Direct Borewell Recharge* పద్దతి ద్వారా పట్టణాలు మరియు మహానగరాల లోని appartments మరియు ఇండిపెండెంట్ ఇళ్ళకి మనము నీటి కష్టాలకు చెక్ పెట్టవచ్చు.
చిన్న పాటి ఖర్చుతో వర్షాకాలంలో ఇంటి స్లాబ్ పైన పడే వర్షం నీటిని ఒక డ్రమ్ లో పడే విధంగా చేసుకొని ఆ డ్రమ్ పైన దోమల జాలి బిగించి దుమ్ము, ధూళి పడకుండా డ్రమ్ లో పడ్డ నీటిని నేరుగా బోర్ కేసింగ్ పైప్ కు రెండు ఇంచ్ ల రంద్రాన్ని చేసి దాని ద్వారా నేరుగా *Direct Borewell Recharge* చేయవచ్చు. ఈ విధానం ద్వారా ఇక మీదట ఎండా కాలంలో నీటి కొరతతో ఇబ్బంది పడే ఇబ్బంది తప్పుతుంది, అలాగే వరుసగా మూడు సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిన మన బోర్లు మాత్రం ఎండిపోవు.
ఈ విధానాన్ని ఇంట్లో బోర్ ఉన్న ప్రతీ ఒక్కరు చేస్తే మన పట్టణం మొత్తం భూగర్భజలాలు పెరుగుతాయి. ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం క్రింది వీడియో ఒకసారి చూస్తే బాగా అర్థం అవుతుంది.
0 comments:
Post a Comment