Pages

In rememberence of my beloved father

 Today is the Death Anniversary of my beloved father.  Am posting some of the important events n things about him which I'd like to share with u all.  These r some of his achievements.  Am paying my humble Homage to him thru this post. 


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-10

       భక్తి, ప్రపత్తి, జ్ఞానం అనే మూడు ప్రధాన విషయాలను రామానుజాచార్యులు వారు ప్రతిపాదించారు .అస్సలు భగవంతుడికి ఎందుకు ఇంత ఆనందం ఎందుకు మనతో ఇలా ఆడుకొంటాడు .మొత్తం మూసేసి అరవకుండా కూ ర్చోవచ్చు కదా అని మనకు సందేహాలు రావచ్చు అది రాబోవు విషయాలలోతెలుసుకుందాము , అయుతే ఇదివరలో పైన మనం చర్చించుకున్న ఒక విషయం సగంలో ఆగిపాయింది .అస్సలు నిజముగా దేవతలు అంతా మనం చూసే ఫోటోలో లా మీసాలు లేకుండా ,లేక పెంచో లేక పట్టుచీరల్లో సింగారించుకొనో , మనలాగా ఆస్తులు ,ఉద్యోగాలు వెతుక్కొంటూ ,మనం వేసే కొబ్బరిముక్కో ,అన్నంముద్ద కోసమో వెంపర్లాడతారా ,అనే విషయం చూద్దాము .ప్రపంచం లేదా విశ్వం మొత్తం ఆ భగవంతుడు నిండి వున్నాడు అని తెలుస్సు .అస్సలు ఆయన ఏ రూపములో అయునా ఉండవచ్చు .అన్ని జీవుల్లోను ,అన్ని వస్తువ్వుల్లోనూ ప్రాణం వున్నవి ,లేనివి అన్ని౦టిలోను ఆ భగవంతుడు వున్నాడని కదా ఇందుకలడు అందులేడను సందేహం కలదు చక్రి సర్వోపగతుండు అనే పద్యములో అదే కదా చెప్పింది

       అలానే ఒక ఉపనిషత్తులో చెప్పినట్లు ; కొంచెం నీరు తెమ్మంటాడు కొంచెం ఉప్పు తెమ్మంటాడు . ఆ నీటిలో ఆ ఉప్పు వేసి కలిపేయమంటాడు .అప్పుడు ఉప్పునీరు తయారు తయారవుతుంది . మళ్ళీ ఆ ఉప్పు నీరు తీసుకొని ఉప్పు – నీటిని విడదీసి చూపమంటాడు .కానీ విడదీయలేము .అలానే ప్రపంచం లో , ప్రపంచం అంతా నిండి వున్న భగవంతుడిని ఎక్కడ లేడు, ఎక్కడ వున్నాడు అని చెప్పగలం .ఆయన అంతటా వున్నాడు ,అన్నింటిలోను వున్నాడు ,అందుకే ఆయన ను సర్వాంతర్యామి అంటారు .ఆయనను నువ్వుఎలా తలిస్తే అలా కనపడతాడు .అమ్మ లా ,నాన్న లా ఎలా అంటే అలా కనిపిస్తాడు ఆయనకు లింగబేధం లేదు ,వయోబేధం లేదు జంతు భేదం లేదు .అలా కాదు పరమాత్మ పరమాత్మ లా కనపడాలి అంటే కూడా కనపడతాడు .కాని మనకి ఆయన ని చూడాలంటే మనకి వున్న శక్తి సరిపోదు . అర్జునునికి విశ్వరూపం చూపెట్టాలని శ్రీ కృష్ణ భగవానుడు ఒక ప్రయత్నం చేశాడు . కానీ సాక్షాత్తూ అర్జునునకే విశ్వరూపం ఎంతసేపు చూసినా ఏమీ అర్థం కాలేదు .ప్రభో ఓ పరమాత్మా నాకు భయం వేస్తుంది . నేను ఈ రూపం చూడలేను .నా పై దయ చూపి నీవు మామూలు రూపమే ధరించి ,చేతిలో మురళి పట్టుకొని ముద్దుగా ,ముగ్ద మనోహరముగా కనిపించు స్వామీ .అని భగవానుడి ని ప్రార్ధించాడు. 

