Pages

ప్రేమ కు మరొక వైపు short story part - 2

ఆదివారం ......బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని  త్వర ,త్వర గా శృతి ఇంటికి చేరుకున్నాడు శ్రీరామ్ .  రండి శ్రీరామ్ గారు లోపలికి ఆహ్వానింఛి తీసుకొచ్చారు మూర్తిగారు .రండి బాబు కూర్చోండి సోఫా చూపె ట్టిం ది శృతి తల్లి అల్గా .నాన్నగారు మీకొక సర్ప్ రై జ్  విషయం చెబుతాను అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ   లోపలనుంచి టీ కప్పులు  ట్రే  తీసుకొచ్చి అందరకు టీ లు ఇస్తూ చెప్పింది .శృతి .     ఇప్పడు ఏమి వుంటుంది. ప్రిన్సిపాల్ వచ్చిన రోజు నుంచీ డల్ గా ఉంటూ ,ఆయన గురించి చెబితేనే లేచి  వెళ్ళిపో యేది ,ఇప్పుడు  చాలా వుషారు గా వుంది ,నాకు ఏమి అర్థం కావడం లేదు ,బుర్ర గోక్కుంటూ    ఆలోచనల్లో పడిపోయాడు మూర్తిగారు . శ్రీరామ్....  .  మీరు కూడా అది  ఏమిటో ఆలోచిస్తున్నారా ?   కొంటెగా నవ్వింది శృతి ,ఏమో మేడం మీరే అంటున్నారు గా స ర్పరై జ్ అని మీరే.....  చెప్పండి . ఏమి లేదు నాన్నగారు అప్పట్లో హైదరాబాద్ లో పక్కన యూనివర్సిటీ నుంచీ   ఓ  .ఫ్రెండ్ వస్తుండే వారు .అని చెప్పాను గుర్తు వుందా .వాళ్ళ నాన్నగారు సర్పంచ్ .అని    ఆ ...ఆ  అవును ,ఆ అబ్బాయి  పెళ్ళి కుదిరింది అని కూడా చెప్పావు .  మధ్యలో అలా మాట లు కలుపుతున్నాడు తండ్రి మూర్తిగారు .ఆ.. అదే  పర్సన్   ఈయన గారు శ్రీరామ్ ......పెద్దగా నవ్వు పెంచి కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది శృతి . ఓ  అయుతే......మా అమ్మాయి  దోస్త్ వే అన్నమాట .సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెప్పింది తల్లి అల్కా .ఇంతకీ మీ పెళ్ళి అ యుందా  బాబు ఆత్రుతగా అడిగింది తల్లి అల్కా .  అయుం దండీ . నాకు పెళ్ళి అయుం ది .వినయం గా చెప్పాడు శ్రీరాం .ఇంకే ముందీ ఇందులో సర్ ప్రైజ్  ,నా మొహం అనుకొంటూ లేచి వెళ్ళిపోయాడు తండ్రి మూర్తి గారు .ఆయన లోపలికి వెళ్ళిపోయు ఇక వంట చేయడం మొదలు పెట్టాడు .

