Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-9

         అలానే జ్ఞాన శాఖ సాంప్రదాయంలో పెద్దగా విగ్రహారాధన పట్టించు కోరు .నిరంజన నిరాకారం అనే భావనతో భగవత్ శక్తి ని మనో ఫలకం పై నిలుపుకొని జ్యోతి స్వరూపము గా ఆరాధిస్తూ వుంటారు.అయితే శంకరాచార్యులవారుఅదే జ్ఞానముగురించి చెబుతూ భగవంతుడు సనాతనుడు ,ఆయన కదలడు, చలించడు నీ గోడు ఎంత చెప్పుకున్నావింటాడని ,విని స్పందిస్తాడా అనేది సందేహం .నీవు చేసినపూర్వ జన్మ  కర్మాను సారమే ,నీ ఇప్పటి జీవితం ,జన్మ నడుస్తుంది .ఆయనేమీకలగచేసుకోడు ,అందుకే భగవంతుడు అనేక కోట్ల జీవరాసుల జన్మలు దాటించి మనుష్య జన్మ ఇచ్చాడు ,అని తెలుసుకోవటం జ్ఞానం ,ఈ జన్మ లో బవభందాలకు లోబడకుండా ,కోరికలు పెంచుకొంటూ పోవటం, వాటికోసం మళ్ళీ మళ్ళీజన్మలు ఎత్తటం మళ్ళీ మళ్ళీ  జనన మరణ చక్రములో పడి పుట్టటం ,చావడం అలా   కోరుకోకుండా ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ,ఎవరిని ఇబ్బందులకు గురిచేయకుండా  ఆ దేవుని పైననే మనస్సుపెట్టి చివరికి ఆ దైవములోకల్సిపోవటమేమోక్షం అదే నిజమైన జ్ఞానం అని చెప్పారు.
   
    అంతే కాదు సంసారం ,కుటుంబం బంధాలు వ్యామోహములో పడి మాయా వ్యామోహములో చిక్కొని జన్మలు కోరి తెచ్చుకోవద్దు ,జన్మం దుఃఖం,జరా దుఃఖం జాయా దుఖ్ఖంపునపునః అని హెచ్చరించారు   .అలా చెప్పి గూడా ఆ దైవాన్ని భక్తితో స్తోత్రం లు పాడి .ఏమీ పట్టించుకోడు అని చెప్పిన ఆయునే ,  జ్ఞాన ము లో భక్తి ని రంగరించి  ఆయన మనకు ఎన్నోదైవ స్తోత్రాలు ,అందరి దేవుళ్ళపై అలా అనే కంటే దేవుని అన్ని రూపాల పై  మధురమైన స్తోత్రాలు మనకు ఎన్నో అందించారు .చిట్టచివరకు నరసింహ స్వామివారిని ప్రార్ధించి సగం కాలిపొయిన కాళ్ళు చేతులు మళ్ళీ తెప్పించుకున్నారు.


        ఇక్కడ రామానుజలవారు కామి కాని వాడు మోక్షకామి కాలేడు .అని చెబుతూ సంసారం ,బంధుత్త్వాలు ,ఆ ప్రేమలు ఎంత బాగుంటాయో అని లొట్టలు వేస్తూ కూర్చొంటే ఆ కోరిక పైనే మనస్సు వుంటే ఇంకా మోక్షం ఎలా వస్తుంది,ఆ భగవంతుడిపై ద్యాస ఎలా కలుగుతుంది .అయునా భగవంతుడు మనకు జన్మలు ఇచ్చాడు ఎందుకు ,స్వయముగా అనుభవించి మనమే లొట్టలు వేయకుండా ఇక ఆ భగవంతుడిని తెలుసుకోవచ్చు అని చెబుతూ సన్యాస ఆశ్రమం  ఒకే సారి తీసుకోకుండా గృహస్తా శ్రమం లో సాదకబాధకాలు తెలుసుకొంటూ మంచిపనులు ,ఇతర జీవులకు  సేవ లు చేస్తూ ఆ సేవ లో భగవంతుడిని ధ్యానిస్తూ కూడా మోక్షం పొంద వచ్చు అని చెప్పారు. అదే తామరాకు ఎలా నీటిలో ఉంటూ తనపై నీటిని వుంచుకోదో అలా ,కుమ్మరి పురుగు ఎలా బురదలో జీవిస్తూ బురదని అంటించుకో కుండా ఎలా బ్రతుకుతుందో అలా బంధాలు ను ఒంట పట్టించుకోకుండా కర్తవ్యాన్నిమాత్రం ఆచరిస్తూ ప్రతీ జీవి మోక్షం పొందవచ్చు .

