మిత్రులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర2024 శుభాకాంక్షలు ..కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరు ని దయతో అందరికీ ఆయురారోగ్య అయుశ్వర్యా లతోను శుభ లాభలతోను వర్ధిల్లాలని ..ప్రార్ధిస్తూ శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ
జై శ్రీకృష్ణ జై శ్రీరామ శ్రీ సాయునాధ మహరాజ్ కి జై
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
జై శ్రీకృష్ణ జై శ్రీరామ శ్రీ సాయునాధ మహరాజ్ కి జై
ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో విష్ణవే
ఓం నమో వే 0కటేశాయ
శ్రీమతే రామనుజాయై నమ,:
శ్రీ మతే రామానుజాయై నమ:
తెలుసుకోవాలని అనుకుంటే మొత్తం వ్యాఖ్యాన0 వినండి
ఓం నమో నారాయణా య ఓం నమో వే0కటేశాయ
,, శ్రీమతే రామానుజయాయై నమ:
💥బులుసు సాంబమూర్తిగారు
బులుసు సాంబమూర్తి గారి గురించి చెప్పుకోవాలంటే మాములుగా, ఆయన వ్యక్తిత్వం గురించి తలుచుకుంటే, ‘ మనమధ్య తిరిగిన వ్యక్తియేనా ఈయన. మనకెందుకు ఈయన గురించి ఇన్నాళ్లూ తెలియకుండా పోయింది ‘ అనిపిస్తుంది.
బులుసు సాంబమూర్తిగారు, 1886 మార్చి 4 న గోదావరి జిల్లాలోని దుళ్ల గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ లో, సాంప్రదాయ బద్ధమైన ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. వారి జీవిత కాలం 71 సంవత్సరాలు.
వీరు 1958 వ సంవత్సరం ఫిబ్రవరి 2 న కాకినాడలో అస్తమించారు. వీరి పితృదేవులు సుబ్బావధానులు గారు వేదపండితుడు. కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ, ధార్మిక జీవనం సాగించేవారు.
సాంబమూర్తి గారు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సైన్స్ లో పట్టా పుచ్చుకుని, విజయనగరం మహారాజా కళాశాలలో కొంతకాలం భౌతికశాస్త్రం బోధించారు. స్వతహాగా స్వేచ్ఛాస్వభావి అయిన సాంబమూర్తిగారికి ఈ ఉద్యోగం అంతగా నచ్చలేదు. కొంతకాలానికి, ఆ ఉద్యోగానికి రాజీనామాచేసి, న్యాయవాదవృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
తరువాత బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై, 1911 లో కాకినాడలో క్రిమినల్ లాయర్ గా న్యాయవాదవృత్తిని ప్రారంభించారు. వారి ప్రతిభతో వారు, ప్రకాశం పంతులుగారి అభిమానం చూరగొని, వారితో కలిసి మద్రాస్ హైకోర్ట్ లో యెంతో ప్రతిభావంతంగా క్రిమినల్ కేసులు వాదించేవారు.
సాంబమూర్తి గారు చాలా విలాసవంతమైన జీవితం గడిపేవారు. ఆయన సిల్క్ సూటు వేసుకుని, మోటార్ సైకిల్ మీద కోర్టుకువస్తుంటే, చూడముచ్చటగా ఉండేదట.
అయితే, మహాత్మా గాంధీ పిలుపునందుకొని న్యాయవాదవృత్తిని వదలి, సాంబమూర్తిగారు స్వతంత్రపోరాటంలో పాల్గొన్నారు. ఆరోజులలో బ్రాహ్మణులు న్యాయవాదవృత్తిలో అమోఘంగా రాణిస్తూ, విశేషమైన ధనం ఆర్జించేవారు. అయినా దేశభక్తి ముందు ఆ సంపాదన తృణప్రాయంగా భావించారు సాంబమూర్తి గారు. వారు గాంధీ గారి కంటే ముందునుండే ఖద్దరువస్త్రాలు తొడగడం ప్రారంభించి, చరిత్ర సృష్టించారట.
