*సూర్యోపాసన*
మన కంటికి కనిపించే దైవం సూర్యుడు. సూర్యుడు వెలుగులేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. పంచాంగ సిద్ధాంత కర్తలు *రథసప్తమిని* 'సూర్యజయంతి' అన్నారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆరాధించే పర్వదినం *రథసప్తమి*. మాఘమాస శుద్ధ సప్తమే రథసప్తమి. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ ప్రారంభ సూచికయే రథసప్తమి. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు సత్రాజిత్తుకు శమంతకణిని ప్రసాదించాడు. రథసప్తమి నాటికి సూర్యకిరణాలు నిలబడి భూమికి వెచ్చదనాన్ని పెంచుతాయి.
శివరాత్రి నాటికి శివశివా అంటూ చలి పారిపోతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అన్నది వేద ప్రమాణం. రథసప్తమి రోజున సూర్యుడిని అర్చించి పూజిస్తే పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు.
ఇతర దేవతలకు నమస్కరించేటప్పుడు, వారిని పూజించేటప్పుడు మనం కూర్చుని ఉంటాం. కానీ సూర్యుని పూజించేటప్పుడు అలా కాకుండా సూర్య విగ్రహానికి అభిముఖంగా నిలబడి పూజించాలి. కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే సర్వప్రాణులను సంహరిస్తుంది.
కాలధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేదు. సూర్యగమనమే కాల వేగానికి ప్రమాణం. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కానీ కాలానికి ప్రమాణమైన సూర్యుడు మన చర్మచక్షువులకు కనిపిస్తాడు.
అందుకే ఆయన ప్రత్యక్షదైవం. సూర్యునివలెనే ఈ సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటంది. సంవత్సరానికి వచ్చే 24 సప్తముల్లోనూ రథసప్తమి ఖగోళరీత్యా కూడా ఎంతో మహత్తును, విశేషతను కల్గి ఉంది.
ఖగోళంలో మాఘశుద్ధ సప్తమి సూర్యోదయ కాలంలో నక్షత్రాల కూర్పు రథాకారంలో దర్శనమిస్తుంది. రథాకారంలో నక్షత్రాలున్న రోజు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమి నాడు కూడా మకర సంక్రాంతి రోజున ఏ విధంగా పితృదేవతల నర్చించి తర్పణాలు వదులుతామో ఆ విధంగానే ఈ రోజున పితృదేవతల ఆశీస్సులు పొందాలి. సూర్యకిరణాల్లోని 'ప్రాణశక్తి'ని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షజాతుల్లో జిల్లేడు, రేగు చెట్లు అతి ముఖ్యమైనవి.
అందుకే ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేస్తే శరీరంపైనా, ఆరోగ్యంపైనా ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కనీసం ఏడాదికొకసారైనా వాటిని స్పృశిస్తూ స్నానం చేస్తే వీటి స్పర్శ ప్రభావం ఆ సంవత్సరమంతా మనపై ఉంటుందని భావించి ఈ ఆకులతో శరీర స్నానం చేయాలని పెద్దలు నిర్దేశించారు. తద్వారా మానసిక ప్రశాంతత, దృఢత్వం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పేర్కొనడం విశేషం. వ్రత చూడామణిలో రథసప్తమినాడు చేయాల్సిన స్నానవ్రతాన్ని గురించి వివరణ ఉంది.
ఈ మాఘ స్నానాన్ని ఆచరించడంవలన సకల రోగాలు, ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని చెప్పబడుతుంది. ఈ వ్రత ఫలంగా శారీరక, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది. మహాభారతంలో భవిషోత్తర పురాణంలో రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన రాజుల కథలు ఉన్నాయి. సూర్యోపాసన చేసి, సూర్య శతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తిడయ్యాడు.
అగస్త్య మహర్షిచేత ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది దాన్ని పారాయణం చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించాడు. ఈ రోజు నీటిలో మగవారైతే జిల్లేడు ఆకులను వేసుకుని, ఆడవారైతే చిక్కుడు ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయాలని శాస్తవ్రచనం. రథసప్తమి సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అరసవల్లి, కోణార్క సూర్య దేవాలయాలు సుప్రసిద్ధమైనవి.
ఏడుకొండల స్వామి తిరుమల వేంకటేశ్వరుడు రథసప్తమినాడు ఒకే రోజున ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేస్తాడు. సూర్యుని ఉపాసించినవారికి అటు ధనసంపత్తి ఇటు ఆధ్యాత్మిక సంపత్తి కలుగుతాయని పుఠాణాలు చెబుతున్నాయ. సూర్యోపాసన వల్ల అనేక రోగాలు దూరం అవడమే కాదు శరీరానికి కావల్సిన ఎన్నో విటమిన్లు లభ్యమవుతాయ
0 comments:
Post a Comment