  ..మా అమ్మాయి కి ఎన్నో పెళ్లి సంభంధాలు వచ్చా యి .ఎంతో చెప్పి చూశాం .మనిషి వింటే గా....... దీర్ఘాలు తీస్తోంది తల్లి అల్కా .బాబూ   నీకు వంట చేయడం,బట్టలు ఉతకడం ,ముగ్గులు ,పిండి వంటలు  అదీ వచ్చా ?కొంచం గట్టిగా అడిగింది తల్లి అల్కా ..ఓ  దానిది ఏముంది లేండి ,  చదువుల  కోసం  దేశం తిరగటం  వల్ల  వంటలు ఆటోమాటిక్ గా వచేస్తాయు అనుకొండి .మీరు ఎందుకు అలా అడిగారో ?నవ్వు ను తెప్పించు కొంటూ అడిగాడు  శ్రీరామ్ . మరేలేదం డి బాబు ఈ విషయం పట్టే మీ ఇంట్లో ని వారు స్త్రీ  పై  ఎలాంటి అభిప్రాయం కలిగి వున్నారో తెలుస్తుంది .వంటలు ,ముగ్గులు ఇవన్నీ స్త్రీలే చేయాలని రూలా ఏమిటి ,తర తరా ల  నుంచీ  మగాడు ,స్త్రీ కి బానిసత్త్త్వం లో కి నెట్టి ,వెట్టి చాకిరి చేయుస్తూ వున్నాడు ,పైకి ఎక్కి క్రిందకు తొక్కేస్తున్నాడు . అందుకే నేను వంటలు ,ముగ్గులు నేర్చుకోలేదు నేను ఆ వెట్టి చాకిరి లో పడదల్చుకో లేదు .అయునప్పటికీ పిల్లలను కన్నాను .  దానిలో ఏముంది లెండి ,అది మీరు చేయాల్సిన డ్యూటీ యే  కదా    గొ ణు క్కుం టూ ,ముసి ముసి గా నవ్వాడు శ్రీరామ్ .ఏమిటి బాబు అంటున్నారు ఇంతకీ  మీ పేరు అల్కా అంటారేమిటి ? కొంచం ఆశ్చర్యం గా అడిగాడు శ్రీరాంమ్ . నేను చెబుతా శ్రీరామ్  మా అమ్మ పేరు అమరవాది లక్ష్మి ఫెమ్మినిస్ట్ .నవ్వుకొంటూ చెప్పింది శృతి .ఆ ..ఫెమినిస్ట్  అనేది వీళ్ళే తగిలించారు బాబు....కొంచం గర్వంగా ,కొంచం సిగ్గు పడుతూ చెప్పింది తల్లి అల్కా .  పోనీలెండి మీరు ఇష్టపడే విషయమే కదా .అంటూ ఆమె కేసి పరీక్షగా చూశాడు .జుట్టు  బాబ్డీ హెయిర్ ,స్లీవ్ లెస్ జాకెట్ ,కళ్ళ అద్దాలు ,ఒక రకమైన వాదానికి అలవాటుపడ్డ ముఖకవళికలు .మళ్ళీ నుదుట చుక్క ఏమిటో ఈ సాంప్రదాయ కుటుంబాల  వాళ్ళకే ఈ మాయరోగం .మగ ,ఆడ బేధాలు  , పురాణాలను తిట్టడం  …… మంచివాళ్ళు ,చెడ్డవాళ్ళు అన్నిచోట్ల ,అందరిలోనూ వుంటారు ,ఆడ ,మగ వాల్లలోను కూడా అంతే .అలా ఏదేదో  ఆలోచిస్తున్నాడు శ్రీరాంమ్.

     .మూర్తిగారు ,వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుటుంబము అంతా   శ్రీరాంమ్  తో  కల్సి  భోజనాలు చేయడం ,  పిచ్చా పాటి గా అనేక విషయాలు మాట్లాడుకోవడం ,ఆలా అలా సాయం కాలం అయుం ది .      అందరికి నా థాంక్స్ ,చాలా కాలం తరువాత  నన్ను ,నా సమస్య ను మర్చిపోయి ,  మీ తో ఆనందంగా గ డిపాను .ఇక వుంటాను .మళ్ళీ ఒకరోజు అందరం కల్సుకుందాం  అని అందరికి బై  చెప్పి  బైటకు నడిచాడు శ్రీరా మ్ ... .    .శృతి   మీతో చాలా విషయాలు మాట్లాడాలి .కొంచం ఏకాంతం కావాలి   రహస్యం గా అడిగాడు శ్రీరాంమ్ .  నాన్న గారు     ఈ   గుడి  లోకి వెళ్లి వస్తాం  అంటూ  ఎదురు గా వున్న దేవాలయం లోకి వెళ్ళారు  శృతి  ,శ్రీరామ్ .