Teeth problems - some remedies

         ఈనాటి రోజుల లోచాలామంది కి పళ్ళ సమస్య వస్తోంది .చిన్నతనం నుంచి ఖ చ్చితమైన అవగాహన లేక పోవటం వల్లపళ్ళ సమస్యలు .కళ్ళ సమస్యలు వస్తూవున్నా యి .పళ్లసమస్యల విషయములో విటమిన్ Dమరియు క్యాలిషియం లోపించటం వల్ల ,దంతముల శుభ్రత పాటించకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తూవున్నా యి మొదటగా చెప్పుకోవలసినది  నోటినుంచి వచ్చే వాసన ,దీనికి కారణములు తెలుసుకొంటే నివారణ చాల తేలిక అవుతుంది నోటినుంచి వాసన తెలీయగానే నోరు శుభ్రత కోసం పళ్ళను అర్గిందాక తోముతువుంటారు .కొంత శుబ్రత పాటించుతూతోముకోవటం అవసరమే కాని మరీ అరి గిపోయందాక తోమరాదు.నోటివాసనకు కారణం పొట్టలోని ,ప్రేవులలోని సమస్యలు ,కడుపులోని పుండ్లు  అల్సర్ ,అజీర్ణం ,గ్యాస్ లాంటివి కారణం .  ఇవి  లేకుండాచూసుకోవాలి .ఒకవేళ వుంటే త్రిఫలాది చూర్ణం అర చెంచ ఉదయం మళ్లి రాత్రి అరచెంచ గోరు వెచ్చని నీటి తో రొజూ తీసుకోవటం లేదా తేనె తో అయునా తీసుకోవచ్చు . కలబంద ( ఆలోవెరా) గుజ్జు ఒక రెండు చెంచాలు ప్రతిరోజూ ఉదయం తీసుకొంటూ వుంటే కూడా కడుపులోని పుండ్లు నయం అవుతాయి.

        అలానే బాగా పండిన బొప్పాయిముక్కలు రోజూ కొన్ని ముక్కలు చొప్పున తింటూ వుంటే కూడా కడుపులో పుళ్ళుతగ్గిపోతాయి ,ఒకే రోజు బొప్పాయి మొత్తం లాగి౦ చకూడదు ,అలా చేస్తే అధిక వేడి చేసి (ఎక్కువ A విటమిన్ వుంటుంది ,) మలద్వారం పగిలిపోతుంది .దేనికైనా అతి పనికిరాదు   .ఎలాగోఅలా లోపలిపుండ్లు తగ్గించుకోవాలి అధిక పులుపు ,అధిక కారం అధిక నూనె ,వేపుళ్ళు ల్లాంటివి పూర్తిగా తగ్గించుకోవాలి .  పళ్ళను తోముకొనేటప్పుడుకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా soft అని వున్న బ్రష్ ఎంచుకోవాలి .బ్రష్ తో రెండు నిమిషాలు మాత్రమే మెల్లగా పళ్ళపై అంటి  అంటని  స్మూత్ గా  ఎక్కువశాతం బ్రష్ ని గాలిలో అంటే పళ్ళపై ఆడించాలి  .మనం తీసుకొనే paste మరీ కొద్దిగా తీసుకోకూడదు .కొంచం ఎక్కువ లేక సరిపడా వేసుకోవాలి అప్పుడు పన్నుకి బ్రష్ కి మద్య ఎక్కువ రాపిడి జరగకుండా paste ఆపుతుంది బ్రష్ తో రెండు నిమిషాలు పన్ను పై నుంచీ క్రిందికి క్రింది పళ్ళుక్రిందినుంచిపైకిమెల్లగా తోమాలి  అంటే క్లాక్ వైజ్ ,సున్నా లా గుండ్రముగా తోముకోవాలి  ,అలా  పూర్తికాగానే ఇకమిగాతా సమయం . ఎక్కువ శాతం చేతి వ్రేలి తో తోముకోవాలి .అది కూడా పంటి చివుళ్ళను మసాజ్ చేస్తున్నట్లుగా తోముకోవాలి