సాంబమూర్తి గారు, 1919 లో హోంరూల్ ఉద్యమంలోను, 1930 లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను, నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. 1927 లో నాగపూరు ‘ పతాక సత్యాగ్రహ ‘ దళానికి నాయకులుగాను, 1928 లో ‘ హిందూస్థానీ సేవాదళానికి ‘ అధ్యక్షులుగాను పనిచేశారు.
స్వతంత్ర ఉద్యమసమయంలో, డప్పుల సుబ్బారావు అనే క్రూరుడైన పోలీస్ అధికారి చేతిలో లాఠీతో చావు దెబ్బలుతినికూడా, మొక్కవోని ధైర్యంతో, రాయిలాగా నిలబడి, అందరినీ ఆశ్చర్యపరిచారు, సాంబమూర్తి గారు. ఆ తరువాత అనేకసార్లు సాంబమూర్తి గారిని పోలీసులు అరెస్ట్ చెయ్యడం, జైళ్లలో పెట్టడం పరిపాటి అయిపొయింది.
తరువాత వీరు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929 లో అఖిలభారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారు చేశారు. అప్పుడు సాంబమూర్తి గారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు.
సాంబమూర్తి గారు అకళంక దేశభక్తుడు, స్వతంత్ర సమరయోధుడు. భారతదేశ స్వతంత్రం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమలక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. వారి ధార్మిక జీవనాన్ని గమనించి ప్రజలందరూ, సాంబమూర్తి గారిని ' మహర్షి బులుసు సాంబమూర్తి ' గారని పిలిచేవారు.
స్వతంత్రఉద్యమ పోరాటసమయంలో, కాకినాడలో అఖిల భారతకాంగ్రెస్ సెషన్ నిర్వహించే సమయంలో, ఆహ్వాన కమిటీ ముఖ్య కార్యదర్శిగా వున్న సాంబమూర్తి గారు, అదేరోజు వారి కుమారుడు పాముకాటు వలన ఆకస్మికంగా మృతిచెందినా, మనసు నిబ్బర పరచుకుని, సమావేశానికి ఏమాత్రం అంతరాయం కలుగకుండా, దుఃఖాన్ని తొక్కిపెట్టి, సదస్సుకు అందరినీ ఆహ్వానించి తనకు అప్పజెప్పిన బాధ్యతని చక్కగా నిర్వర్తించారు.
ఈ విషయం తెలిసి తరువాత గాంధీగారు, సదస్సును మధ్యలో ఆపుజేయించి, ‘ సంతాప సభ ‘ గా దానిని మార్చారు. సరోజినీ నాయుడు గారు ఎంతగానో ఆయన కార్యదీక్షను ప్రశంసించారు. ఆ సమయంలో, సాంబమూర్తిగారు నిజమైన మహర్షిలాగానే ప్రవర్తించారు.
అంతేకాదు, ఉప్పు సత్యాగ్రహం సమయంలో, సాంబమూర్తిగారు, బ్రిటిష్ వారు మనదేశాన్ని వదలి వెళ్లేవరకూ, వుప్పుముట్టనని ప్రతిజ్ఞ చేసారు. అదే విధంగా ఆహారం తీసుకున్నారు, ఉప్పులేకుండా.
జాతీయస్థాయిలో సాంబమూర్తిగారు హిందూసేవాదళ్ కి అధ్యక్షునిగా పనిచేసి, తాను ఛాందస బ్రాహ్మణ కుటుంబంలోనుంచి వచ్చినా, హరిజనులకు, స్త్రీల ఉద్ధరణకు యెంతో సేవజేశారు.
ఒక చిన్న కార్యకర్తగావున్న దుర్గాబాయి దేశముఖ్ గారిని ప్రోత్సహించి ఆమె న్యాయశాస్త్ర పట్టభద్రురాలు అయేటట్లుచేసి, ఆమెసేవలు దేశం ఉపయోగించుకునే విధంగా సాంబమూర్తి గారు, ఆమెను తీర్చిదిద్దారు. అంతేకాదు, సాంబమూర్తి గారు, ‘ చెన్నపురి ఆంద్ర మహిళా సభ ‘ వ్యస్థాపకులలో ఒకరు.
