Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-9

         అలానే జ్ఞాన శాఖ సాంప్రదాయంలో పెద్దగా విగ్రహారాధన పట్టించు కోరు .నిరంజన నిరాకారం అనే భావనతో భగవత్ శక్తి ని మనో ఫలకం పై నిలుపుకొని జ్యోతి స్వరూపము గా ఆరాధిస్తూ వుంటారు.అయితే శంకరాచార్యులవారుఅదే జ్ఞానముగురించి చెబుతూ భగవంతుడు సనాతనుడు ,ఆయన కదలడు, చలించడు నీ గోడు ఎంత చెప్పుకున్నావింటాడని ,విని స్పందిస్తాడా అనేది సందేహం .నీవు చేసినపూర్వ జన్మ  కర్మాను సారమే ,నీ ఇప్పటి జీవితం ,జన్మ నడుస్తుంది .ఆయనేమీకలగచేసుకోడు ,అందుకే భగవంతుడు అనేక కోట్ల జీవరాసుల జన్మలు దాటించి మనుష్య జన్మ ఇచ్చాడు ,అని తెలుసుకోవటం జ్ఞానం ,ఈ జన్మ లో బవభందాలకు లోబడకుండా ,కోరికలు పెంచుకొంటూ పోవటం, వాటికోసం మళ్ళీ మళ్ళీజన్మలు ఎత్తటం మళ్ళీ మళ్ళీ  జనన మరణ చక్రములో పడి పుట్టటం ,చావడం అలా   కోరుకోకుండా ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ,ఎవరిని ఇబ్బందులకు గురిచేయకుండా  ఆ దేవుని పైననే మనస్సుపెట్టి చివరికి ఆ దైవములోకల్సిపోవటమేమోక్షం అదే నిజమైన జ్ఞానం అని చెప్పారు.
   
    అంతే కాదు సంసారం ,కుటుంబం బంధాలు వ్యామోహములో పడి మాయా వ్యామోహములో చిక్కొని జన్మలు కోరి తెచ్చుకోవద్దు ,జన్మం దుఃఖం,జరా దుఃఖం జాయా దుఖ్ఖంపునపునః అని హెచ్చరించారు   .అలా చెప్పి గూడా ఆ దైవాన్ని భక్తితో స్తోత్రం లు పాడి .ఏమీ పట్టించుకోడు అని చెప్పిన ఆయునే ,  జ్ఞాన ము లో భక్తి ని రంగరించి  ఆయన మనకు ఎన్నోదైవ స్తోత్రాలు ,అందరి దేవుళ్ళపై అలా అనే కంటే దేవుని అన్ని రూపాల పై  మధురమైన స్తోత్రాలు మనకు ఎన్నో అందించారు .చిట్టచివరకు నరసింహ స్వామివారిని ప్రార్ధించి సగం కాలిపొయిన కాళ్ళు చేతులు మళ్ళీ తెప్పించుకున్నారు.


        ఇక్కడ రామానుజలవారు కామి కాని వాడు మోక్షకామి కాలేడు .అని చెబుతూ సంసారం ,బంధుత్త్వాలు ,ఆ ప్రేమలు ఎంత బాగుంటాయో అని లొట్టలు వేస్తూ కూర్చొంటే ఆ కోరిక పైనే మనస్సు వుంటే ఇంకా మోక్షం ఎలా వస్తుంది,ఆ భగవంతుడిపై ద్యాస ఎలా కలుగుతుంది .అయునా భగవంతుడు మనకు జన్మలు ఇచ్చాడు ఎందుకు ,స్వయముగా అనుభవించి మనమే లొట్టలు వేయకుండా ఇక ఆ భగవంతుడిని తెలుసుకోవచ్చు అని చెబుతూ సన్యాస ఆశ్రమం  ఒకే సారి తీసుకోకుండా గృహస్తా శ్రమం లో సాదకబాధకాలు తెలుసుకొంటూ మంచిపనులు ,ఇతర జీవులకు  సేవ లు చేస్తూ ఆ సేవ లో భగవంతుడిని ధ్యానిస్తూ కూడా మోక్షం పొంద వచ్చు అని చెప్పారు. అదే తామరాకు ఎలా నీటిలో ఉంటూ తనపై నీటిని వుంచుకోదో అలా ,కుమ్మరి పురుగు ఎలా బురదలో జీవిస్తూ బురదని అంటించుకో కుండా ఎలా బ్రతుకుతుందో అలా బంధాలు ను ఒంట పట్టించుకోకుండా కర్తవ్యాన్నిమాత్రం ఆచరిస్తూ ప్రతీ జీవి మోక్షం పొందవచ్చు .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online