Pages

Sree Rama Pattabhishekam for all Job related problems

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"

ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను  దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

Why r Bananas used for Pujas?

పూజార్హమైన ఫలాలు ఎన్నిఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు ఎందుకు......!!

మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటిచెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి లేకుండా ఉండవు. అరటిని ‘కదళీ’, ‘రంభా’ అనే పేర్లతో కూడా పిలుస్తారు. రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే, భాగవతంలో అరటి ఆవిర్భావమును గురించి వివరించబడింది.
 
అరటి జన్మ వృత్తాంతం......
 
సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి ఆమెను “బీజం లేని చెట్టు” గా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళీ (రంభ) పేరుతో అరటిచెట్టుగా జన్మించింది. తన శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర చేసింది. కదళీ తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై, ఆమెకు పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా అం అంశ రూపమైన కదళిని మానవ, మాధవసేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్థశి. దీనినే అరటి చతుర్థశి అని కూడా అంటారు.\
 
 అరటి చెట్టు ప్రాముఖ్యత
 
రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉండి. మాఘ చతుర్థశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, పెరటిలోనున్న అరటినిగానీ, లేదా అరటి పిలకనుగానీ పూజ చేయవచ్చు. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి, వారికఇ అరటిదవ్వ, ఐదు అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానము కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది.
 
రామాయణంలో అరటిపూజను సీతారాములు చేసినట్లు తెలియుచున్నది.
రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతుని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటిఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడివారికి తెలియ జేయడానికి, తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేసాడు. భరద్వాజ మహర్షి చేసేదిలేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డన చేసాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈవిధంగా వివరించి చెప్పాడు.
 
“శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి”.
 
పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు. ఎందుకు?
 
భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలం లభిస్తుంది. కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంట శ్రేష్ఠం కాడు. కాని, అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండ్లును ఇస్తాయి. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది.

Three names of Shri Maha Vishnu for good health

సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!

శ్రీ అచ్యుతాయ నమః, 
శ్రీ అనంతాయనమః,
 శ్రీ గోవిందాయనమః

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.

వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. 
దానిపేరు సర్వారోగాస్త్రం.

దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది

దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..

శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః

ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి 
కలి ప్రేరితమైన రోగాలు రావు
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. 
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ 

అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-
సాధు పరిత్రాణం కొరకుా, 
దుష్టవినాశం కొరకుా, 
ధర్మసంస్థాపన కొరకుా 
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.

భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. 
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు 
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.
           
సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా 
ఓం అచ్యుతాయ నమః, 
ఓం అనంతాయ నమః, 
ఓం గోవిందాయ నమః 
అని ఆచమించి ఆరంభిస్తాం.
            
క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.

అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ.!

ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. 
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". 
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా 
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. 
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే 
ఇంకొక ప్రమాణం అవసరమా" !.
పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.
       
పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. 
పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. 
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని 
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. 
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు. 
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని -- 
అచ్యుత, అనంత, గోవింద  
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా  
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క 
ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. 
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.
      
కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు 
ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, 
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.

Shrihanuman - different abhishekams

ఆంజనేయస్వామికి ఏ అభిషేకం చేస్తే ఏమి
ఫలితాలొస్తాయి ?

ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి

ఆవునెయ్యి -ఐశ్వర్యం

తేనె - తేజస్సువృధ్ధి

పంచదార - దు:ఖాలు నశిస్తాయి

చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది

కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .

విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి

పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
 
గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.

రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం

సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది

అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.

ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది

కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.

నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి

పసుపునీటితో - సకలశుభాలు ,సౌభాగ్యదాయకం

నువ్వులనూనె తో అభిషేకిస్తే - ,అపమృత్యు నివారణ .

సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం
సుదర్శన చక్రం

Shri Hanuman - Aaku (tamalapaku/pan pattha) pooja benefits

ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు
వేస్తారు ?

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
 

1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది

2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.

3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.

4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.

5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.

6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.

7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
 
 
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది

10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.

11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.

12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .

28 names of Shri Subrahmanyeswara Swami

This year people r saying it is good to read subrahmanya namas and sthotras for our well being.  so here r the 28names of the Lord.
 
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి 28 నామములు

1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికేచెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారు. ఈ విషయమే, శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26.ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27.సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

* స్కంద ఉవాచ
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.

" సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు "

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు - ఆచరణ విధానం

ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:- చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

"ఉగాది" ఆచరణ విధానం

ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారులు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నారు.

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...

ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...

ఉగాది రోజు

    తైలాభ్యంగనం
    నూతన సంవత్సరాది స్తోత్రం
    నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
    ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
    పంచాంగ శ్రవణం

మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. "అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌

భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌

అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.

ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:

అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:

యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
(5) పంచాంగ శ్రవణం

"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌"

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.

"పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్"

ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.


శ్లోకం

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం. అదే దేవి స్వరూపం. అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది. విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.

శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.

ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి'. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.

మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి
"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.

