్ణభగవానుడు అదే చెప్పాడు ..ఆ. శంకరుడిని నేనే ...అని గట్టిగా చెప్పాడు ....అందుకే జై శ్రీమన్నారాయణ... జై శివ నారాయణ జైజై సాయినారాయణ ..ఎలా అయినా ..బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కు భేదం లేదు ..భగవంతుడు ఒక్కటే కానీ వివిధ రూపాలుగా ఆరాధిస్తున్నాం అని తెలుసుకోవాలి .


Shiva ashtottara mahima

శివాష్టోత్తరశతనామస్తోత్ర మహిమ
శివాయగురవేనమః... శృతులయందు చెప్పబడ్డ పరమేశ్వరుని దివ్యనామాలలో శివాష్టోత్తరశతనామ స్తోత్రం ఒకటి. శంకరునికి అత్యంత ప్రియమైన స్తోత్రమిది. సంవత్సరకాలం రోజూ మూడు పూటల దీన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని నారాయణుడు అమ్మవారితో చెప్పగా ఆవిడ ఈ నామాలను ఉపాసన చేసింది తత్ఫలితంగా పరమేశ్వరుని తో వివాహం జరిగిందని స్కాందపురాణం చెప్తోంది. అలాంటి దివ్యమైన ఈ మంత్రరాశి పరంపరగా వ్యాసుని దయ వలన మనకి లభించింది. దీని మహిమను వ్యాసుడు చెప్తూ “యస్త్రిసన్ధ్యం పఠేన్నిత్యం నామ్నామష్టోత్తం శతమ్ శతరుద్ర త్రిరావృత్యా యత్ఫలం లభతే నరః తత్ఫలం ప్రాప్నుయాన్నిత్యమేకావృత్త్యా నసంశయః సకృద్వానామభిః పూజ్య కులకోటిం సముద్ధరేత్” -  మూడు మార్లు రుద్రనమకం పఠిస్తే ఎంత ఫలితమో ఒక్కమారు శివాష్టోత్తరం పఠిస్తే అంత ఫలితం. ఇలా రోజు త్రిసంధ్యలలో పఠించాలి. ఈ నామాలతో శివుని పూజిస్తే వంశం అంతా తరిస్తుంది అని చెప్పారు. “బిల్వపత్రైః ప్రశస్తైశ్చ పుష్పైశ్చ తులసీదళైః  తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయః“ –  మారేడు దళాలు, పుష్పాలు, తులసీ దళాలు, తిలాక్షతలు - నువ్వులు బియ్యం కలిసి ఈ నామాలతో ఆరాధించితే దివ్యమైన ఫలితం లభించి వారు జీవన్ముక్తులు అవుతారని నారాయణుడు చెప్పిన మాట. -పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు

Maha Shiva Ratri importance

మహాశివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని
ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

A rare and the most expensive bird in the world

తమిళనాడులో కనిపించే ఈ పక్షిని ప్రపంచ వారసత్వంగా పరిగణిస్తారు. దీని ధర 25 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇది ఒకేసారి 25 రకాల శబ్దాలను తీయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ వీడియోను చిత్రీకరించడానికి 16 ఫోటోగ్రాఫర్‌లకు 62 రోజులు పట్టింది. మీరు కూడా ఆనందించండి ...






Bhishma Ekadasi (Ziyyar Swami. Pravachanam)

భీష్మ ఏకాదశి

శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘము వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.

జై శ్రీమన్నారాయణ

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Hues of Love (a short story) part - 4