       ఒక ముఖ్య విషయం  ఏమిటంటే ఎంత గొప్ప బ్రష్ అయిన ఒక నెల కంటే ఎక్కువ వాడకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ ,సింథటిక్ కలపిబ్రష్ బ్రస్సెల్  అంటే బ్రష్ కుంచె  ను తయారు చేస్తారు దాని టైం ఓ నెల వరకు పనిచేస్తుంది  తరువాత ప్లాస్టిక్ బైటపడి పళ్లకు మోటుగా తగులుతుంది పళ్ళు దెబ్బతింటాయి అందుకే బ్రష్ ఒక నెల కంటే ఎక్కువ వాడవద్దు అని చెబుతారు..వేప  పుల్ల  ,మామిడి పుల్ల  ఉత్తరేణి వేరు అలా సమస్యను బట్టి తోముకోనేవారు  .ఇంకా పిడకలు,ఆవు పిడకలు అయుతే ఇంకా మంచిది .ఆ పిడకల బూడిద తో కరక్కయపొడి ,పటికపొడి  ఉత్తరేణి మూలికపొడి ,నల్లతుమ్మ ,జాజికాయ జాపత్త్రి  లాంటి ఇంకా ఎన్నో మూలికలు కల్పి పళ్ళపొడి గా ఆయుర్వేద వైధ్యులు ఇస్తూ వుండేవారు

      .ఈ నాటి రోజులలో  మనం  అంత సమయం కేటాయించ లేకపోతున్నాము. అందుకే మార్కెట్ లో దొరికే పేస్టుల పై ఆధారపడుతున్నాము ‘దానిలో అయినా కనీసం ఆయుర్వేదిక్ పేస్టులు ఎంచుకోండి .అందులో నా అనుభవములో   , నేను మా స్నేహితుల ఇళ్ళల్లో ముసలి వారికి ,పిల్లలతో సహా , మా బంధువుల అందరికి నేను ఎప్పట్నించో వాడి మంచి అనుభవం వచ్చిన తరువాతే  vicovajradanti చెప్పాను ఇది కూడా పౌడర్ అయితే మరీ మంచిది .కానీ ఈరోజుల్లో paste లు అలవాటు కాబట్టి vicovajradanti paste వాడితే చాలా మంచిది ఏదైనా vico పౌడర్ కానీ paste కానీ పూర్వములో వాలే చాలా మూలికలతో  దాదాపుగా 18 వనమూలికలతో  తయారు చేయబడినది .దంతముల గట్టిగాను ,చిగుళ్ళు బలంగాను తయారయే  మాట నిజమే . అయితే   దంతముల ,చివుళ్ళ పై బ్రష్ చేసి కొంతసేపు ఆ vico paste ని పళ్ళపై ,చివుల్లపై వుంచుకోవాలి .అలా చేస్తూ వాడుతూ వుంటే వయస్సు తో సంభంధం లేకుండా అందరికీ దంత ఆరోగ్యం వస్తుంది .

       ఇక రెండో paste డాబర్ రెడ్ paste లేక powder ఇది కూడా ఆయుర్వేదిక్ , లవంగాలు ,పుదీనా లాంటి మేలు చేసే మూలికల్ తో తయారు చేయ బడినది .అయితే పళ్ళ నెప్పులు ,లాగటం ,పళ్ళల్లోinfection వున్నా ఈ రెడ్ paste చాల బాగా పని చేస్తుంది . ఇప్పుడు aayush వాళ్ళ paste లు కూడా వస్తూవున్నాయి  ఇంకా dhantakaanti  కూడా కొత్తగా వచ్చింది  .

