కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
నేటి Gk లో జీకే ..ఒక గొప్ప దైవ కార్యం ...ఆది ఏమిటో మొత్తం వినండి GK లో
మొత్తం జాగ్రత్తగా వినండి ....అంత గొప్ప విషయాలు ఎలా సాధించాడో చాలా వున్నాయి ..వినడం కూడా .అది కూడా ఒక యోగమే.
సంక్రాంతి క నుమ శుభాకాంక్షలు
సేకరించిన విషయం "★★★
----- - /సంక్రాంతి కళారూపాలు/-------
మన పండుగలలో ఎక్కువ శాతం పండుగలు ఆయా దేవుళ్ళ పుట్టినరోజు లో లేకుంటే వారు చేసిన ఘనకార్యాలను స్మరించుకోవడానికో చేస్తుంటాము.కాని సంక్రాంతి పండుగ మాత్రం అటువంటి పండుగ కాదు.ఇది చాల విశేషమైన పండుగ. దేశానికి తిండి పెట్టే రైతన్నకు అండదండగా సమాజం నిలబడే పండుగ ఇది.రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. పండించిన పంట సంపూర్ణంగా చేతికందితేనే రైతు బాగుంటాడు.అందుకే రైతుకు మొత్తం సమాజమంతా వెన్నుదన్నుగా నిలబడుతూ రైతుల పంటను రక్షించి ఆ పంటను రైతు చేతికి అందించే ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ యొక్క కార్యాచరణే సంక్రాంతి కళారూపాలు. ఇప్పుడంటే 130 రోజుల పంటలు వచ్చేశాయి కాని పూర్వకాలంలో పంటంటే ఆరునెలల పంట.చేలో దిగితే మనిషి బయటకు కనబడేవాడు కాదు.అంత ఎత్తున చేలు ఉండేవి.రైతులు ఆరునెలల పాటు ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసేవారు. శ్రమకు ఫలితంగా పంటను కోసేటందుకు సుబ్బారాయుడు షష్టి నాడు సుబ్బారాయుడ్ని పూజించి పండుగ తరువాతి మంగళవారం లేక శుక్రవారం నాడు మూన ముహూర్తం చేసి పంటను కోసి పనలను గట్టెక్కించి నూర్పించి రాశిగా పోసిన రైతులు ధాన్యాన్ని ఇంటికి తరలించే హడావుడి లో ఉంటారు.అప్పటివరకూ పడ్డ శ్రమ మూలంగా బడలికతో ఉంటారు.సరిగ్గా అప్పుడు ఈ కళాకారులు రైతులకు బాసటగా నిలుస్తారు.
ఏవిధంగా అంటే......
*బుడబుక్కలవాడు*:
రాత్రి రెండు గంటల సమయంలో 'అంబ పలుకు....జగదంబా పలుకు
కంచి కామాక్షి పలుకు..మధుర మీనాక్షి పలుకు
కాశీలోని అన్నపూర్ణ పలుకు
పోలేరమ్మ తల్లీ పలుకు"
అంటూ ఆ ఊరి గ్రామ దేవతలను ఆవాహన చేస్తూ ఊరి పొలిమేరలలో 'కట్టు' కడతాడు.కట్టు కట్టడమంటే ఆ పొలిమేర వరకూ బాధ్యత తీసుకోవడమన్న మాట.సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో ఆయా గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి. గ్రామదేవతలు సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. పరులెవరైనా గ్రామానికి హానికరమైన పనులు తలపెడితే ఉగ్రరూపం దాల్చి వారిని దండిస్తారని ప్రజల విశ్వాసం. అందుకే వీరి జాతరలు జరిగినప్పుడు ఆ పూజావిధానం కొంత ఉగ్రంగా ఉంటుంది. అర్ధరాత్రి అలసటతో రైతులు చిన్న కునుకు తీస్తే సందు చూసుకుని పంటచేలల్లోని ధాన్యపు రాశులను ఎత్తుకుని పోయే దొంగలు రాకుండా ఈ బుడబుక్కలవాడు తన చేతిలో ఉన్న ఢమరుకం మ్రోగిస్తూ కట్టు కట్టి కాపలా కాస్తాడు.రైతుల పంటలను దొంగల పాలు కాకుండా కాపాడతాడు.