Part.....4
అలా కొద్దికాలం ..అన్నా.. వదిన ల సమస్య ను ఎలా పరిష్కరించాలా ..అనే రీసెర్చ్ లొనే ఉండిపోయారు .ఐశ్వర్య... సాయిచంద్ర లు ...మధ్య ..మధ్య కొన్ని కొత్త విషయాలు ..అన్న చైతన్య. తో ..మాట్లాడి తెలుసుకుంటున్నారు .చైతన్య భార్య ..మాధవికి ఒక తమ్ముడు ..ఒక అన్న ఉన్నారని ..అందులో తమ్ముడు ...తమ్ముడి భార్య చాలా మంచి వాళ్ళని ..కష్ట సుఖాలు తెలిసిన వారని ..వాళ్ళు ప్రస్తుతం ముంబై లో వుంటున్నారని ..తెలుసుకొని ..ఇక అక్కడకు బయలు దేరి వెళ్ళారు... ఐశ్వర్య... సాయిచంద్ర లు ........హలో ...మీరు మాధవి గారి బ్రదర్ వాసు కదా ...కొంచెం నెమ్మది నెమ్మదిగా అడిగాడు సాయిచంద్ర. అవునండీ ....మీరు ..అలా ..పరిచయాలు పూర్తికాగానే ..మా ఇంటికి రండీ అంటూ ..అడ్రస్ పంపడం ..వాళ్ళు రావడం ...మంచి మనస్సుతో..ఆత్మీయంగా ..ఆహ్వానించి పలుకరింపులు ..అన్నీ పూర్తి అయినాయు