ఓ పెద్ద చెట్టు ,దాని క్రింద పచ్చని గరిక్ కాస్తంత విశాలం గా వుంది .అక్కడ సెటిల్ అయ్యారు ఇద్దరు .శృతి  మీరు నేను చెప్పేది అంతా జాగ్రత్తగా వినాలి అంటూ తన ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ .ముందుగా నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి , మన ఫ్రెండ్ లక్ష్మి నాకు ఫోన్ చేసి  మీ   గురించి  మొత్తం చెప్పింది  శృతి  బలే పని చేశారే . మొత్తం తప్పు అంతా  నా పై రుద్ది నన్ను తిట్టుకొంటున్నారే ?   మీరు  నన్ను ఇస్తాపడుతున్నావని  నాకు ఎలా తెలుస్తుంది , చెప్పు అమ్మాయి ? నాకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా నువ్వు చెప్పితే నిన్ను వదిలి వెళ్ళిపోతే  అప్పుడు నాది తప్పు ,నన్ను తప్పు పట్టాలి    . సరే ఓకే యనీ హ వ్  నువ్వు  నా గురించి  నీ  వుద్యోగం మానకుండా వచ్చావు చూశావా ,అది చాలా మంచి నిర్ణయం దానికి నిన్ను అభినందిస్తున్నాను . తలవంచి కాస్తంత విచార వదనం తో  శ్రీరాంమ్  చెప్పేది బుద్దిగా వింటూ కూర్చో౦ డి పోయునది శృతి

 

ప్రేమ కు మరొక వైపు short story part - 1

రోడ్లన్నీ చాలా ట్రాఫిక్ తో నిండి పోయి వున్నాయి .ఒకటే రణ గొణ్ ధ్వనులతో వాహనాలు పరిగెడుతూ వున్నాయి .ఎవరి తొందరలో వాళ్ళు టైం చూసుకొంటూ గబ గబా నడిచి పోతున్నారు ఇంతలో ఒకామె భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళు తోంది. ఇంతలో , హలో మేడం ... ... హలో మేడం .....మీరు .... శృతి ... అవునా ? మీరు సీఫెల్లో ఇంగ్లీష్ లిట్ ..హైదరాబాద్ లో చదువుకున్నారు . యా.....మై కరెక్ట్ ...ఎంతో ఆత్రుతగా ,ఆర్ధ్రరత కలబోసి పలుకరించాడు శ్రీరామ్ .

ఒక్కసారిగా ఆమె ...అతనికి ఎదురుగా తిరిగి నిలబడింది . దగ్గర ,దగ్గర ఆరు అడుగుల ఎత్తు , బలమైన భుజాలు ,చక్కని హెయిర్ స్టయుల్ ,మెరుస్తున్న తెల్లని విశాల నేత్రాలు , చల్లగాలికి పైన ధరించిన బ్లేజర్ , చేతిలో చిన్న బ్రీఫ్ కేసు దానిని నేల పై పెడుతూ ఆమె వైపు చూసాడు .

.... యస్ ..మీ...రా..శ్రీరాం . నేను గుర్తు పట్టానులేండి , ఏమిటి మీరు ..ఇక్కడ ..ఇంత ..షడ్ న్ గా ..నిజం గా ర్పరైజే .....ఎనీ హౌ ,ఓకే , నేను బాగున్నాను ....... మీరు కూడా బాగున్నారా ?ఓకే ఉంటానండి... థాంక్స్ ....బై అంటూ వేగం గా అక్కడ ను౦చీ కదిలి వెళ్లి పోయుంది .శృతి. ఏమిటి ఇంత విచిత్ర ప్రవర్తన ..ఎప్పుడు అన్ని విషయాలు మాట్లాడేది గల గలా మాట్లాడే మనిషి , నన్ను కొత్తగా చూసినట్లు గా వెళ్ళిపోతుంది ఆమె వై పు అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్ . అదీ పనిగా ఆలోచిస్తూ గురపు బండి ఎక్కాడు. ఎక్కడకు వెళ్ళాలో అడ్రస్ చెప్పాడు శ్రీ రామ్ .కొండల్లో....... కోనల్లో... తిరిగి తిరిగి .... పెద్ద భవనం ముందు ఆగింది గుర్రపు బండి సార్ర్ ఇదే లాస్ట్ . ఇంకా లోపలికి వెళ్ళనివ్వరు అంటూ గుర్రపు బండి దిగి నిలబడ్డాడు తోలేవాడు .

