Pages

Top 10 prominent Sri Rama temples across India


seetha ramula thalambralu - visishtatha


శ్రీ సీతారామ కల్యాణ సమయంలో ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకునే ఘట్టాన్ని బహు-చమత్కార భరితంగా వర్ణించిన  శ్రీ రామకర్ణామృతం లోని  ఈ క్రింది సంస్కృత శ్లోకాన్ని మన తెలుగువారు చాలా మంది పెండ్లి శుభలేఖపై  తెలుగు లిపిలో  ముద్రింప చేసి తద్వారా తమ ఇంటి వధూవరులకు ఆ పురాణ దంపతుల మంగళాశాసనం పొందడం ఒక ఆచారంగా వస్తున్న విషయం మనందరికీ తెలిసినదే.

భక్తిరస ప్రబోధకాలైన మూడు (రామ, శివ, కృష్ణ) కర్ణామృత కావ్యాలలో, శ్రీశివ కర్ణామృతం-భరద్వాజ ముని,  శ్రీకృష్ణ కర్ణామృతం-లీలాశుకులు రచించినట్లు నిర్ధారణ గా తెలిసినప్పటికీ, శ్రీరామకర్ణామృతం ఎవరు రచన చేసేరన్న విషయంలో స్పస్టమైన ఆధారం లేదు.. శ్రీరామకర్ణామృతం శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచితమని చేకూరి సిద్ధయ్య కవి చెప్పినారు. కానీ శ్రీ శంకరాచార్య చరిత్రను రచించిన పండితులెవ్వరూ శ్రీరామకర్ణామృతం ఆది శంకర విరచిత మని పేర్కొనలేదు. ఈ శ్రీరామకర్ణామృత కావ్యం ఆది శంకరుల రచన కాకపోయినప్పటికీ, వారి తర్వాతి పీఠాధిపతులు రచించి వుండవచ్చని మరికొందరి అభిప్రాయం.

శ్రీ రామ భక్తి రసాన్ని దాదాపు 400 శ్లోకాలలో అత్యంత మధురంగా వర్ణింపబడ్డ ఈ కావ్య రచయిత ఎవరైనప్పటికీ, ఆయన మహాతపస్వి అనడానికి ఈ క్రింది శ్లోకం ఒక్కటి చాలు..  ఈ శ్లోకం కోటాన కోట్ల పెండ్లిండ్లు చేయించినది, చేయించుచున్నది, చేయించబోతున్నది.. ఇంతటి శక్తిని ఈ శ్లోకంలో ధారపోసినది నిశ్చయముగా మహాతపశ్శక్తి సంపన్నుడైన మహర్షి అనడం లో సందేహం లేదు.  ఈ మహిమాన్విత శ్లోకం నిత్యం పారాయణ చేయదగినది..

 ౹౹శ్లో.౹౹(1.82)

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితా
 న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయి తాః౹
 స్రస్తాః శ్యామల కాయ కాంతికలితాః యా ఇంద్ర నీలాయితా
 ముక్తా స్తా శ్శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః౹౹


తా... పెళ్ళి కూతురుగా సీతమ్మ తల్లి, శ్రీరాముడి తల మీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే) ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాముని శిరస్సుపై పోసినపుడు (ఆయన తలపై తెల్లని పట్టు వస్త్రం తో అలంకరింపబడిన పెళ్ళి-తలపాగా మీద పడి) అవి తెల్లని మల్లెపూల వలే  ఒప్పాయట (కుంద ప్రసూనాయితాః)! ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా (ఇంద్ర నీలాయతా) భాసించాయట. అలాంటి శ్రీరామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు (శ్రీ రామ వైవాహికాః) అందరికీ శుభం కలుగ జేయుగాక (శుభదాః భవంతు భవతామ్‌)!
 

Raama rasam (paanakam) visishtatha

 రామ రసం ప్రాముఖ్యత


దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

సీత రాముల ప్రవరలు

శ్రీరామ నవమి అంటే మన తెలుగు వారు అందరికి గుర్తు వచ్చేది సీతారాముల కళ్యాణం.  ఈ కళ్యాణం లో వేద పండితులు వధువు, వరుడు యొక్క వంశ గోత్రాలను చెపుతారు దానినే మనం ప్రవరలు అని అంటారు.


శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.


శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.



సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
 ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం..


ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది

Astronomical secrets in Vishnu Puraanam

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు


విష్ణుపురాణం సూర్య మండలం గురించి కొంత వివరంగా చెబుతుంది. చాలా క్రిప్టిక్ (నిగూఢo) గా ఆ వివరణ వుంటుంది.
సూర్యుడు ఒక ఏడు గుర్రాలు పూన్చిన రధం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని, ఆ రధానికి రెండు ఇరుసులు ఉంటాయని, ఒక ఇరుసు 157 కోట్ల యోజనాల దూరం ఉంటుందని ఆ ఇరుసుకు మనకు సంబంధించిన కాల చక్రం బిగించబడి ఉంటుందని, ఆ చక్రానికి మూడు నాభులు ఉన్నాయని 12 అంచులు ఉన్నాయని, ఆ చక్రానికి 6 కడకమ్మలు ఉన్నాయని చెబుతుంది. సూర్యుడు ఎప్పుడూ మేరు పర్వతానికి దక్షిణం వైపుగానే ఉంటాడని చెబుతుంది.


 
ఒకసారి  దీనిమీద మరింత లోతుగా చర్చిద్దాము.
 