*జంగం దేవర*:
ఈ జంగందేవరలు సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు ప్రజలు.వీరు శివకథలను చెబుతూ చేతనున్న శంఖాన్ని పూరిస్తూ ఉంటారు. వీరు కంఠమెత్తి "హరహర మహాదేవ" అంటూ ఎలుగెత్తి హర గద్యలను ఆలపిస్తుంటే ఆకంఠ గాంభీర్యానికి,ఆ శంఖారావానికి భయపడి పారిపోతారు దొంగలు.
*హరిదాసులు*:
"కొండ గొడుగుగా కాచిన
కొలనిదోపరికిని గొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
హరిలొరంగ హరి...హరిలొ రంగ హరి"
అంటూ తూరుపు దిక్కు తెలబోతుంటే మన ఇంటి ముంగిట ఇంటి ఆడబడుచు పెట్టిన రతనాల ముగ్గులో నృత్యం చేసి ఆనాడు రేపల్లె లో గోవర్ధన గిరినెత్తి గోపాలకులను కాపాడిన ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు మనకెప్పుడూ తోడుగా ఉండి మున్ముందుకు నడిపించాలని మనఃపూరకంగా కోరుకుంటాడు. మనం సమర్పించిన దోసెడు బియ్యాన్ని స్వీకరించి 'కృష్ణార్పణం" గావిస్తాడు
*గంగిరెద్దులు*:
రైతులకు నిజమైన మిత్రులు ఎడ్లు.ట్రాక్టర్లు రాకముందు ఎడ్లు లేకుండా వ్యవసాయం చేయడం కుదిరేదే కాదు.చేను దున్నాలంటే ఎడ్లు కావాలి. ఆవులు,ఎడ్ల పేడే చేలకు ఎరువులు. వరి పనలను నూర్చి ధాన్యాన్ని వేరు చెయ్యాలంటే ఎడ్లే పనలను తొక్కాలి.పండిన పంటను పొలం నుండి ఇంటికి తరలించాలంటే ఎడ్లబళ్ళే శరణ్యం. ఇలా ప్రతి వ్యవసాయ పని ఎడ్లు లేకుంటే జరిగేది కాదు.అందుకే రైతులు ఎడ్లను దైవంగా కొలుస్తారు.
అటువంటి దైవాలను అలంకరించి నుదటన సిందూరపు బొట్టు పెట్టి, మూపురంపై రంగు రంగుల బట్టలు వేసి,మెడలో గంటలు కట్టి నెల రోజులపాటు రోజూ మన ఇంటి ముంగిటకు తెచ్చి 'అయ్యగారికీ దణ్ణం పెట్టు,అమ్మగారికీ దణ్ణం పెట్టు అయ్యగారి కుటుంబం సిరి సంపదలతో,పాడిపంటలతో వర్ధిల్లాలి. ఈఇల్లంతా శుభోజ్జయంగా ఉండాలి' అంటూ గంగిరెడ్లచేత ఆడిస్తారు గంగిరెడ్ల వాళ్ళు.ఆ ఎడ్ల దీవెనలు అందిస్తారు.
