పైన వఛ్చిన వార్త చాలా బాధాకరమైన విషయం. " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః " ఎచట స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి.
పూజించటం పోయి హింసపెట్టటం , చంపటం చాలా మాములు అయిపోయింది.
పట్టపగలు హత్య జరుగుతూ ఉంటే నిజం గా అక్కడ మనుష్యులు ఉన్నారా ? మానవత్వం ఏమయిపోయింది ? ప్రతిచోటా కూడా బజారులో కొట్టుకుంటూ ఉంటే, కత్తులు తీసుకుని రౌడీలు మనిషిని తరుముతూ ఉంటే, దాడులు చేస్తూ పోతుంటే , పశువులను రోడ్డు మధ్య లో బరువులు లాగటం లేదని హింసిస్తూ ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడరు! నోరు తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు .
ఈ అమ్మాయి స్వాతి హత్య జరిగిన ప్రదేశం రైల్వే స్టేషన్. అది చాలా మంది జనం ఉన్న బహిరంగ ప్రదేశం. కనీసం ఒక 50 - 60 మంది చుట్టూ చూస్తూ ఉన్న సమయం లో వాడు ఈ హత్య చేసి పారిపోయాడంటే మన సమాజం లో ఎంత గా చైతన్య రహితం గా మారింది అనేది తెలుస్తోంది . అసలు గొడవలు, దాడులూ జరుగుతుంటే వాటిని ఆపటానికి ప్రయత్నించ కుండా ఏదో చోద్యం చూస్తూ నిలబడి ఆ తర్వాత కొవ్వొత లూ, దీపాలు పట్టుకుని రోడ్లపై తిరగటం, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం అంటూ పువ్వులు పెట్టి ప్రార్ధనలు చెయ్యటం ఎంత వరకు సబబు ? ఆరోజు రైల్వే స్టేషన్ లో ఈ హత్య జరిగినప్పుడు అక్కడ ఒక్క మగాడు కాదు అసలు ఒక్క మనిషి కూడా లేదా అని నాకు అడగాలి అనిపిస్తోంది. అక్కడ ఉన్నవారిలో ఏ కొద్దీ మంది గట్టిగా ప్రయత్నించినా ఆ వ్యక్తి ని ఈ దారుణం చెయ్యకుండా ఆప గలిగే వాళ్ళు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడ గలిగే వాళ్ళు. మనం సినిమా హీరోల్లాగా అందరితో ఫైట్లు చెయ్యక్కర్లేదు. ఆ సందర్భానికి తగినట్లు మనం వ్యవహరించి మనకు చేతనైన మార్గం లో హింసని ఆపగలిగేతే అది చాలు . కానీ అంత మంది లో ఏ ఒక్కరు గట్టిగా ఏయ్ ! ఎవడ్రా నువ్వు ? ఏంటి నువ్వు చేస్తున్న పని అని గట్టిగా అరిస్తే కూడా వాడు ఒక్కసారి ఆగిపోయేవాడు. మిగిలిన జనం అందరూ కలిసి ప్రయత్నిస్తే వాడిని ఆపగలిగే వారు . కానీ అలా ఎవరు చెయ్యలేదు. అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి పోయారు . ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే వాడు అలా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యం గా పొడిచి వెళ్లిపోతుంటే ఎవరు పట్టుకోవటానికి ప్రయత్నించలేదు సరికదా ఆ అమ్మాయి నెత్తుటి మడుగులో మృత్యువు తో పోరాడుతూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ఆమెను రక్షించటానికి కూడా ప్రయత్నించ లేదు దాదాపు 20 ని,, ఆమె అలానే ఉంది . చివరికి ప్రాణాలు వదిలింది . ఇది చాలా హృదయ విదారక మైన సంఘటన . అక్కడ ఆ సమయం లో ఒక్క మగాడు లేడా? ఈ ప్రశ్నవిషయం తెలుసుకున్న ప్రతి వ్యక్తి మనసులో కలుగుతోంది .
ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకు ఈమధ్య కాలం లో నా కళ్ళముందు జరిగిన రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి. ఒకసారి నేను ఇంకా కొంత మంది నా స్నేహితులు కలిసి బజారులో నడిచి వెళ్తున్నాము . అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కారణం ఏమిటా అని చూస్తున్నాము. అక్కడఒక ఎడ్లబండి ఒక ఫ్లయ్ ఓవర్ కింద నుండి U-టర్న్ తీసుకుంటోంది. కానీ ఎందుకో బండి ఒక్కసారిగా ఆగిపోయింది . ముందుకు కదలడం లేదు. ఆ బండి వాడు ఆ ఎద్దుని ముందుకు కదలమని గట్టిగా కొడుతున్నాడు. ఆ ఎద్దు ఎంత ప్రయత్నించినా ఆ బండి కదలటం లేదు. బండి వాడు కొడ్తున్న దెబ్బలకి ఆ ఎద్దు చర్మం చిట్లి రక్తం కారుతోంది.కానీ చుట్టూ ఉన్న జనం వాళ్ళ దారిన వాళ్ళు వెళ్లిపోతున్నారు. సూట్లు, బూట్లు వేసుకున్నవాళ్ళు , ఇంకా ఎందరో రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. కానీ ఎవరూ మాట్లాడటం లేదు . ఆ బండి వాడిని ఆ ఎద్దుని కొట్టటం ఆపమని ఎవరూ చెప్పటం లేదు . వాడు కూడా దాన్ని ఇంకా హింసిస్తున్నాడు . పాపం ఆ ఎద్దు ఇంకా తన శక్తిని అంతా ఉపయోగించి బండిని లాగటానికి ప్రయత్నిస్తోంది . అప్పుడు నేను ఇంకా నా స్నేహితులు ఒక విషయాన్ని గమనించాము . అది ఏమిటంటే ఆ బడి లో ఉన్న ఇనుప కడ్డీలు ఆ వంతెన కింద ఉన్న పిల్లర్లలో ఇరుక్కున్నాయి. అందువల్ల ఆ ఎద్దు బండిని లాగలేకపోతోంది. నేను ఆ బండి వాడిని గట్టిగా ఆగమని అరిచాను . దానికి వాడు ఆగి కిందికి దిగి వచ్చాడు. అప్పుడు వాడికి ఈ విషయం చూపించి వాడిని గట్టిగా కేకలేసాను అసలు విషయం గమనించకుండా ఆ ఎద్దుని కొట్టినందుకు . అప్పుడు వాడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయం గమనించి ఆశ్చర్య పడ్డారు . అప్పుడు అందరూ ఏదో నిద్ర నుండి మేల్కొన్నట్లు వఛ్చి సహాయం చేసి ఆ కడ్డీల్ని పక్కకి జరిపారు. అప్పుడు బండిని ఎద్దు ముందుకు లాగ గలిగింది. నేను , నా స్నేహితులు అక్కడ ఉన్న వారినీ, ఆ బండి వాడినీ కూడా గట్టిగా కేకలేశాము.అలానే ఇంకొక సారి మేము బైకులపై వెళ్తున్నాము ఆ ప్రదేశం ఊరికి బయట ప్రదేశం. అప్పుడు మాకు కొన్ని అరుపులు వినబడ్డాయి. మేము ఆ శబ్దం వస్తున్న వైపుకి వెళ్ళాము. అక్కడ కొంత మంది వ్యక్తులు ఒక మనిషిని కలబడి కొడుతున్నారు. ఆ వ్యక్తి ఆ దెబ్బలకి తట్టుకోలేక అరుస్తున్నాడు. అది చూసిన మేము వాళ్ళ దగ్గరికి పరిగెత్తాము ఆపమని అరుస్తూ . ఆ కొడుతున్న వ్యక్తులు మమ్మల్ని చూడగానే కొట్టటం ఆపివేసి పారిపోయారు. మేము ఇతనిని తర్వాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాము. అతను బాగానే ఉన్నాడు .ఇది ఎందుకు రాస్తున్నానంటే ఈ రెండు సంఘటనల్లో కూడా మేము ఆ హింసకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఆపటానికి ప్రయత్నించాము. మేము ఆపగలిగాము.
కానీ ఈ అమ్మాయిని ఒక వ్యక్తి అంత దారుణం గా హింసించి చంపుతుంటే అక్కడి వారు భయపడి అవతలకు వెళ్లిపోయారట. వాడు ఒక్క మనిషి పైగా వాడి చేతిలో పెద్ద ఆయుధాలు ఏమి లేవు. చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కలిసి గట్టిగా అడిగితే వాడు అప్పుడే పారిపోయేవాడు. కానీ వారు ఆపని చేయలేదు. ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే వాడు వెళ్ళిపోయినాక కూడా ఆఅమ్మాయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటుంటే ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చెయ్యలేదు. కళ్ళముందు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకున్నారు . ఇది మానవత్వం సిగ్గు పడవలసిన విషయం.మన సమాజం లో మనకు ఒక అలవాటు బాగా ఉంది. అది ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంటాము మనల్ని నడిపించటానికి. స్వతంత్ర పోరాటం లో గాంధీగారు వచ్చే వరకు మనకు ఐకమత్యం గా పోరాడాలి అని అనిపించలేదు. ఇది అన్ని సందర్భాల్లో పనికిరాదు. ఎవరికోసమో ఎదురు చూడకుండా మనుషులుగా మన కనీస బాధ్యత మనం నిర్వర్తిస్తే చాలు చాలా మంచి పనులు చెయ్యవచ్చు. మనం కనీసం మనుషులుగా ప్రవర్తించి మానవత్వాన్ని కాపాడుదాం.

0 comments:
Post a Comment