అసలు సూర్యుడు ఏమిటి రధం ఎక్కడం ఏమిటి? నేటి సాంకేతికత పరంగా పురాణం చెబుతోందా? దీని మీద ఋషులు ఎన్నడో వివరణ ఇచ్చారు. మిగిలిన మతాలు, శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపు నుండే మనం మనం నివసిస్తున్న ధరను భూగోళం అని వ్యవహరిస్తున్నాం. భూమి గోళాకారంలో ఉందని వేదం చెబుతోంది. దానికి ఉదాహరణకు ఒక్కసారి వరాహ అవతార విగ్రహాలను పరికించండి. కొన్ని వేల ఏళ్ళ క్రితం నుండి శిల్పశాస్త్రంలో ఈ విషయమై చూపుతారు. వరాహ స్వామీ కోర మీద భూమి ఒక గోళంగా చిత్రిస్తారు. ఇది ఎవడో ఒక్కసారి మేలుకుని నెత్తిమీద ఒక పండుదెబ్బతో తెలిసినది కాదు. మనకు ఎన్నటినుండో తెలిసి ఉన్న పరమ సత్యం. అంతేకాక సప్తద్వీపా వసుంధరా అని సంబోదిస్తాము. సప్త ద్వీపములు ఉన్నాయని సప్త మహా సముద్రాలు  ఉన్నాయని మనకు ఉగ్గుతో నేర్పిన సత్యము.


మనం ఉదాహరణకు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాము అనుకోండి. ఒక ఊరికి దగ్గర పడ్డప్పుడు ఆ ఊరొచ్చింది, ఆ ఊరు వెళ్ళిపోయింది అని అంటాము. వాస్తవానికి ఆ ఊరు ఎక్కడకీ పోదు, రాదు. కేవలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు relative (సంబంధిత) గమనాన్నే చెబుతాము. మనకు తెలుసు శాస్త్రాదారంతో సూర్యుడు అక్కడే ఉంటాడు అని. నక్షత్రాలు అక్కడే ఉంటాయని, కానీ మనకు సమయం లెక్క కట్టడానికి వ్యవహార పరంగా సౌర్య మానం, చంద్ర మానం, సాయణం, నక్షత్రమానం గా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. భూమి తన పైనున్న ఆకాశంలో నక్షత్ర మండలాల పరిధులలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే ప్రదక్షిణం ఒక 23.5 డిగ్రీల కోణంలో చేస్తుంది, అందువలననే మనకు దక్షిణాయానం, ఉత్తరాయణం లో వివిధ రకాలుగా దివారాత్రాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న బొమ్మను చూడండి. ఒక cone (శృంగం) న్ని ఒక కోణంలో కత్తిరించినట్టు అయితే ఒక దీర్ఘవృత్తము (ellipse) వస్తుంది. ఆ కోణం యొక్క కోనను మనం ధ్రువపదం అని చెబుతాము. ఆ ధ్రువపదం మనకు రిఫరెన్స్ అన్నమాట. ఆ ధ్రువ పదానికి ఎప్పుడూ దక్షిణంలోనే సూర్యుడు ఉంటాడు. భూమి కూడా సూర్యునికి దీర్ఘ వృత్త మార్గంలోనే ప్రదక్షిణం చేస్తుంది. అందుకే మన భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా, ఒకసారి అత్యంత దూరంగా ప్రయాణం చేస్తుంది.

పైన ఉన్న నక్షత్ర మండలం స్థిరంగా ఉంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆయా నక్షత్ర మండల పరిధులలో తిరుగుతుంది. ఆ మండలాన్ని మన ఋషులు 12 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం భూమిని స్థిరంగా అనుకుని మిగిలినవన్నీ relative గా లెక్క కట్టినట్టు అయితే సూర్యుడు తిరుగుతాడు, పగలు ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. లెక్క కట్టడానికి మనకు సులువు, అందుకే మొట్ట మొదటి relativity గురించి ప్రస్తావన మన జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది.


ఇప్పుడు నిన్న 157 కోట్ల యోజనాలు సూర్యునికి భూమికి ఉన్న దూరం అని చెప్పుకున్నాము. అదే మనం గణించే కాల చక్రానికి ఆధారం. మూడు నాభులు పగలు, సాయం, నిశ(రాత్రి) కి సంకేతాలు, 6 కడకమ్మలు ఆరు ఋతువులకు నిగూఢనిరూపణ అయితే 12 అంచులు పన్నెండు నెలలకు సంకేతార్ధాలు. ఇదే కాక సూర్యుని రధం 36 లక్షల యోజనాల పొడవు అని చెబుతుంది.  అలాగే సూర్యుని ఒక ఇరుసుకు నాలుగు గుర్రాలు, మరొక దానికి 3 గుర్రాలు కట్టబద్దాయని, రెండవ ఇరుసు 145 కోట్ల యోజనాలు అని చెబుతుంది. ఒక ellipse కు రెండు focal పాయింట్స్ ఉంటాయి. అవి రెండు ఒకే విలువ వుంటే అది ఒక సర్కిల్ అవుతుంది. ఇక్కడ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు   దూరం. దానికి focal పాయింట్ గణిస్తే sqrt(a**2 – b**2) ఫార్ములా ప్రకారం అది సరిగ్గా 36 మిలియన్ కిలోమీటర్లు, సరిగ్గా వేదం చెప్పిన సూర్యుని రధం పొడవుకు సమానంగా

.
సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని  సూర్యుని చుట్టుకొలత 1391000kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108 అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108. చంద్రుని చుట్టుకొలత తెలియకుండా ఈ calculations చేసారు అని బుర్రలో గుజ్జున్నవాడెవ్వడూ వాదించడు.