ఆరోజులలోనే, ఆంధ్రోద్యమంలో భాగంగా, సాంబమూర్తి గారు, మన తెలుగు న్యాయవాదులను, శాసనసభ్యులను ఇంగ్లీషుకు బదులుగా, తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించేవారు. ఉద్యమాల ద్వారా, తెలుగు మాట్లాడేవారి ఆత్మగౌరవాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండేవారు.
ఇక సాంబమూర్తి గారి రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే, 1935 లో మద్రాసు ప్రోవిన్షియల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు, సీ.రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు, సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు.
కాంగ్రెసు మంత్రివర్గ పరిపాలనలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు, వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.
స్వాతంత్రం వచ్చేవరకు, భరతమాత ముద్దుబిడ్డడిగా సాంబమూర్తిగారు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే వున్నారు. అయితే,స్వతంత్రం వచ్చిన తరువాత, నాయకులంతా పదవుల కోసం పోట్లాడుకుంటుంటే, ఆయన పదవుల కోసం ఉత్సాహం చూపలేదు. సామాన్య కార్యకర్తగానే ఉండిపోయారు.
ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, పొట్టి శ్రీరాములుగారి నిరశనదీక్షకు ఏ నాయకుడూ మద్దత్తు ఇవ్వకపోతే, సాంబమూర్తిగారు తాను మైలాపూర్ లో ఉన్న తనవిశాలమైన, విలాసవంతమైన భవంతిలో వారికి ఆశ్రయం ఇచ్చి, అక్కడే దీక్ష కొనసాగేటట్లు చేసారు. తరువాత, ఆభవనాన్ని మన ప్రభుత్వంవారు పడగొట్టి పొట్టి శ్రీరాములు సంస్మరణార్ధం గ్రంధాలయం స్థాపించి, ఒక్కరూపాయి కూడా, సాంబమూర్తి గారికి పరిహారం ఇవ్వలేదు. .
ఇంత వైభవంగా జీవితం గడిపిన సాంబమూర్తి పంతులుగారు, తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించి, తనను అనుసరించిన వారే తనను మోసం చేసినా, చివరిరోజులలో పేదరికంలో, అనారోగ్యంతో గడిపి 1958 వ సంవత్సరంలో పరమపదించారు.
స్వతంత్ర భారతదేశంలో పదిసంవత్సరాలు సాంబమూర్తిగారు, ఒంటరిగా, పేదరికంలో మ్రగ్గి, అనారోగ్య పరిస్థితులలో మరణించారని తెలిస్తే, కన్నీరు ఆగదు, ఎవరికైనా.
ఆయన చనిపోయే సమయానికి విధవరాలైన అయన కుమార్తె మాత్రమే బ్రతికివున్నది. ఆమె స్వతంత్ర సమర యోధుల పింఛను కోసము దరఖాస్తు పెట్టుకుంటే, బులుసు సాంబమూర్తిగారు సమరయోధుడిగా, ఎక్కడా పేరు వ్రాయించుకోలేదనే నెపంతో ఆమెకు పింఛను తిరస్కరించారు. అదీ మహర్షి సాంబమూర్తి గారి దేశభక్తి ఆంటే !
2008 లో భారత ప్రభుత్వం బులుసు సాంబమూర్తిగారి గౌరవార్థం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది.
ఆ మహర్షికి, ఆ మహానుభావుడికి, ఆ మనీషికి నివాళి. వారి జీవనసరళి ఎందరికో మార్గ దర్శకం.💥
గోవు,గజరాజు,శ్వేతాశ్వము దర్శించుకుంటాయి.వాటిని మనము
దర్శిద్దాము.. దీనినే విశ్వరూప దర్శనం అంటారు..🙏🕉🌹
https://www.v6velugu.com/significance-of-srirangam-temple-do-you-knownకార్తీక పురాణం: భూలోక వైకుంఠం ఎక్కడుందో తెలుసా.. https://www.v6velugu.com/significance-of-srirangam-temple-do-you-known
Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online