ఓకే అంటూ సెక్యూరిటీ వాళ్ళకు అంతా వివరించి చెపాడు శ్రీరామ్ సెక్యూరిటీ వాళ్ళు సామాలను అన్ని తీసుకొని వెళ్ళిపోయారు తనకు కేటాయించిన నివాసంలో శ్రీ రామ్ ని దింపారు

సార్ .. రోజు విశ్రాంతి తీసుకోండి .రేపు మిమ్ములను అందరికి పరిచయం చేస్తాను అంటూ ,శ్రీరామ్ దగ్గర అవసరమైన పేపర్స్ తీసుకొని వెళ్ళాడు .అసిస్టెంట్ మూర్తి


* * * *. *

 

ప్రయాణంలో అల్లసిపోయిన శ్రీరామ్ ..... ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు . తెల్లరిపోయింది పనివాళ్ళు

తనకు కొత్త ప్రదేశం కొత్త ఉద్యోగం అని ఆలోచన రాగనే హడావిడిగా లేచి తయారయ్యాడు . రెసిడెన్షియల్ స్కూల్ కదా విద్యార్ధులు ఉపాధ్యాయులు ఉద్యోగులు అలా అంత కలిసి మెస్ కి వస్తుపోతూ వున్నారు .

టీచర్స్ అంతా టైం చూస్కుంటూ క్లాసు రూమ్ కి వెళ్ళిపోతునారు. ఈరోజు కొత్త ప్రిన్సిపల్ వస్తునారు కదా విధుల్లో జాయిన్ అవ్వుతారట ఇయనా ఎల్లాంటి వారో ఏమో అలా ఏదేదో మాట్లాడుకుంటూ ఉద్యోగులు అంతా ఎవ్వరి బిజీ లో వాళ్ళు ఉన్నారు . విశాలమైన పెద్ద క్యాంపస్ ఫస్ట్ తరగతి నించి గ్రాడ్యుయేష్ న్ వరకు ఒకటే ప్రాంగణం కావడం వల్ల ఎప్పుడూ కోలాహలం గా వుంటుంది .శ్రీరామ్ కు అంతా కొత్త అవడం వల్ల ,శ్రీరామ్ ని వెంట పెట్టుకొని మెస్ , పనివాళ్ళను ,ఇతర అధికారులను పరిచయం చేస్తున్నాడు అసిస్టెంట్ మూర్తి .

ఇక ఆరోజు సాయంత్రం స్టాఫ్ మీటింగ్ .ఉపాద్యాయులు ,ఇతర ఉద్యోగులు అంతా వచ్చి కూర్చోం టున్నారు .కొత్త ప్రిన్సిపాల్ అనే వుత్సకతో అందరు ఎదురు చూస్తూవున్నారు .చైర్మన్ కొత్త ప్రిన్సిపాల్ శ్రీరామ్ ని వె మ్మటి పెట్టుకొని లోపలికి ప్రవేసిం చారు . అందరూ లేచి నిలబడ్డారు .శృతి ఒక్కసారిగా ఖంగు తింది .శ్రీరామ్ మాకు ప్రిన్సిపాల్ గా వచ్చాడా ! రేర్ప్ప ఆర్పకుండా చూస్తూ నిలబడి పోయింది .అందరూ కూర్చొన్నారు , శ్రీరామ్ నిలబడి వున్న ఆమె వైపు చూశాడు.మేడం మీరు కూడా కూర్చోం డి .ఏదైనా చెప్పా లనుకొంతున్నారా ?చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్ .అదేమీ లేదండి ,కంగారు పడుతూ చెమట తుడుచు కొంటూ కూర్చుండిపోయుంది .శృతి . కొత్త ప్రిన్సిపాల్ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామ్ బయోటెక్నాలజీ లో డాక్టరేట్ చేసినప్పటికి విద్యాబొధన పై ఆసక్తి తో ప్రిన్సిపాల్ గా వచ్చారు .ఇటువంటి మేధావులు సంస్టకే కలికితురాయి చెప్పుకోవచ్చు .ఇలా చైర్మన్ , శ్రీ రామ్ గురించి పరిచయ వాక్యాలు చెప్పుకొంటూ పోతున్నారు సంస్ట చైర్మన్.