కాబట్టి relative స్పీడ్ ఆధారంగా మనకు సూర్యుడు సప్తాశ్వరాధ -ఏడు గుర్రాల (VIBGYOR – ఏడు రంగుల )  రధం మీద మేరువుకు ప్రదక్షిణగా తిరుగుతాడు అని చెబుతారు. చూసే దృష్టి మార్చి చూస్తె మనకు వారు చెప్పిన పరమ సత్యాలు బోధపడతాయి. నేడు మనం కాంతి సంవత్సరం పరంగా గణిస్తున్నాము , మనం మాట్లాడే అంకెలు మారతాయి కానీ ఆ అంకెల ఆవల ఉన్న సత్యం, లోకం మారదుగా.
 
!! ఓం  నమో వేంకటేశాయ !!
 !! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

yama krutha siva keshava sthotram

యమకృత శివకేశవ స్తుతి


 అనారోగ్యంతో.. బాధపడుతున్నవారు..
ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు..
నిత్యం ఈ స్తోత్రం చదవాలి.



మన జీవితం లొ ఒక్కసారి అయిన ఈ నామాలు  చదవాలి.

కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి..
ఈ నామాలనూ ప్రతిరోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు..
యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ  నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు..

.
గోవింద మాధవ ముకుంద హరే మురారే ,శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే !
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గంగాధరాంధకరిపో హర నీలకంఠ , వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !
భూతేశ ఖండపరశో మృడ చండికేశ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే ,గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !
నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ  శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే , భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే  మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శూలిన్ గిరీశ రజనీశకళావతంస, కంసప్రణాశన సనాతన కేశినాశ!
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

స్థానో త్రిలోచన  పినాకధర స్మరారే , కృష్ణానిరుద్ద  కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!


ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు
‌‌‌ఓం శివ నారాయణాయ నమః

aapaduddharaka hanumat sthotram

ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రమ్

వామే కరే వైరిభిదాం వహంతం
 శైలం పరే శృంఖలహారిటంకమ్,
దధానమచ్ఛచ్ఛవియజ్ఞ సూత్రం
 భజే జ్వలత్కుండల మాంజనేయమ్.

సంవీతకౌపీనముదంచితాంగుళిం
 సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్,
సకుండలం లంబిశిఖాసమావృతం
 తమంజనేయం శరణం ప్రపద్యే.

ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమతే
 అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనమః

సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ,
తాపత్రితయసంహారిన్ ! ఆంజనేయ ! నమోస్తుతే.

ఆధివ్యాదిమహామారి గ్రహపీడా పహారిణే,
ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః

సంసారసాగరావర్త కర్తవ్యభ్రాంతచేతసామ్,
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే.

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజ సే,
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీ రుద్రమూర్తయే

రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయాపహమ్,
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్.

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే,
జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే.

గజసింహమహావ్యాఘ్రచోర భీషణకాననే,
యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్.
సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః,
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్,
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః

జప్త్వాస్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః,
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జ్జయమ్.

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః,
సర్వాపద్బ్యః విముచ్యతే నాత్ర కార్యా విచారణా

మంత్రః
 మర్కటేశ మహోత్సాహ ! సర్వశోకనివారక !
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో ! హరే !


ఇతి శ్రీ విభీషణకృతం సర్వాపదుద్దారక శ్రీ హనూమత స్తోత్రమ్.

vilambi nama samvatsara Ugadi subhakankshalu



భవతాం భవత్కుటుంబసదస్యానాం చ స్వస్తిశ్రీ విలంబి నామ నవవర్షస్య శుభకామనాః.
ఏతస్మిన్ శుభవత్సరే భవతాం అభీష్టాని అవిలంబేన సిద్ధ్యన్తు ఇతి ఈశ్వరం ప్రతి మమ ప్రార్థనా..


ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు సర్వసమృద్ధిగా అందరికి కలిగి ఆనందంగా ఉండాలని పరమాత్ముణ్ణి ప్రార్థిస్తూ విలంబి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .
 

Urinal infections ( in women) - some Ayurvedic medicines n home remedies part 2

 ఆడవారిలో ఈ infection సమస్యలు

ఇక స్త్రీ లలో అయుతే పైన చెప్పుకున్న అన్ని infection తో పాటు స్త్రీలకు తెల్లబట్ట అనే ఇంకో infection కూడా వాళ్ళలో వస్తూ వుంటుంది . దీనిని లుకేరీయా అని పిలుస్తూ వుంటారు . ఈస్ట్ అనే బాక్టీరియా వల్ల ఈ infection వస్తూవుంటుంది . ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం , ఎక్కువగా వేడి చేసే నాన్ వెజ్ తినడం ,జననేంద్రియ ములు శుభ్రము గా ఉంచుకోక పోవడం లాంటి కారణాల వల్ల ఈ తెల్ల బట్ట అనేది వస్తుంది , ఈ infecti on వల్ల స్త్రీలలో కొంచం నీరసం కూడా వస్తుంది . అందుకే వచ్చిన దానికి మందు వాడటం ,అస్సలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం .

రోగ నిరోధక శక్తి తక్కువగా వుంటే కూడా ఈ infecti on తొందరగా వస్తుంది .C విటమిన్ తక్కువ అయుతే కూడా ,ఈ రోగనిరోధక శక్తి తక్కువ అయు పోతుంది .కాబట్టి విటమిన్ C వున్నవి తీసుకోవాలి ఉసిరి ,నిమ్మ లాంటివి ఎక్కువ గా తీసుకోవాలి .లేదా మనకు అందుబాటు లో వుండే టమాటో రసం రోజూ ఒక గ్లాస్ చొప్పున కొద్ది రోజులు తీసుకొంటే మంచిది .దీనిలో ని విటమిన్ c వల్ల ఇది యా౦టీఆక్సిడెంట్ గా పనిచేసి విషాలు వ్యాపించకుండా ,క్యాన్సర్ రాకుండా కాపాడును . కొంతమందికి ఈ infection వల్ల పు౦ డు అవుతూ వుంటుంది ,ఆ పుండు ని కూడా ఈ c విటమిన్ నయం చేస్తుంది .అందుకే ఇంగ్లీష్ వైద్యములోయూరినల్ infections కి ముందుగా c విటమిన్ వుండే సిరప్ తప్పనిసరిగా వాడ,మమి ఇస్తారు ,ఇక ఆయుర్వేదములో అర చంచా (halftespoon ) దాల్చిన చెక్క పొడి అంటే (CINNAMOM)+ 2 TEA SPOONS పులుపు లేని పెరుగు తో బాగా కలిపి ఉదయం పూట REGULAR గా,కొద్దిరోజులు తీసుకొంటే తెల్ల బట్ట కు కారణం అయ్యే ఈస్ట్ క్రిములు చనిపోతాయి .ఇంగ్లీష్ వైద్యములో METERANJOLE అనే మందు ఇస్తారు ,ఇంకా AZEE25౦ ఇస్తూవుంటారు –ఆడ ,మగ ఇద్దరికీ ఇదే మందు ఇస్తూ వుంటారు .
కొంతమంది లో నేను తెలుసుకున్న అనుభవం ఏమిటంటే ,ఎప్పుడైనా వైద్యులు ముందుగ infection అనగానే లేక ఆ లక్షణాలు కనపడగానే కొన్ని యంటిబయాటిక్ మందులు ఇస్తారు .కొంతకాలం వాడి రమ్మని ,మల్లీ టెస్ట్ లు వ్రాస్తూవుంటారు. ఓకే ఇదంతా బాగానే వుంది కానీ అప్పుడు వెళ్లి టెస్ట్ లు చేయంచు కుంటే వచ్చే result అంత correct గా రాలేదు అని ,యాంటీబయాటిక్ మందులు ఆపేసి రక్త పరీక్షలు చేయంచు కోవడం కొద్దిమంది లో చూశా ను .అప్పుడు correct results వచ్చాయి.

ఇక మూత్రము పాస్ చేస్తున్నప్పుడు కొంతమందికి మంట వస్తుంటుంది దానిని నివారించడానికి ,ధనీయాలపొడి 1 spoon నీటిలో వేసి కషాయం కాచి అందులో కొంచం పటికబెల్లం లేదా తాటికలకండ వేసి కూడా తగ్గవచ్చు .మంట తగ్గిపోతుంది .అలానే ముల్లంగి దుంపలు ఆకులతో కలిపి వండి తింటే కూడా చాలా మూత్ర రోగాలకు మంచిది ,ముఖ్యముగా మూత్రములో ఎక్కడా రాళ్ళు తయారవ కుండా కాపాడుతుంది .అరటి దవ్వ లేక అరటి ఊచ తెచ్చి దానిని రోజూ వండుకొని తినాలి ,దాని రసం త్రాగుతూ వుండాలి .ముల్లంగి రసం రోజూ ఒక గ్లాస్ త్రాగినా ,లేక బార్లీ కషాయం పెట్టుకొని రోజూ ఎక్కువ సార్లు త్రాగుతూ వున్న రాళ్ళు కరిగి బైటకు పోతాయి . ,బార్లీ కషాయం మూత్రములో ని అన్ని రకాల infections ని తగ్గిస్తుంది .కాళ్ళ వాపులు కూడా తగ్గి నీరు బైటకు వెళ్లి పోతుంది .


ఇక మహిళల్లో తెల్ల బట్ట కూడా శ రీరములో కలిగే అతి వేడి వల్ల వస్తూవుంటుంది . ఒక కలబంద (aalovera ) మట్ట తీసుకొని దాని ని మధ్య లో కి పొడుగ్గా చీల్చాలి ,కాసిని మెంతులు తీసుకొని ఆ చీల్చిన బద్దలలో పెట్టి దారం కట్టి రాత్రంతా అలానే వుంచి ఉదయం తీసి ఎలా అయునా సరే ఆ మెంతులు లోపలికి తీసుకోవాలి దానిని paste గ నూరి నీటిలో కలుపుకొని త్రాగవచ్చు .అలా రెండు ,లేక మూడు సార్లు వ్యాధి తీవ్రత ను పట్టి తీసుకోవాలి ,దానివల్ల లోపలి వేడి తగ్గి మూత్రములో మంట ,తెల్లబట్ట ఇతర infections కూడా తగ్గిపోతాయి . అలానే కాస్తంత శుభ్ర మైన ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయాలి .అలానే జననంగాలను కూడా ఎప్పుడు శుభ్రముగా వుంచుకోవాలి .అలాని ఎక్కువpowerful సబ్బులు ,లిక్విడ్ లు ఉపయోగి౦ఛి కడగకూడదు. ఆజననాంగాల లోపల మంచి చేసే బాక్టీరీయా కూడా వుంటుంది .అది powerful వాటి పెట్టి కడిగితే అది కాస్త చచ్చిపోతుంది .అలానే మలవిసర్జన తరువాత క్రింది నుంచీ పైకి కాకుండా ,పైనుంచి క్రిందికి కడుక్కోవాలి .దానివల్ల ఏదైనా బాక్టీరియా లోపలికి వెళ్ళకుండా బైటకు వెళ్ళిపోతుంది .