*పిట్టల దొరలు*:
'అయ్యగారండోయ్ అమ్మగారండోయ్ దొరలమొచ్చామండోయ్.దొరలంటే దొరలం కాము పిట్టల దొరలమొచ్చామండోయ్. మా ఆస్తిపాస్తులు వివరాలు తెలుసానాండీ.అరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాలు, హిందూ మహాసముద్రంలో లక్షల ఎకరాలు,బంగాళాఖాతంలో పన్నెండు బంగళాలు ఉన్నాయి. మొత్తం బంగళాలన్నీ మునగ కలపతో గట్టిగా కట్టించాము.మా ఇంట్లో పది కిలోల బంగారాన్ని కుక్క ముట్టుకుందని రోడ్డు మీద పారేయించాను' అని గొప్ప బడాయిలు పోతూ చిన్న, పెద్ద ఇంటిల్లిపాదినీ నవ్వుల్లో ముంచెత్తుతారు.
*సోదెమ్మ*:
'సోది చెబుతానమ్మ సోది చెబుతాను.జరిగింది జరిగినట్టు చెబుతాను.జరగబోయేది చెబుతాను' అంటూ చెయ్యి చూసి మంచి చెడులు చెప్పి చేటనిండా బియ్యం, స్వయంపాకం,పాతచీర పట్టు చీర పట్టుకెళతారు ఈ సోదెమ్మలు.
*కొమ్మదాసర్లు*:
ఈ కొమ్మదాసర్లు మధ్యాహ్నం అన్నం తిని విశ్రాంతి తీసుకునే వేళ వచ్చి దొడ్లోని చెట్టెక్కి అరుస్తుంటారు.కిందకు దిగమంటే 'పడతా పడతా నే పప్పుదాకలో పడతా..పడతా పడతా నే పాతర గోతిలో పడతా' అంటూ నానా హడావిడి చేస్తారు. కాస్త బియ్యం, పాత బట్టలు ఇస్తే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు.
ఇంతకీ" పాతర గొయ్యి' అంటే ఏమిటి?
రైతులు పూర్వం తమ పెరట్లో ఓ గొయ్యి తవ్వి దానిలో ఎండుగడ్డి పరచి దానిపై గోనెసంచులు కానీ దుప్పట్లు కానీ పరచి ధాన్యాన్ని ఆ దుప్పట్లపైన పోసి ఆపైన మళ్ళీ ఎండుగడ్డి పరచి మట్టితో కప్పెట్టి ధాన్యాన్ని దాచుకుని నిలవ ఉంచుకునే వారు.ఈ గోతినే 'పాతర గొయ్యి' అనేవారు. సాధారణంగా దొంగలు ఈ గోతులను ఏ రాత్రి పూటో తవ్వి ధాన్యాన్ని దోచుకు పోయేవారు. ఈ కొమ్మదాసర్లు పాతర గోతిలో పడతామంటూ ఇంట్లోని పాతరగొయ్యి సురక్షితంగా ఉందో లేదో చూసుకొమ్మని హెచ్చరించి వెళ్ళేవారు.
*రంగవల్లులు*:
సంక్రాంతి నెల పట్టటానికి గుర్తు ఇంటి ముంగిట ఆడపడుచులు తీర్చిదిద్దిన ముగ్గులు. ఈ ముగ్గులను బియ్యపు పిండితో వేస్తారు.ఆవుపేడతో కళ్ళాపి జల్లి ఆపైన ఈ ఈ ముగ్గులు వేస్తారు.. ఈ ఆవుపేడ,బియ్యపు పిండి మన ఇంటి పరిసరాలను క్రిమికీటకాలనుండి రక్షిస్తాయి.అప్పటి దాకా పైరులను ఆశ్రయించుకున్న క్రిమికీటకాలు వరి కోతలైన తరువాత ఊర్లోకి జొరబడతాయి.వీటిని మన ఇంట్లోకి రానీయకుండా ఈ ముగ్గులు కాపాడతాయి.
*భట్రాజులు*:
ఈ భట్రాజులు కళ్ళాలలోకి వచ్చి రైతులపై ప్రశంసా పద్యాలను చెప్పి నాలుగు గింజలు కొలిపించుకుని వెళతారు.