ఒకటి ,రెండు రోజులు అంతా కల్సి షా పింగ్ లు ,సరదాలు అంటూ తిరిగారు .ఒకరోజు ...వాళ్ళ అన్నా ..వదిన ..ల గురించిచర్చ మొదలుపెట్టింది ఐశ్వర్య .. ....ఏమిటి ..సాయిచంద్ర చెప్పండి ...మా అక్క సంసారం ఎలా ..బాగుపడుతుంది?నాకు ఏమి అర్థం కావడం లేదు ...కొంచెం నిట్టూరు స్తూ అడిగాడు . వాసు ... అది మీరే హింట్ ఇవ్వాలి ఎందుకంటే ..నాకంటే ముందునుంచి ఇక్కడ ఉన్నవారు ..సమస్య చూస్తూవున్నవారు ...మీరే ఆలోచించాలి .చిరునవ్వుతఅన్నాడు సాయిచంద్ర.అంతా ..అలా చాలాసేపు మాట్లాడుకుని ఓ ప్లాన్ వేశారు ..అలా ఒకరోజు ప్లాన్ ..అంతా చర్చించుకుని .. ఈ విషయం. పెద్దవాళ్ళ కు కానీ మన ఇళ్లల్లో ఎవ్వరికి తెలియకూడదు ..అంతా న్యాచురల్ గా జరిగిపోవాలి ..అలా నిర్ణయం ..తీసుకొని సాయిచంద్ర... ఐశ్వర్య లు తిరిగి వాళ్ళ ఊరు బయలు దేరారు .
,* * * * * * * *
చెన్నై లో వర్షం ..బాగా పడుతోంది ..ఆ వర్షం లో నే కంగారు కంగారు గా ఆటో లో దిగాడు వాసు ..కాలింగ్ బెల్ మోగింది ...తలుపు తీసింది తల్లి . లోపలికి వస్తూ ఉన్న వాసు ని ఏరా ఒక్కడివే వచ్చావ్? ...అమ్మాయి రాలేదా ?అడిగింది ....లేదమ్మా ...కొంచం విసుగ్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వాసు . కొద్దిరోజులు ఏదో హడావిడి గా అటూ ఇటూ.. ఊరంతా తిరిగాడు వాసు..ఒకరోజు ....వాసు అస్సలు ..నీకు ఏమైందిరా ..వచ్చిన పనేంటి ..అస్సలు. ఈ హడావిడి...హంగామ ఏమిటి?..కాస్తంత గట్టిగా నిలదీసింది వాసు తల్లి .ఏముంది అమ్మా మీ కోడలు కు నాకు అస్సలు పడటం లేదు ప్రతి రోజు కొట్టుకు చస్తున్నాం ...అందుకే విడాకుల కోసం లాయర్ ని సంప్రదిస్తున్నాను .చిరాకు. పడుతూ చెప్పాడు వాసు ..అంతా ..ఇక మీ ఇష్టమేనా ..మా పెద్దరికం ఏమీ లేదా ? కోపంగా అడిగింది వాసు తల్లి ..ఎన్నిసార్లు చెప్పాను ...ఎన్నిసార్లు పిలిచాను ఒకసారి వచ్చి వెళ్ళండి అని నాన్నగారికి ..నీకు ! ...మీరు నా మాట విన్నారా ? అందుకే
నా పని నేను. చేసుకుంటున్నాను..... అది కాదురా ..ఇంకోఅమ్మాయి ని చేసుకున్నా ..అది బాగుంటుంది అనే నమ్మకం ఏమైనా ఉందా ?వాదిస్తున్న ట్లు అడిగింది వాసు తల్లి ..ఇంకొకటి లేదు ఏమి లేదు ..చేసుకున్నదానికే చాలా జ్ఞానోదయం అయ్యింది ..ఇక నేను ఫ్రీ గా హాయిగా బ్రతుకుతా ..ఈ తల నొప్పినేను పడలేను ఖరా ఖండిగా చెప్పేశాడు వాసు .అస్సలు మీకు గొడవ అంతా ఎక్కడ వస్తుంది చెప్పకుండా ఈ నస ఏమిటి రా బాబు ..ముందు అస్సలు గొడవ చెప్పు పక్కన వచ్చి కూర్చొని మెల్లగా అడిగింది వాసు అక్క మాధవి ...ఏముంది ...వాళ్ళ అమ్మా ..నాన్న గారు మా దగ్గరే తిష్ట వేశారు ..ఇక్కడనుంచి కదలరు.. వదలరు ? ..ఇక వాళ్ళ వాళ్ళందరూ.. వస్తూ.. పోతూవుంటూ అదొక పెద్ద ..న్యూసెన్సు..
వాళ్ళ.. చుట్టాలతో పోటీ అంటుంది .డబ్బులు తగలేస్తోంది ...స్కైప్ లో ..వాళ్ళ ..వాళ్ళందరి తో రోజంతా చాటింగ్ ..ఇంటి పనులు పట్టించుకోదు...సరే ..కొద్దిరోజులు ఆగు ఏదైనా ఒక చిన్న పరిష్కారం దొరుకుతుందేమో ..ఆలోచిద్దాం .అలా అంతా కూర్చొని ..మాట్లాడుకొంటున్నారు ....ఇంతలో కాలింగ్ బెల్ శబ్దం....తలుపు తీయగానే ..వాసు భార్య కోమలి లగేజీ తో దిగింది ...వస్తూనే ..ఏమిటి ..మీ పైత్యం ..ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయరు ..ఏమైందో ..ఎక్కడకు వెళ్ళారో ..ఏమైనా ఒక్క మాట చెప్పారా ? ఎంత టెన్షన్ పడిచస్తున్నాను ...కొంచెం కాలర్ పట్టుకొని నిలదీస్తున్నట్లు గా అనిపించేలా ఉంది సీన్ ....సరే నమ్మా ..ఇదిగో ముందు మంచి నీళ్ళు తాగమ్మా ..రిలాక్సఅవు.. ప్రయాణం చేసి వచ్చావుకదా .అంటూ గ్లాస్ చేతికి అందించింది అత్తగారు .అమ్మా ..నువ్వు మంచి నీళ్ళు ఏమి అందించాల్సిన అవసరం లేదు .ఇంట్లోకి వెళ్ళిత్రాగుతారులే ...అయినా ..విడాకులు ఇచ్చుకొండి... మరేమీ పర్వాలేదు అని గునిశావు గా మరి తగుదనమ్మా అని వెమ్మటి పడి మరీ రావాలా ?..కొంచం వెటకారం గా అన్నాడు వాసు ...ఎంత కష్ట పడ్డాను అందర్ని ఫోన్ లు చేసి అడిగాను .ఎక్కడికి వెళ్ళారో ఏమో నని ..ఎవరో ఒక మహాను భావుడు చెప్పాడు మీరు చెన్నై వెళతాను అన్నారని ...అంత ఖర్మ ..నాకేంటి చెప్పండి ..తిన్నగా ఉండక ?విసుగ్గా అరిచింది కోమలి .