రామబాణం లేదా నూరువరహాల గుత్తి పువ్వు ,అది ఏ రంగు పువ్వు అయునా పర్వాలేదు .దానిని తీసుకొని కషాయం కాచి వడపోసి త్రాగాలి అలా రోజు ఒక పువ్వు అంటే రోజూ ఒక గుత్తి తీసుకొని త్రాగితే మహిళల్లో తెల్లబట్ట నయం అయుపోతుం ది .ఇంకా రోజూ అర చంచా నల్లజీలకర్ర పొడి తీసుకొని దానిని వేయుంచి లోపలికి తీసుకోవాలి .దానితో పాటు త్రిఫల చూర్ణం, రాత్రి పూట త్రాగాలి ఇలా చేస్తూ వుంటే గ ర్భా సేయ సమస్యలు ,లోపలి గడ్డలు పోతాయి .ఇక పొత్తికడుపు పై బొడ్డు చుట్టూ ఆముదం ను పై పూత గా వ్రాయాలి ,కాలి బొటన వ్రేలు కి కూడా ఆముదం వ్రాసుకోవాలి ఇలా చేయటం వల్ల మెన్సెస్ లో నొప్పి వుండదు ,ఒకవేళ వున్నా పోతుంది .ఇంకా కొన్ని తరువాయు భాగములో చూద్దాం. ఇక ఆయుర్వేదములో అయుతే అశోకారి స్టా , కుమారిఆసవం మందులు కూడా స్త్రీల గర్భాశయ సమస్యలుకు బాగా పనిచేస్తాయి .

Some home remedies for Dental problems


*పంటి నొప్పి నుంచి క్షణాల్లో రిలీఫ్!!



నేటి సమాజంలో మనం తినే చిరుతిళ్లకు పండ్లు పాడై పోవడమో లేక పండ్లకు సంబంధించిన వ్యాధులు రావడమో సర్వ సాధారణంగా మారింది. నూటిలో తొంబై శాతం మంది పంటి నొప్పి తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తీపి పదార్థాలు తినడం సరిగా బ్రష్ చేసుకోక పోవడం వంటివి. పంటి నొప్పిని తట్టుకోలేక ఏమి తినలేక తీవ్ర యిబ్బందులు ఎదురౌతూ ఓర్చుకోలేనంత బాధలు పడుతున్న పరిస్థితి. మనం తినే తీపి పదార్థములు పిండి పదార్థాలతో పంటిపై గారలు ఏర్పడతాయి. వాటిలో సూక్ష్మ జీవులు చేరతాయి. వీటి వలన ఏనుగు దంతము వలె గట్టిదైన పంటి పైనున్న ఎనామిల్ పాడవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం పిప్పళ్ల వంటివి ఏర్పడి ఏమి తినకుండా నొప్పి కలగడం జరుగుతుంది. అంతేకాక పంటి నరాలకు దంతమూలాలకు చేరి పళ్లను పాడుచేస్తాయి.


మరి ఈ పంటి నొప్పి వెంటనే తగ్గడానికి తీసుకోవల్సివ జాగ్రత్తలు, చిట్కాలు ఏంటో చూద్దాం.


 వెల్లుల్లి, లవంగం ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే కొద్ది సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ వలన ఎప్పటి నుండో ఉన్న నొప్పి కూడా తగ్గి పోతుంది.

పంటి నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఒక నాలుగు, ఐదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది. యిది మంచి చిట్కా.

  కాగితపు టవల్ పైన విక్స్ లేదా అమృతాంజన్ ను రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంతంలో చర్మం పై కాసేపు ఉంచినట్లైతే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

  దంత శుద్దికి, పంటి నొప్పికి గోధుమ గడ్డి రసం ను ఉపయోగిస్తారు. యిది చక్కని ఆయుర్వేదంలా పనిచేసి దంత క్షయాన్ని నొప్పిని నివారిస్తుంది.
 

 మరో మంచి టెక్నిక్ ఏంటంటే నొప్పి ఉన్న చోట మంచు ముక్కను పడితే నొప్పి తగ్గిపోతుంది.
 

 పంటి నొప్పి ఉన్న దంత దవడ భాగంలో ఐస్ క్యూబ్ పెడితే నొప్పి తగ్గిపోతుంది.
 

 చిగుళ్ల వాపు మరియు నొప్పి తగ్గుటకు మిరియాల పొడిని దంత మంజన్ లా వాడి పళ్లపై రుద్దితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
 

 చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. యిది చాలా మంచి అలవాటు అంటున్నారు వైద్యులు. ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే పంటి నొప్పి తగ్గిపోతుంది. నమలడం యిబ్బంది అనుకుంటే అప్పుడే కోసిన ఉల్లిముక్కని నొప్పి దగ్గర పెడితే నొప్పి మాయం అవుతుంది.
 