       ఇక ప్రతీ వాళ్ళు కూడా ఏమి తిన్నా పళ్ళు అన్నీ ,మరియు నోరు అంతా శుభ్రపడేలా నోటిలో నీళ్ళు పోసుకొని బాగా పుక్క్లి లించి ఉమ్మేయాలి .మజ్జిగ,పాలు ,తీపి పానీయాలు లాంటివి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా  పుక్క్లిలించాలి .అస్సలు మనిషి నోటిలోని లాలాజల౦ చాలా పవర్ ఫుల్  .కోటానుకోట్ల మంచి ,చెడు రెండు బాక్టీ రియాలు లాలాజలం అంటే ఉమ్మి లో ఉంటాయి .అందుకే మన సంస్కృతిలో మనషి ని మనషి తగలకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు .ముద్దులు ,కౌగిలింతలు కు సంభంధి౦ఛిన వి లేవు  .అలానే  ఉదయం లేవగానే నోరు లో వుండే లాలాజలం చాలా పవర్ ఫుల్ గా వుంటుంది.అయి తే పాచినోరు చాలా దుర్భరం గానూ వుంటుంది .కొంతమంది పూర్వులు ఏమి చెప్పారంటే    ఉదయం ,నిద్ర లేవగానే ,నోటిలోని లాలాజలంచేతిలో కి  అంటే  కొంచం ఉమ్మి రెండు చేతులలో కల్పి దానిని కళ్ళ మూసి పైన రాసుకోంటే  కళ్ళ సమస్యలు అన్ని పోతాయి .కానీ అలా కొద్దిరోజులు చేయాలి అంటారు .ఏది ,ఏమైనా ఇది కొంచం ఇది అసభ్యం గానూ .అసహ్యం గాను వున్నా లాభం వుంది అంటారు  సిద్దవైద్యములో.   

         ఇంగ్లీష్ వైద్యములోవాళ్ళు  infections వస్తాయి అలా చేస్తే అని వాళ్ళు అంటారు .   పళ్ళ నెప్పులు వున్న వారు గోరు వెచ్చని నీటి లో కొద్దిగా salt కలిపి పుక్కిలి పట్టాలి .గొంతు లో నొప్పి infection వున్న కూడా అదే ఉప్పు నీటి తో గొంతులో gurggle అంటే గొంతులో ఆ నీటిని  తిప్పాలి  .ప్రతి దానికి యాంటీబయాటిక్ వాడకూడదు ,ఎక్కువ శాతం పళ్ళ నెప్పులు vico తో పోతాయి .ఇంకా నెప్పులు వుంటే  వాన్ తేజ్  paste డెంటిస్ట్ లు వ్రాస్తూవుంటారు .పన్ను నొప్పికి సీతాఫలం చెట్టు ఆకు నమిలి కాసేపు ఆ ముద్ద పంటి పై వుంచుకోవాలి .లేదా painoff అని colgateవాళ్ళది వస్తూ వుంది అది కూడాapply చేయవచ్చు .

        ఇంకా పంటి నొప్పికి డెంటిస్ట్ లు zerodal అనే tablets వ్రాస్తూ వుంటారు RESTCLEAN, DOLOPER  tabs  .అవి  కూడా సేఫ్ డ్రగ్ . ఇంకా పళ్ళ,చిగుల్ల సమస్య తో ఏమి తినలేకపోతే డెంటిస్ట్ లు Rexidin-m fortegel అనేది వ్రాస్తూవుంటారు పళ్ళ పైన వ్రాసుకోవాలి ఆ జెల్ అయిటే .అది రోజూ వాడకూడదు .  Dologel-CT ఇది కూడా అంతే .ఇది కాకుండా నోటిపూత కొంతమందికి విపరీతముగావస్తూవుంటుంది .ఒక కప్ నీటిలో DETTO L  4  చుక్కలు వేసి బాగా కలిపి ఆ నీటిని పుక్కిలి పట్టాలి ఆ తరువాత నీటిని వుమ్మేయాలి ,అలా రెండురోజులు చేస్తే తగ్గిపోతుంది .అది BCOMPLEx  లోపం వల్ల వస్తూవుంటుంది riboflavin (రైబోఫ్లెవిన్ ) అనే బి విటమిన్ tabs ఇస్తారు చాలా చిన్న పసుపు పచ్చని tabs అవి నోటి పూత కి బాగా పనికి వస్తాయి .
 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online