కొద్దిరోజులు అలా గిల్లి కజ్జాలుపెట్టుకొంటూ..అవన్నీ స్కైపు లో లైవ్ షో పెట్టింది కోమలి . ఏదో సర్ది చెప్పాలని ..మధ్య మధ్య వాళ్ళ గోడవల్లోకి దూరుతోంది అక్క మాధవి ....ఏమిటండీ మీరు మాకు చెప్పేముందు ..మీ సంసారం సరి దిద్దుకుంటే మంచిది .కొంచం ఆవేశంగా అరిచింది కోమలి .ఏమిటి ..మా అక్క ఇంటి ఆడపడుచు అనే జ్ఞానము కూడా లేదా ?అడ్డుగా వచ్చాడు వాసు .అలా మాట ..మాట పెంచుకొని కోమలిని లాగి కొట్టాడు వాసు .నీ మీద కంప్లైంట్ ఇస్తాను .అని...ఏడుచుకుంటూ కూర్చుంది ..ఏం ..ఇక్కడ మీ వాళ్ళు అందరూ తిష్ట వేయలేదా? మీ బావ కు అంతా గొరిగి ..విసుక్కోని గెంటేయ లేదా? ఇక్కడ మాత్రం వీళ్ళ0ధరకు ఒక పద్ధతి... నాదాకా వస్తే వేరే పద్దతి .?అడిగే వాడు ఎవడూ లేరా?స్కైపు లో ..ఏమిటి అల్లుడుగారు మీరు ..మీ వాళ్ళ దౌర్జన్యం.. అని అత్తగారు వాళ్ళు అరుస్తుంటే..స్కైపు ..కనెక్షన్లు విసిరి బెడ్ పై వేశాడు వాసు... కోమలి ..విసిరిన మాటలు ..కు అక్కమాధవి కి కొంచెం మనస్సు కలుక్కుమంది...వాసు వాళ్ళ ..తల్లిదండ్రులు కు ఏమి చేయాలో పాలుబోవడం లేదు .ఒకపక్క అమ్మాయి సంసారం.. కూతురు .ఇక్కడ ..అల్లుడు ..అక్కడ మధ్య నలిగిపోతున్న చిన్న బాబు ..మళ్ళీ కొడుకు కోడలు కొట్లాట ....ఎవ్వరికీ ఏమి చెప్పేటట్లు లేదు ..ధీర్ఘమైన ఆలోచనలో పడిపోయుంది వాసు వాళ్ళ అమ్మ .రోజులు గడుస్తున్నాయి .అటు పక్క ..ఇటుపక్క వాళ్ళు గుసగుసలు గా చెప్పుకుంటున్నారు .మాధవి కొడుకు అస్తమానం ...డాడీ ..డాడీ అని కలవరిస్తూన్నాడు..నువ్వు డాడీ ...డాడీ అంటూ జపం చేస్తూ ..పిచ్చికళ్ళు చేస్తే ..చంపేస్తా ..బెదిరిస్తోంది .తల్లి మాధవి ...చూస్తుండగానే ..వాడికి వాళ్ళ డాడీ పైనే దిగులు పెట్టుకొని జ్వరం తెచ్చుకుని బాధపడుతున్నాడు ...గొడవలకు కారణం ...మన అసమర్థత ..మనస్వార్ధం... అని ఇప్పుడిప్పుడే మాధవి తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు ..చుట్టుపక్కలవాళ్ళు ...సైతం మొహం పైనే అంటున్నారు ..ఇక చేసేది లేక ..స్వంత ఊరు వెళ్ళి పనులు చూసుకొని..మళ్ళీ వస్తాం అని సర్దుకున్నారు .