మూడు నాలుగు చుక్కల విస్కీని కాటన్ లో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే నొప్పి మాయం అవుతుంది.
 

 ఇక పొద్దున రాత్రిపూట క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పంటి సమస్యలతో బాధ పడేవారు రెండు పూటలా బ్రష్ చేయాలి.

  ఈ చిన్న చిట్కాలను పాటించి పంటి నొప్పిని తగ్గించుకోండి. ఏదైనా తిన్నపుడు నోటిని పరిశుభ్రం చేసుకోవాలి .

Where is the Justice for us normal people here??

కేసు మీరు తప్పని సరి గా చదవాలి ,ఇటువంటి కేసుల్లో ధర్మం ,న్యాయం చెప్పటానికి లా చదవక్కరలేదు అనుకుంట ,మన మనస్సుల్లో ధర్మం ,న్యాయం ఎలా చేయచ్చో వెంటనే స్పురిస్తుంది .కాని బోడి ధర్మం చెప్పటానికి పదిహేను సంవత్సరాలు వాళ్ళకు పట్టింది . గ్రామాలలో రచ్చబండ పై కూర్చొని న్యాయం చెప్పేవారు అయుతే ఏమంటారు . వాళ్ళ పరీక్ష పత్రాలు ,వాళ్ళ voice testtapes తెప్పించి ,లేదా మళ్ళీ మా చేత ఏదైనా script చదివించి అప్పుడు తీర్పు చెబుతారు ,కాని court లో judge ఏమి అడగలేదు , tapes తీసుకోనిరమ్మని చెప్పలేదు ,కనీసం ఫైనల్ లిస్టు లో వున్న మమ్మలిని ఎవ్వరిని పిలువలేదు .కనీసం కేసు వాదిస్తూవున్న లాయరు కు విషయం బోధ పడలేదు ,పబ్లిక్ ప్రాసే క్యూ ర్ కి కూడా ఆలోచన లేదు ,judge కి అస్సలు లేదు .ఇదండీ మన న్యాయ వ్యవస్థ .దీనికోసం 5 సంవత్సరాలు లా చదవాలా? చదువుకున్న వాళ్ళ కే ఇలా వుంటే ,చదు వుకో ని వారి గతి ఏమిటి ?

మనం ఏమైనా court గురించి మాట్లాడితే contempt of the court మనలని లోపల వేద్దామని ప్లాన్ చేస్తారు .కాబట్టి న్యాయం మీరే చెప్పాలి .


అయ్యా

నా పేరు మరి౦గంటి మురళి కృష్ణ s/ మరింగంటి భట్టరా చార్యులు స్వాతంత్ర్య సమర యోధులు .నేను ఆకాశవాణి ,హైదరాబాద్ ,కొత్తగూడెం కేంద్రాలలో రమారమి ఇరువై స౦వత్సరాలు క్యాజువల్ అనౌన్సర్ గా పని చేసాను 1998 సంవత్సరం లో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రముగా భాసిల్లేది . సంత్సరములో నే కొన్ని ఇతర ఆకాశవాణి కేంద్రాలలో ఖాళీగా వున్న అనౌన్సుర్గ్రేడ్4 పోస్టులకు మొత్తం 6 ఖాళీలకు ప్రకటన ఇచ్చారు .అందులో 4 oc 1 sc 1 obc . సుమారుగా 1000 మంది అభ్యర్దులు అప్లై చేసారు .హైదరాబాద్ లో 2 కేంద్రాలలో వ్రాత రీ క్ష లు నిర్వ హించారు .ఇక వ్రాత పరీక్ష లో కొన్ని అనువాదములు వాతావరణం విశేషాలు ,ధరలు ,కొన్ని సాహిత్య సాంస్కృతిక ,చారత్రిక ,వ్యాసాలు వుంటాయు. ఇలా writtentest పెట్టి ఇందులో వడపోసి గాత్ర పరీక్ష కు అనుమతి ఇస్తారు .

    ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడే కొంతమంది ఎవరో ఆంగ్ల పత్రికా లో ‘’ ANNOUNCER POSTS FOR SALE అనే న్యూస్ వచ్చింది .అది మామూలే అనూకొని యధావిధిగాటెస్ట్ ని CONTENUE చేస్తూ అలాWRITTENTEST LO PASS అయున కొద్దిమంది ని voice test కి అనుమతించారు . ఇక దానిలో కష్టమైన పదాలు ఉంటాయి example ఘటోత్కచుడు వుచ్చైస్రవం బ్ర్హాహమణ్యం ,శ్రీ కృష్ణార్జునులు ,ఇలా ఉంటాయి .ఇంకా తెలుగు సాహిత్యములో కవుల వర్ణనలు ,ఇంకా కొన్ని హిందీ ,ఆంగ్ల బ్దాలు కూడా ఇస్తారు . చదివే టప్పుడు అభ్యుర్దులందరి voice ను స్టూడియో లో రికార్డు చేస్తారు .మంచి voice ఉన్నవారిని ,స్పస్టముగా ,చక్కగా చదివే వారిని యంపిక చేసి interview కి పిలుస్తారు , interview బోర్డు లో language expert , రంగస్తలకళాకారుడు ,నాటకరచయుత ,లేదా కవి లేదా professor ఇలా మరియు stationdirector వుంటారు .