Ugadi Subhakankshalu


Magic rice

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్క‌ర్ పెడ‌తా అంటారు ఇంట్లో ఆడోళ్లు. వేళ‌కాని వేళ‌లో మ‌మ్మీ ఆక‌లి అని పిల్ల‌లు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడ‌తా అంటారు.. ఇక నుంచి ఈ మాట‌లు వినిపించ‌వు.. అంటే అన్నం తినం అని కాదు.. వండ‌దు అని కాదు.. అన్నం అంటే ఇప్పుడే నాన‌పెట్టా.. ఓ అర గంట ఆగు వ‌డ్డిస్తా అంటారు. అవును దేశంలోనే ఉత్ప‌త్తి అవుతున్న ఈ ర‌కం బియ్యం.. మ‌రికొన్ని రోజుల్లోనే దేశంలోని అంద‌రికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంత‌కీ ఉడ‌క‌ని.. నాన‌బెడితే అన్నం త‌యార‌య్యే ఈ ర‌కం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం…
 
 
అసోంలో పండిస్తున్నారు
ఈ బియ్యం పేరు బోకా సౌల్. అంద‌రూ ముద్దుగా మ్యాజిక్ రైస్ అంటారు. దీనికి మ‌రోపేరు కూడా ఉంది.. అదే మ‌డ్ రైస్. వీటిని అసోంలోని కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు రైతులు. ఈ పంట సీజ‌న్ జూన్ – డిసెంబ‌ర్ నెల‌. ఈ ఆరు నెల‌లు పంట‌కు అనుకూలం. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పొయ్యిమీద పెట్టిన ఉడికించాల్సిన అవ‌స‌రం లేదు. చ‌న్నీళ్ల‌లో ఓ గంట నాన‌బెడితే చాలు.. అన్నం త‌యారు అవుతుంది. చ‌క్క‌గా తినేయొచ్చు. మామూలు అన్నంలాగే ఉంటుంది. ఓ కేజీ మామూలు రైస్ వండితే.. ఎంత ఎక్కువ అన్నం వ‌స్తుందో.. అదే విధంగా ఈ మ్యాజిక్ అలియాస్ మ‌డ్ రైస్ ను నాన‌బెట్టినా అంతే ఎక్కువ వ‌స్తుంది. ఈ పంట పండించ‌టానికి పురుగు మంద‌లు, ర‌సాయ‌న‌క ఎరువులు అవ‌స‌రం లేదు. వీటిని చ‌ల్లితే పంట నాశ‌నం అయ్యే ప్ర‌మాదం ఉంది అంటున్నారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు. సో.. గ్యాస్ తో పనిలేదు.. క‌రెంట్ అవ‌స‌రం లేదు.. కుక్క‌ర్లు కొనాల్సిన అవ‌స‌రం లేదు.. జ‌స్ట్ ఓ గంట నాన‌బెడితే చాలు అన్నం త‌యారీ..
 
 
పేటంట్ వ‌చ్చింది.. దేశం గురించింది ః
కొన్ని సంవ‌త్స‌రాలుగా మ‌డ్ రైస్, మ్యాజిక్ రైస్ పండిస్తూనే ఉన్నారు అసోం రైతులు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం దీనికి పేటెంట్ ఇచ్చింది. దీంతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో ఈ ర‌కం వంగ‌డాన్ని స్రుష్టించారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు. అసోం రాష్ట్ర ప్ర‌జ‌లు పండుగ‌లు, ఫంక్ష‌న్ల‌లో ఈ బియ్యంతో త‌యారైన అన్నాన్నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. మొఘ‌ల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్ప‌త్తి జ‌రిగింది. 17వ శ‌తాబ్దంలో సైనికులు ఇదే ఆహారంగా తీసుకునేవారంట‌.
 
పోష‌క విలువ‌ల మాటేంటీ
ఈ బియ్యంపై ఇప్ప‌టికే ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ముఖ్యంగా గువాహ‌టి యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో బోకా సౌల్ బియ్యం విశిష్ట‌త‌ను వివ‌రించారు. ఈ బియ్యంలో  పీచుప‌దార్ధం 11శాతం, మాంస‌క్రుతులు 7శాతం ఉన్న‌ట్లు తేలింది. ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలో వేడి కూడా త‌గ్గుతుంది.ఆడ వాళ్ళందరికీ మంచి శుభవార్త ఇది

Sanskrit and Neuroscience

 
Dont  teach Baa Bas Black Sheep. Teach : 
Vakrathunda mahaa kaaya....

Read on. 
Western researchers reveal why children who memorize sanskrit mantras become super intelligent as they grow up*

Neuroscience shows how  rigorous memorising can help the brain. The term the ‘Sanskrit Effect’ was coined by neuroscientist James Hartzell, who studied 21 professionally qualified Sanskrit pandits. He discovered that memorising Vedic mantras increases the size of brain regions associated with cognitive function, including short and long-term memory. This finding corroborates the beliefs of the Indian tradition which holds that memorising and reciting mantras enhances memory and thinking.

Dr Hartzell’s recent study raises the question whether this kind of memorisation of ancient texts could be helpful in reducing the devastating illness of Alzheimer’s and other memory affecting diseases. Apparently, Ayurvedic doctors from India suggest it is the case and future studies will be conducted, along with more research into Sanskrit.

While we all know the benefits of mindfulness and meditation practices, the findings of Dr Hartzell are truly dramatic. In a world of shrinking attention spans, where we are flooded with information daily, and children display a range of attention deficit disorders, ancient Indian wisdom has much to teach the West (and their 'modernised' intellectual serfs in the East). 
Even introducing small amounts of chanting and recitation of the common sanskrit mantras like gayatri mantra daily could have an amazing effect on all of our brains.

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online