..పిల్లవాడిని తీసుకొని హాసిపిటల్ చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తుంది తల్లి మాధవి .ఇటువంటి కష్ట సమయములో మీరు ఊరు వెళ్ళాలా? అని.
తల్లి తండ్రులను విసుక్కొంటుంది.. మాధవి ..ఒక రోజు డాక్టర్ గారు చూడమ్మా ..కొద్దిరోజులు మీ అబ్బాయిని వాళ్ళ డాడీ దగ్గర ఉంచితే చాలా మంచిది ...మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అని చెప్పడం తో ఆలోచనల్లో పడిపోయింది మాధవి .తాను కూడాఇంట్లో ఎవరికి చెప్పలేక సతమతమవుతొంది . ఎవరిగోలల్లో వాళ్ళు కొట్టుకొంటున్నారు ..ఇక తాను కూడా కాస్తంత రిలాక్స్ కావాలి ..బాబు ని దక్కించుకోవాలి ..అని భర్త చైతన్య వాళ్ళ ఊరు బయలుదేరింది మాధవి .
* * * * * *
శీతాకాలం ..అవ్వటం వల్ల కాస్తంత చలిగా ఉంది .దొరగారు మేడ పైన అటూ ఇటూ కాస్తంత ఎండ వెతుక్కు0టూ..పచార్లుచేస్తున్నారు .దూరం నుంచి పిల్లగాడి ని ఎత్తుకొని బ్యాగ్ తో వస్తున్న కోడలిని చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు .నిజంగా .కోడలు పిల్లేనా ....మా కోడలు పిల్లే ..ఆశ్చర్యం పడిపోతున్నాడు.దొరగారు..ఎప్పుడు వచ్చినా కారు పంపించండి..పనివాళ్ళు నుపంపండి ..ఇదేం ఊరు ఇక్కడేమి దొరకవు ..ఊరంతా బురద ఎలా రావాలి అని విసుగు తో చంపేసేది ...ఇప్పుడు తల వంచుకొని బుద్దిగా వస్తోంది ..ఇలా గొణుక్కు0టూ గబ.. గబా క్రిందికి దిగి గేట్ పక్కాగా నిలుచున్నాడు దొరగారు..ఏమి చేస్తుందో చూద్దాం అనుకొని ...చెట్లలో పక్కగా ఏదో పని చేస్తున్నట్లు గా ఉండిపోయాడు దొరగారు ..గేట్ తీ సి లోపలికి నడుచుకుంటూ వస్తోంది ..మాధవి... ఇంతలో వెనుక నుంచి పిలుపు ...అమ్మాయి గారు ...నాకు ఇవ్వండమ్మా ..ఆ లగేజీ ..అంటూ బ్యాగ్ లు అందుకున్నాడు పనివాడు రామయ్య ...

లోపలకు వచ్చిఇంకో గేట్ తీసి లోపలికి చూసింది ...మామయ్య గారు ..గట్టిగా పిలిచింది మాధవి ...అమ్మా ...నువ్వా ..తల్లీ ...ఫోన్ చేస్తే ఎవరో ఒకళ్ళని సహాయం గా పంపించే వాళ్ళం కదమ్మా ....తాతగారు ..అంటూ చేతులు జాపాడు మనుమడు అభిషేక్ .ఓరి ...నాన్న ..మాబుచ్చి గదరా ..అంటూ ముద్దు చేస్తుంటే ..ఎత్తుకోమని ...బాబు ని చేతుల్లోకి అందించింది మాధవి ...మురిసిపోయు న దొరగారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..ఎత్తుకొని ముద్దాడుతుంటే ..పనివాళ్ళు మాధవి ని లోపలికి తీసుకొని వెళ్ళారు...నీకు నిజంగా నా పైన ..ప్రేమ ఉంది నాయినా లేకపోతే నన్ను ఇంతలా గుర్తు పెట్టుకొని పెనవేస్తావా !..పోనీలే ..మీ అమ్మ ఎత్తుకోమని నాకు మనస్సారా ఇంత కాలానికి ఇచ్చింది ..ఇక అది చాలు రా !బాబు ..అంటూ కళ్ళు వత్తుకున్నాడు .!....దొరగారు పిలుపు వినపడగానే .....మళ్ళీ అటూ ఇటూ చూసి జంధ్యం పైకి సర్దుకొని దొర లా గాంభీర్యం...తెచ్చుకొని మీసాలు దువ్వుకున్నాడు ...కంఠం ..సవరించు కుంటున్నాడు దొరగారు ....అమ్మగారు ..వాళ్ళంతా మిమ్మల్ని పిలుస్తున్నారు. చెప్పాడు రామయ్య... సరే పద ..అంటూ ఇంట్లోకి బయలు దేరారు దొరగారు . పలకరింపులు ...టీ ..స్నాక్స్ .కార్యక్రమం
పూర్తి అయ్యింది.. ఏమిటండీ ...మీకు మాత్రం మీరు వచ్చేసి మీ ఊళ్ళో తిష్ట వేశారు ...మీ అబ్బాయి అక్కడ డాడీ... డాడీ అని ఒకటే జపం ..మీరు చేసింది ఏమీ పద్దతిగా లేదు .విసుగ్గా మాధవి అంటుంది... అదే అక్కడఇంతకాలం చెప్పి చెప్పి విసిగి నీలో మార్పు లేక ఇక నేనే ఇక్కడకు ప్రశాంతంగా బ్రతకాలని వచ్చేసా ..ఎప్పుడు మీ వాళ్ళే కానీ నన్ను కానీ.. మా వాళ్ళను కానీ పట్టించుకున్న దాఖలాలే లేవు ..అంటూ. భర్త చైతన్య వాదిస్తున్నాడు .ఇద్దరి మాటలు కాస్తంత పెద్దగా బైటకు వినపడుతున్నాయి... అక్కడ బైట దగ్గరలో ఉన్న దొరగారు ..భార్య.. కూతురుని కూడా ...అటు వెళ్ళద్దు ...చప్పుడు చేయకుండా వినండి అని సైగ తో చెప్పాడు దొరగారు .

