Pages

క్రీమీ లేయర్ అవసరమా కాదా ??

     క్రీమీ లేయర్ అనేది నేడు అవసరమే .  సమాజం లో అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, ధనికులూ, పేదవారు ఉన్నారు.  అందుకే అంబేద్కర్ యొక్క కుమారుడు రాహుల్ అంబేద్కర్ ఈ మధ్య భారత దేశం లో అనేక ప్రాంతాలో పర్యటించారు .  ఆయన ఒక విషయం చెప్పారు.  రిజర్వేషన్లు అనేవి కులం, మతం వర్గాన్ని బట్టి కాకుండా ఆర్ధికం గా వెనుక బడిన వారికి ఎవరికైనా ఇచ్చేలా చట్టాలు ఉండాలి  అని నొక్కి చెప్పారు.  ఈ విషయం మన దేశం లో ఏ కుహనా రాజకీయ పార్టీలకు వినపడదు.  ఎందుకంటే వారికి కావలసింది కుర్చీలు , అధికారం. 
   ఇప్పుడు క్రీమీ లేయర్ విధానం పై అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.  6 లక్షలు పరిమితి సరిపోదు అనీ, దాన్ని 15 లక్షలకు పెంచమని గొడవ చేస్తున్నారు.  నేను చాలామంది బి .సి . కులాల వారిని అడిగి చూసాను.  వాళ్ళలో కోద్దా అత్యంత ధనవంతులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులూ ఉన్నారు.  చాలా మంది ప్రభుత్వఉద్యోగులు ఉన్నారు.చాలా ప్రభుత్వ పదవులలో ఉద్యోగాలలో నెలకు 40,000 నుండి 50,000 వరకు జీతాలు వస్తున్నాయి.  ఏవో కొన్ని అటెండర్ , అటువంటి పోస్టుల్లో తప్పఅటువంటప్పుడు వారి జీతం సo,, కి 6 లక్షలు అవుతుంది కదా .  అంతే కాదు చాలామంది లేని వాళ్ళు అలానే ఉంటున్నారు .

      
         .దీనిలో ఎక్కువ భాగం వహించేది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచర్లు, ఇలా బాగా చదువుకున్న వారు , చదువు చెప్పేవారు .  వీళ్ళు వారి సబ్జక్ట్స్ వదిలేసి వీరికి తెలియని వేదాలు, చదవని రామాయణ భారతాలు, భాగవతం మొదలైన వాటిపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తిక్క తిక్క గా సమాధానాలు ఇస్తుంటారు.  పోనీ వారిని ఎవరైనా " మీరు ఆ గ్రంధాలు చదివారా ? అని అడిగితే , మేము చదవలేదు, అసలు చదవాల్సిన పని లేదు" అని చెప్తుంటారు.  మరి అసలు ఆ గ్రంధాలు చదవకుండా విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం మిడి మిడి జ్ఞానం, అనుభవ రాహిత్యం తో ఏ విషయాన్ని వాధించలేము.  ఆ వాదనలు ఎక్కువ కాలం నిలువవు .  కుల వాదం, కుల వివక్ష  పోవాలని వాదిస్తారు .  కానీ ఆచరించరు.  బ్రాహ్మణులలో ఉప కులాలు వారు కొట్టుకు చస్తుంటారు.  ఇక బి .సి .లలో కూడా ఒకరితో ఒకరికి పడదు.  SC, ST, వారిలో కూడా కొన్ని తెగల వారు కొన్ని తెగల వారిని తక్కువగా చూస్తుంటారు. 
       ఇంకా బి .సి . కులాల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎదుగుతున్నారు .  మరి లేని వారి పరిస్థితి ఏమిటీ ?  అసలు ఆ లెక్కలు కూడా తీయాలి.  ఈ మధ్య కొంత మంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు కూడబెట్టి ఇల్లు కట్టి అద్దెలకు ఇవ్వటం, ఇంకా బినామీ పేర్ల తో వ్యాపారాలు చేస్తున్నారు.  మళ్ళీ వాళ్ళ పిల్లలకే రిజర్వేషన్స్, ఇంటర్వ్యూ తర్వాత పోస్టింగ్స్ కోసం డబ్బు వెదజల్లటం వంటివి చేస్తున్నారు.  దాని వల్ల వల్ల తోటి బీద వారు వారి కులం వారే ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతున్నారు. అందుకే ఈ క్రీమీ లేయర్ కావాలి అని వారిలోనే ఒక వర్గం వారు సమర్ధిస్తున్నారు చాలా మంది డబ్బు, పదవి హోదా దక్కగానే వాళ్ళ వాళ్ళనే హీనంగా చూస్తుంటారు.  దర్పం వెలగ బెడుతూ, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబ పరిస్థితులు, ఎక్కి వచ్చిన మెట్లు అన్నీ మర్చిపోయి ఏదో గొప్ప రాజ  వంశీకులు లాగా ప్రవర్తిస్తుంటారు. 
    ఈ మధ్య  కాలం లో మన దినపత్రికల్లో ఒక విషయం చదివాము అది ఏంటంటే విదేశాల్లో మన ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు లక్షల సంఖ్యలో స్థిరపదినట్లు.  ఆ లెక్కలు కూడా చూపించారు .  ఇలా జరగటానికి కారణం ఏమిటి ?  ప్రతిభావంతుల ప్రతిభ ఖండాలు దాటి విదేశాలకు వలస పోవటానికి కారణం ఎవరు ?  మన స్వార్ధ రాజకీయ నాయకులు.  వాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం వారికి నచ్చిన విధం గా చట్టాలు మర్చేస్తుంటారు.  కానీ విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రతిభ కు సంబంధించిన చట్టాలు మాత్రం వాటి కాల పరిమితి దాటిపోయినా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు ఏమాత్రం అనుగుణం గా లేకపోయినా వాటిని మార్చటానికి ధైర్యం చెయ్యరు. వాళ్ళు కులం, మతం, జాతి ఎత్తవద్దు అని నాటకాలు ఆడుతుంటారు.రాజ్యాంగాన్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తుంటారు.  కానీ వారికి అనుగుణంగా దాన్ని మార్పు చేస్తుంటారు.  కానీ ప్రజలకు అవసరమైన చట్టాలు చెయ్యాలంటే వనికిపోతుంటారు,  వారి పదవి పోతుందేమో అని భయం. 

