Pages

ఆంజనేయుడు త్రినేత్రుడా? రాక్షసవధతో ముక్కంటిగా మారాడా?

ఆంజనేయుడు త్రినేత్రుడా? రాక్షసవధతో ముక్కంటిగా మారాడా?

త్రినేత్రుడు అంటే మనకు ముందు పరమశివుని రూపమే ప్రత్యక్షమవుతుంది. ముక్కడి అంటే శివుడు, శివుడంటే ముక్కంటి అని మనకు తెలిసిన విషయం. కానీ హనుమంతుడు కూడా త్రినేత్రుడు అని మనలో ఎంతమందికి తెలుసు? అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? ఆంజనేయుడు త్రినేత్రుడు మాత్రమే కాదు, దశభుజుడు కూడా. సామికి రెక్కలు కూడా ఉన్నాయట. దశభుజుడి చేతుల్లో శంఖు, చక్రం, కపాలం, కొరడా ఇలా వివిధ ఆయుధాలతో ఉన్నాడు. ఇంతకీ ఆ స్వామి ఇటువంటి అవతారాన్ని ఎందువల్ల ఏ సందర్భంలో ఈ అవతారం ధరించినట్టు?

రామరావణ యుద్ధం ముగిసిన తరువాత విభీషణుడు శ్రీరామచంద్రుడికి పుష్పకవిమానం బహుకరించగా, అందరూ ఆ పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. మార్గమధ్యంలో శ్రీరాముని ఆదేశం ప్రకారం భరద్వాజ ముని ఆశ్రమం దగ్గర ఆగి, విడిది చేశారు. ఆరోజు పంచమి తిథి. అప్పటికి రాముని అరణ్యవాసం  అయిన 14 సంవత్సరాలు పూర్తయ్యాయి.  కుశల ప్రశ్నల తరువాత శ్రీరాముడు భరద్వాజ మునితో ఇలా అన్నారు "ఓ మహాత్మా! అయోధ్యా నగరం సుభిక్షంగా ఉందా? అందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో ఉన్నారా? భరతుడు రాజ్యపాలన ఎలా చేస్తున్నాడు? మా తల్లులు అందరూ క్షేమమే కదా?'' అని అడిగాడు. అందుకు భరద్వాజ ముని రాముడికి కొన్ని వరాలు అనుగ్రహించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అప్పుడు రాముడు "నేను అయోధ్యా నగరానికి వెళుతున్నాను. నేను వెళ్ళే దారిలో వృక్షాలన్నీ ఫలప్రదంగా ఉండాలి, వివిధ ఫలాలు అమృతంలా ఉండాలి'' అని కోరుకున్నాడు.

భరద్వాజ ముని ఆతిథ్యం స్వీకరించిన తరువాత శ్రీరాముడు కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా 'నారాయణ ... నారాయణా' అనే శబ్దం వినిపించింది. నారదుడు అక్కడికి వచ్చి శ్రీరాముడికి అభివాదం చేసి "శ్రీరామా! ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి నీ దగ్గరకు వచ్చాను'' అని అన్నాడు. శ్రీరాముడు చెప్పండి నారదా అని అన్నాడు. "రామయ్యా! రావణ సంహారం జరిగినందువల్ల సంతోషమా? రావణ సంహారం జరిగినప్పటికీ, దుష్టసంహారం ఇంకా ముగియలేదు కదా? నీ వింటి అంబులపొదికి ఇంకా పని కల్పించాల్సిందే'' "వివరంగా చెప్పు నారదా'' అన్నాడు శ్రీరాముడు. "రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసిందనుకుంటున్నావ్, అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడు అనే రాక్షసులు నిన్ను గెలవడానికి సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. వారు శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే ఆ రాశాసులకు అడ్డుకోవడం చాలా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోను కావాల్సి ఉంటుంది. అందుకే రామా! నీవు త్వరగా ఆ రాక్షసులను అంతం చేసే దిశగా ఆలోచించు'' అని అన్నాడు. రాముడు ఆలోచనానిమగ్నుడై ఉండగా నారదుడు మళ్ళీ మాట్లాడుతూ "అంత దీర్ఘంఘా ఏమి ఆలోచిస్తున్నావు రామా?'' అని అడిగాడు. దానికి శ్రీరాముడు "నారదా! నేను అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాను. "లక్ష్మణుడుని పంపించవచ్చు కదా?''

"తను నా నీడవంటి వాడు మహర్షీ? నన్ను వదిలి ఉండనని శపథం చేశాడు కదా! ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా?'' అని అంటూ ఉండగా రాముని దృష్టి హనుమంతుడిపై పడింది. "ఆంజనేయా! ఇలా దగ్గరకు రా'' అని పిలిచాడు.
"స్వామీ!'' అంటూ ముకుళిత హస్తాలతో హనుమంతుడు రాముని ఎదురుగా వచ్చాడు. "నా ప్రియమైన హనుమంతా ... రాక్షస సంహారం నీ చేతుల మీదుగా కావించు'' అని ఆనతిని ఇచ్చాడు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షసవధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు.

అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు..

Benifits of chanting OM

ఓం''...  తో   అలసట  మాయం...
శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక.......
  ఓం... శబ్దంతో.... 
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. 
👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది. 
👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 

👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...
👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది. 
👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 

👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 

👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. 
👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 
👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. 
👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. 
👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 
👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 

👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. 
👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.... 
ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.........  మీ  భందు మిత్రులతో  చేయించండి ........ ఓం ,  ఓం , ఓం..



 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online