కొన్ని సంవత్సరాల క్రిందట .....శృతి కళ్ళల్లోని జ్ఞాపకాల దొంతర లోకి వెళ్ళిపోయింది ఆమె మనస్సు . అవును రోజుల్లో ప్రక్కనే యూనివర్సిటి క్యాంపస్ నుంచీ మా సీఫెల్ క్యాంపస్ లోకి వస్తూవుండేవాడు .మేం అంతా అమ్మాయి లమే కాబట్టి అందరం కలిసి ప్రతిచోట కు వెళ్ళుతూ వుండేవాళ్ళం .తను మా క్యాంపస్ లో వున్న మీడీయా సెంటర్ కి స్క్రిప్ట్ వ్రాయడానికి వచ్చేవాడు .అలా అలా లైబ్రరీ లో మా కు పరిచయం .పైగా కొత్త ,పాత తేడా ఏం లేకుండా అందరి ని పలుకరించి వెళ్తూ వుండే వాడు .శ్రీరామ్ తో పరిచయం కానీ స్నేహం కాని ఆరోగ్యకర మైనది .ఎవ్వరిని నొప్పించే వాడు కాదు .మా లో ఎవరికీ ఏమి కావాలన్నా అందరిని స్వంత వాళ్ళుగా భావించి అన్ని సహాయాలు చేసేవాడు ..ఎందుకో కొంతకాలం వరకు షడన్ గా మా వద్దకు రావడం మానేశాడు .నాకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం గా వుండేది . నేను చాలా కాలం అతగాడి కోసం ఎదురు చూశాను .శ్రీ రామ్ వుండే హాస్టల్ కి కూడా వెళ్లి ఎంక్వయిరీ చేశాను .శ్రీ రామ్ కి పెళ్లి కుదిరింది అందుకే వాళ్ళ ఊరు కి వెళ్ళిపోయాడు .అని అతగాడి రూమ్ లో వాళ్ళు చెప్పారు .కొద్ది రోజులు బాధగా అనిపించేది ,ఇక తరువాత పరీక్షల బిజీ , తరువాత కోర్సు అయుపోవడం ఇలా మా వూరు కి వచ్చే యడం ఇక అప్పటినుంచి కనిపించకుండా పోయి ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు . పైగా చెప్పకుండా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి .అలా పరధ్యానములో వున్న శృతి కి మీటింగ్ అయుపోయు అందరూ బైటకు నడుస్తూ వుంటే అప్పుడు లోకం లోకి వచ్చింది శృతి .


* * * * *

శృతి ఇంట్లో తల్లి ,తండ్రులు , చెల్లెలు ,తమ్ముడు అంతా కల్సి కూర్చొని భోజనాలు చేస్తున్నారు . "ప్రిన్సిపాల్ గారు పేరు శ్రీరామ్ అట ,నిజముగా పేరు కు తగ్గట్టు శ్రీరామే ,మంచి మనిషి .వినయం కలవాడు .ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనే అనిపిస్తుంది .కష్ట సుఖాలలో ,లై ఫ్ లో డక్కా ముక్కిలు తిన్నవాడిలా వున్నాడు .అందుకే దేని విషయములో తొందర పడడు .పెద్దలు అంటే గౌరవం ,ప్రతీ విషయం చాలా ఓపెన్ గా ఉంటాడు .అలా పొగడ్తలతో దండకం చదివేస్తున్నాడు శృతి తండ్రి మూర్తి గారు , ఏమ్మా ..శృతి ఒకరోజు శ్రీరామ్ ని మన ఇంటికి ఆహ్వానించాలమ్మా . అంటూ ఏదో చెప్పబోతున్నప్పుడే భోజనం మద్యలో వదిలేసి లేచి వెళ్లి పోయింది శృతి .ఏదోలే ఆడపిల్లలు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనుకొని తండ్రి మూర్తి సర్దుకొని తనపనిలోకి వెళ్ళిపోయాడు .సాయంత్రం వేళ ఎర్రని సూర్య కిరణాలు తన ఇంటి పైన పరచుకున్నాయి .ఇంటి పక్కన చెట్ల నిండా పక్షులు ముసురుకొని తెగ గోల పెడుతున్నాయి . శృతి అటువైపే చూస్తూ ఆలోచనల్లో పడింది .నేను ఇక స్కూల్ కి వెళ్లక పోవడమే మంచిది . అక్కడ మనశ్శా౦ తి కరువై పోతుంది .శ్రీరామ్ కి దూరం గా వుంటే అంతా మంచి జరుగుతుందేమో .అలా రక రకాల గా ఆలోచించి వుద్యోగం మానేయాలని నిర్ణయం తీసుకొంది శృతి .హైదరాబాద్ లో వున్న తన దోస్తు లక్ష్మి కి ఫోన్ చేసి తన బాధ నంతా చెప్పుకోవడం ప్రారంభి చింది .శృతి యు అర్ లక్కీ ,శ్రీరామ్ అక్కడ ప్రత్యక్షమైయ్యా డా . వుద్యోగం మానేయడం ఎవడు చెప్పాడే .నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా ,నీకు ఎందుకు చిరాకు ,పరాకు ,సూటిగా అడిగింది లక్ష్మి .అదికాదే అతనికి అయుపో యు ఉండొచ్చు కదా ; ఆవేదనగా నసిగింది
 
