Pages

ఇది నా అనుభవం

     పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు అందరికీ నమస్కారం .  నేను O.U. క్యాంపస్ లో చదువుతున్నప్పుడు చాలా పోటీ పరీక్షలు రాసాను .  నేను O.C.ని  నాకు జరిగిన అనుభవం ఇక్కడ నేను చెప్తాను .  నేను M.D.O. పోస్ట్ కోసం జరిగిన పరీక్ష  వ్రాశాను .  అందులో క్వాలిఫై అయ్యాను.  ఇంటర్వ్యూ కూడా పూర్తి అయ్యింది .  నా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయ్యింది రాజ ముద్ర కూడా వేశారు .  కానీ నాకు పోస్టింగ్ ఇవ్వలేదు .  ఆ సమయం లో మా దగ్గర చాలా మంది కి ఈ పోస్ట్స్ వచ్చాయి . ఒక్కో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి కూడా వచ్చాయి. 

      నేను, ఇంకా నాలా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఇంకొంత మంది కలిసి A.P.P.S.C. ఆఫీస్ కి వెళ్లి వాళ్ళని కలిసాము.  అప్పుడు వాళ్ళని వివరాలు అడిగితే వారు అన్నారు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా వచ్చింది కదా అందుకే మేము అన్ని కోటాలు పూర్తి అయినా తర్వాత అప్పుడు మీ సంగతి చూడాలి, ఇంకా కొంత కాలం వెయిట్ చెయ్యమని చెప్పారు.
 
     మరి కొంత కాలం తర్వాత వెళ్తే వారు చెప్పింది విన్నాక మాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.  ఇక్కడ విషయం ఏమిటంటే " అన్ని రిజర్వేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కోటాలో పోస్ట్స్ పొందటమే కాకుండవాళ్లకి  మార్కులు ఉన్నాయి కనుక ఓపెన్ లో  కూడా పోస్ట్స్ ఇవ్వాలి అని రెండు రకాలుగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం మేము వాళ్ళకి  రెండు కోటాలో ముందు ప్రాముఖ్యం ఇవ్వాలి కనుక ఇచ్చాము .  అందువల్లనే మీకు పోస్టింగ్ రాలేదు" అని చెప్పారు .ఇంకా మాకు ఎవరికీ పోస్టింగ్స్ రాలేదు .


     ఇక్కడ విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ ఉన్నవారు ఆ కోటా తో పాటుగా ఓపెన్ కోటా ల్లో కూడా పోస్టింగు పొందుతూ పోతుంటే ఇంకా మరి O.C. వాళ్ళ పరిస్థితి ఏమిటి ?  ఓపెన్ కోటాలో పోస్ట్లు వారికి ఇస్తారు కానీ రిజర్వేషన్ కోటాలో అభ్యర్థులు లేకపోయినా ఆ పోస్టులు అలానే ఉంచుతారు తప్ప వాటిని O.C. వారికి ఇవ్వరు .  ఇదెక్కడి న్యాయమో ?  ఈ పరిస్థితి ఇలానే కొనసాగినంత కాలం O.C. వారికి న్యాయం జరగదు .  కనుక నా విన్నపం ఏమిటంటే O.C. వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఈ అంశం మీద పోరాటం చెయ్యాలి లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం అనవసరం .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online