Pages

                                                        నేటి   ప్రపంచం
        ఈరోజుల్లో చాలా మందికి కారులో డ్రైవ్ చేస్తూ చేతిలో ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ తో రిచ్ గా కనపడాలని తాపత్రయం .  ముఖ్యం గా 25 నుండి 35 సంవత్సరాల మధ్య  వయస్సు  అమ్మాయిలు ,అబ్బాయిలు విపరీతం గా వ్యామోహం పెంచుకుంటున్నారు .  టీవీ సీరియల్స్ , సినిమాలు అదే విషయాన్నీ చూపిస్తున్నాయి ఇంకా పెద్ద పెద్ద ఇల్లూ , సేవకులు ,కార్లు  ఇవే చూపిస్తున్నాయి.  లేనివాళ్ళు , మధ్య తరగతి కుటుంబాలలో అనేక సమస్యలు ఉంటున్నాయి .  అవి ఎవరూ చూపించటం లేదు .  ఎలాగైనా ఒకే రోజులో లక్షాధికారి అయిపోవాలి , అందుకు ఏమైనా చెయ్యచ్చు ఏది తప్పు కాదు అనే విధంగా చూపిస్తున్నారు . 
            యువత లో కూడా ఎలాంటి విషయమైనా మాట్లాడి, చర్చించి అర్ధం చేసుకునేటంత ఓపికా , నిదానము లేవు . ప్రతి వాడిని బెదిరించి కొట్లాటలకు వెళ్ళటం నేటి సినిమాలలో  చూపిస్తున్న హీరోయిజం .  అదే ఫాషన్ అయిపొయింది .
           రోడ్లన్నీ పెద్ద పెద్ద కార్లతో  నిండిపోయి ఉంటున్నాయి ప్రతి కారులో ఒక్కరే ఉంటున్నారు .  కొంత మంది అవసరం లేకపోయినా రోడ్లపైకి షికారుగా వచ్చి వాళ్ళ సంపద వైభవం రాజసం చూపాలని తహతహ లాడుతున్నారు .  డ్రైవింగ్ చేస్తూ పెద్ద పెద్ద ఫోన్స్ చూపుతూ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు .  దాని ఫలితముగా  యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అంతే కాదు విపరీతమైన వేడి , కాలుష్యం , విషవాయువులు ,  ఇవే మనం చిన్నారులకు , రానున్న తరాలకు  అందించే వారసత్వ సంపదలు .
     కాస్తంత ఆలోచించండి .. దగ్గర దగ్గర పనులకు కాలి నడకన వెళ్ళండి , సైకిళ్ళు వాడండి .  దీని వాళ్ళ వ్యాయామం అవుతుంది .  ఇంధన వనరులు పొదుపు చేసిన వారము  అవుతాము . పెద్ద పెద్ద కార్లతో రోడ్లు అన్ని నిoపే యకండి  ఎంత పెద్ద కారున్నా దేశానికీ సంఘానికి ఒరిగేది ఏమి లేదు .  అంత డబ్బులు ఎక్కువగా ఉంటె తర తరాలకు ఉపయోగ పడే పనులు చేయండి .  వేప , రావి , మర్రి , జువ్వి , మామిడి  వంటి పెద్ద పెద్ద వృక్షాలు , మొక్కలు  పెంచండి .  హైదరాబాద్ వంటి వాతావరణం లో ఎక్కడైనా సరే వేప మొక్కలు పెంచటం చాలా మంచిది .  శ్వాస  సంబంధ వ్యాధులు ఇంకా రకరకాల వ్యాధులు ఎన్నో నిరోధిస్తాయి .  ప్లాస్టిక్ మొక్కల వల ఏమి ప్రయోజనం లేదు .  కారు కంటే టూవీలర్  వాడండి .  టూవీలర్ కంటే సైకిల్ వాడండి .  ఇంకాస్త దగ్గర దూరాలు అయితే నడకను ఎంచుకోండి   ఆరోగ్యాన్ని ,  ఆయుషును పెంచుకోండి భూమి మీద సమస్త జీవరాసులకు  ఆయురారోగ్యాలు పెంచండి మనం మన కర్తవ్యం చెయ్యాలి అప్పుడే దైవం అనుగ్రహిస్తాడు
     
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online