చేస్తున్నావు .నేరం అంతా శ్రీరామ్ పైనే నేట్టేస్తున్నావు .నువ్వు ఆరాదిస్తునట్లు ,ప్రేమించినట్లు గతం లో ఎప్పుడైనా శృతి .తెలియకుండానే ,ఏమి తెల్సుకోకుండా వ్యుద్యోగం కూడా మాని ఏమి చేస్తావ్? నువ్వు చాలా తప్పు శ్రీరామ్ కి చెప్పావా? లేదే .గట్టిగా అడిగింది శృతి . నేను ఎన్నో చోట్ల శ్రీరామ్ కోసం గాలించాను కానీ ఎక్కడా ఆచూకి దొరకలేదు . కొంచెం కోపం ,అసహనం గా మాట్లాడుతోంది శృతి . పోనీ శ్రీరామ్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నేను తే ల్చేస్తాను.అయ్యబాబోయ్ నాకు ఏం అంత ఎగ స్ట్రాలు అవసరం లేదు .విసుగ్గా శృతి .అన్నీ నువ్వే నాన పెట్టుకొని బాధపడు నేను ఏమి చేయగలను ,బాధను వ్యక్తం చేసింది లక్ష్మి .సరే ఇక ఫైనల్ గా నేను ఒకటి చెబుతా విను నీ వుద్యోగం నీవు ప్రశాంతం గా చేసుకు పో అన్ని విషయాలు శ్రిరా మ్ గురించి ఏదో ఒక రోజు తెలియకుండా ఎలా ఉంటాయి . శృతి ఇది జీవితం ,మనం ఏమి టీనేజ్ పిల్లలం కాదు .ఒకరి గురించి జీవితం ఎప్పుడూ ఆగిపోకూడదు .నీ జీవితం నీ చేతుల్లో నే వుంది ,దానిని ఒక స్థాయు కి తెచ్చుకోవడం నీ చేతల్లో వుంది .బై ఇక వుంటాను అంటూ కాస్తంత హిత బోధ చేసి ఫోన్ పెట్టేసింది స్నేహితురాలు లక్ష్మి. రోజు రాత్రంతా అలోచనల్లో గడిపిన శృతి మరుసటి రోజు వుద్యోగం మానకూడదు అనే నిర్ణయం తీసుకొని స్కూల్ కి బయలుదేరింది .
* * * * *
స్కూల్ లో క్లాసులు బిజీ బిజీ గా నడుస్తూ వున్నాయి .టీచర్స్ అంతా వాళ్ళ వాళ్ళ సబ్జుక్ట్స్ టీచింగ్ లో మునిగిపోయి వున్నారు .అన్ని క్లాసులు ,మరియు విద్యార్థులు అందరిని పరిశీలన చేస్తూ చూసుకొంటూ రౌండ్స్ వేస్తున్నాడు ప్రిన్సిపాల్ శ్రీరామ్ . శృతి పాటం చెబుతున్న క్లాస్ రానే వచ్చింది .కొద్దిసేపు క్లాస్ విండో దగ్గర నుంచీ నిలబడి పాఠం వింటున్నాడు .శృతి ది చాలా చక్కని ,స్పష్టమైన స్వరం . రోజుల్లో ఒక పాట పాడాలి అని అడిగే వాళ్ళం ,తరువాత పాడుతా అని తప్పించుకొని తిరిగేది , జ్ఞాపకాలు తో చిన్నగా నవ్వుకున్నాడు శ్రీరాంమ్ .ఆమె క్లాస్ లోకి దారి తీసాడు ప్రిన్సిపాల్ శ్రీరామ్ ..శ్రీరాంమ్ ని చూసిన శృతి మళ్ళీ ఒక నిమషం స్ట న్న్ అయుంది .చెమటలు తుడుచుకొంటూ కొంచం కంగారు కంగారు గా రండి సార్ రండి అంటూ ఆహ్వానం పలికింది .

