ఒకే ఒక చిట్కా, బరువు తగ్గిపోవచ్చు.
ఈ మధ్య కాలంలో చాలామందిని పట్టి వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఇందుకు చాలామంది, చాల విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక చాలామందికి చెయ్యాలని ఉన్నా కూడా, సమయాభావం వల్లనో, బద్ధకం వల్లనో వారి ప్రయత్నాలను ఏరోజుకు ఆ రోజు వాయిదావేసుకుంటూ వస్తుంటారు. అలంటి బద్దకస్తులకు కూడా ఇంటిదగ్గరే ఉంది బరువు తగ్గే సలహాలు ఇస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారు సూచిస్తున్న పరిష్కారం ఏంటంటే,
“తమలపాకు”.
అవును ప్రతిరోజు మన డైట్ లో తపలపాకును భాగం చెయ్యడం వలన బరువు తగ్గవచ్చునట. తమలపాకు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మన శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ” లేత మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న తమలపాకులో 5-6 మిరియాల గింజలు వేసి, తమలపాకును మడిచి తినాలని, అలా ఒక నెలరోజులు చేస్తే చాల వరకు బరువు తగ్గిపోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ” ఇలా ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వలన, మిరియాలలో ఉండే ప్యాతో న్యూట్రిఎంట్స్, పెప్పేరిన్ కొవ్వుతో రసాయనిక చర్య జరిగి కొవ్వు విచ్చిన్నం జరుగుతుందని చెబుతున్నారు.
అంతే కాకుండా, తమలపాకు కడుపు ఉబ్బరం వ్యాధిని, గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాలను కూడా నిరోదిస్తుందని సలహా ఇస్తున్నారు.
0 comments:
Post a Comment