🙏 అందాల నటి జమునా రమణారావు గారికి నివాళి🙏
హైదరాబాద్ యూనివర్సిటీ లో చదువుకొంటూ వార్తా పత్రిక ల్లోనూ ...రేడియో దూరదర్శన్ లోను విస్సా లాంటి కొన్ని ఛానల్స్ లోను ...హైదరాబాద్ లో పని చేశాను ...అప్పట్లో 90 నుంచి 2005 వరకూ కూడా అనేక సాంస్కృతిక సంస్థలు
కళాకారుల సంఘాలు మీటింగ్స్ ...సన్మాన సభలకు ఆ..వార్తలు కవర్ చేయటానికి .సంగీతం ..నాట్యం .సాహిత్యం ల గురించి కాస్తంత పరిచయం ఉందని ..నన్ను పంపించే వారు అలా ఎందరినో కలుసుకొని ముచ్చటి0చే .అదృష్టం లభించింది...ఇంకో అవకాశం ఎక్కడో ఏదో సభలో మా నాన్న గారు
మరి0గంటి భట్టరా చార్యుల వారు పాల్గునే వారు ..అలా కూడా తోడుగా వెళ్ళాల్సి వస్తూవుండేది ..అప్పుడు చాలాసార్లు కనిపించిన వారు ..అక్కినేని గారు...జమున గారు ..వీళ్ళు ప్రతీ సభలో కనిపిస్తూ వుండే వారు ..ముఖ్యంగా త్యాగరాజ గాన సభ లో ....అలా అక్కినేని గారు ..అయితే నాన్న గారిని దీక్షితులు గారు ..అని పిలిచేవారు ...జమున గారు బాగా మాట్లాడేవారు ..ఇదంతా ఒక ఎత్తు అయితే ...జమున గారి భర్త ప్రొపెసర్ రమణారావు గారు నేను యూనివర్సీ టీ లో బాగా కలిసి మాట్లాడుకునేవారం ..వారు కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు ..నా రీసెర్చ్ టాపిక్ ఎలా నడుస్తోంది అడిగి తెలుసుకొనే వారు
కొన్ని మెలుకువ లు కూడా చెప్పేవారు ..ముఖ్యంగా ఓ యూలోఒక బ్యాంకు ఉంది
ఆ బ్యాంకు లో పని మీద వచ్చి నప్పుడు చాలా సేపు మాట్లాడుకొంటూ కూర్చునే వాళ్ళ0 ..చాలా చక్కగా ..ఆచి తూచి మాట్లాడుతూ వుండే వారు .సినిమా రంగం లో వారి వి కూడా కొన్ని సంభ0దాలు ...కూడా చెప్పారు ...నా కు అప్పట్లో స్థిర మైన ఆదాయం లేక ధైర్యం చేయలేదు ఎన్నో సార్లు నాన్న గారిని తీసుకొని ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు ....నాన్న గారు ఇక్కడ స్థిరంగా నివాసం వు 0డ లేక పోవడం ...నేను అప్పట్లో స్థిర పడకపోవడం ..లాంటి కారణాలతో వెళ్లలేక పోయాము ..తరువాత కొంత కాలానికి హైదరాబాద్ చేరి స్థిర పడే టైమ్ కి రమణారావు గారు పరమ పదించడం ఇక్కడికి చేరేసరికి నాన్న గారు పెద్దవాళ్ళు అయి ఇంటికే పరిమితం అవడం ..ఆ తరువాత వారూ వెళ్లిపోవడం అలా ...అలా జరిగిపోయాయి ..మనస్సులో మంచివాళ్ళు ..మంచిని కోరేవాళ్ళు మంచిగా జీవించి నా లాంటి సామాన్యులు మరియు అందరి జనుల గుండెల్లో సు కీర్తిని ఆ చంద్ర తారార్కం ..నింపిన..ఎందరో మహానుభావులు అందరికి కోటి సాష్టాంగ ప్రాణామాలు అర్పిస్తూ అందమైనసోయగాలనటి జమునా రమ ణా రావు గారికి అశ్రునయనాలతో నివాళులు సమర్పించు కొంటున్నాను .
🙏🙏🙏🌹🌹🌹.డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణభట్టరాచార్య .హైదరాబాద్