చూడండి మేడం ..మీరు క్లాసులో లెసన్ చెబుతున్నప్పుడు , లెస్సన్ పై శ్రద్ధ పెట్టని వాళ్ళను ఒక కంట కనిపెడుతూ వుండాలి అని చెబుతూ క్లాస్ మొత్తం మీద టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరు ?చిన్నగా అడిగాడు .శ్రీరామ్ .మొదటి బెంచ్ లో వారిని చూపించింది శృతి .లీస్ట్ లో వున్నవాళ్ళు ఎవరూ మళ్ళీ చిన్నగా అడిగాడు శ్రీరామ్ .చివ్వరి బెంచ్ చూపించింది .శృతి . అప్పుడు శ్రీరామ్ మొదటి వరుస వదిలి రెండవ బెంచ్ లోకి బాగా వెనుక బడిన వాళ్ళను తీసుకొచ్చి కూర్చో బెట్టాడు .ఇలా కొద్ది రోజులు చూద్దాం ,వీళ్లల్లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం .రె మీడీయల్స్ కు కాస్తంత ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వండి .ఓకే మేడం మీ లీజర్ పీరియడ్ లో ఒకసారి ఆఫీసు కి రండి కొంచం సీరీయస్ గా గట్టిగా చెప్పి అక్కడనుంచి కదిలి వెళ్ళాడు శ్రీరామ్ .అంత గా మాట్లాడుతున్నా ఆతనిపై కొంచం కోపం ,కొంచం బిడీయం .ఇంకొంచం సిగ్గు కలగలిపి ఆమె బుగ్గలపై ఎర్ర ఎర్ర గా పూ శా యు .



* * * * *

శ్రీరామ్ ఒకసారి తన ఆఫీస్ కి రమ్మ నా డు .తన లీజర్ పీరియడ్ లో టైం చూసుకొంటూ ,అస్సలు ,వెళ్ళాలా వద్దా అనుకొంటూ ఆలోచనల్లో పడిపోయి ది . అస్సలు ఎందుకు పిలిచాడో తెలుసుకోవాలి కదా ? అయునా ఇప్పుడు నాకు శ్రీరామ్ ప్రిన్సిపాల్ కదా వెళ్ళాలి ,లక్ష్మి చెప్పింది అస్సలు నువ్వు అతనితో మాట్లాడితే కదా అతని గురించి నీకు తెలిసేది ఆలోచన తో , టక్కున లేచి శ్రీరామ్ ఆఫీస్ కు బయలుదేరింది . అసిస్టెంట్ మూర్తిగారు ,శృతి కలిసి శ్రీరామ్ ఆఫీస్ గది లోకి వచ్చారు . రండి ....లోపలికి రండి ..కూర్చోండి సోఫా చూపించాడు ప్రిన్సిపాల్ .శ్రీరామ్

సార్ .ప్రిన్సిపాల్ గారు మీకొక విషయం తెలుస్సా ; మా అమ్మాయి శృతి , మె కూడా హైదరాబాద్ లో చదువుకొంది .నిజముగా మీ అమ్మాయే అని తెలీయదు . చిరునవ్వు నవ్వాడు శ్రీరామ్ .మీరు ఏదో ఆఫీస్ పని గురించి పిలిచారటకదా ఇక మాట్లాడండి ,నేను కూడా బిజీ లో వున్నాను .అంటూ లేచి తన సీట్లో కి వెళ్ళిపోయాడు మూర్తిగారు .కొద్ది క్షణాలు మౌనం ...ఒకర్ని ఒకరు చూసుకొంటున్నారు .మళ్ళీ నేల చూపులు చూస్తున్నారు .కొద్దిసేపటికి చెప్పండి శృతి ఏమిటి మీ విశేషాలు ?ఏమిటి , రోజు నన్ను రోడ్డు ప్రక్కనే వదిలేసి వెళ్ళిపోయారు .మీరు ఊహించినట్లు లేరు ,నేను మళ్ళీ ఇక్కడికే వస్తానని ,కదూ .అవునులెండి నేను కూడా మీరు నాకు ఇక్కడ కలుస్తారు అని నేను కూడా ఊహించలేదు . ఎందుకు మేడం నన్ను