          ఇలాంటి స్వార్ధ రాజకీయ నాయకులు, క్రీమీ లేయర్ వద్దు అని వాదించే వర్గాలు, ప్రభుత్వాలు, ముటాతత్వం ఉన్నంత కాలం ప్రతిభ విదేశాలకు వెళ్ళిపోవటం, మేధావులు విదేశాలను బాగుచేయ్యటం  అది చూస్తూ మనం బాధ పడటం తప్ప చేసేది ఏమి లేదు.  రాజ్యాంగం లో సమూల మార్పులు చెయ్యాలి.  ఆధునికత కు అనుగుణం గా అందరికీ సమాన అవకాశాలు దక్కేవిధం గా సంస్కరింప బడాలి.  కానీ అది జరగాలంటే మళ్ళీ కొందరు సంఘ సంస్కర్తలు పుట్టాలి.    

some techniques to cure neck pain n spondylosys

మీరు మెడ నొప్పి ని తగిన్చుకోవటానికి కొన్ని జాగ్రత్తలు :-
     ఎప్పుడూ మెడను పూర్తిగా గుండ్రం గా తిప్పకండి .  సగం మాత్రమె తిప్పండి .  నిద్ర పోయే సమయం లో పలుచగా ఉన్న తలగడను భుజాల కిందుగా ఉండేలా అమర్చుకోవాలి .  మరీ మెత్తటి తలగడను వాడకండి .

       మీ మెడ నొప్పి తగ్గటానికి మీ భుజాలను ష్రగ్ చేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కుని 5 అంకెలు లెక్క పెట్టి మళ్ళీ వదలండి .  ఇలా కనీసం 5సార్లు చెయ్యండి .  మీ భుజాలను మొదట 5 సార్లు సవ్య దిశలో , ఆతర్వాత 5 సార్లు అపసవ్య దిశలో తిప్పండి .  మీ నుదుటిని అరచేతితో పట్టుకుని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ 5 అంకెలు లెక్క పెట్టండి .  అలాగే రెండు చెంపలకు అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధం గా వ్యాయామం చెయ్యండి . 
    ఆ తర్వాత తల వెనుక చేతిని పెట్టుకుని కాసేపు తలను వెనుక వైపునకు నొక్కుతూ వ్యాయామం చెయ్యండి .  మెడ , వెన్ను , భుజం ఇలా ఏ ప్రాంతం లో నొప్పి ఉందొ అక్కడ కాపడం పెట్టండి .  చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడూ , పేపర్ చూస్తున్నప్పుడూ తలను ఎక్కువగా వంచకండి  మీకంప్యూటర్ మోనిటర్, టీవీ చూసేటప్పుడు దానిలోకి తొంగి చూస్తున్నట్లుగా మెడను ఉంచకండి.  ఫోన్ మాట్లాడే సమయం లో భుజానికీ, తలకు మధ్య ఫోన్ ను ఇరికించి తలను పక్కకు తిప్పి మాట్లాడకండి .భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి .
           ల్యాప్ టాప్ గానీ , కంప్యూటర్ మానిటర్ గానీ మీ కళ్ళ లెవెల్ కు సమానంగా ఉండేలా చూసుకోండి .  కంటికీ మానిటర్ కు మధ్యన 16 నుండి 22 అంగుళాల దూరం ఉండాలి.  అంతకు తక్కువ, ఎక్కువా ఉండటం మంచిది కాదు.  కంప్యూటర్ పై పని చేసే సమయం లో మీ మోచేతులను కుర్చీ చేతులపై ఆన్చి .. వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి .
   ఈ విధం గా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించటం వల్ల మెడ నొప్పి , కండరాల నొప్పి,స్పాన్దిలోసిస్  వంటి సమస్యల నుండి బయట పడవచ్చు . 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online