ఈవిధంగా పంటలు కోతలు మొదలు పంట ఇంటికి చేరేవరకూ తమ కళా ప్రదర్శనలతో రైతు పంటకు రక్షణగా, ఓ రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్న మన పూర్వీకుల దూరద్రుష్టిని శ్లాఘించాలి.నెల రోజులపాటు మనకు మన కుటుంబాలకు మంచి జరగాలని ఆ దేవుడిని కోరుతూ తమ కళలను ప్రదర్శించే కళాకారులను సత్కరించటం మన విధి.మనం వారికి బిచ్చం వేయడం లేదు. మన విధి మనం నిర్వర్తిస్తున్నామంతే!!
ముక్కనుమ నాడు. మీమీ ఇళ్ళకు వచ్చే కళాకారులను యధాశక్తిన సత్కరించండి.మీ ఋణం తీర్చుకొండి ...🙏
నేటి జీకే లో పబ్లిక్ కి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయు GK
సరదాగా కాసేపు.........8 వ పర్సన్ ముసలి వారి పెన్షన్ లు గురించి చెప్పారు ..వాళ్ళ అమ్మ పెన్షన్ గురించి చెబుతూ
Tiruppavai 26 th pashuram తిరుప్పావై 26 వ పాశురం
ఓంగరుడ దేవుని వైశిష్ట్యం ..షట్ చక్రాలు హంస పరమహంస ల గురించి ఈ పాశుర వ్యాఖ్యానం 🙏 నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ
Tiruppavai25 pashuram ..తిరుప్పావై25 వ పాశురం
లక్ష్మీ దేవి వైభవం ..స్వామివారిలో ఆ అమ్మవారు లక్ష్మీకళ
గురించి విషయాలు ఈ పాశురం లో ఉన్నాయి
ఓం నమో నారాయణాయ ఓం నమోవే0కటేశాయ శ్రీమాత్రే నమ:
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎂💐💐💐💐💐
Gk వాట్సప్ నుండి సేకరణ
😃లోకం పోకడ😃
ఏ పి లో కమ్యూనిస్ట్ నాయకులు ఇంకా ఏం రోగం వచ్చింది అని చస్తున్నారు ..జగన్ ...జనాలందరకు సిన్సియర్ గా మీట నొక్కి అందరికి అన్నీ పంచి ఇస్తున్నాడు sc st bc మైనారిటీలకు ..oc బీదలకు కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు దళారులు బెడద లేదు mla తో సహా ఎవ్వడూ తినడానికి లేదు ..దొంగ లెక్కలు చూపించకుండా బ్యాంకుల్లో రికార్డులు ఉంటాయి ...ఆరోగ్య శ్రీ వైద్యం 25 లక్ష లు కి పెంచాడు ..ప్రతి ఊర్లో ఆరోగ్య క్యా0ప్ లు పెట్టి అందరికి వైద్యం చేస్తున్నారు ..ఇంకా ఇంటకంటే ఇంకా దోచి పెట్టగలరా కమ్యూనిస్టు లు ..ఏమి లేదు కుటుంబ సభ్యులను తెచ్చి ఒక పక్క ఇంకో పక్క వాడి మతం తెచ్చి ఇంకో పక్క అన్ని రంగాల కార్మికులు వ్యుద్యోగల ను రెచ్చ గొట్టి ధర్నా లు చేయుంచటం ..వ్యుద్యోగస్టులకు ఇప్పటి లక్షల జీతాలు సరిపోవడం లేదు ఇంకా కొత్త స్కీం లు తీసుకువచ్చేలా ధర్నా లు లా అండ్ ఆర్డర్ ని ఎలా దెబ్బ తీసి ప్రభుత్వాన్ని పడగొట్టి మన కులపొరు ఎలా కుర్చీ ఎక్కాలి..ఇంకా కొత్త కొత్తవి ఎం అలజడులు తీసుకురావచ్చు ఇవి కమ్యూనిస్ట్ ల పిచ్చి చేష్టలు ..