 
అలా చేశారు .ఇంకొకరు అయుతే ఇంత పరిచయం వున్నవాళ్ళం తప్పకుండా ఇంటికి రండి అని ఆహ్వానించే వారు మరి నేను ఏదో పాపం చేసి వుంటాను లేండి .వ్యంగ్యంగా అన్నాడు శ్రీరాంమ్ .మీరు కాదు శ్రీరాంమ్ .. .. నేను పాపం చేసి వుంటాను. కొంచెం దీనముగా మాట్లాడింది శృతి . అప్పట్లో . మీకు పెళ్లి కుదిరింది అని అందుకే మీ వూరు వెళ్లిపోయారని అందరం తెల్సుకున్నాం .మీకు ఎంతమంది పిల్లలు , మీ శ్రీ మతి గారు ఎలా వున్నారు ? అక్షరాలు మ్రింగుతూ ,కొంచం జీర గొంతు ని సవరించు కొంటూ ,కొంచం ..కంగారుగా అడిగింది శృతి . ఇలా ఆఫీస్ లో పర్సనల్ మాట్లాడటం నాకు కరెక్ట్ కాదు అన్పిస్తో౦ ది .మన ఇద్దరం కాస్తంత అన్ని విషయాలు మాట్లాడుకోవాలి ,నేను ఒక రోజు మీ ఇంటికి రావాలను కొంటున్నాను .గట్టిగా చెప్పాడు ప్రిన్సిపాల్ శ్రీరాంమ్ .టైం చూసుకొంటూ . చైర్మన్ గార్ని కలిసే పని వుంది అంటూ కొన్ని ఫైల్స్ తీసుకొని లేచాడు .శ్రీరాంమ్ . శృతి కూడా లేచి శ్రీరామ్ తో అడుగులు వేస్తుంది . ఇద్దరు మాట్లాడుకొంటూ నడుస్తున్నారు .శ్రీరామ్ ఏమీ మారలేదు ఇదివరలోలగానే ఫ్రీ గా మాట్లాడుతున్నాడు అను కున్నశృతి తన మాటల్లో వేగం ,పెంచింది , ఏమో శ్రీరాంమ్ , మీరు మా ఇంటికి వస్తే మీరు నిజముగా పాపం చేసిన వాళ్ళే అయుం టారు . కొంటెగా అన్నది శృతి . ఎందుకో నాకు ఏమి అర్థం కాలేదు . పెదవి విరిచాడు శ్రీరామ్ ,ఏమి లేదు బాబు ,మా అమ్మ కి కొంచం చాదస్తం ఎక్కువ ,మగాళ్ళు అంటే పడదు ,ఫెమినిజం , ......... ఏం మీ నాన్నగారు మీ అమ్మగారిని ఏమైనా ఇబ్బంది పెడతారా ?ఎందుకు మగాళ్ళు అంటే అంత కోపం ?కొంచం మొహం చిట్లించి అడిగాడు శ్రీరామ్ .మా నాన్నగారు ఆయన ఒక సాదు జంతువు ,నాకు వూహ తెల్సిన ప్పటి నుంచీ ఇంట్లో అన్ని పనులు ఆయనే చేసుకొనేవారు .మంచి కోప్ రేటివ్ ,మా అమ్మే వూరికే నస పెడుతూవుం టు ది .నవ్వుకొంటూ చెప్పింది శృతి . మరేమి పర్వాలేదు నేను రేపు ఆదివారం మీ ఇంటికి వస్తాను .అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకున్నాము . బై వుంటాను అని చిన్నగా చెబుతూ చైర్మన్ ఆఫీసు లో కి వెళ్ళిపోయాడు .శ్రీరామ్.
                                                                                                      


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online