ఇలా interview పూర్తి అయు 4 oc 1 sc 1 obc పోస్టులకు selection పూర్తి చేసి result ఫైనల్ చేసి టైపు చేసి ,బోర్డు సభ్యులు అందరు సంతకాలు చేసి సీల్డ్ కవర్ లో పెట్టి లాక్ చేసారు . మరుసటి రెండు రోజులు శని ,ఆది వారాలు సెలవులు ,ఇక రోజుల్లో ఢిల్లీ పంపటానికి కుదరలేదు అందుకే బీరువా లో భద్ర పరచి సీల్ వేసి వెళ్లి పోయారు .

monday యధావిధిగా ఆఫీస్ ఓపెన్ చేసారు .ఓపెన్ చేయగానే,అప్పటి పత్రిక లోని న్యూస్ ఆధారముగా సిబిఐ వాళ్ళు ఎటాక్ చేసి సీల్ చించి result sheets పట్టుకొని వెళ్లి పోయారు . కాలం గడచి పోతుంది ,మేము అక్కడే క్యాజువల్ అన్నౌన్సుర్స్ గా పని చేస్తూనే ఉన్నాము లోపు ఢిల్లీ నుంచి directors ,officials ఎవరో ఒకరు వస్తూ వుండే వారు .మేము కొంతమంది జమ అయు sir మా రిజల్ట్స్ చెప్పండి ,అంటూ మెమొరాండం ఇస్తూ వుండే వాళ్ళం .వాళ్ళు అవి తీసుకొని చెత్త బుట్టల్లో వేసి వెళ్తూ వుండే వారు .కొన్ని సంవత్సారాల తరువాత సిబిఐ వారు వాటిని ఢిల్లీ కి పంపి dipartmentalఎంక్వయిరీ చేసుకోమని పెట్టారు .అలా ఎవరూ పట్టించు కోక మళ్లి కొన్ని సంవత్సరాలు గడచి పోయుంది .మళ్ళి మేము ఢిల్లీ వారికి memorandams  పంపుతూనే ఉన్నాము .అందువల్ల ఢిల్లీ వారు శ్రద్ద తీసుకొని officer ని దాని రీసెర్చ్ కోసం appointment చేసారు .అక్కడనుంచి దానికి పూర్తి దరిద్రమైన షేడ్ కమ్ముకోవడం ప్రారంభమైంది . దాని నిమిత్తం ఒరిస్సా స్టేట్ officer A.K పాడే అనే అధికారి హైదరాబాద్ వచ్చారు . టెస్ట్ లో పాలు పంచుకొన్నఏ అభ్యర్ధిని కూడా ఆయన interview చేయలేదు , ఏదో తూతూ మంత్రం గా వన్ డే లో కానిచ్చి వెళ్ళిపోయారు .మళ్ళి కొన్ని సంవత్సరాలు అలానే గడిచి పోయాయి


.కొంతమంది విసిగి పోయి మహిళా అభ్యర్థి CAT న్యాయస్తానానికి వెళ్ళింది .వాళ్ళు result చెప్పమని అధికారులకు directin ఇచ్చారు .కొన్ని అవక తవకలు జరిగాయని అందుకే exm ని స్క్వాష్ చేస్తున్నాము అని court కి ఇచ్చారు . కొంతకాలానికి ఫైనల్ లిస్టు లో నేను ,ఇంకా కొంతమంది పేర్లు తెల్సినవి .ఎలా అంటే ఢిల్లీ వారు మా పేర్లు బైట పెట్టి మా ఫైనాన్సియల్ గురించి వాకబ్ చేసారు .మాకు లంచాలు ఇచ్చే శక్తి వుందా అని లేదు . కుటుంబాలు అన్ని తిండి లేక అలమటించే బీద బ్రాహ్మణా కుటుంబాలు అని తెలుసుకున్నారు .ఇక మేము లంచాలు ఏమి ఇవ్వగలం? ఇక మేము లిస్టు లో వున్న వాళ్ళం కలిసి హై court కి వెళ్ళాము .singlejudge బెంచ్ వాదన జరిగింది .అప్పటికైనా court వారు ఎవరైతే ఫైనల్ లిస్టు లో వున్నారో వాళ్ళ కి సంభ౦ దించిన అంటే మావి పరీక్ష పేపర్స్ , రికార్డు చేసిన voice టెస్ట్ CD లు ,తరువాత మమ్మల్ని court కి judge పిలుస్తారు అని కూడా ఎదురు చూసాము .

కానీ అవి ఏమి లేకుండానే హై court వారు చాలా స౦వత్సరాలు నానబెట్టి ఒక విషయం చెప్పారు .అది ఏమిటంటే exam విషయములో department ఏమి చేసిన అది మనం ప్రశ్నించే హక్కు లేదు ,సదరు department వారికి అన్ని హక్కులు ఉంటాయి అని court వారు గొప్పగా తీర్పు ఇచ్చారు . ఇక court కి వేళ్ళామనే నెపం తో వున్న casual అనౌన్సర్ కూడా పీకేశారు .ఇక ఎక్కడి వాళ్ళం అక్కడ చెల్లా చెదురు యుపోయము .ఎప్పుడు వస్తుంది రా మీ వుద్యోగం అని అడిగే తల్లితండ్రులు,తమ్ముడు కూడా వెళ్లి పోయారు .కాని నాలో ఎందుకో భాధ మావి CD లు ఎందుకు వినలేదు ,మా పేపర్ లు ఎందుకు పరిశీలించ లేదు .అందరు నా voice బాగుంది అని చెబుతుంటే నాకు జరిగిన అన్యాయమే గుర్తు వస్తూవుంటూ౦ది .ప్రసార్ భారతి లో వున్న 50 వేల మంది లో నాకు కూడా వుద్యోగం ఇస్తే ,సంస్థ కు ఏమిటి భారం అనిపిస్తుంది .పైగా preference will be given for higer qualificati ons అని రోజుల్లో అనే వారు .అది కూడా నాకు వర్తిస్తుంది. అన్నీ వున్న మాకు పొట్ట కొట్టింది ఒకరు Ak పాడే.ఇంకొకరు court .వీళ్ళ court లలో కళ్ళు మూసేసుకున్న త్రాసు పట్టుకున్న బొమ్మ ,వాళ్ళు చెప్పే judge ment కి మరో రూపం అని వాళ్ళే చెప్పుకుంటారు.ఒకప్పుడు గ్రామాలలో చెప్పిన రచ్చబండ తీర్పులే చాలా నయం .