తో అన్ని వైపు ల నుంచి జగన్ ని పీక్కోని తినేస్తున్నారు ...కమ్యూనిస్ట్ నాయకుల్లో ఒక ప్రత్యేక కులం వాళ్ళు అక్కడ నాయకులు వున్నారు ..వాళ్లకు ప్రజల కు జరిగే మేలు కాదు కావాల్సింది ..వాళ్లకు కావాల్సింది వాళ్ళ కులం వాళ్లు మాత్రమే ప్రభుత్త్వం ఏర్పాటు చేయాలి ...వంద సం లు ఆయునా ప్రపంచము ఉన్న నాళ్ళు వాళ్ళ కులమే ఉండాలి అది వాళ్ళ అతి ఆశ ..దానికి డప్పు కొడుతూ ఆ కులం పేపరు ఆ కులం చానల్స్ తెగ డప్పు కొడుతూ జనాలు లో వాళ్ళకులం కుళ్లు కంపు లు తో ap అంతా మురుగు వాసన తెచ్చే పనిలో పడ్డారు ఎందరు తిడుతూవున్నా సరే సిగ్గు ఎగ్గూ లేకుండా వినిపించినా వినపడలేదని నటిస్తూ ఊగిపోతున్నారు .ప్రజలారా మేలుకోండి . ( వాట్సప్ నుండి సేకరణ )
నేను రియల్ ఎస్టేట్ ..నా ఫార్మ్ ల్యా0డ్స్ కొంటారా con చేయండి
హైదరాబాద్ కి అని వైపులా ఉన్నాయి p l o ts ..f l a t s నా వద్ద ఉన్నాయి విల్లాలు కూడా ఉన్నాయి
Tiruppavai16th pashuram తిరుప్పావై16 వ పాశురం
Blog Archive
-
▼
2024
(102)
-
▼
January
(24)
- జీ కే GK లో పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి చూద్దాం
- Gk లో కొందరి మాటలు విందాం జీకే
- శ్రీ రామ దేవుని పైఒక ముస్లిం మహిళ ఎంత బాగా వివరించ...
- నేటి Gk లో జీకే ..ఒక గొప్ప దైవ కార్యం ...ఆది ఏమిట...
- అయోధ్య రాముల వారి సేవ కు ప్రభాస్ 50 కోట్లు జీకే G K
- సంక్రాంతి క నుమ శుభాకాంక్షలు
- అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
- జీ.కే...G k ...నేటి జీ కె లో G K ..
- 29 వ పాశురం తిరుప్పావై 29 th pashuram tiruppavai
- జీ కె ..G K లో పనికి వచ్చే విషయం ఇది
- నేటి జీకే లో పబ్లిక్ కి అన్ని విషయాలు తెలిసిపోతున్...
- తిరుప్పావై28 వ పాశురం Tiruppavai 28 th pasuram
- Tiruppavai 26 th pashuram తిరుప్పావై 26 వ పాశురం
- Tiruppavai25 pashuram ..తిరుప్పావై25 వ పాశురం
- తిరుప్పావై24 వ పాశురం Tiruppavai24 th pashuram
- Gk వాట్సప్ నుండి సేకరణ
- తిరుప్పావై. 23 వ పాశురం Tiruppavai23 pashuram
- G K ...జీకే లో తెలంగాణ లో విచిత్ర రాజకీయ0
- Tiruppavai 22 th pashuram. తిరుప్పావై 22 వ పాశురం
- Tiruppavai 21 th kashtam తిరుప్పావై 21 వ పాశురం
- Tiruppavai 20 th pashuram తిరుప్పావై 20 వ పాశురం
- నేను రియల్ ఎస్టేట్ ..నా ఫార్మ్ ల్యా0డ్స్ కొంటారా c...
- Tiruppavai19 th pashuram తిరుప్పావై 19 వ పాశురం
- Tiruppavai16th pashuram తిరుప్పావై16 వ పాశురం
-
▼
January
(24)
Followers
About Me
- Dr.M muralikrishna