.అలా రోజులు గడుస్తున్నాయి .కూతురు ఐశ్వర్య ...అల్లుడు సాయిచంద్ర పరిస్థితి అంతా అంచనా వేస్తున్నారు ..పనిలో పని సాయిచంద్ర కాస్తంత ..సందడి గా ఉంటుంది అని వాళ్ళ అమ్మా.. నాన్న లను కూడా రప్పించాడు ..ఇక ఇల్లంతా సందడే సందడి ...చాలా కాలం తరువాత..కాస్తంత కబుర్లు ..షికార్లు ..ఆనందం తో ఉబ్బి..తబ్బి పోతున్నాడు దొరగారు ..మాధవి కి కూడా అటూ ..ఇటూ బాబు ని తయారుచేసి ..తాను కూడా రెడీ అవడం ..భర్త తో చుట్టూపక్కల బంధువుల ఇళ్ళు ..పంక్షన్ లు అంటూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇంట్లో అందరు ..మాధవికి కి కాస్తంత కొత్త.. కొత్తగా ఉంది ..ఆత్మీయత ..అనురాగం .ఆ.తీపి మధురానుభూతిని పొందుతూ హుషారుగా ఇక్కడ గడిపేస్తోంది. ..చెన్నై నుంచిలాయర్ ఫోన్ చేస్తున్నాడు .....విడాకులు విషయం. ఎత్తుతున్నాడు ....కొద్దికాలం ఆగండి సార్ ..నేను ఫోన్ చేసి చెప్పిందాక మీరు ఏది ఫైల్ చేయవద్దు ...రిక్వెస్ట్ గా చెప్పాడు చైతన్య ....