         ఇక పరమాత్మ ని మామూలు మనిషి లా ,మీసాలు వున్నట్టు ,మీసాలు లేనట్టు ,చేతుల్లో ఆయుధాలు ధరించినట్టు ఇలా పరమాత్మ ను రక రకాలుగా మనం చిత్రాలల్లో చూస్తూవుంటాము .అంతేకాదు పట్టుపీతాంబరములుధరించినట్టు ,తలపై కిరీటం ధరించి నట్లు ,రక రకాల జంతువులపై ఎక్కి ప్రయాణం చేస్తునట్లు ,ఆ స్వామీ చుట్టూ తేజోమయమైన కిరణాలు ప్రసరిస్తున్నట్లు బట్టలు మాత్రమే కట్టుకొంటాను ,షేవింగ్ చేసుకొంటాను ,కొట్టుకు వెళ్లికావాల్సిన సామాను లు తెచ్చుకుంటాను ,ఇలా ఏమైనా చెప్పాడా ,కాస్త అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలు మనకు వస్తూవుంటా యి .అప్పుడు మనం కాస్తంత వెనక్కి వెళ్లి ఆలోచించాలి . ఇప్పుడు మనలో కొందరి దగ్గర మన తాతల ,ముత్తాతల ఫోటో లు వుండవు .ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు .అప్పుడు మనకు ఫై నుంచీ ఓ పరంపర లో పాతవిషయాలు చెప్పుకొంటూ వస్తూవుంటారు .నానమ్మ వాళ్ళ అబ్బాయికి ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇలా పై నుంచి తాతలు ,ముత్తాతలు వాళ్ళు ఎలా వుండే వారో ,వాళ్ళ అలవాట్లు ఏమిటో వేష భాషలు దగ్గరనుంచీ అన్నీ చూసినట్లు చెప్పేస్తూ వుంటారు .

       అదిగో అలా పూర్వకాలములో భగవంతుడి రూపం ఒకటి పై వాళ్ళ నుంచి ఓరూపములో ఇలా ఉంటాడు అనేది మనదాకా వచ్చేసింది .ఇంకో వాదములో ఆలోచించితే మన తల్లితండ్రులు ఎలా వున్నారు .వాళ్ళ తల్లి తండ్రులు ఎలా వున్నారు వాళ్ళ పై వాళ్ళు ఎలా వున్నారు మనరూపమే ఎలా వుందో వాళ్ళు అలానే వుండివుంటారు .అనే ఓభావనలో మనిషి గా ఊహించి వుంటారు ,కాకపోతే ఇంకో రెండు చేతులు రెండు ,కాళ్ళు ఎక్కువగా వుండిఉంటాయి అని వాళ్ళ చేతుల్లో మనలాంటి సామాన్యులను రక్షించటానికి ఆయుధాలు ఉంటాయి అని ఎదో ఒక వాహనం ఎక్కి లోకాలన్నీ తిరగటానికి జీవులందరి దగ్గరకి వచ్చి రక్షించ టానికి ఇలా మనమే ఒక దైవాన్ని ఏర్పరుచుకున్నాము ,ఇంకో ఆలోచన చూద్దాము.అస్సలు సృష్టి మొత్తములో ఈ విశ్వములో మనిషి కంటే తెలివి అయున ది ఇంకొకటి లేదు .అందుకే కూడా మనం భగవంతుడిని మనిషి రూపములోనే ఆరాదిస్తూవున్నాము .అందుకే నాస్తికులు ఇలా పాడుతూవుంటారు దేవుడు చేసిన మనుషుల్లారా ,మనుషులు చేసిన దేవుళ్ళారా అంటూ కొంచం వెం గ్యముగా అంటూ ఉంటారు.



 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online