ఒకప్పుడు కూడా మాకు గడచిపోయినకాలం , benfits,నష్ట పోయున promotion ఇవి ఏమి మాకు వద్దు ఫ్రెష్ వుద్యోగం ఇవ్వండి చాలు బ్రతుకుతాం అని కూడా మేము రిక్వెస్ట్ చేసాము .ఫైనల్ result లో ఉన్నవారందరూ 15 సంవత్సరాలు పైగా అనుభవం వున్న వారే రోజుల్లో . అది ఒక ముఖ్య విషయం . ఇక మీరు అడగ వచ్చు ప్రైవేటు రూపం తో యువతులకే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి .మేము అటు తరానికి ఇటు IT ఫీల్డ్ కి మధ్య వాళ్ళం అవటం చేత కూడా అటూ ,ఇటూ ఎటూ కాకుండా పోయాము అనేదే భాధ .రిటైర్మెంట్ కి ఇంకా 8 ఇయర్స్ వుంది కదా ఇప్పటికైనా న్యాయం జరుగదా అనే ఎక్కడో ఒక ఆశ .

ఇక కేసులో బైట పడిన అంశాలు ఏమిటి అంటే station DIRICTOR స్తాయులో ఇగో వల్ల STATON DIRECTOR ని బదనాం చేయాలని వాళ్ళలో వాళ్ళు చేసుకొని మమ్మలిని మద్యలో బలిచేసారు .ఇప్పటికి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తూనే వుంది ఇక మీకు తెలుస్సు బ్రాహ్మణ కుటుంబాల ఆర్ధిక పరిస్తితులు , పై నుంచీ మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ వున్న కాస్తంత దేశ సేవ కి అంకితం చేసేసారు .నేను ఇప్పుడు నాకు ఒక పెద్ద బాద్యత గా మానసిక వికలాంగి సిస్టర్ వుంది అన్ని సేవలు ఆమెకు చేయాల్సి౦ దే. ఆమెకు పని రాదు .అదొక భాధాకరం .

ఇక కేసు లో గుడ్డి న్యాయ స్తానం చూడని అంశాలు ;

ప్రసారభారతి నుంచీ appoint అయి departmental enquiry కి వచ్చిన officer AK పాడే అస్సాం కు చం దిన వారు .వారికి కి తెలుగు రాదు . ఇక పరీక్ష పేపర్స్ లో ఏమి చదివి చూస్తాడు .మావి ఆడియో CD లలో మేము చదివిన

తెలుగు వారికి ఏమి అర్థం అవుతుంది ?

అస్సలు టెస్ట్ మొత్తం పూర్తి కాకుండానే ప్రారంభం లోనే న్యూస్ పేపర్స్ లో jobs for సేల్ అని వచ్చింది .అంటే ఇది కావాలని గిట్టని వాళ్ళు చేసిన ఆరోపణ అని అర్థం అవుతూ వున్నది.

చదువుకున్నవాళ్ళ౦ మేము మాకు న్యాయం జరగలేదు అంటే court లు ఏమి చేసాయి ఎన్నో .సంవత్సరాలు నానబెట్టి నానపెట్టి చివరికి తుస్సుమన్నాయు . ఒక్కరిని కూడా court కి పిలవలేదు . మా voice test tapes judge వినలేదు .మా పేపర్స్ ఏవి కూడా చూడలేదు ,అవును లెండి కళ్ళకు గంత లు కట్టుకున్న న్యాయ దేవత వాళ్ళ సింబల్ కదా .సుమారు 20 సంవత్సరాలు court లో నాన బెట్టి వాళ్ళు చేసిన న్యాయం ఇదేనా సార్ర్ .మేము తప్పు చేయలేదు .మాకు లంచాలు ఇచ్చే శక్తి లేదు .మాలో కొందరికి 10 సం;లు అనుభవం వుందని మమ్ములను ఎంపిక చేసి వుందా వచ్చు .ఎవరైనా తప్పు చేసి వుంటే వాళ్ళ పేపర్స్ మార్క్లు లు voice tapes అన్నీ చూడవచ్చు కదా.ఫైనల్ లో ఎంపిక అయున మా పరీక్ష లు, మా పేపర్స్ లో ఏమైనా టాంపరింగ్ జరిగిందా?మరి మాకు ఎందుకు వేసారు శిక్షలు ?AK పాడే ,మరియు judge లు మా నలుగురి నిరుద్యోగులకు కి అన్యాయం చేసి ఉసురు పోసుకున్నారు . అని బాధ పడుతున్నాము .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online