ఒకరోజు ..మళ్ళీ ..రీసెర్చ్ వర్క్ అంటూ పొలందగ్గరే ..పూర్తిగా చేతికి వచ్చిన..వరి కంకులు ..తడిమి చూస్తున్నాడు ..కొన్ని ఫోటోలు తీసుకుంటున్నాడు ..సాయుచంద్ర ...బాబూ..పిలుపు వినపడింది ..దొర గారు రండి ...కొంటెగా ముసి ముసి నవ్వులతో ఫైల్ పట్టుకొని నిలుచున్నాడు ...బాబు ..అదే వద్దుఅన్నాను .. .అయ్యా!..కర్ణం గారు ..అనవచ్చా ?మా అమ్మాయి ..నా వెమ్మటి రాలేదు అనేగా ....కొంచెం నవ్వుతూ అన్నాడు దొరగారు ...పర్వాలేదు మామయ్యగారు.. మనం ఇక్కడినుంచే గా ప్రయాణం ప్రారంభించాము. అందుకే ..దొరగారు అని గుర్తుకు తెచ్చుకోవడం... కాగితాలు అన్నీ లైను లో పేర్చుకుంటూ అన్నాడు సాయిచంద్ర... సరే బాబు ..ఇంతకు మీ కృషి ..దీక్ష...పోరాట0 ..శ్రమ ..మీ ..వ్యూహం తో ..ఎలానో..అలా మా కుటుంబం మొత్తాన్ని గాడిలో కి తెచ్చారు ..మీ రుణం తీర్చుకోవడం చాలా కష్టం బాబు ...కొంచెం.. కళ్ళు అద్దుకుంటూ ఆర్ధ్రత గా అన్నాడు దొరగారు .మనదే ఏముంది మామయ్యగారు ..అంతా భగవంతుని దయ ..ఆయన మీ ప్రార్ధన ..విన్నపాలు విన్నాడు .అందరిని గాడిలో పెట్టాడు ...కొంచెము నవ్వుతూ చెప్పాడు సాయిచంద్ర... సరే బాబు మరి ఇక తరువాత మీ అబ్బాయి గారిని ట్యూన్ చేయండి ..అబ్బాయి ..కోడలు ఇద్దరు మీ దగ్గరే ఉండేలా చూసుకొండి.. వాళ్ళు చెన్నై వెళ్ళితే
కధ మొదటికే వస్తుంది .అంతకు కాక పోతే మేము వెళ్ళి మొత్తం సామాన్లు సర్ది ఇక్కడ కు తెప్పిస్తాం ..లేండి ....సరే బాబు
నా పధకం కూడా ప్రారంభం చేస్తాను.అంటూ ఇద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రీలాక్స్ గా నవ్వుకుంటున్నారు ..........
* * * * * *
ఆ రోజు శుక్రవారం ..అందరూ గోమహాలక్ష్మి పూజ చేశారు... పొలం పక్కనే అందరూ పశువుల పాక దగ్గర చెట్ల క్రింద కూర్చొని సేద తీరుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు... కొడుకు సాయిచంద్ర కనుసైగ చేశాడు ..తల్లి కి అర్థమైంది.. వెళ్ళి ..మాధవి పక్కన కూర్చుంది.. ఎమ్మా మాధవి ..మేము వచ్చి చాలా రోజులు అయ్యింది .వీలు చూసుకొని మీ దంపతులు ..మీ మామా..అత్తగార్లను ..తీసుకొని మా ఇంటికి రావాలి ...మా వారి వంశస్తులు కట్టించిన శ్రీవేంకటేశ్వర ఆలయం అవీ ఉన్నాయి ..ఆ ఉత్సవాలు అవీ చూద్దురు గాని ..అందరూ తప్పకరండి ఆమెచెబుతుంటే ..అవునమ్మామీరు అందరూ తప్పక రావాలి ..అని సాయిచంద్ర తండ్రి గారు కూడా మాట కలిపారు.చూడమ్మా మీ అత్తగారు ,మామగారు పెద్దవాళ్ళు కదా ..కాస్తంత కనిపెట్టుకొని ఉండండి .ఇక్కడ పనివాళ్ళు .ఇంటి పంటలు,కూరగాయలు మంచి గాలి,నీరు వున్నాయి. కొద్దికాలం అయినా మీరంతా కల్సి ఉంటే మీకే తెలుస్తుంది ..మా ఊరు కూడా రెండు మూడు గంటలు అంటే పెద్ద కష్టమేమీ కాదు..మేము మీరు అంతా కలుసుకుంటూ ఉండవచ్చు .ఇది నా అభిప్రాయం ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దమ్మా.. కొంచెం చిరునవ్వుతో చెప్పింది సాయిచంద్ర తల్లి ఇలా రెండురోజులు గడవగానే సాయిచంద్ర తల్లి తండ్రులు వాళ్ళ ఊరు బయలుదేరారు ...మన్నించాలి బావగారు ..మా అమ్మాయి ని లెక్కప్రకారం మీ ఇంట్లో దింపిరావాలి కానీ ..మా అల్లుడు గారు ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దే పనిలో వున్నాడు పూర్తికాగానే మా అమ్మాయి అల్లుడిగారిని తీసుకువచ్చి దింపుతాను ఆలశ్యానికి మన్నించగలరు ..మెల్లిగా సాయిచంద్ర తండ్రిగారి చెవి దగ్గర చెప్పాడు ...దొరగారు.
