శ్రీకూర్మ జయంతి
క్షీరసాగరమథనం జరుగుతున్నప్పుడు పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవటంతో సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపింపజేసే పరిమాణంతో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఏటా జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున ఈ కూర్మజయంతిని నిర్వహిస్తారు.
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మనాథుడు వెలిశాడు. అస్సాంలోని గౌహతిలోనూ కూర్మనాథాలయం ఉంది.
.
ఈ కూర్మావతార కథే శ్రీకూర్మజయంతిగా ప్రసిద్ధికెక్కింది . శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది.
.
ఈ కూర్మావతార కథే శ్రీకూర్మజయంతిగా ప్రసిద్ధికెక్కింది . శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది.
ఆ కూర్మానికి వెన్నులో మేష, వృషభ రాశులు; తలలో మిథున, కర్కాటకాలు; ఆగ్నేయంలో సింహరాశి; దక్షిణ ఉదర భాగంలో కన్య, తులలు; నైరుతిలో వృశ్చికం; తోకపై ధనుస్సు; వాయవ్యాన మకరం; ఎడమ వైపు కుంభం; ఈశాన్యంలో మీనరాశి ఆక్రమించుకొని ఉంటాయంటారు. దాన్నే కాలానికి ప్రతీకగా చెబుతారు.
జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదలిస్తుంది. సంకల్పరహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది.
అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాలనుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపు చేసికొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్ళగలిగే చిత్తవృత్తికి కూర్మం ప్రతీక.
అనంతమైన పొడవు వెడల్పులు దేహం అనాదిగా అనంతంగా ఉండే వస్తువుకే ఉంటాయి తప్ప- జనన నాశనాలు కలిగిన వాటికి సంభవించదు.
అనంతమైన దేహంతో జలమంతా నిండి క్రీడిస్తున్నట్లు సర్వాధిష్ఠాన, చైతన్యాత్మ స్వరూప నారాయణుడు జీవకోటి అంతటా నిండి ఉండి క్రీడిస్తున్నాడు. కనుక కూర్మం సర్వాధిష్ఠాన భగవత్ స్వరూపం.
*శ్రీకూర్మజయంతినాడుశ్రీమహావిష్ ణువుని భక్తితో సేవించిన వాళ్లు తప్పకుండా సకల ఐశ్వర్యాలు పొంది సుఖశాంతులతో వర్థిల్లుతారు.
0 comments:
Post a Comment