భలే వారండి.. ముందు పనులన్నీ కానివ్వండి సార్ ..మనలోమనకు ఏమిటి ..చూడలనిపిస్తే .మేము వస్తూనే ఉంటాం ..
కాస్తంత ..చిరునవ్వుతో చెప్పి బయలుదేరారు ...
* * * * * *
పొలం దగ్గర సాయిచంద్ర..చైతన్య ..దొరగారు కూర్చొని మాట్లాడుకొంటున్నారు ..చైతన్యా మీరు ఏదైనా ప్రాజెక్టు లో ఒకరెండు సంవత్సరాలు.. మీ ఫ్యామిలీని తీసుకొని అబ్రాడ్ వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది ..అడిగాడు సాయిచంద్ర... ఎలాగూ నేను ఐశ్వర్య ఇక్కడే మీ నాన్నగారి ని,అమ్మగారిని కనిపెట్టుకొని ఉంటాము .నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు కాస్తంత మీ..కుటుంబం దారిలో పడుతూ ఉంది కదా అని ..మళ్ళీ చెన్నై పోతే మీ..మమగారివాళ్ళ పెత్తనం మొదలవుతుందేమో అని ...చెబుతున్నాను మీరు ఏమి అనుకోవద్దు ..కొంచెం మెల్లగా చెప్పాడు సాయిచంద్ర.. మీరు చెప్పింది కూడా కరక్టే ...నేను అదే ఆలోచిస్తూన్నాను ..అయితే కొంతకాలం యు.ఎస్ .లో ఉండి వచ్చాను పెద్దగా ఇంట్రెస్ట్ రావడం లేదు .గురగావ్ ఢిల్లీ.. వైపు నాకు ట్రాన్స్ఫర్ ఉంది ..అది బెటరేమో ఆలోచిస్తూన్నాను ..అన్నాడు చైతన్య .మీరు ఏమంటారు మామయ్యగారు..?అడిగాడు సాయిచంద్ర... నాదే ఏముంది బాబు మనమంతా ఒకచోట ఉంటే బాగుంటుందేమో ..ఆలోచించండి.. పరిస్థితులను బట్టి మారాల్సివస్తే ..ఇక తప్పదు .కొంచెం బాధగా చెప్పాడు దొరగారు .సరే ..నాన్నగారు నాకు కూడా కొంత రిలాక్స్ కావాలి మేము కొంత కాలం ఈ ఊళ్ళోనే ఉంటాము ..ఆ తరువాత ఆలోచిస్తాను గట్టిగా చెప్పాడు చైతన్య. సరే ..నేను కూడా మా యూనివర్సిటీ కి వెళ్ళాలి మా ప్రొపెసర్ ని కలవాలి నేను రేపు బయలు దేరి వెళ్ళి వస్తాను ....అలా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు .మా ఇంటిని మొత్తాన్ని ఒక దారిలోకి తెచ్చినందుకు ..మీకు ఋణ పడి ఉంటాం.బావా కొంచెము జీరకంఠ0 తో బాధ గా చెబుతున్నాడు సాయిచంద్ర.. నాదే ముంది మీరు అందరూ సహకరించారు ..ముఖ్యంగా ..మాధవి తమ్ముడి వాసు దంపతులకు..మన0 కృతజ్ఞతలు చెప్పాలి .అంటూ వాళ్ళు వేసిన ప్లాన్ ..మాధవి తమ్ముడు సహకరించిన ఉత్తీత్తి కొట్లాటలు అదంతా దొరగారి కి వివరించి చెప్పాడు సాయిచంద్ర .ఇక ఇప్పుడు చెన్నై వదిలి అందరూ ఎవరి దారి వాళ్ళు వెళ్లిపోయారు..ఇక ఈ విషయాలు ..ప్లాన్లు అన్నీ ఇక్కడితో మర్చిపోదాం చెప్పాడు సాయిచంద్ర ..బాగుంది బాబు నేను ఎప్పుడైనా ఫోన్ లో నీవు కలిపిస్తే ఆ బాబు కి కృతజ్ఞతలు చెబుతాను ..మరి ..మా దగ్గర ఒక మనువడు వున్నాడు ..మీరు మాఅమ్మాయి కల్సి ఇంకో మనుమడిని మాకు అందిస్తే ....మేము ఇక ఆడుతూ వాళ్ళతో కల్సి తిరుగుతూ జీవితం సాగిస్తాం అల్లుడుగారు అనగానే అందరూనవ్వేశారు ....................................................................(శుభం)




 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online